
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమపై కక్ష్య సాధింపుతో వ్యవహరిస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆరోపించారు. కరువు సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని పేర్కొన్నారు. రేపు అనంతపురం కలెక్టరేట్ వద్ద సీమ సమస్యలపై ధర్న నిర్వహిస్తున్నామని తెలిపారు.
సీఎం రమేష్ గూండాలా వ్యవహరిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ గూండాలా వ్యవహరిస్తున్నారని ఏపీ బీజేపీ కార్యదర్శి జల్లి మధుసూదన్ విమర్శించారు. ఆరోపణలపై సమాధానం చెప్పకుండా జీవీఎల్‌ను దూషిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. సీఎం రమేష్‌కు సభ్యత- సంస్కారం లేదని అన్నారు. కేంద్రం లెక్కలు అడిగితే జారుకోవటం ఎందుకన్నారు. సోమ్ము కేంద్రానిది.. సోకు చంద్రబాబు నాయుడిదని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment