సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ వ్యవహారంలో రోస్టర్ విధానంపై న్యాయ సలహా ఇవ్వాలని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్‌ను కోరింది. ఈమేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య లేఖ రాసినట్లు తెలిపింది. పోస్టుల భర్తీలో యూనివర్సిటీల వారీగా రోస్టర్ అమలు చేయాలా? లేక విభాగాల (సబ్జెక్టు) వారీగా రోస్టర్‌ను అమలు చేయాలా? అన్న విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన సమాధానంపై ఈ లేఖ రాశారు.
ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని గతంలోనే యూజీసీకి లేఖ రాయగా, అది సెంట్రల్ యూనివర్సిటీలకు వర్తిస్తుందని ఒక చోట, అన్ని యూనివర్సిటీలకు వర్తిస్తుందనే అర్థం వచ్చేలా మరొక చోట పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఆ లేఖను ఎలా అన్వయించు కోవాలన్న విషయంలో సలహా ఇవ్వాలని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్‌ను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment