సినిమా సంఘటనలతో బజార్‌ | Meena Bazar Movie Teaser Launch Event | Sakshi
Sakshi News home page

సినిమా సంఘటనలతో బజార్‌

Published Thu, Oct 3 2019 12:18 AM | Last Updated on Thu, Oct 3 2019 12:18 AM

Meena Bazar Movie Teaser Launch Event - Sakshi

మధుసూదన్, రానా సునీల్, శ్రీజిత

‘‘మీనా బజార్‌’ సినిమా టీజర్‌ బాగుంది. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ ‘మీనా బజార్‌’ సినిమా మంచి విజయం సాధించి, రెండో భాగం కూడా రావాలని కోరుకుంటున్నా’’ అని సి.కళ్యాణ్‌ అన్నారు. మధుసూదన్, శ్రీజిత ఘోష్‌ జంటగా రానా సునీల్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.మీనాబజార్‌’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌ని సి. కల్యాణ్‌ విడుదల చేశారు. ‘‘కన్నడలో ఒక సినిమా చేశాను. తెలుగులో మొదటి చిత్రమిది’’ అన్నారు రానా సునీల్‌ కుమార్‌ సింగ్‌. ‘‘మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు’’అన్నారు మధుసూదన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement