స్విస్ చాలెంజ్ విధానం సరికాదు | suresh reddy fired on ap government on swiss challange | Sakshi
Sakshi News home page

స్విస్ చాలెంజ్ విధానం సరికాదు

Published Thu, Aug 25 2016 2:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

స్విస్ చాలెంజ్ విధానం సరికాదు - Sakshi

స్విస్ చాలెంజ్ విధానం సరికాదు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి
నెల్లూరు (బారకాసు): రాజధాని నిర్మాణంలో లోపభూయిష్టంగా ఉన్న స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఆర్‌డీఏ ద్వారా విదేశీ కంపెనీలకు నిర్మాణ బాధ్యతలను అప్పచెప్పడం.. వారు చెల్లించే రెవెన్యూ వాటా, బిడ్ వివరాలు వెల్లడించకపోవడంపై కోర్టు తీవ్రంగా తప్పుపట్టిందన్నారు.

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రతి పనినీ పారదర్శకంగా చేస్తున్నారని, రాష్ట్రంలో మాత్రం అంతా గోప్యంగా ఉంచుతున్నారన్నారు. దేశంలో ఎంతో మంది నిపుణులున్నా రాజధాని నిర్మాణానికి విదేశీ సంస్థలను ఆహ్వానించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. అఫ్గానిస్తాన్‌లో మన తెలుగువారే చక్కటి పార్లమెంట్ భవనం నిర్మించారని, అలాంటి నిపుణులున్న రాష్ట్రంలో రాజధానిని నిర్మించడం పెద్ద కష్టం కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement