‘పదేళ్లు’.. మరో రెండేళ్లు | The maximum age restriction is once again an extension | Sakshi
Sakshi News home page

‘పదేళ్లు’.. మరో రెండేళ్లు

Published Wed, Aug 9 2017 2:29 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM

‘పదేళ్లు’.. మరో రెండేళ్లు - Sakshi

‘పదేళ్లు’.. మరో రెండేళ్లు

గరిష్ట వయోపరిమితి సడలింపు మరోసారి పొడిగింపు
 
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ నియామకాలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నిరుద్యోగులకు ప్రయోజనంగా ఉండేందుకు మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దేశించిన గరిష్ట వయో పరిమితి 34 ఏళ్లు.

అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూలైలో ప్రభుత్వం ఈ వయో పరిమితిని సడలించింది. అదనంగా పదేళ్లపాటు గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచింది. ఈ వెసులుబాటు ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రకటించింది. 2016 జూలైలో మరో ఏడాది పొడిగించింది. గతనెలలో ఈ గడువు ముగిసింది. దీంతో తాజాగా మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై 26 వరకు 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి పొడిగింపు ఉత్తర్వులు అమలు కానున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement