
సాక్షి, కడప: టీడీపీ నేతలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో అనేక రాజకీయ నాటకాలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ, మిత్రపక్షం బీజేపీపై అవాకులు, చవాకులు విసురుతూ తమ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. వీటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సురేష్ రెడ్డి ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు.
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కేవలం తన ఆస్తులను, అక్రమ ట్రావెల్స్‌ను కాపాడుకోవడానికి పార్టీలు మారుతూ డ్రామాలు అడుతున్నాడని ఆయన ధ్వజమెత్తారు. హింసా రాజకీయాలకు, అక్రమార్జనలకు జేసీ దివాకర్ పెట్టింది పేరన్నారు. చంద్రబాబు మెప్పుకోసం జేసీ ప్రకృతిని కొల్లగొడుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ కాంగ్రెస్ నేతలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలో చేరి అసలైనా తెలుగు రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల బండరాన్ని బయట పెట్టడానికి బీజేపీ సిద్ధంగా ఉందని సురేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment