SP Singh
-
అఖిలేష్‌కు పోటీగా బలమైన అభ్యర్థి! బీజేపీ ఎత్తుగడ ఫలించేనా?
BJP Fields Union Minister SP Singh Baghel against Akhilesh Yadav from Karhal Seat: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు పోటీగా బీజేపీ బలమైన అభ్యర్థిని ప్రకటించింది. ఓబీసీ వర్గానికి చెందిన సత్యపాల్ సింగ్ బఘేల్ కర్హల్ నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోంది. పోలీస్ ఎస్ఐగా తన కెరీర్ ప్రారంభించిన ఎస్పీ సింగ్ బఘేల్.. మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఎస్పీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఎస్పీలో చేరిన ఎస్పీ సింగ్ బఘేల్‌కు 2014లో మాయావతి రాజ్యసభ సీటు ఇచ్చారు. అనంతరం కమలం పార్టీలో చేరిన ఎస్పీ సింగ్ బఘేల్.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తుండ్లా స్థానం నుంచి గెలిచి.. యోగి కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆగ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మోదీ కేబినెట్లో న్యాయ శాఖ సహా మంత్రిగా పనిచేస్తున్నారు. మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అఖిలేష్‌కు పోటీగా బఘేల్‌ను రంగంలోకి దింపడంతో కర్హల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చదవండి: (అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నామినేషన్ దాఖలుచేశారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేస్తున్నారు. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న అఖిలేష్.. మెయిన్‌పురి సబ్‌డివిజన్ ఆఫీస్‌లో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. కర్హాల్ స్థానం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో దాదాపు 3.5లక్షలమంది ఓటర్లు ఉండగా.. ఇందులో దాదాపు లక్షన్నర వరకూ యాదవులే ఉన్నారు. కర్హాల్ స్థానానికి మూడోదశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. చదవండి: (బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా?) -
దీర్ఘకాలిక చర్యలు తీసుకోండి: సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై దీర్ఘకాలిక చర్యలు తీసుకోకుండా చందాలు ఇచ్చినట్లు డబ్బులిస్తే ఫలితం ఉండదని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. అలాగే రుణ పరిమితి పెంచకపోతే రైతులు ఇబ్బందిపడతారని ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం సురేశ్‌రెడ్డి, కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సచివాలయంలో సీఎస్ ఎస్పీ సింగ్‌ను కలసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పంట పెట్టుబడి మొత్తం, బ్యాంకులు ఇస్తున్న రుణానికి చాలా వ్యత్యాసం ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. -
కొత్త సీఎస్ ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు. సికింద్రాబాద్‌లోనే ‘రైల్వే’శిక్షణ 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు ఎనిమిది నెలలపాటు రైల్వేలో పని చేశారు. సికింద్రాబాద్‌లోనే శిక్షణ పొందారు. అప్పట్నుంచే తెలంగాణతో ఆయనకు అనుబంధం ఉంది. జోషి సివిల్ సర్వీసెస్ అధికారిగా మొదట నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఐటీ, నీటిపారుదల, ఇంధన శాఖ, రెవెన్యూ, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల కార్యదర్శి, ముఖ్యకార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచీ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో రెండు దఫాలుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. జర్మనీ, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో మన దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌బౌండరీ వాటర్ రీసోర్సెస్ అనే పుస్తకాన్ని రచించారు. మధ్యాహ్నమే బాధ్యతలు కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి బుధవారం మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం చంద్ర గ్రహణం మొదలవటంతో అంతకుముందే 3 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సమత బ్లాక్‌లో సీఎస్ ఎస్పీ సింగ్ తన బాధ్యతలను జోషికి అప్పగించారు. ఈ సందర్భంగా జోషి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు జోషికి అభినందనలు తెలిపారు. సీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో పాత సీఎస్ ఎస్పీ సింగ్‌కు వీడ్కోలు పలికారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మంచి పేరు తెలంగాణ ఏర్పడినప్పట్నుంచీ జోషి అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మొదలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టాలెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నీటి పారుదల శాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను సైతం ఆయనకే అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ అధీనంలో ఉన్న సీసీఎల్ఏ అదనపు బాధ్యతలను రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి అప్పగించారు. సీఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పంచాయతీరాజ్ గ్రామీణ నీటిసరఫరా విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
తెలంగాణ నూతన సీఎస్‌గా ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఎస్ శేఖర్ ప్రసాద్ సింగ్ (ఎస్పీ సింగ్) పదవీకాలం నేటితో ముగియనుంది. ఎస్పీ సింగ్ పదవీకాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో నూతన సీఎస్ నియామకం అనివార్యమైంది. 984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శైలేంద్ర కుమార్ జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ఆయన స్వస్థలం. ఢిల్లీ ఐఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ అనంతరం సివిల్స్ ర్యాంకు సాధించారు. రాజీవ్ శర్మ, ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్‌ల తర్వాత తెలంగాణకు నాలుగో సీఎస్ ఎస్కే జోషి. సీఎస్ నియామక ఉత్తర్వులు -
కొత్త సీఎస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. మరో మూడు నెలల పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఎస్పీ సింగ్ పదవీ విరమణకు మరో మూడు రోజులే మిగిలి ఉండటంతో కేంద్రం అనుమతి మంజూరు చేస్తుందా.. లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కేంద్రం నుంచి అనుమతి రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్‌గా ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం స్పెషల్ సీఎస్‌లుగా ఉన్న వారందరూ సీఎస్ పదవికి అర్హులైనప్పటికీ.. ఎస్కే జోషి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎస్పీ సింగ్ పదవీకాలం పొడిగించకపోతే జోషిని కొత్త సీఎస్‌గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
‘అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లడానికి ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ కొనియాడారు. సోమవారం సచివాలయంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమతతో కలిసి ఆవిష్కంచారు. రైతులకు 24 గంటల విద్యుత్, భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు దేశం దృష్టిని ఆకర్షించాయని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్రం కోసం పుట్టిందని, నేడు ప్రభుత్వ పథకాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. 2018 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలుతో పాటు ఆర్డర్ టు సర్వ్ కింద ఉన్న ఉద్యోగులను ఫైనల్ అలాట్మెంట్ చేయాలని మమత కోరారు. -
త్వరగా పూర్తి చేయకుంటే.. బ్లాక్‌లిస్టులో పెడతాం
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకాన్ని త్వరగా ఎందుకు పూర్తి చేయడం లేదని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ నిలదీశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏజెన్సీలు పనిచేయకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. మార్చి 31 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా జరగాల్సిందేనన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం సచివాలయంలో భగీరథ పనులు ఆశించనంత వేగంగా జరగని సూర్యాపేట, ఆదిలాబాద్ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు విజయ్ ప్రకాశ్, జగన్మోహన్రెడ్డితో పాటు కాంట్రాక్టు సంస్థలు జీవీపీఆర్, మెగా ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భగీరథ పనులపై సమీక్షించిన ఆయన.. త్వరగా పనులు పూర్తి చేసేలా దిశానిర్దేశం చేశారు. భగీరథ పను లు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. -
రాష్ట్రానికి నిధులు రాబట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అత్యధిక నిధులు వచ్చేలా కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదికలు అందజేయాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన సమాచారంతో నివేదికలను తయారు చేయాలని, నిధులు రాబట్టేందుకు అధికారులు సమర్పించే నివేదికలే కీలకమని అప్రమత్తం చేసింది. కేంద్ర ఆర్థిక సంఘం మొదటిసారిగా రాష్ట్రాల పురోగతిని దృష్టిలో పెట్టుకొని ప్రోత్సాహక గ్రాంట్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అత్యధిక నిధులు రాబట్టే వ్యూహంతో నివేదికలు సిద్ధం చేయాలని చీఫ్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ అన్ని శాఖల అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ అయ్యా రు. స్థానిక సంస్థలకు గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, జిల్లాల వారీ గా అభివృద్ధి, వివిధ అంశాల్లో సాధించిన ప్రగతి, స్ట్రాటజీ డెవలప్మెంట్ గోల్స్, ఆదాయ–వ్యయాలు, పన్నుల వసూలు వివరాలన్నీ ఆర్థిక సంఘానికి పంపించాలి. వీటన్నింటిపైనా సీఎస్ చర్చించారు. ఈ నివేదికలకు ఆర్థిక శాఖలో ప్రత్యేక టీం, నోడల్ అధికారిని నియమించినట్లు సీఎస్ తెలిపారు. 2019 అక్టోబర్ 30న ఆర్థిక సంఘం కేంద్రానికి నివేదిక సమర్పిస్తుందని, ఏప్రిల్ 2018 నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందన్నారు. అందుకే అన్ని శాఖ లు 2018 ఫిబ్రవరి 7 నాటికి తమ శాఖల్లో చేపడుతున్న పనులు వాటి ప్రగతి, లక్ష్యాలు తదితర వివరాలు సమర్పించాలన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఈ నెల 15 నాటికి సమర్పించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను కోరారు. -
గణతంత్ర వేడుకలకు బందోబస్తు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 26న జరిగే వేడుకల ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్, మెట్రో వాటర్ వర్క్స్, సమాచార, ఉద్యానవన, రహదారులు, భవనాల శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాల న్నారు. వేడుకలకు హాజరయ్యే విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. -
సీఎస్ పదవీకాలం పొడిగింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరో మూడు నెలలపాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ ఇటీవల లేఖ రాసింది. ప్రస్తుతం ఈ ఫైలు కేంద్ర హోం శాఖ పరిశీలనలో ఉంది. ఈ నెల 31తో ఎస్పీ సింగ్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో పొడిగించాలని లేఖలో ప్రస్తావించింది. ప్రభుత్వం లేఖ రాయటంతోపాటు ఇటీవల ఎస్పీ సింగ్ కూడా ఢిల్లీకి వెళ్లి తనవంతుగా ఎక్స్టెన్షన్కు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. దీంతో కేంద్రం ఆమోదించటం లాంఛనమేననే అభిప్రాయాలు ఐఏఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి సీఎస్‌గా పని చేసిన రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని ఇదే తీరుగా రెండు దఫాలు పొడిగించారు. 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్ సొంత రాష్ట్రం బిహార్. మెప్పించిన సింగ్.. సీఎస్ ఎస్పీ సింగ్ ఏడాది కాలంగా తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండటంతోపాటు అధికార వర్గాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ముందు నుంచీ ఆయన పర్యవేక్షిస్తున్నారు. సీఎంతోపాటు కేంద్రంలోని ముఖ్యులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే పదవీకాలాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ఐఏఎస్‌లకు ‘బదిలీల’ షాక్!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్న సీనియర్ ఐఏఎస్‌లతోపాటు పలువురు సీనియర్లను ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. మొత్తంగా 25 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతోపాటు రాష్ట్రానికి కొత్తగా కేటాయించిన 2015 బ్యాచ్‌కు చెందిన మరో నలుగురు యువ ఐఏఎస్‌లకు తొలిసారి పోస్టింగ్‌లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురేశ్చందాను రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీఆర్ మీనాను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇద్దరు సీనియర్ అధికారులకు కమిషన్ల కార్యదర్శుల బాధ్యతలు అప్పగించడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. జాయింట్ సెక్రటరీ స్థాయి గల అధికారులకు కేటాయించే పోస్టులను వీరికి కేటాయించారని చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన మరో ఐఏఎస్ బీపీ ఆచార్యను సైతం ఇటీవల ప్రభుత్వం ప్రణాళిక శాఖ నుంచి తప్పించి ఎంసీహెచ్ఆర్డీకి పరిమితం చేసింది. తాజా బదిలీల్లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి ప్రభుత్వం కీలకమైన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్‌ను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో విభేదాల నేపథ్యంలో పలువురు జిల్లా కలెక్టర్లు సైతం బదిలీకి గురయ్యారు. జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన గతంలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూకబ్జాలపై బహిరంగంగా ఆరోపణలు చేయగా.. తాజాగా ఆమెను అక్కడ్నుంచి తప్పించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఇటీవల స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆమెను సైతం ప్రభుత్వం బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. గిరిజనులు ఆరోగ్యంగా ఉండాలంటే అడవి పంది మాంసం, గొడ్డు మాంసం తినాలని గతంలో గిరిజన తండాల్లో ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళిని సైతం బదిలీ చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతీ హొళికేరిని కూడా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేతో ఉన్న విభేదాల నేపథ్యంలో బదిలీ చేశారన్న చర్చ జరుగుతోంది. -
ఉట్నూర్ సమస్యకు పరిష్కారం!
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీ, లంబాడీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్ప గా, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి. కాగా, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉట్నూ ర్కు తరలివచ్చింది. శనివారం ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌లతో కలిసి హెలికాప్టర్లో ఉదయం ఉట్నూర్‌కు చేరుకున్నారు. సుమారు నాలుగు గంటలపాటు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో గడిపారు. మొదట ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధికారులతో, ఆపై ఆదివాసీ, లంబాడీ పెద్దలతో చర్చలు జరిపారు. మీడియాను ఈ సమావేశాలకు అనుమతించలేదు. శాశ్వత పరిష్కారంపై సీఎం దృష్టి: సీఎస్ ఎస్పీ సింగ్ ఆదివాసీ, లంబాడీల ఘర్షణ నేపథ్యంలో పాత ఆదిలాబాద్ జిల్లాలో చిన్నచిన్న సంఘటనలు జరగడంతో శాంతిభద్రతలపై కొంత ప్రభావం చూపిందని సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని అన్నారు. ఆ సందర్భంలోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పోలీసు, అధికారులతో చర్చలు జరిగాయని తెలి పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. ఆయా కమ్యూనిటీ లీడర్లతో ముఖా ముఖి చర్చించామన్నారు. శాంతి స్థాపన కోసం సహకారం అవసరమని కోరగా, అందుకు ఇరువర్గాల పెద్దలు సహకరిస్తామని చెప్పారని తెలిపారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత కలెక్ట ర్లు, ఎస్పీలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. చర్చల్లో అదనపు డీజీపీ అంజనీకుమార్, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీవో, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీలు విష్ణు ఎస్.వారియర్, కల్మేశ్వర్‌లు పాల్గొన్నారు. చర్చలపై అసంతృప్తి.. చర్చలపై ఆదివాసీ, లంబాడీలు అసం తృప్తి వ్యక్తం చేశారు. చర్చల అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ చర్చలతో ఎలాంటి ఫలితం దక్కలేదని ఆదివాసీ సంఘం నేత నైతం రవి అన్నారు. హక్కుల సాధన కోసం ఆదివాసీలు శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని అన్నారు. వారితో కలసి చర్చలకు ఒప్పుకునేది లేదన్నారు. మరో ఆదివాసీ సం ఘం నేత బొంత ఆశరెడ్డి మాట్లాడుతూ చర్చలు పూర్తి కాలేదని, సీఎంను పిలవాలన్నారు. గవర్నర్ ఆదివాసీల దగ్గరికి రావాలన్నారు. లంబాడీ నాయకులు మాట్లాడుతూ లంబాడీలు ఆడపిల్లలను అమ్ముకుంటున్న సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయని, 45 రోజులుగా ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదని, పరిష్కారం లేనప్పుడు చర్చలు ఎలా ఫలప్రదమవుతాయన్నారు. -
రాష్ట్రంలో మూడు వెనుకబడిన జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా రాష్ట్రంలోని కొత్త జిల్లాలను కేంద్రం గుర్తిం చింది. ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన జిల్లాల జాబితాలో జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 115 జిల్లాల్లో రాష్ట్రం నుంచి మూడు జిల్లాలను నీతి ఆయోగ్ ఈ జాబితాలో చేర్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 2022 న్యూ ఇండియా లక్ష్య సాధన దిశగా జిల్లాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వెనుకబాటుతనం, పేదరికం, తీవ్రవాద ప్రాబల్యంతోపాటు అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు, విద్య, తాగునీరు, విద్యుత్ వసతి వంటి కీలకమైన మౌలిక వసతులను ప్రామాణికంగా తీసుకుని జిల్లాలను ఎంపిక చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది. వేగంగా పనులు జరిగేలా చూసేందుకు కేంద్రం ఈ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఖమ్మం జిల్లాకు రాజీవ్ రంజన్ మిశ్రా, ఆసిఫాబాద్ జిల్లాకు వసుధా మిశ్రా, భూపాలపల్లి జిల్లాకు సంజయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం తరఫున నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభు త్వం ఖమ్మం జిల్లాకు జి.అశోక్‌కుమార్, భూపాలపల్లి జిల్లాకు నవీన్ మిట్టల్, ఆసిఫాబాద్ జిల్లాకు నదీమ్ అహ్మద్‌ను నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. మరో మూడు జిల్లాలకు చోటివ్వండి.. కేంద్రం గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల జాబితాలో రాష్ట్రంలోని మరో మూడు జిల్లాలకు అవకాశం కల్పించాలని రాష్ట్రం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌కు రాష్ట్ర సీఎస్ ఎస్పీ సింగ్ లేఖ రాశారు. సామాజిక ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన ప్రాంతాల గుర్తింపునకు నీతి అయోగ్ ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం మహబూబాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాలను ఈ జాబితాలో చేర్చాల్సిన అవసరముందని ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నందున ఆ జిల్లాను సైతం జాబితాలో చేర్చాలని కోరారు. -
తెలుగు మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకు సచివాలయంలో సభల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ప్రధాన వేడుక జరిగే ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదిక, పలువురి ప్రతినిధులకు సీటింగ్ తదితర ఏర్పాట్లకి సంబంధించి లే అవుట్‌పై చర్చించారు. భోజన వసతిలో ఎటువంటి ఇబ్బందు లు లేకుండా చూడాలన్నారు. తెలుగులో రాసిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. మెస్సర్స్ విజ్ క్రాప్ట్ ద్వారా లేజర్ షో ఏర్పాటు చేయాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లపై చర్చించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చే ప్రతినిధులకు ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా తగు సమాచారాన్ని అందించాలన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో టీం వర్కుగా పనిచేసి సభలను విజయవంతం చేయాలని సూచించారు. -
‘పాలమూరు’పై పీఎంవో ఆరా!
సాక్షి, హైదరాబాద్: అవిభాజ్య మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన ‘పాలమూరు–రంగారెడ్డి’ఎత్తిపోతల పథకంపై వచ్చిన ఫిర్యాదులపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు పీఎంవో డైరెక్టర్ నందిని పలివాల్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్‌కు లేఖ రాశారు. ఆగస్టులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ప్రాజెక్టు టెండర్లలో అవకతవకల అంశాన్ని ప్రస్తావించారు. నాగం లేఖలోని అంశాలపై వివరణ ఇవ్వాలని పీఎంవో లేఖలో స్పష్టం చేసింది. దీనిపై నివేదిక పీఎంవోకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ నివేదికను రూపొందించింది. ఆరోపణల్లో నిజం లేదు.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు టెండర్లలో అవకతవకలు, అక్రమాలు జరగలేదని, నాగం ఆరోపణలన్నీ నిరాధారమని నీటిపారుదల శాఖ తన నివేదికలో స్పష్టం చేసినట్లుగా తెలిసింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పంప్‌హౌస్‌లలో బీహెచ్ఈఎల్కు ఎలాంటి అనుభవం లేకున్నా పంపుల నిర్మాణ పనులు అప్పగించారని నాగం ఆరోపించారు. దీనిపై శాఖ వివరణ ఇస్తూ.. ‘ప్రభుత్వంతో బీహెచ్ఈఎల్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. పంపులు, మోటార్ల తయారీ, సరఫరా, పర్యవేక్షణతోపాటు వాటిని బిగించడం బీహెచ్ఈఎల్ చేయాలి. నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం 4 గీ130 మెగావాట్ల టర్బైన్లను బీహెచ్ఈఎల్ తయారు చేసింది. 326 మీటర్ల నుంచి 44.13 క్యూసెక్కుల నీటిని డిశ్చార్జి చేసేలా వాటిని తయారు చేసింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అన్ని పరిశీలించాక కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) అథారిటీ సమ్మతం తెలిపింది. ఈ దృష్ట్యా బీహెచ్‌ఈఎల్‌పై నాగం చేస్తున్న ఆరోపణలు నిరాధారం’అని పేర్కొన్నట్లుగా తెలిసింది. టెండర్ల విషయమై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయగా కొట్టివేసిందని పీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. నాగం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని సైతం ఆశ్రయించారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన విజిలెన్స్ ఆయన ఆరోపణల్లో నిజం లేదని తేల్చిందని వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ నివేదికను.. ఒకట్రెండు రోజుల్లో పీఎంవోకు పంపనుంది. -
తెలుగు మహాసభలను విజయవంతం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుండి 19వ తేదీ వరకు నిర్వహించే ఈ మహాసభలకు రాష్టపతి, ఉప రాష్ట్రపతితోపాటు ఇతర ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారితో కలసి సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చే సాహితీ ప్రముఖులకు బస, భోజనం, రవాణా తదితర సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ప్రత్యేక వలంటీర్లను నియమించుకోవాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, హెచ్వోడీలు, యూనివర్సిటీ వీసీలకు ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనేలా సర్క్యులర్ రూపొందించాలని ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హాకు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, రజత్ కుమార్, సీవీ ఆనంద్, కార్యదర్శులు బి.వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్, పీసీబీ సభ్యకార్యదర్శి సత్యనారాయణరెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఎం.డి. క్రిస్టినాచౌంగ్త్, సాట్స్ ఎం.డి. దినకర్ బాబు, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, గ్రంధాలయ సంస్థల చైర్మన్ శ్రీధర్, ఆధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో లేజర్ షో తెలుగు మహాసభలకు ప్రముఖ క్రీడాకారులను ఆహ్వానించాలని ఎస్పీ సింగ్ ఆదేశించారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడి యంలో ప్రముఖ నిపుణులతో లేజర్ షో నిర్వహించాలని, నగరంలో 100 స్వాగత ద్వారాలతోపాటు ఎయిర్‌పోర్టు, బస్, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిం చారు. టెలివిజన్ చానళ్లల్లో అడ్వర్టయిజ్ మెంట్, సెల్ ఫోన్ల ద్వారా వాయిస్ మేసేజ్ ప్రచారం నిర్వహించాలన్నారు. పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వేడుకల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక బుక్ స్టాల్స్ , ఫుడ్ కోర్ట్, హస్తకళల స్టాల్స్ ఏర్పాటుతోపాటు మంచినీటి సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
ఎటువంటి ఇబ్బందులూ రావొద్దు!
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మెట్రో రైలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ప్రాంతం, భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ప్రధాని మోదీ, ఇవాంకా, ఇతర ప్రముఖులు ప్రయాణించే మార్గాలు, పర్యటించే ప్రదేశాలు ఏర్పాట్లపై సమీక్షించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులో హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ అనంతరం జీఈఎస్ సదస్సు జరిగే హెచ్ఐ సీసీ వేదికను డీజీపీ పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, మోదీ, సీఎం, ఇవాంకా వచ్చే మార్గాలు, గ్రీన్ చానల్ ఏర్పాటు, డెలిగేట్లు వచ్చే మార్గం తదితరాలపై సమీక్షించారు. ఇక 29న గోల్కొండ కోటలో జీఈఎస్ డెలిగేట్లకు విందు ఇవ్వనున్న ప్రాంతాలను సీఎస్, డీజీపీ పరిశీలించారు. ఆదివా రం నుంచి కోటను అదీనంలోకి తీసుకోవాలని.. ఎవరినీ అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. విందు మెనూను పరిశీలించారు. కోటలో హస్తకళల ప్రదర్శన మాత్రమే ఉంచాలని, అమ్మకాలను జరపవద్దని సూచించారు. సిబ్బంది, అధికారులు ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకోవాలని, ఇబ్బందులు తలెత్త కుండా, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఇక డీజీపీ మహేందర్ రెడ్డి మెట్రో రైలు డిపో, మియాపూర్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై మెట్రోరైల్ అధికారులతో కలసి సమీక్షించారు. అధికారులతో కలసి మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రతి మెట్రో స్టాప్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. సదస్సు నేపథ్యంలో ఆదివారం నుంచి గురువారం వరకు పోలీసు శాఖ డేగకళ్లతో పహారా కాయబో తోంది. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌ల పర్యటన నేపథ్యంలో.. దాదాపు 4 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది భద్రతా వ్యవహారాల్లో నిమగ్న మవుతున్నారు. -
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)తో పాటు హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎస్పీ సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశిం చారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షిం చారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాలు, మియాపూర్, హెచ్ఐసీసీ, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ ప్రాంతాల్లో ఏర్పాట్లపై సమీక్షించారు. బేగంపేట విమానా శ్రయంలో ప్రధానికి స్వాగ తం పలకడానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికా రులను ఆదేశించారు. ప్రధాని పర్యటించే మార్గంలోనూ.. విదేశీ అతిథులు బస చేసే ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జీఈఎస్‌కు వచ్చే అతిథుల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జీఈఎస్‌ను ప్రారంభించే ముందు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తార న్నారు. వివిధ సంస్థల సీఈవోలతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొం టారన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని ఇచ్చే విందుకు అతిథులను హెచ్ఐసీసీ నుంచి తీసుకువెళ్లడానికి పకడ్బంది ప్రణాళిక రూపొందించాలని, అక్కడ సాంస్కృతిక కార్య క్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీఈఎస్ అతిథులకు గోల్కొండ కోటలో ఇచ్చే విందుకు అన్ని ఏరాట్లు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘గ్లోబల్’ అతిథులకు ప్రత్యేక విందు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్–2017కు హాజరు కానున్న విదేశీ అతిథులకు హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, గత వైభవాన్ని తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోటల్లో వారికి ప్రత్యేక విందులను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28న ఈ సదస్సు ప్రారంభం కానుండగా, అదేరోజు విదేశీ అతిథులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో, 29న గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సహా 1,200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై గురు వారం సచివాలయంలో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ పై విషయాన్ని వెల్లడించారు. 28న ప్రారంభోత్సవం ఉంటుందని, 29, 30 తేదీల్లో ప్లీనరీ సెషన్ మరియు ప్యానెల్ డిస్కషన్, వర్క్‌షాప్ మానిటరింగ్ క్లాసులు ఉంటాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. సదస్సు నిర్వహణపై వచ్చేవారం మరో మారు సమావేశం అవుతామన్నారు. సదస్సును పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సీఎస్‌కు వివరించారు. -
అమ్మో.. 74 వేల ఎకరాలా?
సాక్షి, హైదరాబాద్: వేలాది ఎకరాల ‘భూదాన్’ భూములు అదృశ్యం కావడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్రస్థాయి చర్చ మొదలైంది. ఇన్నాళ్లుగా లెక్కాపత్రం లేని భూదాన భూముల గురించి జిల్లాల వారీగా గణాంకాలతో ‘భూదాన్ దొంగలు దొరికేనా?’ శీర్షికన మంగళవారం సాక్షి ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అందులోని వివరాలు చూసి ప్రభుత్వ వర్గాలే నివ్వెరపోయాయి. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి సర్వే నంబర్లోని భూముల రికార్డులు పరిశీలిస్తున్న నేపథ్యంలో.. భూదాన్ భూముల లెక్క కూడా తేలితే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నత స్థాయిలో చర్చ భూరికార్డుల ప్రక్షాళనపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనాల నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లలో భూదాన భూముల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఒక కీలక సూచన చేసినట్లు తెలిసింది. ఎవరైనా భూస్వామి భూదానపత్రంలో సర్వే నంబర్లు, విస్తీర్ణం చెప్పకపోయినా... 1975 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం భూముల వివరాలు వెల్లడించినప్పుడు ఫలానా సర్వే నంబర్లోని, ఫలానా విస్తీర్ణం గల భూమిని భూదానం కింద ఇచ్చినట్లుగా పేర్కొని ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది. అలా పేర్కొన్న భూములను భూదాన్ కిందకు చేర్చాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇక భూదాన్ యజ్ఞబోర్డు నుంచి తెప్పించుకున్న వివరాల ఆధారంగా.. గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడైనా వివాదాలు తలెత్తినప్పుడు అన్ని రికార్డులు పరిశీలించి ఆ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో ఏ మేరకు భూదాన్ భూములున్నాయనే దానిపై స్పష్టత రావచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సర్వే నంబర్లు లేని భూములు, సాగుకు యోగ్యం కావని నిర్ధారించిన భూముల నిగ్గు తేల్చేందుకు మరో మార్గం లేదని.. ఉన్నంతలోనే లెక్కల్లో స్పష్టత వస్తుందని ఓ సీనియర్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూదాన్ భూములు అక్రమార్కుల పాలైన మాట వాస్తవమేనని.. కానీ ఇంత భారీగా భూములకు లెక్కలు లేకుండా పోయాయనే విషయం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే భూదానోద్యమ స్ఫూర్తికి సార్థకత చేకూరుతుందని, భూమి లేని పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సర్వే నంబర్లు లేనివి పట్టుకునేదెలా? ఎప్పుడో 1950–65 సంవత్సరాల మధ్యలో దానంగా వచ్చిన భూముల వివరాలను పదిలపర్చడం, వాటిని పరిరక్షించడంలో ప్రభుత్వ వర్గాలు విఫలమైన నేపథ్యంలో... ఇప్పుడు వాటి వ్యవహారం తేలడం అంత సులభమేమీ కాదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 1.69 లక్షల ఎకరాల భూదాన్ భూముల్లో కనీసం 60 వేల ఎకరాలకు సర్వే నంబర్లు లేవని చెబుతున్నాయి. అలా సర్వే నంబర్లు లేని భూముల లెక్క ఎలా తేల్చాలన్నది కూడా సమస్యగా మారనుంది. అంతేగాకుండా కొందరు దాతలు భూములిస్తూ సమర్పించిన దానపత్రంలో సర్వే నంబర్లు పేర్కొనలేదని, మరికొందరు సర్వే నంబర్లు ఇచ్చినా భూమి విస్తీర్ణం చెప్పలేదని, ఇంకొందరు వివాదాస్పద భూములను కూడా దానం చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎన్ని ఎకరాల భూములను అప్పట్లో రెవెన్యూ అధికారులు నమోదు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
‘లెక్క’లేనితనం!
సాక్షి, హైదరాబాద్: గిరిజన వర్గాల కోసం రాష్ట్ర సర్కారు కొత్తగా తీసుకొచ్చిన గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్)పై ప్రభుత్వ శాఖల్లో గందరగోళం నెలకొంది. 2017–18 వార్షిక సంవత్సరం నుంచి బడ్జెట్ పద్దుల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో గిరిజన ప్రత్యేక ప్రణాళిక స్థానంలో గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 2017–18 సంవత్సరానికి రూ.8,165.87 కోట్లు కేటాయించింది. గిరిజన సంక్షేమం కోసం తలపెట్టిన ఈ ప్రత్యేక అభివృద్ధి నిధిని 43 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎస్డీఎఫ్ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుండగా... సంబంధిత శాఖలు ఖర్చులు మొదలుపెట్టాయి. అయితే గడిచిన ఆర్నెల్లలో ఏ శాఖ ఎంత మేర ఖర్చు పెట్టిందనే లెక్కల్లో స్పష్టత లేదు. శాఖల వారీగా లెక్కలు తేలకపోవడంతో ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చు, లబ్ధిపై అయోమయం నెలకొంది. నివేదికల జాడలేదు.. ఎస్టీ ఎస్డీఎఫ్ కింద చేసే ఖర్చులు, లబ్ధిపై శాఖల వారీగా ప్రత్యేక ఖాతాలు నిర్వహించాలి. అలాగే ఆర్థిక శాఖ రూపొందించిన సీజీజీ పోర్టల్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. కానీ గత ఆర్నెల్ల కాలంలో 43 శాఖల్లో ఒక్క విభాగం కూడా వివరాలు అప్లోడ్ చేయకపోవడం గమనార్హం. సాధారణంగా ఎస్డీఎఫ్ వినియోగంలో ప్రభుత్వ శాఖలు నాలుగు కేటగిరీల్లో నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత లబ్ధిదారులు, సంఘాలు, పనులు, వ్యవస్థాగత అభివృద్ధిపై స్పష్టమైన సమాచారాన్ని జిల్లాలు రూపొందించి నివేదికలను పొందుపర్చాలి. కానీ ఈ నివేదికల రూపకల్పనపై ఉన్నతాధికారులకు అవగాహన లేకపోవడంతో ఆన్లైన్లో ఇప్పటివరకు ఎలాంటి వివరాలు నమోదు కాలేదు. ఇటీవల సంక్షేమ భవన్లో గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుపై 43 శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశంలోనూ ఆయా శాఖలు సరైన వివరాలు సమర్పించకపోవడంపై ఎస్డీఎఫ్ కార్యదర్శి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎస్ ప్రత్యేక సమావేశం గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుపై సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 43 విభాగాలకు చెందిన కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొననున్నారు. గతవారం జరిగిన సమావేశంలో శాఖాధిపతుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో సోమవారం నాటికల్లా స్పష్టమైన వివరాలతో రావాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో నేటి సమావేశం కీలకంగా మారింది. -
పెట్టుబడిదారుల సదస్సుకు నిర్వహణ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో 8 కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సోమవారం జారీ చేశారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకుగాను నీతి ఆయోగ్ చేసిన సూచనల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగనున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంక ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు హాజరు కానున్నారు. నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాల అధిపతులతో నగర సుందరీకరణ కమిటీ, రవాణా ఏర్పాట్ల కమిటీ, ట్రాఫిక్ నిర్వహణ, కంట్రోల్ రూం ఆపరేటర్ల కమిటీ, వలంటీర్ కమిటీ, ఎయిర్పోర్ట్, రిసెప్షన్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ రిసెప్షన్ కమిటీ, మీడియా కో ఆర్డినేషన్ కమిటీ, సెక్యూరిటీ కో ఆర్డినేషన్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు సమావేశమై ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం కోరింది. ఏర్పాట్ల పరిశీలనకు అమెరికా ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్ నుంచి ప్రతినిధుల బృందం త్వరలో రానుందని తెలిపింది. సదస్సుకు ఆహ్వానించాల్సిన అతిథులు, ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, వీవీఐపీలకు కానుకలు, స్పాన్సర్ల గుర్తింపు తదితర బాధ్యతలను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించింది. -
వచ్చే ఏడాదికల్లా స్వచ్ఛ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: వచ్చేఏడాది అక్టోబర్ 2 నాటికి తెలంగాణను బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా రూపుదిద్దాలన్న ఆశయంతో గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు స్వచ్చందంగా భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ కోరారు. ‘స్వచ్ఛ సంకల్ప్ సే స్వచ్ఛసిద్ధి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం స్వచ్ఛభారత్‌పై నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, షార్ట్ఫిలింలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన 19 మందికి సర్టిఫికెట్లను శుక్రవారం సచివాలయంలో ప్రదానం చేశారు. వ్యాసరచన పోటీల్లో ఓపెన్ కేటగిరి విభాగంలో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన బి.ప్రియాంక, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కె.రమేశ్, ఖమ్మం జిల్లాకు చెందిన గురుస్వామి, నిజామాబాద్‌కు చెందిన నిషాంత్‌లు బహుమతులు గెలుపొందారు. సర్పంచ్ల విభాగంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామ్‌సాగర్ గ్రామ పంచాయతీకి చెందిన పి.గంగాధర్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెట్టిపల్లి కలాన్ గ్రామ పంచాయతీకి చెందిన మల్లేశం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామపంచాయతీకి చెందిన జిన్న గంగాధర్‌లు బహుమతులు గెలుపొందారు. పెయింటింగ్ విభాగంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన సాహస, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన వీరేశ్, ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్.సుష్మలు బహుమ తులు గెలుపొందారు. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ విభాగంలో జగిత్యాల జిల్లాకు చెందిన అశోక్ భోగే, భద్రాద్రి జిల్లాకు చెందిన జగత్‌కుమార్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డి.ప్రకాశ్, ఖమ్మం జిల్లాకు చెందిన మొగలి వెంకటేశ్వర్లు బహుమతులు గెలుపొందారు. ఈ పోటీలు ఆగస్టు్ట 16 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించారు. -
కాళేశ్వరానికి రూ.11,400 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారథ్యంలోని బ్యాంకర్ల కన్సార్షియంకు మధ్య కీలక రుణ ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టు–2కి రూ.11,400 కోట్ల రుణానికి సంబంధించి ఒప్పందం జరిగింది. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సమక్షంలో బ్యాంకర్లు రుణ పత్రాలను నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషికి అందించారు. రూ.11,400 కోట్ల రుణంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.1,900 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.1,500 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ.1,000 కోట్లు, సిండికేట్ బ్యాంక్ 1,000 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంక్ రూ.1,000 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ.1,000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.750 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.500 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.500 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.500 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.250 కోట్లు సమకూర్చనున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మేలు చేసే మెగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు అతి తక్కువ సమయంలో రుణం అందించిన బ్యాంకర్లను సీఎస్ ఈ సందర్భంగా అభినందించారు. బ్యాంకు రుణాల వల్ల ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయని, రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు పాలుపంచుకోవడం ఆనందదాయకమని అన్నారు. సమావేశంలో ఎస్కే జోషితో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి రామ్మోహన్రావు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వేడుకగా కొండా లక్ష్మణ్ జయంతి
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఈ నెల 27న రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వ హించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వేడుకను బీసీ సంక్షేమ శాఖ నిర్వహించాలని, ఇందుకు రూ.8 లక్షలు కేటాయించింది. వేడుకల నిర్వహణకు 84 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, 11 మందిని ఉపాధ్యక్షులుగా, 27 మందిని కన్వీనర్లుగా, 36 మందిని కో కన్వీనర్లుగా, 9 మందిని గౌరవ సలహాదారులుగా నియమించింది. జిల్లాస్థాయిలో వేడుకలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాకు రూ.20 వేలు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
నేడు జాతీయ జెండా అవనతం
అర్జన్ సింగ్‌కు నివాళిగా..జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ అంత్య క్రియలను పురస్కరించుకొని సోమవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఎగిరే జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమ వారం ఉదయం పది గంటలకు ఢిల్లీలోని దరార్లో అర్జన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించను న్నారు. ఆయనకు నివాళిగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు
సీఎం అధ్యక్షతన ఎంపిక కమిటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 కేంద్ర సమాచార హక్కు చట్టంలోని నిబంధనల మేరకు ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు అందులో ప్రస్తావించింది. మొజాంజాహీ మార్కెట్లోని హౌసింగ్ బోర్డు బిల్డింగ్‌లో ఉన్న సమాచార హక్కు భవన్ కేంద్రంగా కమిషన్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ ఏర్పాటుతోపాటు ప్రధాన కమిషనర్, రాష్ట్ర కమిషనర్ల నియామకాలకు సభ్యులను సిఫారసు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షునిగా ఉండే ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి సభ్యులుగా ఉంటారు. -
‘అసైన్డ్’ సమస్యకు ‘ప్రక్షాళన’తో పరిష్కారం!
భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్ భూముల సమస్యకు చెక్ - అన్యాక్రాంతమైన భూముల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు - కబ్జాలో ఉన్న వారి ‘సామాజిక, ఆర్థిక హోదా’ వివరాలు చెప్పాలని ఉత్తర్వులు - నివేదికల ఆధారంగా రీ అసైన్ లేదా క్రమబద్ధీకరణ! - లక్షల ఎకరాలు పట్టాలయ్యే చాన్స్ - దళితులైతే మూడెకరాల పంపిణీ కింద అందజేత సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరో సమస్యకు భూ రికార్డుల ప్రక్షాళన పరిష్కారం చూపుతుందా.. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఈనెల 15 నుంచి జరగనున్న ఈ ప్రక్రియలో అసైన్డ్ భూముల సమస్యకు ఫుల్స్టాప్ పెట్టే దిశలో రెవెన్యూ యంత్రాంగం నిబంధనలు రూపొందించింది. అసైన్డ్ భూములు నిజమైన లబ్ధిదారుల చేతిలో ఉంటే మళ్లీ వారి పేరు మీద రికార్డుల్లో నమోదు చేసుకోవాలని, వేరొకరి కబ్జాలో ఉంటే తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘సామాజిక, ఆర్థిక హోదా’ అనే పదాన్ని భూ రికార్డుల ప్రక్షాళన కోసం రూపొందించిన మార్గదర్శకాల్లో చేర్చింది. 20 లక్షల ఎకరాల పైమాటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచే భూమి లేని నిరుపేదలకు భూ పంపి ణీ చేశారు. వ్యవసాయ, నివాస భూముల ను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి అసైన్ చేసేవారు. తర్వాత రాజకీయ బాధి తులు, స్వాతంత్య్ర సమరయోధులకు భూములు అసైన్ చేశారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగానే అసైన్ చేసిన భూములు ఉంటాయని అంచనా. 40 శాతం అన్యాక్రాంతం అయితే ఈ అసైన్డ్ భూములను అమ్ముకునే అవకాశం లేదు. వేరొకరి పేరు మీద రిజిస్టర్ కూడా కావు. కానీ దాదాపు 40 శాతం పైగా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన భూములను లబ్ధిదారులు అమ్ముకోవడం.. లేదంటే వ్యవసాయ యోగ్యం కాక వదిలివేయడంతో వేరొకరు కబ్జా చేశారని, ఇలా రాష్ట్రంలో 8 లక్షల వరకు అసైన్డ్ భూములు ఇతరుల చేతుల్లో ఉన్నాయని అంటున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా ఓ నివేదిక ఇచ్చింది. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని చట్టాలు చెబుతున్న నేపథ్యంలో.. 15 నుంచి ప్రారంభం కానున్న భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్ భూముల వాస్తవ పరిస్థితి తేలనుంది. అన్యాక్రాంత అసైన్డ్ భూములను ఏకపక్షంగా తిరిగి తీసుకునే దానికంటే కబ్జాలో ఉన్న వారి జీవన పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసైన్డ్ భూముల కబ్జాలో ఉన్న వారి సామాజిక ఆర్థిక హోదా వివరాలు పేర్కొంటూ ప్రత్యేక నివేదిక పంపాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రక్షాళనకు వెళ్లినప్పుడు ఏం చేస్తారంటే? రికార్డుల ప్రక్షాళనకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అసైన్ చేసిన భూముల్లో నిజమైన లబ్ధిదారులే ఉంటే అక్కడే వారికి 1–బీ రిజిస్టర్ ప్రతిని అందజేస్తారు. పాసు పుస్తకాలు లేని వారుంటే వివరాలు నమోదు చేసుకుంటారు. ఒకవేళ లబ్ధిదారు కాకుండా వేరొకరు కబ్జాలో ఉంటే వారి సామాజిక, ఆర్థిక హోదాను తెలి యజేస్తూ నివేదిక పంపాలని కలెక్టర్లకు పంపిన మార్గదర్శకాల్లో సీఎస్ ఎస్పీ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారు. కబ్జాలో ఉన్న వారి పేరు, విస్తీర్ణం, వ్యవసాయ యోగ్యమా కాదా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏంటి, కులం తదితర వివరాలను పేర్కొనాలని సూచించారు. ఈ వివరాలు తెలుసుకోవడం ద్వారా కబ్జాలో ఉన్నది నిజంగా పేదలైతే వారికే రీ అసైన్ లేదా నామమాత్రపు ధర మీద క్రమబద్ధీకరించే ఆలోచనతోనే ఈ నిబంధన చేర్చామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక కులం తెలుసుకోవడం ద్వారా కబ్జాలో ఉన్నది దళితులైతే వారికి మూడెకరాల భూ పంపిణీ కింద నేరుగా పట్టాలిచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. -
పలువురు ఐపీఎస్, డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే పలువురు డీఎస్పీలను కూడా బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు వెలువరించారు. సూర్యాపేట ఎస్పీ, డీఎస్పీలను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దసరా తర్వాత మరికొంత మంది డీఎస్పీలు, ఎస్పీల బదిలీ ఉండే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు తెలిపాయి. అధికారులు ప్రస్తుతం బదిలీ స్థానం ప్రకాశ్‌రెడ్డి ఎస్పీ, నల్లగొండ డీసీసీ, అడ్మిన్, రాచకొండ కమిలేశ్వర్ సింగెన్వర్ ఎస్పీ, నాగర్‌కర్నూల్ ఎస్పీ, మహబూబ్‌నగర్ పరిమళ హనా ఎస్పీ, సూర్యాపేట ఎస్పీ, సీఐడీ ప్రకాశ్ జాదవ్ ఎస్పీ, సీఐడీ ఎస్పీ, సూర్యాపేట డీవీ శ్రీనివాస్‌రావు అదనపు డీసీపీ, రాచకొండ ఎస్పీ, నల్లగొండ డీఎస్పీలు.. నాగేశ్వర్రావు డీఎస్‌ఆర్‌బీ, సికింద్రాబాద్ డీఎస్పీ, సూర్యాపేట వి.సునీత డీఎస్పీ, సూర్యాపేట హెడ్‌క్వార్టర్స్ ఎస్.రమేశ్ ఏసీపీ, సీటీసీ ఏసీపీ, చౌటుప్పల్ జి.చంద్రమోహన్ డీఎస్పీ, వెయిటింగ్ డీఎస్పీ, ఇంటలిజెన్స్ -
20 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
-
20 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ వేడుకతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రక టించి మూడేళ్లుగా అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయా లని భావిస్తోంది. బతుకమ్మ వేడుకకు అంతర్జా తీయంగా గుర్తింపు తెచ్చేందుకు రెండేళ్లుగా కృషి చేస్తోంది. ఈసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలను పెద్దఎత్తున నిర్వహిం చటం ద్వారా ఈసారైనా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభు త్వ ప్రధానకార్యదర్శి ఎస్పీసింగ్ గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న దాదాపు 35 వేల మంది మహిళలతో సామూహికంగా ఎల్బీ స్టేడియంలో ‘‘బతు కమ్మ ఉత్సవం’’నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా 28న వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బతుకమ్మలను హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం కల్పించా లన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ట్రాఫిక్ ప్రణాళిక రూపొందిం చాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిం చారు. జిల్లాలలో కూడా ఘనంగా నిర్వహిం చేందుకు కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వ హించాలని సూచించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలతోపాటు విదేశీ నగరాల్లో కూడా పండుగను ఘనంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశంను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి వేడుకలు మరింత ఉత్సాహంగా, కొత్తగా ఉండేలా చూడాలని సూచించారు. పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ ఒక్కోరోజు ఒక్కో రంగం మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించి హుస్సేన్‌సాగర్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హైదరాబాదు జిల్లా కలెక్టర్ యోగితా రాణా, హెచ్.ఎం.డి.ఎ. కమిషనర్ చిరంజీవులు, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటి మేనేజింగ్ డైరెక్టర్ దినకర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో 1,990 ఆత్మహత్యలు
♦ రైతు మరణాలపై సీఎస్ ♦ చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ ♦ రాజ్యసభ కమిటీకి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో 2015లో 1,358 మంది, 2016లో 632 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. వాణిజ్య పంటలు వేసిన రైతులు కూడా అధిక పెట్టుబడులు పెట్టి, రాబడి లేక ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆ రైతు కుటుంబాలకు పరిహారమివ్వడంతో పాటు పలు విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాజ్యసభ హమీల అమలు కమిటీకి వివరించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, నివారణ చర్యలు, మైనారిటీల అభివృద్ది, యువత ఉపాధికి చర్యలు, విద్యుత్ రంగంలో మార్పులు తదితరాల పరిశీలనకు చైర్మన్ సతీశ్ చంద్ర మిశ్రా, హుసేన్ దల్వాయి, మహ్మద్ నదీమ్ ఉల్ హక్, లాల్‌సింగ్ వడోదిన్, మధుసూదన్ మిస్త్రీ, విప్లవ్ ఠాకూర్లతో కూడిన కమిటీ గురువారం రాష్ట్రానికి వచ్చింది. సీఎస్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్ జలీల్, పోలీసు ఉన్నతాధికారులు వారితో భేటీ అయ్యారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఎకరాకు రెండు పంటలకు రూ.8 వేల చొప్పున పెట్టుబడి తోడ్పాటు అందించేందుకు కార్యచరణ సిద్ధం చేసిందని కమిటీకి సీఎస్ తెలిపారు. కేంద్రం సబ్సిడీ కింద ఇస్తున్న సౌర విద్యుత్ మోటార్లు, మీటర్లపై రైతులు ఆశించినంతగా ఆసక్తి చూపలేదని అజయ్ మిశ్రా తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణలో 24 గంటలు నిరంత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మైనారిటీల అభివృద్ధి కార్యక్రమాలను జలీల్ వివరించారు. -
1.2 లక్షల ఉద్యోగుల ఆందోళన బాట!
- కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుకోసం డిమాండ్ - నేటి నుంచి వరుసగా నిరసనలు, ఆందోళనలు - పాల్గొననున్న అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిపి దాదాపు 1.2 లక్షల ఉద్యోగులతో పోరుబాటకు సిద్ధం అయ్యాయి. నేటినుంచి సెప్టెంబర్ 1వ తేదీవరకు వరుసగా ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించాయి. టీజీవో, టీఎన్జీవో, టీటీజేఏసీ, టీఈజేఏసీ వంటి సంఘాలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించగా, జాక్టో, సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యక్రమాలతోపాటు సెప్టెంబర్ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించాయి. అంతేకాదు ఆ రోజున ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సామూహిక క్యాజువల్ లీవ్ పెట్టాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తరువాత వారి భరోసా, భద్రతకు విఘాతంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆందోళనకు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా ఉద్యమ రూపంలో సీసీఎస్ రద్దుకోసం పోరాటం చేసేందుకు సిద్ధం అయ్యాయి. ఈనెల 28న నిరసన ప్రదర్శనలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని జాక్టో ఆందోళనకు సిద్ధమైంది. ఈనెల 29వ తేదీన టీఎన్జీవో హైదరాబాద్ జిల్లాలో సభను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. అలాగే 30, 31 తేదీల్లో అన్ని డివిజన్ కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయాలలో ధర్నాలు నిర్వహించాలని టీజీవో, టీఎన్జీవో సంఘాలు నిర్ణయించాయి. వీటితోపాటు ఇతర ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో కూడిన తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ (టీఈజేఏసీ), ఈనెల 30వ తేదీన మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని, సెప్టెంబర్ 1న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవల తీర్మానించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఇప్పటికే విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. మరోవైపు సెప్టెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులంతా మండల విద్యాధికారి కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీటీజేఏసీ నిర్ణయించగా, అదే రోజు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ టీచర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని, జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తీర్మానించింది. -
వేగం తగ్గొద్దు... పనులు ఆగొద్దు
- జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేసుకుని ముందుకెళ్లండి - ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం తగ్గవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు నిలిచిపోకుండా సంబంధిత ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. జీఎస్టీ అమలు ప్రభావం అభివృద్ధి పనులపై ఏ మేరకు ప్రభావం చూపనుందనే అంశంతోపాటు, పలు శాఖల ఉన్నతాధికారులకు జీఎస్టీపై అవగాహన కల్పించేందుకుగాను సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ, భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, డబుల్బెడ్రూం ఇళ్లకోసం పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నామని, వీటిని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పలు అభివృద్ధి పనులపై పడే జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేసుకుని ముందుకెళ్లాలని, ఈ పనుల విషయంలో ప్రభుత్వం జారీచేసిన మెమోకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఏజెన్సీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.కె.జోషి, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, బీపీ ఆచార్య, బీఆర్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ వ్యాట్, జీఎస్టీలకు ఉన్న తేడాలపై అధికారులకు అవగాహన కల్పించారు. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
-
‘పదేళ్లు’.. మరో రెండేళ్లు
గరిష్ట వయోపరిమితి సడలింపు మరోసారి పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నిరుద్యోగులకు ప్రయోజనంగా ఉండేందుకు మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దేశించిన గరిష్ట వయో పరిమితి 34 ఏళ్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూలైలో ప్రభుత్వం ఈ వయో పరిమితిని సడలించింది. అదనంగా పదేళ్లపాటు గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచింది. ఈ వెసులుబాటు ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రకటించింది. 2016 జూలైలో మరో ఏడాది పొడిగించింది. గతనెలలో ఈ గడువు ముగిసింది. దీంతో తాజాగా మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై 26 వరకు 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి పొడిగింపు ఉత్తర్వులు అమలు కానున్నాయి. -
జోన్లు రద్దయితే మరో ముప్పు..!
► రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ ఓపెన్ కోటానే.. ► స్థానికులకు పొరుగు రాష్ట్రాల అభ్యర్థుల పోటీ ► మల్లగుల్లాలు పడుతున్న అధ్యయన కమిటీ ► స్థానికులకు అన్యాయం జరగకుండా కసరత్తు సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వులతో ముడిపడి ఉన్న అంశం కావటంతో కేంద్రానికి డ్రాఫ్ట్‌ను పంపించే ముందే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరమైన మార్గదర్శకాలు, కేంద్రానికి పంపించే నివేదికను తయారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ఎస్పీ సింగ్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. కసరత్తు ముమ్మరం చేసిన కమిటీ.. ఉద్యోగ వ్యవస్థలో ప్రస్తుతమున్న మూడంచెల విధానానికి బదులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో రెండంచెల విధానంలోనే పోస్టులుండేలా ఈ కమిటీ తమ కసరత్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వరుసగా రెండు రోజులు వివిధ శాఖాధిపతుల అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా జోనల్ వ్యవస్థ రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో సర్కారు అప్రమత్తమైంది. ప్రధానంగా రాష్ట్ర కేడర్ పోస్టుల భర్తీ విషయంలో స్థానికులు నష్టపోయే ప్రమాదముంటుందనే వాదనలు తెరపైకి వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ ఓపెనే.. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతోంది. అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా స్థాయి పోస్టుల్లో లోకల్ 80 శాతం, ఓపెన్ 20 శాతం.. జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, మల్టీ జోనల్ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ కేటగిరీగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల భర్తీకి లోకల్ రిజర్వేషన్ ఉండదు. మొత్తం ఓపెన్ కోటాగానే పరిగణిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జోనల్ స్థాయిని తొలగించి ఉద్యోగాలను జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుగా పునర్వ్యవస్థీకరించే పని పెట్టుకుంది. రాష్ట్రంలో రెండే కేడర్లు ఉండనుండటంతో సూపరింటెండెంట్ స్థాయి వరకు జిల్లా పోస్ట్‌లుగా, ఆపై స్థాయి పోస్టులన్నీ రాష్ట్ర పోస్టులుగా చేయాలని చర్చ జరుగుతోంది. జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులను రాష్ట్ర స్థాయిలో చేర్చాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో కీలకమైన పోస్టులకు లోకల్ రిజర్వేషన్ వర్తించకుండా పోతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సైతం వీటి కోసం పోటీ పడే వెసులుబాటు ఉంటుంది. పొరుగు రాష్ట్రాల అభ్యర్థుల పోటీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాషా సమస్యతో రాష్ట్ర స్థాయి పోస్టులకు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఏపీకి చెందిన వాళ్లు ఇక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశముంటుంది. లోకల్ రిజర్వేషన్ లేకపోవటంతో ఇంచుమించుగా సమాన సంఖ్యలో, ఒక్కోసారి ఎక్కువ సంఖ్యలో వారికి ఉద్యోగాలు దక్కే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవు తోంది. మరోవైపు పోస్టుల పునర్వ్యవ స్థీకరణతో రాష్ట్ర స్థాయి పోస్టుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. అప్పుడు తెలంగాణ స్థానికులకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికులకు అన్యాయం జరగకుండా కసరత్తు.. తెలంగాణ స్థానికులకు అన్యాయం జరగకుండా ఉండేలా జోన్ల పునర్వ్యవస్థీకరణ ఉండేలా తదుపరి కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించడం కుదరదని నిపుణులు అంటున్నారు. దీంతో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది.. స్థానికులకు న్యాయం జరిగేలా ఎలాంటి మార్గదర్శకాలను పొందుపరుస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి ఏపీలో జోనల్ పోస్టులను కుట్రపూరితంగా రాష్ట్ర పోస్టులుగా మార్చారని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఉద్యమ సమయంలోనే ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో జోన్ల రద్దుతో కొత్త చిక్కులు తలెత్తుతాయా..? తెలంగాణలోని నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఎలాంటి మార్గదర్శకాలు పొందుపరచాలనేది అధికారుల కమిటీకి సవాలుగా మారింది. -
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంపు!
► ఎస్సీలకు 16%, ఎస్టీలకు 9% ► జనాభా ప్రాతిపదికన ప్రతిపాదనలు రూపొందించిన యంత్రాంగం ► సానుకూలంగా ఉన్న సీఎం.. త్వరలో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. జనాభా ప్రాతిపదికన ఈ వర్గాల రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జనాభా లెక్కల ఆధారంగా అధికారులు రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. ఇందులో ఎస్సీ జనాభా 54.08 లక్షలు, ఎస్టీ జనాభా 31.77 లక్షలుగా ఉంది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ రిజర్వేషన్ల పెంపుపై ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. రిజర్వేషన్ల పెంపుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు అతి త్వరలో ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీలకు తాజాగా 4 శాతం రిజర్వేషన్లు పెరగనుండడంతో రిజర్వేషన్ల కోటా 54 శాతానికి చేరుకోనుంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్త నోటిఫికేషన్ల నాటికి.. ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగిరం చేస్తోంది. దీంతో ఆయా వర్గాలు నష్టపోతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. త్వరలో వెలువడే నోటిఫికేషన్లకు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రిజర్వేషన్లు పెంచాలనే యోచనలో ఉంది. -
సీఎం ఆమోదం తర్వాతే.. ‘సర్వశిక్షా’ సిబ్బంది వేతనాలు పెంపు!
రూ.2,195 కోట్ల బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం సాక్షి, హైదరాబాద్: సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) సిబ్బంది వేతనాల పెంపునకు పాలకమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రభుత్వ ఆమోదం తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఎస్ఎస్ఏ పరిధిలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వేతనాల పెంపుపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని పాలకమండలి పేర్కొంది. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఎస్ఎస్ఏ పాలకమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎస్ఎస్ఏ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు చర్చించారు. గతంలో ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఆమోదించిన వేతనాల పెంపు ప్రతిపాదనలపై సీఎస్ ఆధ్వర్యంలోనే నిర్ణయం తీసుకొని అమలు చేసేవారు. అయితే, ఈసారి విద్యాశాఖ ఫైలు పంపిస్తే సీఎం పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఎస్ఎస్ఏ పరిధిలో సివిల్ వర్క్స్ చూసే ఇంజనీరింగ్ విభా గాన్ని తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సంస్థ(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)లో విలీనం చేయాలని నిర్ణయించారు. సివిల్ వర్క్స్ మానిటరింగ్‌కు ఈఈ నేతృత్వంలో ఒక విభాగాన్ని కొనసాగించాలని తీర్మానించారు. మరోవైపు కొత్తగా మంజూరైన కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ), 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, కేంద్రం ఓకే చెప్పిన రూ.2,195 కోట్ల ఎస్ఎస్ఏ బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ కిషన్, ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావు, కేజీబీవీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి ‘భగీరథ’ నీరు
నల్లగొండ టూటౌన్ : మిషన్ భగీరథ పథకం ద్వారా డిసెంబర్ 31 నాటికి అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసే విధంగా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేయడంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. అర్హులైన ఒంటరి మహిళలకు ఈనెల 8వ తేదీ నుంచి 13 వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 18వ తేదీ వర కు దరఖాస్తులను పరిశీలించాలని, 19 నుంచి 21వరకు అర్హులైన వారి జాబితాను పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రదర్శించి అభ్యం తరాలు స్వీకరించాలని కోరారు. అదే విధంగా సాదాబైనామాలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్‌చీఫ్ సెక్రటరీబీఆర్. మీనా, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా నుంచి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలతో దేశంలోనే అగ్రగామి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సాక్షి, సంగారెడ్డి: సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2016 ఆర్థిక సంవత్సరంలో 17.82 శాతం ఆదాయ వృద్ధి రేటుతో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతరం ప్రభుత్వ సేవలు ప్రజల ముగింట్లోకి వచ్చాయని, భవిష్యత్‌లో మరిన్ని ఫలాలు అందుతాయని చెప్పారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని సీఎస్ వివరించారు. 38 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని, నూతనంగా 510 రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు 17 వేల కోట్లు రుణమాఫీ చేయడంతో పాటు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్నామని చెప్పారు. వివిధ పథకాలతో పాటు మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్లు, విద్య, వైద్యం, సంక్షేమం, పరిశ్రమలు, మహిళా సంక్షేమం, పోలీస్ తదితర అంశాలపై వివరించారు. -
పండుగలా అవతరణ వేడుకలు
► వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ.సింగ్ సాక్షి, కరీంనగర్: తెలంగాణ అవతరణ వేడుకలను పం డుగలా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ.సింగ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వేడుకలు నిర్వహించా లని సూచించారు. జిల్లాస్థాయిలో వివిధరంగాలలో విశేష కృషి చేసిన 11 మందిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయాలని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా, డివిజన్‌స్థాయిలో ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణం కల్పించాలని తెలిపారు. జూన్ 3వ తేదీన కేసీఆర్ కిట్టు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వాస్పత్రులలో, ఏరియా ఆస్పత్రులలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొనాలన్నారు. జూన్ 4న ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వమించాలని పేర్కొన్నారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతంచేసి రెండు రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొనేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. 2018, డిసెంబర్ నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందు కు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛ గృహిశ్, స్వచ్ఛ రుతలను నియమించుకోవాలని సూచించారు. ఉపాధిహమీ పథ కం క్రింద శానిటేషన్ వర్కర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, కృష్ణభాస్కర్, డీఆర్వో అయేషామస్రత్‌ఖానమ్, డీఎంహెచ్‌వో శ్రీధర్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అవతరణ ఉత్సవాలు ఘనంగా జరపండి
అవతరణ ఉత్సవాలు ఘనంగా జరపండి ► జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, మున్సిపాలి టీలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలు ప్రారంభించాలన్నారు. గురువారం సచివాల యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ప్రాణాలర్పిం చిన అమరవీరులకు అమరవీ రుల స్థూపం వద్ద నివాళులర్పించి తర్వా త పరేడ్ గ్రౌండ్స్‌లో పతాకా విష్కరణ, పరేడ్, ప్రసం గం, అవార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. హైదరా బాద్, జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, కార్యా లయాలు, బ్యాంకులు, హోటళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించేలా చూడాలని.. హోటళ్లు, అసోసియేషన్లు, యూనియన్లు వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ రంగాలలోని కృషి చేసిన 11 మందికి అవార్డులను ప్రదానం చేయాలని.. స్క్రీనింగ్ కమిటీతో, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదంతో అవార్డుల లిస్టు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. -
జూన్ 2 నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు
- ప్రణాళికను నిర్దేశించిన సీఎస్ ఎస్పీ సింగ్ - వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల పెన్షన్ల ను జూన్ 2 నుంచి పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. ఒంటరి మహిళల పెన్షన్ల మార్గదర్శకాలు జారీ చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించా లన్నారు. బుధవారం సచివాలయం నుంచి సీఎస్ ఎస్పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్. మీనా, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియంకా వర్గీస్, పంచాయతీరాజ్ కమిష నర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని సీఎస్ అన్నారు. ఈ నెల 8 నుంచి 13 వరకు గ్రామ సభల్లో, మున్సిపల్ వార్డులలో మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీక రణను ప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు. 9 నుంచి 18 వరకు దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి, 19 నుంచి 21 వరకు దరఖాస్తుదారుల జాబితాలను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డు లలో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించా లన్నారు. 22న లబ్ధిదారుల జాబితాను ప్రకటించి ప్రదర్శించాలన్నారు. 23 నుండి 25 వరకు డేటాను అప్లోడ్ చేయాలన్నారు. కలెక్టర్లు శ్రద్ధ వహించి ఈ పథకం అమలుపై జిల్లా యంత్రాంగానికి తగు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలోను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పెన్షన్ల పంపిణీ జరగాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో అర్హుల ఎంపికకు ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలన్నారు. ఈ పథకానికి సంబంధించి సెర్ప్ కార్యాలయం లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా మన్నారు. రాష్ట్రంలో వచ్చే సీజన్లో హరిత హారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వ హించడానికి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. -
హిందాల్కో కంపెనీని పునరుద్ధరించాలి
-
హిందాల్కో కంపెనీని పునరుద్ధరించాలి
సీఎస్‌కు వినతిపత్రం సమర్పించిన కోదండరాం సాక్షి, హైదరాబాద్: గండిపేట చెరువు సమీ పంలోని హిందాల్కో కంపెనీని పునరుద్ధరించి, అందులోని ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు జేఏసీ చైర్మన్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సచివాల యంలో సీఎస్‌ను కలసి ఆయన ఆధ్వర్వం లోని బృందం వినతిపత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో కోదండరాం మాట్లా డుతూ.. హిందాల్కో కంపెనీ వల్ల ఎటువంటి ఇబ్బం దులు లేవని, ఇది జీవో నెంబర్ 111 పరిధిలోకి రాదన్నారు. ఈ కంపెనీని కొన సాగించడానికి ముందు కొచ్చిన వారికి అవ కాశం ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలోని రామ గుండం గోలివాడ సమీపంలో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 400 ఎకరాలను ప్రభుత్వం సేకరించేందుకు యోచిస్తోందన్నారు. అక్కడి నిర్వాసితులు దీనిపై కోర్టు స్టే తెచ్చుకున్నారని, అయినా ప్రభుత్వం బలగా లతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జోక్యం చేసు కోవాల ని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. స్కై ఉబర్ నిర్మాణం పేరుతో హైదరాబాద్‌లో ప్రధాన ఆకర్షణ కేంద్రంగా ఉన్న శిల్పా రామం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయా న్ని తప్పుబట్టారు. ఎవరి మీద కోపంతోనో.. కక్షతోనో జేఏసీ ఉద్యమాలు చేయడం లేదని కోదండరాం స్పష్టం చేశారు. -
మిషన్ భగీరథపై ప్రధాని ఆసక్తి
బ్యాంకర్లతో భేటీలో సీఎస్ ఎస్పీ సింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం మోడల్‌గా పరిగణిస్తోందని, భగీరథ పనుల పురోగతిని ప్రధాని మోదీ వాకబు చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. ప్రాజెక్ట్ పూర్తయ్యే రోజుకోసం కేంద్రంలోని ఉన్నతస్థాయి వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రాజెక్ట్‌లో కీలకమైన ఇంట్రావిలేజ్ పను లకు రుణసాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భగీరథ అధ్యయనానికి ఇతర రాష్ట్రాలు ఇక్కడకు వస్తున్నాయని, ప్రాజెక్టు సాధించిన ఈ ఘనతలో బ్యాంకర్లదే ప్రధాన పాత్ర అన్నారు. -
సీఎం ఓకే అంటేనే..
డిమాండ్లపై ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించ లేదు.సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి సమస్యలపై చర్చించిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు.. మంగళ వారం మరోసారి ఆయనతో సమావేశమ య్యారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత త్వర గా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎస్ హామీ ఇచ్చారు. కీలకమైన సాధారణ బదిలీల విషయంలో సాంకేతిక సమస్యలతో పాటు ఖాళీల సమస్య ఉందన్నారు. బదిలీల కు అవకాశం కల్పిస్తే కొత్తగా ఏర్పడిన మారు మూల జిల్లా కలెక్టరేట్లలో పనిచేస్తున్న అరకొర సిబ్బంది కూడా పట్టణాలకు సమీపంలోని జిల్లాలను కోరుకుంటారని, అప్పుడు మారు మూల జిల్లాల్లో పాలన దెబ్బతింటుందనే అభిప్రాయపడ్డారు. ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల బదిలీలను కొత్త జిల్లాల ప్రకా రమా.. లేక పాత జిల్లాల ప్రకారమా అన్నది ముందుగా నిర్ణయించాల్సి ఉందని సీఎస్ పేర్కొన్నట్లు సమాచారం. పాత జిల్లాల ప్రకారమైతే కొత్త జిల్లాల్లో.. మారుమూల ప్రాంతాల్లో ఉండకుండా, పట్టణ ప్రాంతాలకు వచ్చేందుకు ఎక్కువ మంది ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో పాలనపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాల ప్రకారమైతే... ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న వారికి శాశ్వత కేటాయింపులు జరిపి, ఆ తర్వాత బదిలీలు చేయాల్సి ఉం టుంది. దీంతో ఇçప్పటికిప్పుడు సా«ధారణ బదిలీలు కష్టమేనని సీఎస్ అన్నట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షు రాలు వి.మమత, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. సమస్యలపై ఏకరువు... ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై రాష్ట్రంలో నిషేధం అమల్లో ఉంది. రాష్ట్రం ఏర్ప డక ముందు రెండేళ్లు.. తర్వాత మూడేళ్లుగా బదిలీలు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ సంఘా ల ప్రతినిధులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆరేడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. భార్యాభర్త ల కేసులను ప్రత్యేకంగా పరిగణిస్తామని, వారి బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినా... ఖాళీలు లేని కారణంగా అది అమలుకు నోచుకోవటం లేదన్నారు. పునర్విభజన అనంతరం ఏపీలో ఇప్పటికే రెండుసార్లు బదిలీలు జరిగాయన్నారు. విద్యా సంవత్సరం ఆరంభం దృష్ట్యా పిల్లల చదువు లను దృష్టిలో ఉంచుకొని మే 15 లోపు బదిలీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం వద్దే ఉందని, పీఆర్సీ బకాయిలను ఎన్ని విడతలుగా చెల్లించాలనేది తుది పరిశీలనలో ఉందని సీఎస్ తెలిపారు. సీపీఎస్ రద్దు చేయండి... కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. ఈ విధానంతో ఉద్యోగు లకు అన్యాయం జరుగుతుందని, దీన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలయ్యేలా చూ డాలని కోరారు. అయితే ఇది క్లిష్టమైందని, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని సీఎస్ చెప్పారు. సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగుల కు గ్రాట్యుటీ చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని.. తెలంగాణలోనూ చెల్లిం చాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఏపీలో ఉన్న తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులతో పాటు మిగతా ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసు కోవాలని, ఆ మేరకు ఏపీతో సంప్రదిం పులు జరపాలని విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే ఈ అంశంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని, ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని సీఎస్ బదులిచ్చారు. ఫైలు సీఎం పరిశీలనలో ఉందని, అన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారు. వారం తర్వాత కార్యాచరణ: ఉద్యోగ సంఘాలు సీఎస్‌తో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారంలోపు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారని, ఆలోగా సమస్యలు పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. సీఎస్‌ను కలిసిన వారిలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాజేందర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్ తదితరులు ఉన్నారు. -
15 రోజుల్లో గొర్రెల పథకానికి సర్వే
⇒ 25 వరకు అన్ని జిల్లాలకు కేసీఆర్ కిట్లు ⇒ జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకానికి సంబం ధించి 15 రోజుల్లో గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు మొదలవగానే జూన్ 20లోగా గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 10న సీఎం కేసీఆర్ నిర్వహించే కలెక్టర్ల సమావేశానికి తగిన సమాచారంతో రావాలని సూచించారు. కలెక్టర్ల సదస్సులో సమీక్షించే అంశాలపై శుక్రవారం సచివాలయం నుంచి సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, భూసేకరణ సకాలంలో జరగకపొతే వ్యయం పెరిగే అవకాశమున్నందున ఈ అంశంపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. త్వరలో ప్రారంభించే కేసీఆర్ కిట్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఈ నెల 25 లోగా కేసీఆర్ కిట్లు జిల్లా స్టోర్లకు చేరుకుంటాయని, ప్రతి ఆసుపత్రికి ఇవి చేరేలా చూడాలన్నారు. గర్భిణులకు అందించే ప్రోత్సాహకానికి సంబంధించి సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు సీఎస్ చెప్పారు. ఆసక్తిచూపే ప్రతి ఒక్కరికి గొర్రెల యూనిట్ గొల్ల, కుర్మ, యాదవ కులాల్లో 18 సంవత్సరాలు నిండి, గొర్రెల పెంపకానికి ఆసక్తి చూపే ప్రతి ఒక్కరికి యూనిట్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతమున్న సొసైటీల్లో కొత్త సభ్యుల నమోదు, కొత్త సొసైటీల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన జరగాలని అన్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకర ణకు సంబంధించిన వివరాలతో కలెక్టర్ల సదస్సుకు రావాలని సీఎస్ సూచించారు. మిషన్ భగీరథకు సంబంధించి స్థానిక కాంటాక్టర్లకు గ్రామాల్లో అంతర్గత పనుల అప్పగింత, జిల్లాల్లో పనుల పురోగతి, ప్రైవేటు వ్యక్తుల భూములలో పైపులైన్లు వేసే పనులపై సీఎం సమీక్షిస్తారని చెప్పారు. సీఎస్‌తో పాటు ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్. మీనా, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ధిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, వైద్యశాఖ కమిషనర్ కరుణ, సెర్ప్ సీఈవో పౌసమిబసు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఎస్సీ, ఎస్టీ నిధి నిబంధనలు
వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి నిబంధనల రూపకల్పనకు సూచనలు చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కోరారు. మంగళవారం సచివాలయంలో నిర్వహిం చిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల న్నారు. పథకాల అమలు పర్యవేక్షణకు సీఎం చైర్మన్‌గా కౌన్సిల్ ఏర్పడుతుందన్నారు. పది రోజుల్లోగా డ్రాప్ రూల్స్ సమర్పించాలని అజయ్ మిశ్రా కోరారు. ఈ సందర్భం గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ప్రగతి పద్దులో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధిం చి కేంద్రం నుంచి రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు అదనంగా పొందేలా వివిధ శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రంజీవ్ ఆర్.ఆచార్య, ఎస్కే జోషి, రాజేశ్వర్ తివారి, బీపీ ఆచార్య, సురేశ్ చందా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సహకారంతో ‘భగీరథ’
అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో ప్రజల సహకారం తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణాభివృద్ధి శాఖ సమష్టి భాగస్వామ్యంతో మరుగుదొడ్ల నిర్మాణం విజయవంతంగా ముందుకు సాగుతోందని, ఈ తరహాలోనే గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా పైప్లైన్ల పనులు జరపాలని సూచించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై బుధవారం తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ప్రధాన కార్యాలయంలో సీఎస్ సమీక్ష జరిపారు. గ్రామాల్లో అంతర్గతంగా చేపట్టే భగీరథ పనుల్లో సెర్ప్ సిబ్బందిని ఉపయోగించుకునేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతు కుమారి ప్రసాద్‌ను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో అంతర్గత పైప్‌లైన్ పనులు ప్రారంభమవుతాయని, ఈ పనులకు వాడే పైపుల నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భగీరథ పథకానికి అవసరమైన నిధుల సమీకరణ, నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డిని ఆదేశించారు. సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ అధికారులను ఏపీకి పంపించాలి
సీఎస్ ఎస్పీ సింగ్‌కు గ్రూప్–1 అధికారుల విజ్ఞప్తి హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఆంధ్రా అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు రాష్ట్ర గ్రూప్–1 అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం సచివా లయంలో సీఎస్‌ను కలసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఇతర నేతలు శ్రీనివాసులు, శశికిరణాచారి, అరవింద్‌రెడ్డి తదితరులు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రాకు చెందిన అధికారులు ఏపీకి ఆప్షన్ ఇచ్చినప్పటికీ అక్కడ ఖాళీలు లేవన్న సాకుతో కమలనాథన్ కమిటీ తెలంగాణకు కేటాయించిందని, వారిని వెంటనే ఖాళీలతో సంబంధం లేకుండా ఆంధ్రాకు కేటాయించాలని కోరారు. అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ అధికారులు, ఉద్యోగులను రాష్ట్రానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలను ఆప్షన్లతో సంబంధం లేకుండా వారి సొంత రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. -
తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్పీ సింగ్
-
తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్పీ సింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ సింగ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగిసింది. ఆయన పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. శనివారం రాత్రి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రదీప్ చంద్ర స్థానంలో ఎస్పీ సింగ్ ను ఎంపిక చేసింది. బిహార్ కు చెందిన ఎస్పీ సింగ్ పూర్తి పేరు శేఖర్ ప్రతాప్ సింగ్. కాగా, అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా శనివారం పదవీ విరమణ చేసిన ఏకే ఖాన్ ను మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియమించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అరవింద్ కుమార్ ను ఎంపిక చేసింది. -
‘మిషన్ భగీరథ’లో స్పీడు పెంచాలి.
- సంపు పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్, ఎస్పీ సింగ్ మేడ్చల్ : మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. బుధవారం వారు మిషన్ భగీరథకు సంబంధించి మేడ్చల్ మండలంలోని ఘనాపూర్ క్షేత్రగిరిపై నిర్మించిన గోదావరి జలాల సంపును, మేడ్చల్‌లో టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో, గిర్మాపూర్, ఎల్లంపేట్, సోమారం గ్రామాల్లో సంపులను నిర్మించనున్న ప్రాంతాలను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడొద్దని, వచ్చేఏడాది ఏప్రిల్‌లోపు పనులను పూర్తిచేయాలని ఎస్పీ సింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మేడ్చల్ తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ దేవసహాయం, నగర పంచాయతీ కమిషనర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భోగారంలో సంపు నిర్మాణ పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్ కీసర : మండలంలోని భోగారంలో మిషన్ భగీరథ పనులలో భాగంగా చేపడుతున్న సంపు నిర్మాణ పనులను సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. అధికారులతో కలిసి కీసరగుట్టలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయారు. -
అదిగో.. ఆగస్టు మేఘం!
* ఇప్పుడే కరువు భయం వద్దు.. ఇంకో నెల చూద్దాం * వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ * క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరమని వ్యాఖ్య * ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధం కావాలని సూచన * సాగు సంక్షోభంలో కూరుకుపోతోందంటూ ఆవేదన * ఆధునీకరణ, యాంత్రీకరణను ప్రోత్సహించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, వర్షాల్లేక పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈనెలలో వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయని... లేకపోతే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావు, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెలాఖరు వరకు వర్షాలు కురిస్తే పంటలకు ఢోకా లేదని.. అప్పటికీ వర్షాలు రాకుంటే కరువు పరిస్థితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే ఇప్పుడే కరువు గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని, క్షేత్రస్థాయిలో మరింత ఆందోళన వ్యక్తమవుతుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. వ్యవసాయం కుంటుపడింది.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతోందని, అనుకున్న రీతిగా అభివృద్ధి చెందడం లేదని సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయశాఖలో విస్తరణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని.. వ్యవసాయ వర్సిటీలలో పరిశోధనలు తగ్గిపోవడం మంచి పరిణామం కాదని చెప్పారు. పరిశోధనలు పెరగాలని.. అవసరమైన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తేవాలని, వ్యవసాయ వర్సిటీ ఇందులో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. కాగా వ్యవసాయ విస్తరణాధికారులను కూడా మండల స్థాయిలో నియమించుకోవాలని.. ఎన్ని ఉద్యోగాలు అవసరమో ప్రతిపాదిస్తే, త్వరలో నియామకాలు జరుపుతామని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అవసరమైన మేరకు ఆగ్రానమిస్టులను కూడా నియమించుకోవాలని చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునీకరణ పెరగాలని... రాష్ట్రంలోని వ్యవసాయ క్షేత్రాలను క్రాప్ కాలనీలుగా గుర్తించి విభజించాలని, విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలని ఆదేశించారు. రైతులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా సరైన ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. రెండు పంటల కాలం రానుంది... రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని... వీటిద్వారా రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ తమ కార్యక్రమాలను విస్తరించుకోవాలని సూచించారు. తెలంగాణలో రెండు పంటలు పండే కాలం వస్తుంద న్నారు. సంప్రదాయ వ్యవసాయమే కాకుండా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వ్యవసాయ పద్దతుల్లో మార్పులు రావాలని, పట్టణాల పరిసర వ్యవసాయ భూముల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కోసం అవసరమైన మార్కెటింగ్ వ్యూహాన్ని అవలంబించాలని సూచించారు. కాగా వ్యవసాయ వర్సిటీకి సెర్చ్ కమిటీ నియమించి వీసీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. వర్సిటీలో పరిశోధనలు పెరగాలని... వర్సిటీ పరిధిలోని భూముల్లోనే కాకుండా ప్రొఫెసర్లు, విద్యార్థులు అన్ని జిల్లాల్లో పర్యటించి పరిశోధనలు చేయాలని చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా భూసార పరీక్షలు చేయిస్తామని, దానికి అనుగుణంగా ఎక్కడ ఏ పంటలు వేయాలో రైతులకు సూచించాలని పేర్కొన్నారు. -
రెండుగా ఆబ్కారీ శాఖ
జూన్ 1 నుంచే తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ విధులు ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, పెట్టుబడి వాటాల విభజన, బదిలీ రెండు రాష్ట్రాల్లో వేర్వేరు రంగుల లేబుల్స్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ కార్పొరేషన్లు రెండుగా విడిపోయాయి. రెండు ప్రాంతాలకు ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తిచేసిన ఎక్సైజ్ శాఖ అధికారికంగా జూన్ ఒకటి నుంచి విధులు నిర్వర్తించబోతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన లేబుల్స్(ఈఏఎల్స్) రంగులను కూడా మార్చారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ రెండు వేర్వేరు జీవోలు(నంబర్ 239, 240) జారీ చేశారు. ఈ మేరకు జూన్ 1 నుంచే విభజన అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీ పునర్నిర్మాణ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ సీమాంధ్రకు, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతాయి. {పస్తుతం మద్యం బాటిళ్లపై ప్రింట్ చేస్తున్న ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్’ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేసే బాటిళ్లపై ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్’ అని ప్రింట్ చేస్తారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో తయారయ్యే మద్యంతో పాటు ఎగుమతి, దిగుమతి, సీఎస్డీ మద్యానికి ఇస్తున్న లేబుల్స్ రంగులను తెలంగాణకు మార్చినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. {పస్తుతం మద్యం లేబుళ్లను యథాతథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఏపీ రాష్ట్రంలో తయారయ్యే మద్యానికి లేత ఆకుపచ్చ, ఎగుమతి, దిగుమతి మద్యానికి లేత పసుపు, సీఎస్డీ లేబుళ్లకు లేత గోధుమ రంగు కొనసాగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యే మద్యంకు లేత గులాబీ, ఎగుమతి మద్యానికి లేత నారింజ, దిగుమతి లేబుళ్లకు లేత ఎరుపు, సీఎస్డీ లేబుల్స్‌కు లేత నలుపు రంగులను కేటాయించారు. తెలంగాణలో స్థానిక వినియోగానికి వినియోగించే మద్యం బాటిళ్లకు లేత ఆకుపచ్చ, గులాబీ రంగు లేబుళ్లను వినియోగిస్తారు. తెలంగాణ ప్రభుత్వ లోగో వచ్చిన తరువాత ప్రస్తుతం ఉన్న లోగో స్థానంలోకి మార్పు చేస్తారు.