
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై దీర్ఘకాలిక చర్యలు తీసుకోకుండా చందాలు ఇచ్చినట్లు డబ్బులిస్తే ఫలితం ఉండదని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. అలాగే రుణ పరిమితి పెంచకపోతే రైతులు ఇబ్బందిపడతారని ప్రభుత్వానికి సూచించారు.
మంగళవారం సురేశ్‌రెడ్డి, కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సచివాలయంలో సీఎస్ ఎస్పీ సింగ్‌ను కలసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పంట పెట్టుబడి మొత్తం, బ్యాంకులు ఇస్తున్న రుణానికి చాలా వ్యత్యాసం ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు.