'తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబడలేదు' | Chinna Reddy suggest Strengthen Telangana Congress | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబడలేదు'

Published Mon, Aug 25 2014 2:40 PM | Last Updated on Sat, Aug 11 2018 7:16 PM

'తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబడలేదు' - Sakshi

'తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబడలేదు'

హైదరాబాద్: తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబడలేకపోయిందనే బాధ పార్టీ కేడర్‌లో ఉందని మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీతో కలిసి పనిచేయకపోవడం, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వ్యూహం ఫలించకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలైందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో మాట్లాడుతూ... పార్టీ సంస్థాగత పదవుల్లో మహిళలు, యువతకు పెద్దపీఠ వేయాలని సూచించారు.

టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలే ఆ పార్టీని గెలిపించాయని మరో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పార్టీ బలోపేతమవ్వలంటే నేతలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement