నేడు జాతీయ జెండా అవనతం
అర్జన్ సింగ్‌కు నివాళిగా..జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ అంత్య క్రియలను పురస్కరించుకొని సోమవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఎగిరే జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమ వారం ఉదయం పది గంటలకు ఢిల్లీలోని దరార్లో అర్జన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించను న్నారు.
ఆయనకు నివాళిగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.