
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లడానికి ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ కొనియాడారు. సోమవారం సచివాలయంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమతతో కలిసి ఆవిష్కంచారు.
రైతులకు 24 గంటల విద్యుత్, భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు దేశం దృష్టిని ఆకర్షించాయని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్రం కోసం పుట్టిందని, నేడు ప్రభుత్వ పథకాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. 2018 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలుతో పాటు ఆర్డర్ టు సర్వ్ కింద ఉన్న ఉద్యోగులను ఫైనల్ అలాట్‌మెంట్ చేయాలని మమత కోరారు.
Comments
Please login to add a commentAdd a comment