నిర్వాసితులకు న్యాయం చేస్తాం
Published Thu, Sep 29 2016 12:22 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆర్‌డీఓ లక్షీ్మనారాయణతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. బైపాస్ కారణంగా కేవలం 25 ఇళ్లు మాత్రమే పోతున్నాయన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలోనే మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు, పట్టణ ప్రధాన రోడ్డు ఫోర్ లే¯Œæగా మారుస్తున్నామన్నారు. బైపాస్ రోడ్డు ఎస్‌వీఎస్ ఆస్పత్రి పక్క నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు 9.7కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుందన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారమే బైపాస్ సర్వే జరుగుతోందన్నారు. ఈ రోడ్డు వల్ల రవాణా వ్యవస్థ మెరుగై ప్రజల బతుకుదెరువుకు అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.పది కోట్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డును విస్తరిస్తున్నామన్నారు. ఇందులోభాగంగా దుకాణాలు కోల్పోయే వ్యాపారులు సహకరించాలని కోరారు. అనంతరం బైపాస్ సర్వే మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ టీపీఓలు విద్యాసాగర్, ప్రతాప్, సర్వే ఏజెన్సీ నిర్వాహకులు శివకుమార్, రంగయ్య, శ్రీనివాసులు, టీఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్య, శివరాజ్, సురేశ్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement