తెలుగు మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేయండి | Make arrangements for the Telugu Conferences | Sakshi
Sakshi News home page

తెలుగు మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేయండి

Published Sun, Dec 10 2017 2:15 AM | Last Updated on Sun, Dec 10 2017 2:15 AM

Make arrangements for the Telugu Conferences - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకు సచివాలయంలో సభల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ప్రధాన వేడుక జరిగే ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదిక, పలువురి ప్రతినిధులకు సీటింగ్‌ తదితర ఏర్పాట్లకి సంబంధించి లే అవుట్‌పై చర్చించారు.

భోజన వసతిలో ఎటువంటి ఇబ్బందు లు లేకుండా చూడాలన్నారు. తెలుగులో రాసిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. మెస్సర్స్‌ విజ్‌ క్రాప్ట్‌ ద్వారా లేజర్‌ షో ఏర్పాటు చేయాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లపై చర్చించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చే ప్రతినిధులకు ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా తగు సమాచారాన్ని అందించాలన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో టీం వర్కుగా పనిచేసి సభలను విజయవంతం చేయాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement