Arjan Singh
-
నేడు జాతీయ జెండా అవనతం
అర్జన్ సింగ్‌కు నివాళిగా..జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ అంత్య క్రియలను పురస్కరించుకొని సోమవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఎగిరే జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమ వారం ఉదయం పది గంటలకు ఢిల్లీలోని దరార్లో అర్జన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించను న్నారు. ఆయనకు నివాళిగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
రేపు లాంఛనాలతో అర్జన్ సింగ్ అంత్యక్రియలు
-
రేపు లాంఛనాలతో అర్జన్ సింగ్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత వాయుసేన వీరుడు మార్షల్ అర్జన్ సింగ్ భౌతిక కాయానికి రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయన గౌరవార్థం సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని తక్కువ ఎత్తులో ఎగురవేయాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అర్జన్ సింగ్ శనివారం ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అర్జన్ సింగ్ 44 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎయిర్ ఫోర్స్‌లో 60 రకాల విమానాలను నడిపిన అనుభవం ఆయనది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా తీర్చిదిద్దడంలో అర్జన్ సింగ్ విశేషంగా కృషి చేశారు. -
అర్జన్ సింగ్ ఇక లేరు
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ (98) తీవ్ర గుండెపోటుతో శనివారం రాత్రి ఆర్మీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవాలు కొద్దిసేపటి క్రితమే ఆర్మీ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు. భారత మిలటరీ చరిత్రలో అర్జన్ సింగ్ ఓ ఐకాన్. 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫైవ్ స్టార్ ర్యాంక్ దక్కిన అధికారి అర్జన్ సింగ్ మాత్రమే. ఫీల్డ్ మార్షల్‌తో సమానమైన డిస్టింక్షన్‌ను పొందిన ఏకైక ఐఏఎఫ్ అధికారి. అర్జన్ సింగ్ 1919 ఏప్రిల్ 15న (పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్) ల్యాలాపూర్‌లో జన్మించారు.1949లో ఎయిర్ కమాండర్‌గా ఎదిగిన ఆయన 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత వాయుసేన చీఫ్‌గా ఉన్నారు. అర్జన్ సింగ్ సేవలకు గుర్తింపుగా పనాగఢ్ ఎయిర్ బేస్‌కు ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్ పేరు పెట్టడం విశేషం. -
పొరబాటు ట్వీట్.. నాలుక్కరచుకున్న మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) తొలి మార్షల్ అర్జన్ సింగ్ అర్జన్ సింగ్ మృతి చెందారంటూ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకేసింగ్ ట్వీట్ చేయడం కలకలం రేగింది. ‘ఐఏఎఫ్ తొలి మార్షల్ అర్జన్ సింగ్ మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. దేశానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోం. సెల్యూట్’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఐఏఎఫ్ వర్గాలు.. ఆయన బతికే ఉన్నారంటూ వెంటనే ప్రకటన విడుదల చేశాయి. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అర్జున్ సింగ్‌ను పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్లు వెల్లడించాయి. దీంతో నాలుక్కరుచుకున్న వీకే సింగ్ వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.