మాజీ స్పీకర్‌కు కలిసి రాని ఆర్మూర్
ఆర్మూర్, న్యూస్‌లైన్ : ‘బాల్కొండలో పోటీ చేసినప్పుడు గెల్సిన సురేశ్‌రెడ్డి.. ఆర్మూర్‌కు వచ్చేసరికి ఓడిపోతున్నడు.. ఆయనకిక్కడ కలిసొస్తలేదు..’ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి బా ల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి గురించి ఇవే మాట లు వినిపిస్తున్నాయి. నాలుగు పర్యాయాలు బా ల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలి చిన చరిత్ర.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఎదిగిన అనుభవం.. కానీ 2009 నియోజకవర్గ పునర్విభజన అనంతరం కీలక సమయాల్లో ఆయన తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణుల్లో, ఆయన అనుచరుల్లోనే ఆయనపై అపనమ్మకాన్ని పెంచాయి.
ఇలాంటి తరుణంలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసిన సురేశ్‌రెడ్డికి ఇక్కడి ఓటర్లు చేదు అనుభవాన్నే మిగిల్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి చిన్ననాటి మిత్రుడే అయినా ఆర్మూర్ అభివృద్ధికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యా రనే అపవాదు ఉంది.బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1989 నుంచి 2004 శాసన సభ ఎన్నికల వరకు వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, శాసన సభ స్పీకర్ కూడా అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బాల్కొండ నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ పునర్విభజన అనంతరం 2009 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేశారు. ఆయన నిర్ణయం తీసుకున్నంత వేగంగా పార్టీలో పరిస్థితులు మారకపోవడంతో ఓటమి తప్పలేదు.
ప్రజారాజ్యం విలీనంతో
2009లో బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈరవత్రి అనిల్, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో సురేశ్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు ఆర్మూర్ సరైంది కాదని, తిరిగి బాల్కొండకు వెల్లిపోవాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి, అప్పటి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్‌చార్జి శనిగరం శ్రీనివాస్‌రెడ్డితో సురేశ్‌రెడ్డి చర్చలు జరిపారు.
బాల్కొండ మండలం పోచంపాడ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తాము నియోజకవర్గాల మార్పు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తాను మళ్లీ బాల్కొండ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని సురేశ్‌రెడ్డి ప్రకటించారు. ఇంతలో రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ మార్పులతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో బాల్కొండ నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. ప్రభుత్వ విప్ పదవి సైతం దక్కింది. చేసేది లేక సురేశ్‌రెడ్డి మళ్లీ ఆర్మూర్‌బాట పట్టారు. మళ్లీ ఓడారు.
చేసిందేమి లేదు
వివాదరహితుడిగా పేరున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి సురేశ్‌రెడ్డి చేసింది పెద్దగా ఏంలేదనే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే చేస్తుంటారు. మొన్న ఆర్మూర్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అవి స్థానికంగా పోటీలో నిలిచిన వ్యక్తులకు ఉన్న పలుకుబడితో పడ్డ ఓట్లేనని చెబుతున్నారు.