
జనసేనలో ముగ్గురికి పదవులు
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి: పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మహేం దర్‌రెడ్డిని తెలంగాణ జనసేన రాజకీయ కార్యక్రమాల సమన్వయకర్తగా నియమించినట్లు ప్రకటించారు. తెలంగాణ ఇన్‌చార్జిగా నేమూరి శంకర్‌గౌడ్, మీడియా విభాగం అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు పవన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా డి.పోచంపల్లికి చెందిన వ్యాపారవేత్త. బోరబండకి చెందిన శంకర్‌గౌడ్ కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో చురుకైన కార్యకర్తగా పనిచేశారని అందులో తెలిపారు.