సురేష్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, నిజామాబాద్ : కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షమం చూసి దశాబ్దాల బంధం ఉన్న కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేనినట్లు మాజీ స్వీకర్ సురేష్ రెడ్డి తెలిపారు. వేగంగా జరిగిన అభివృద్ధి ప్రస్తుతం జంక్షలో ఉందని, రానున్న రోజుల్లో అభివృద్ధి రథం డ్రైవర్‌ను మార్బే అవసరం ఉందా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటి వరకూ విభేదించిన పార్టీలు సిద్దాంతాలు పక్కన పెట్టింది అభివృద్ధిని అడ్డుకోవడానికే అని విమర్శించారు. మహా కూటమి అనేది మహాకుట్ర అని ప్రజలు గమనిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్దికి తాను అంబాసిడర్‌గా పని చేస్తానని పేర్కొన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూర్వ వైభవం కోసం.. కేసీఆర్ చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో అందరి గెలుపుకు కోసం తాను కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా వ్యవహరించిన సురేష్ రెడ్డి.. ఇటీవల అనూహ్యంగా గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment