![Two TDP leaders who joined the BJP - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/2/bjp.jpg.webp?itok=nOPK1zKg)
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేతలిద్దరు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్‌రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను ఈ ఇద్దరు నేతలు మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబం ధించిన పలు అంశాలపై రాంమాధవ్ వారితో చర్చించినట్లు తెలిసింది. అనంతరం వీరి చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని రాంమాధవ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో బీజేపీలో వీరి చేరిక ధ్రువీకరించినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment