మత్స్య సంపదను కాపాడుకుందాం
Published Mon, Oct 3 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
మహబూబ్‌నగర్ వ్యవసాయం : మత్స్య సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పెద్దచెరువులో చేప విత్తనాలు వదిలి అనంతరం ఆయన మాట్లాడారు. వందశాతం రాయితీపై చేపవిత్తనాల పంపిణీకిగాను జిల్లాకు రూ.ఐదు కోట్లు కేటాయించామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతును చేపట్టడంతో మత్స్యకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు.
వారికి అవసరమైన చేపల మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలో వంద చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మత్స్యకారుల కమ్యూనిటీ భవనాలు, కార్యాలయాల ఏర్పాటుకు యత్నిస్తామన్నారు. పాలమూరులో త్వరలోనే పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేగాక పెద్దచెరువును మినీ ట్యాంకు బండ్‌లా అన్ని విధాలా అభివద్ధి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, మత్స్యశాఖ ఏడీ ఖదీర్ అహ్మద్, మత్స్య సంఘం జిల్లా అధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ, టీఆర్‌ఎస్ జిల్లా కో–కన్వీనర్ బెక్కెం జనార్దన్, ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షుడు పెద్ద విజయ్‌కుమార్, పార్టీ నాయకులు మనోహర్, నాగులు, ఎర్ర బాలప్ప, గోనెల శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement