mla srinivasgoud
-
‘అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లడానికి ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ కొనియాడారు. సోమవారం సచివాలయంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమతతో కలిసి ఆవిష్కంచారు. రైతులకు 24 గంటల విద్యుత్, భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు దేశం దృష్టిని ఆకర్షించాయని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్రం కోసం పుట్టిందని, నేడు ప్రభుత్వ పథకాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. 2018 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలుతో పాటు ఆర్డర్ టు సర్వ్ కింద ఉన్న ఉద్యోగులను ఫైనల్ అలాట్మెంట్ చేయాలని మమత కోరారు. -
పాలమూరులో ప్రొటోకాల్ చిచ్చు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రొటోకాల్ వివాదం శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ సమావేశంలో చిచ్చుకు దారితీసింది. ఈ విషయమై మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌ డ్, సంపత్‌కుమార్‌ల నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. జెడ్పీ అతిథి గృహం పునఃప్రారంభోత్సవం విషయమై స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు సమాచారం ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఇటీవల మరమ్మతులు చేసిన జెడ్పీ అతిథి గృహాన్ని శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఎందుకివ్వలేదని, ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యే చేత ఎలా ప్రారంభోత్సవం చేయిస్తారంటూ జెడ్పీ సమావేశం లో శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్, జడ్చర్లలో గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ చేత ప్రారంభోత్సవం చేయిస్తే ఊరుకుంటా రా అంటూ మండిపడ్డారు. గంటసేపు వివా దం సాగడంతో బండారి భాస్కర్ కలుగజేసు కుని అనుకోకుండా రిబ్బన్ కట్ చేయాల్సి వచ్చిందని, అధికారిక ప్రారంభోత్సవం కాదని కొబ్బరికాయ కూడా కొట్టలేదంటూ చెప్పుకొచ్చారు. మంత్రులిద్దరూ భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. నన్నెందుకు అవమానిస్తారు: సంపత్ ఈ విషయమై ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇద్దరు మంత్రులు నాకు బలవంతంగా కత్తెర ఇచ్చి రిబ్బన్ కట్ చేయించి, తీరా ఇప్పుడేమో బోగస్ ఓపెనింగ్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం. మంత్రులే స్వయంగా బోగస్ ఓపెనింగ్ చేయించి నన్ను అవమాన పరుస్తారా? నాకు అవమానం కలిగిస్తే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా’ అంటూ ధ్వజమెత్తారు. -
మత్స్య సంపదను కాపాడుకుందాం
మహబూబ్‌నగర్ వ్యవసాయం : మత్స్య సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పెద్దచెరువులో చేప విత్తనాలు వదిలి అనంతరం ఆయన మాట్లాడారు. వందశాతం రాయితీపై చేపవిత్తనాల పంపిణీకిగాను జిల్లాకు రూ.ఐదు కోట్లు కేటాయించామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతును చేపట్టడంతో మత్స్యకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. వారికి అవసరమైన చేపల మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలో వంద చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మత్స్యకారుల కమ్యూనిటీ భవనాలు, కార్యాలయాల ఏర్పాటుకు యత్నిస్తామన్నారు. పాలమూరులో త్వరలోనే పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేగాక పెద్దచెరువును మినీ ట్యాంకు బండ్లా అన్ని విధాలా అభివద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, మత్స్యశాఖ ఏడీ ఖదీర్ అహ్మద్, మత్స్య సంఘం జిల్లా అధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ, టీఆర్ఎస్ జిల్లా కో–కన్వీనర్ బెక్కెం జనార్దన్, ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షుడు పెద్ద విజయ్‌కుమార్, పార్టీ నాయకులు మనోహర్, నాగులు, ఎర్ర బాలప్ప, గోనెల శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆర్డీఓ లక్షీ్మనారాయణతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. బైపాస్ కారణంగా కేవలం 25 ఇళ్లు మాత్రమే పోతున్నాయన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలోనే మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు, పట్టణ ప్రధాన రోడ్డు ఫోర్ లే¯Œæగా మారుస్తున్నామన్నారు. బైపాస్ రోడ్డు ఎస్వీఎస్ ఆస్పత్రి పక్క నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు 9.7కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుందన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారమే బైపాస్ సర్వే జరుగుతోందన్నారు. ఈ రోడ్డు వల్ల రవాణా వ్యవస్థ మెరుగై ప్రజల బతుకుదెరువుకు అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.పది కోట్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డును విస్తరిస్తున్నామన్నారు. ఇందులోభాగంగా దుకాణాలు కోల్పోయే వ్యాపారులు సహకరించాలని కోరారు. అనంతరం బైపాస్ సర్వే మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ టీపీఓలు విద్యాసాగర్, ప్రతాప్, సర్వే ఏజెన్సీ నిర్వాహకులు శివకుమార్, రంగయ్య, శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, శివరాజ్, సురేశ్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని మతాల సారం ఒక్కటే
స్టేషన్ మహబూబ్‌నగర్ : అన్ని మతాల సారం ఒక్కటేనని ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం బక్రీద్‌ను పురస్కరించుకుని ఖౌమీ ఏక్తా కమిటీ కార్యదర్శి రఫీఖ్ పటేల్ నివాసంలో ఈద్ మిలాప్ నిర్వహించారు. ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండడం అభినందనీయన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కతి ప్రపంచ దేశాలకు అదర్శంగా నిలించిందన్నారు. త్యాగాలకు ప్రతీకౖయెన బక్రీద్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రజలకు వారు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అ«ధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, పాలమూరు మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, టీడీపీ నాయకులు ఎన్పీ వెంకటేశ్, నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మదర్‌థెరిస్సాను స్ఫూర్తిగా తీసుకోవాలి
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : సమాజసేవయే పరమావదిగా.. తన చివరి తుదిశ్వాస వరకు సమాజ సేవలో తరించిన మదర్ థెరిస్సాను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని బోయపల్లిలో మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో థెరిస్సా జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు సమకూర్చిన చీరలను 150 మంది నిరుపేద వద్ధులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న దీనావస్థను చూసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఎందరికో ఆపన్నహస్తం అందించి ప్రపంచంలోని ప్రతిఒక్కరి గుండెల్లో గూడు కట్టుకుందని అన్నారు. అలాంటి మానవతావాది జయంతి రోజు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. రక్తదానం విషయంలో అపోహాలకు గురికాకుండా జీవితకాలం వీలైనన్ని సార్లు రక్తాన్ని దానం చేయాలని సూచించారు. అనంతరం ట్రస్టు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శరత్చంద్ర, ట్రస్టు అధ్యక్షుడు నాగరాజుగౌడ్. మాజీ సర్పంచ్ నర్సిములు, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రాములు, ఆంజనేయులు, సత్యనారాయణ, బాలరాజుగౌడ్, రామకష్ణ. తిరుపతయ్య, నాగిరెడ్డి, మనోహర్‌రావు, మాసయ్య పాల్గొన్నారు. -
బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవ
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ కల్చరల్: కుల రహిత సమాజం కోసం పాటు పడిన బసవేశ్వరుడిని స్ఫూర్తిగా తీసుకొని, ధార్మిక, సామాజిక సేవల్లో తరించాలని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. వీరశైవ లింగాయత్ –లింగబలిజ సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం స్థానిక గోపాల్‌రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘కాయకమే కైలాసం’ (కçష్ట పడితేనే ముక్తి, భుక్తి) అంటూ చాటి చెప్పిన బసవేశ్వరుడు గొప్ప మానవతా వాది అన్నారు. 12వ శతాబ్దంలోనే ‘అనుభవ మండపం’ అనే పార్లమెంటను ఏర్పాటు నిర్వహించారని గుర్తు చేశారు. బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వీరశైవ లింగాయత్‌లకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీలో చేర్చిన ఘనత వైఎస్‌దే.. ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సంగేశ్వర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో తయ కులస్థులను బీసీల్లో చేర్చారని అన్నారు. ఓబీసీలుగా గుర్తించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అనంతరం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి శివరత్నం నూతన కార్యవర్గ సభ్యులచే పదవీ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా నేతలువన్నె ఈశ్వరప్ప,కవితా దేశ్‌ముఖ్, శేఖర్, పవన్, రేణుక,సోమశేఖర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జేపీఎన్సీఈ చైర్మెన్ కేఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.