సీఎస్ ఎస్పీ సింగ్‌కు గ్రూప్–1 అధికారుల విజ్ఞప్తి
హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఆంధ్రా అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు రాష్ట్ర గ్రూప్–1 అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం సచివా లయంలో సీఎస్‌ను కలసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఇతర నేతలు శ్రీనివాసులు, శశికిరణాచారి, అరవింద్‌రెడ్డి తదితరులు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రాకు చెందిన అధికారులు ఏపీకి ఆప్షన్ ఇచ్చినప్పటికీ అక్కడ ఖాళీలు లేవన్న సాకుతో కమలనాథన్ కమిటీ తెలంగాణకు కేటాయించిందని, వారిని వెంటనే ఖాళీలతో సంబంధం లేకుండా ఆంధ్రాకు కేటాయించాలని కోరారు. అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ అధికారులు, ఉద్యోగులను రాష్ట్రానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలను ఆప్షన్లతో సంబంధం లేకుండా వారి సొంత రాష్ట్రానికి కేటాయించాలని కోరారు.
ఆ అధికారులను ఏపీకి పంపించాలి
Published Wed, Feb 1 2017 1:32 AM | Last Updated on Sat, Jun 2 2018 2:23 PM
Advertisement
Advertisement