
ఎస్‌కే జోషి (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఎస్ శేఖర్ ప్రసాద్ సింగ్ (ఎస్పీ సింగ్) పదవీకాలం నేటితో ముగియనుంది. ఎస్పీ సింగ్ పదవీకాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో నూతన సీఎస్ నియామకం అనివార్యమైంది.
984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శైలేంద్ర కుమార్ జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ఆయన స్వస్థలం. ఢిల్లీ ఐఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ అనంతరం సివిల్స్ ర్యాంకు సాధించారు. రాజీవ్ శర్మ, ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్‌ల తర్వాత తెలంగాణకు నాలుగో సీఎస్ ఎస్‌కే జోషి.
సీఎస్ నియామక ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment