మిషన్ భగీరథపై ప్రధాని ఆసక్తి
బ్యాంకర్లతో భేటీలో సీఎస్ ఎస్పీ సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం మోడల్‌గా పరిగణిస్తోందని, భగీరథ పనుల పురోగతిని ప్రధాని మోదీ వాకబు చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. ప్రాజెక్ట్ పూర్తయ్యే రోజుకోసం కేంద్రంలోని ఉన్నతస్థాయి వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు.
మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రాజెక్ట్‌లో కీలకమైన ఇంట్రావిలేజ్ పను లకు రుణసాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భగీరథ అధ్యయనానికి ఇతర రాష్ట్రాలు ఇక్కడకు వస్తున్నాయని, ప్రాజెక్టు సాధించిన ఈ ఘనతలో బ్యాంకర్లదే ప్రధాన పాత్ర అన్నారు.