
పొరబాటు ట్వీట్.. నాలుక్కరచుకున్న మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) తొలి మార్షల్ అర్జన్ సింగ్ అర్జన్ సింగ్ మృతి చెందారంటూ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకేసింగ్ ట్వీట్ చేయడం కలకలం రేగింది. ‘ఐఏఎఫ్ తొలి మార్షల్ అర్జన్ సింగ్ మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. దేశానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోం. సెల్యూట్’ అంటూ ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన ఐఏఎఫ్ వర్గాలు.. ఆయన బతికే ఉన్నారంటూ వెంటనే ప్రకటన విడుదల చేశాయి. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అర్జున్ సింగ్‌ను పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్లు వెల్లడించాయి. దీంతో నాలుక్కరుచుకున్న వీకే సింగ్ వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.