కార్యకర్తలతో మాట్లాడుతున్న సురేష్ రెడ్డి
కమ్మర్‌పల్లి(బాల్కొండ): గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. పార్టీ మారే వారి కోసం టికెట్ కేటాయించడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడం వల్లే తాను కాంగ్రెస్ నుంచి తప్పుకోవలసి వచ్చిందన్నారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి తన అనుచరులకు వివరించారు. 2009 నుంచి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించిన ఆయన.. తొందరపడి పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోలేదన్నారు.
30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఊహించని పరిణామం ఎదురైందని, గౌరవం లే ని చోట ఉండడం ఇష్టం లేక పార్టీ మారాల్సి వ చ్చిందని చెప్పారు. మాతృ పార్టీని వీడడం బాధ గా ఉన్నప్పటికీ, కుటుంబాన్ని కాపాడుకోవలసిన బాధ్యతతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసు కున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి, సేవలు వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
30 ఏళ్ల నుంచి తనను నమ్ముకొని ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏమిటని అడిగితే, వారికి కూడా సముచి త స్థానం కల్పించి అండగా ఉంటామని సీఎం హా మీ ఇచ్చారని చెప్పారు. ఆర్మూర్, బాల్కొండ ని యోజకవర్గాల అభివృద్ధిలో తన పాత్ర ఉం టుందని సీఎం స్పష్టం చేశారని వివరించారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని, ఆశీర్వదించాలని కోరారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ.. తామంతా మీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment