madhu sudhan
-
పీటల మీద పెళ్లి నిలిపేసిన భార్య.. పాపం హనీమూన్ ట్రిప్..
పెళ్లి మండపంలో ఎటుచూసినా సందడి. మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. మూడుముళ్లకు సమయం సమీపిస్తోంది. వరుడు కూడా ఆతృతగా ఉన్నాడు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. వధువు తల్లిదండ్రులను కలిసి ఏదో చెప్పింది. అంతే పెళ్లి వేడుక బంద్ అయ్యింది. పోలీసులు వచ్చి వరున్ని తీసుకెళ్లారు. పూల కారుపై ఊరేగాల్సిన వరుడు జీపు ఎక్కాడు. సాక్షి, బెంగళూరు(యశవంతపుర): పెళ్లయిన సంగతిని దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధమైన మోసగాన్ని హాసన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బెంగళూరులో ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న మధుసూదన్‌కు నాలుగేళ్ల క్రితం వసుధ అనే యువతితో వివాహమైంది. గొడవలు రావడంతో ఇద్దరు బెంగళూరులో విడివిడిగా ఉంటున్నారు, కానీ విడాకులు ఇంకా తీసుకోలేదు. హాసన్‌లో రెండో పెళ్లి తతంగం ఆ కేసు పరిష్కారం కాకుండానే అక్క సాయంతో హాసన్‌కు చెందిన అమ్మాయితో గుట్టుగా పెళ్లికి సిద్ధమయ్యాడు. హాసన పట్టణంలోని కళ్యాణ మండపంలో పెళ్లికి ఇరువైపులవారు చేరుకున్నారు. వసుధకు చూచాయగా విషయం తెలిసి గూగుల్‌లో హాసన్ పట్టణంలోని కళ్యాణ మండపాల వివరాలను సేకరించింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మధుసూదన్ వధువుకు తాళికట్టే సమయానికి వసుధ అక్కడకు వచ్చి వధువు తల్లిదండ్రులను కలిసింది. అతని వల్ల నా జీవితం నాశనమైంది. మీ అమ్మాయి జీవితం కూడా పాడు కాకుండా చూసుకోండని గట్టిగా చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులు మోసగాడు మధుసూదన్‌ను గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అరెస్ట్ చేశారు. పాపం హనీమూన్ ట్రిప్ పెళ్లి అయిన మరుసటి రోజున మాల్దీవులకు హనీమూన్‌కు వెళ్లాలని మధుసూదన్ ప్లాన్ వేశాడు. శనివారం విమానం ఎక్కడానికి పాస్‌పోర్ట్, వీసా, టికెట్లను రెడీ చేశాడు. పెళ్లి తరువాత మొదటి భార్య బంధువులు ఏమి చేయలేయరనే ధీమాతో ఉన్నాడు గానీ పథకం మొత్తం నీరు గారడంతో పాటు కటకటాల వెనక్కు చేరాడు. కాగా పీటల మీద పెళ్లి నిలిచిపోవడంతో వధువు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అతని గురించి ముందే తెలిసి ఉంటే ఇంతవరకూ రానిచ్చేవారం కాదని వాపోయారు. -
సినిమా సంఘటనలతో బజార్
‘‘మీనా బజార్’ సినిమా టీజర్ బాగుంది. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ ‘మీనా బజార్’ సినిమా మంచి విజయం సాధించి, రెండో భాగం కూడా రావాలని కోరుకుంటున్నా’’ అని సి.కళ్యాణ్ అన్నారు. మధుసూదన్, శ్రీజిత ఘోష్ జంటగా రానా సునీల్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.మీనాబజార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ని సి. కల్యాణ్ విడుదల చేశారు. ‘‘కన్నడలో ఒక సినిమా చేశాను. తెలుగులో మొదటి చిత్రమిది’’ అన్నారు రానా సునీల్ కుమార్ సింగ్. ‘‘మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’అన్నారు మధుసూదన్. -
‘రాయలసీమపై ముఖ్యమంత్రి కక్ష్య సాధింపు’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమపై కక్ష్య సాధింపుతో వ్యవహరిస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆరోపించారు. కరువు సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని పేర్కొన్నారు. రేపు అనంతపురం కలెక్టరేట్ వద్ద సీమ సమస్యలపై ధర్న నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం రమేష్ గూండాలా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ గూండాలా వ్యవహరిస్తున్నారని ఏపీ బీజేపీ కార్యదర్శి జల్లి మధుసూదన్ విమర్శించారు. ఆరోపణలపై సమాధానం చెప్పకుండా జీవీఎల్‌ను దూషిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. సీఎం రమేష్‌కు సభ్యత- సంస్కారం లేదని అన్నారు. కేంద్రం లెక్కలు అడిగితే జారుకోవటం ఎందుకన్నారు. సోమ్ము కేంద్రానిది.. సోకు చంద్రబాబు నాయుడిదని ఎద్దేవా చేశారు. -
అమ్మా.. నాన్నా.. ఓ వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: అమ్మ నవమాసాలూ మోసి జన్మనిస్తే.. తండ్రి తన శరీరంలోని ఓ భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చాడు.. బిడ్డను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న తపనను చూసిన వైద్యులు తమ వంతు సాయం చేసి ప్రాణం నిలబెట్టారు.. రూ.25 లక్షలు ఖర్చయ్యే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను ఉచితంగా చేశారు.. నిండు ఆరోగ్యం సమకూరిన చిన్నారి చిరునవ్వునే తమకు బహుమతిగా తీసుకున్నారు.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన మాడేపల్లి సతీశ్, మమతల కుమార్తె సౌజన్య (4) గాథ ఇది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యుడు మధుసూదన్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు, మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి, రెండు ఔషధ సంస్థలు ఈ సర్జరీకి సహాయం చేశారు. అరుదైన వ్యాధితో బాధపడుతూ.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన దంపతులు మాడేపల్లి సతీశ్, మమత. సతీశ్ వరంగల్‌లోని ఓ సెలూన్లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. వారి ఒక్కగానొక్క కుమార్తె సౌజన్య (4). ఆమె పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, కడుపు ఉబ్బిపోవడంతో చాలా ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడ వైద్యులు పలు పరీక్షలు చేసి సౌజన్య హెపాటిక్ ఫైబ్రోసిస్ అనే తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. దెబ్బతిన్న కాలేయాన్ని తొలగించి.. ఇతరుల కాలేయం అమర్చాల్సి ఉంటుందని తేల్చారు. ఇందుకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. సతీశ్ తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని ఆస్పత్రుల్లో చూపితే.. ఈ శస్త్రచికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. దాంతో వారు ఇటీవల పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు నిమ్స్‌లో చేర్పించి చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చినా.. తర్వాత పట్టించుకోలేదు. దాంతో సతీశ్, మమత వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. చివరికి ఉస్మానియా ఆస్పత్రిలో ప్రముఖ కాలేయ వైద్యుడు మధుసూదన్‌ను సంప్రదించారు. ఆయన సౌజన్య పరిస్థితిని పరిశీలించి.. కాలేయ మార్పిడి చికిత్స చేసేందుకు అంగీకరించారు. తండ్రి కాలేయం ఆమెకు సరిపడడంతో.. సతీశ్ శరీరం నుంచి కొంత కాలేయాన్ని తీసి సౌజన్యకు అమర్చేందుకు సిద్ధమయ్యారు. తలా ఇంత సాయం చేసి... సతీశ్, మమతలు అప్పటికే తమ బిడ్డ వైద్యం కోసం ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉన్నారు. ఇప్పుడు శస్త్రచికిత్స కోసం అవసరమైన మందులు, పరికరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని వైద్యుడు మధుసూదన్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాపను ఎలాగైనా కాపాడాలని భావించిన మధుసూదన్.. తాను కొంత సొమ్మును సర్దారు. పలువురు స్నేహితులు, ఇతర దాతల నుంచి కొంత డబ్బును విరాళంగా సేకరించారు. రెండు ఔషధ కంపెనీలు ఖరీదైన మందులు, సర్జికల్ పరికరాలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఉస్మానియాలో ‘లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (జీవించి ఉన్న ఓ వ్యక్తి నుంచి కాలేయాన్ని కత్తిరించి.. వెంటనే మరొకరికి అమర్చడానికి)’కు కావాల్సిన మౌలిక వసతులు లేవు. ఆలస్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉండటంతో.. మధుసూదన్ కార్పొరేట్ ఆస్పత్రుల సాయం కోరారు. దీంతో మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి యాజమాన్యం ముందుకు వచ్చి.. ఆపరేషన్ థియేటర్ సహా ఐసీయూ, ఇన్వెస్టిగేషన్ ఇతర సౌకర్యాలను ఉచితంగా సమకూర్చేందుకు అంగీకరించింది. దీంతో చిన్నారి సౌజన్యను మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 15 రోజుల క్రితం తండ్రి సతీశ్ నుంచి 130 గ్రాముల కాలేయాన్ని సేకరించి.. సౌజన్యకు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం తండ్రి, కుమార్తె ఇద్దరూ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. పలువురు సర్జన్లు, అనెస్థీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది పైసా ఆశించకుండా చికిత్సకు తోడ్పాటు అందించారని డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు. -
ఆటో పల్టీ: ఇద్దరి దుర్మరణం
ధారూరు: వేగంగా వెళ్తున్న ఆటో బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి పల్టీలుకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో రైతు, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ప్రమాదంలో మరో పదమూడు మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతగిరిగుట్ట మలుపులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వికారాబాద్ సీఐ రవి కథనం ప్రకారం.. వికారాబాద్ నుంచి ఓ ఆటో(ఏపీ 28 వై 1922) శనివారం ఉదయం ధారూరుకు ప్రయాణికులతో వెళ్తోంది. ఈక్రమంలో అనంతగిరి గుట్ట దిగుతుండగా శివలింగం మలుపులో వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆటో వేగంగా ఉండడంతో లోయలోకి దూసుకెళ్తుంది. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్ వెంకటయ్య వెంటనే కుడివైపుకు మళ్లించాడు. దీంతో ఆటో అదుపుతప్పి మూడుసార్లు పల్టీలు కొట్టి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన రైతు కావలి ఎల్లయ్య(50) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ధారూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్(45), శంషొద్దీన్(32), చాంద్‌పాషా(38), యాదయ్య(22), లక్ష్మణ్(20), మోసీన్(19)లకు తీవ్ర గాయాలయ్యా యి. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఓ ఆటోలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే మధుసూదన్ ప్రాణం విడిచాడు. శంషొద్దీన్, చాంద్‌పాషా, యాదయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వారిని నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రవి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా ఆటో డ్రైవర్ వెంకటయ్య పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి వస్తూ.. ఆటో పల్టీలు కొట్టిన ప్రమాదంలో రైతు ఎల్లయ్య తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈయనకు భార్య బాల మణి, కొడుకు సాయిలు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఎల్లయ్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శనివారం ఉదయం వికారాబాద్‌లోని ఆ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగి మధుసూదన్ వికారాబాద్‌లోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీఏ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేవారు. రెండునెలల క్రితం ఆయన ధారూరు తహసీల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చారు. ఈయనకు భార్య సరస్వతి, కూతురు విజయ ఉన్నారు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ మండలం మత్పల్ గ్రామస్తుడు. మధుసూధన్ రాజేంద్రనగర్ మండలం ఆరెమైసమ్మ వద్ద ఉంటూ ధారూరుకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాడు. -
జీవితం మీద ఆశలు వదులుకున్నాం..
భువనగిరి : ‘వరదనీటితో క్యాంపస్ గదులు నిండిపోయాయి.. కరెంట్ లేదు.. తాగడానికి మంచినీళ్లు లేవు.. తినడానికి తిండిలేదు.. ఇంటికి ఫోన్ చేద్దామంటే కలవడం లేదు.. మా ‘నిట్’ కళాశాల విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నా ఎలా చేరుకోవాలో తెలియదు.. జీవితం మీద ఆశలు వదులుకున్నాం.. ఇక మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి అనుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం.. శనివారం యూనివర్సిటీ అధికారులు ఒక ట్రక్‌లో విమానాశ్రయానికి పంపిన తర్వాత జీవితంమీద ఆశలు చిగురించాయి.. బతికి బయట పడ్డామన్న ఆనందం కలిగింది.. ఇంటికి వస్తున్నానని ఇక అక్కడి నుంచే ఫోన్ చేసిచెప్పా’ అని జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ వరదల్లో చిక్కుకున్న భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన విద్యార్థి గోగు మధుసూదన్ తెలిపారు. ఆదివారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నేను శ్రీనగర్‌లోని హజరత్బాల్లో ఉన్న ఎన్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నా. కాగా ఈ నెల4 వతేదీ నుంచి జమ్మూకాశ్మీర్‌లో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురిశాయి. 7వ తేదీన రాత్రి కురిసిన భారీ వర్షాలకు మా కళాశాల పై భాగంలో గల దల్లేక్(సరస్సు) నిండి వరద నీరు పొంగి పొరలింది. దాంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న మా క్యాంపస్‌లోకి వరద నీర ంతా వచ్చి చేరింది. క్రమంగా పెరుగుతున్న వరద నీటితో మా తరగతి గదిలో ఉన్న సామగ్రిని కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. క్యాంపస్‌లోకి నీరు వస్తుండడాన్ని గమనించిన సిబ్బంది మమ్మల్ని కాశ్మీర్‌లోని కాశ్మీర్ యూనివర్సిటీకి తరలించారు. మా క్యాంపస్‌లో 1500 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఫుడ్, మంచినీరు లేదు. ఎవరికైనా ఫోన్చేద్దామనుకుంటే ఎయిర్‌సెల్ సిమ్ మాత్రమే పనిచేస్తుంది. అది కూడా పై అంతస్తుకు వెళ్తే కొంతమేర సిగ్నల్ మాత్రమే వస్తోంది. దీంతో చాలా టెన్షన్ పడ్డాం. కుటుంబ సభ్యులకు ఇతరులకు ఫోన్లు కలవక పోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. వర్షం తగ్గిన తర్వాత నాలుగైదు అంతస్తులపై నుంచి చేస్తే అప్పుడు ఫోన్ కలుస్తుందని మిత్రుడు ఒకరు తెలిపాడు. అప్పుడు పై అంతస్తులోకి వెళ్లి ఇంటికి ఫోన్ చేశా. కాగా ఈ కళాశాలలో నాతో పాటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 16 మంది అబ్బాయిలం, 8 మంది అమ్మాయిలు ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కె రామ్మోహన్రావు, తెలంగాణ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారిలు మాతో పలు మార్లు ఫోన్లో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయమూ చేయలేదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణానికి సంబంధించిన టికెట్టు ఏర్పాటు చే యడం ద్వారా శనివారం శ్రీనగర్ నుంచి ఢిల్లికి, ఢీల్లి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చాం. నేను సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో మా కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు. నన్ను చూసేందుకు బంధువులు వస్తున్నారు. మాకు అన్ని విధాలా సహకరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. -
సైబర్ నేరగాళ్ల అరెస్టు
తాడిపత్రి, న్యూస్‌లైన్ : పట్టణంలో ఇటీవల మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎంల నుంచి నగదును తస్కరిస్తున్న సైబర్ నేరస్తులు మధుసూదన్‌రెడ్డి, శివకంచిరెడ్డి బుధవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40,150 నగదు, 4 సెల్ఫోన్లు, 8 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసు స్టేషన్లో తాడిపత్రి డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మినారాయణతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన నిందితులు ఇద్దరూ కంప్యూటర్ డిప్లొమో కోర్సు చేశారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో కొత్తగా వచ్చిన ఎయిర్టెల్ మనీ ట్రాన్స్ఫర్ సైట్‌ను ఉపయోగించడంతో పాటు నకిలీ సిమ్‌కార్డుల సహాయంతో ఇతరుల బ్యాంకు ఖాతాల్లోని నగదును ఇంటర్నెట్ ద్వారా వారి ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు. చోరీ చేసేది ఇలా.. ఈ బ్యాంకింగ్ వ్యవస్థపై పట్టు సాధించిన వీరు... ఓటర్ల ఐడీ నంబరు సేకరించి, ముందుగా వారి పేరున మీ సేవా కేంద్రాల్లో ఓటరు కార్డును సంపాదిస్తున్నారు. వాటి ద్వారా కొత్త సిమ్‌కార్డులు పొందుతున్నారు. అనంతరం బ్యాంకుల ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేస్తున్న వారి వెనుక వినియోగదారుల తరహాలో వీరిద్దరూ నిలుచుని, వారి కార్డు పిన్, కార్డు నెంబరు, ఖాతాదారుని పేరు వంటి వివరాలను అనుమానం రాకుండా సేకరించేవారు. తర్వాత ఎయిర్టెల్ మనీ ట్రాన్స్ఫర్ సైట్లో లాగిన్ అయి సేకరించిన వివరాలను నమోదు చేసి, వారి ఖాతాల్లో నిల్వ ఉన్న నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుని డ్రా చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలపై తాడిపత్రిలో 8 మంది బ్యాంకు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారులు నగదు డ్రా చేస్తున్న సమయంలో నిఘా పెంచామని, కొంతమంది అజ్ఞాత వ్యక్తులు వారిని గమనిస్తున్నట్లు తేలిందని డీఎస్పీ తెలిపారు. బాధితులున్న ప్రతిచోటా మధుసూదన్‌రెడ్డి, శివకంచిరెడ్డి ఉండటాన్ని పసిగ ట్టి దర్యాప్తు అధికారిగా పట్టణ సీఐ.లక్ష్మినారాయణను నియమించామన్నారు. ఈ క్రమంలో నిందితులు పట్టుబడ్డారన్నారు. వీరు పులివేందుల, అనంతపురము ప్రాంతాల్లో ఏటీఎం చోరీల్లో నిందితులని, గతంలో వీరిపై కేసులు కూడా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేసుకునే సమయంలో తమ వెనుక వైపు ఏవరూ లేకుండా జాగ్రత్త పడాలని, వివరాలను నమోదు చేసేటపుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఖాతాదారులను కోరారు. నిందితులను పట్టుకున్న సీఐని, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.