ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాలు పారద ర్శకంగా చేపడుతామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.