ప్రొఫెసర్లను(ఆచార్యులను) నరికి చంపుతామంటూ గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, వారిని తాము క్షమించబోమని తగిన విధంగా శిక్షిస్తామంటూ ఆ లేఖ పేర్కొంది. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికోల నుంచి ప్రొఫెసర్లు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆ లేఖ ఆరోపించింది. అలాంటి వసూళ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిని నరికి చంపుతామంటూ ఆ లేఖ తీవ్రంగా హెచ్చరికలు చేసింది. మెడికల్ కాలేజీ పేరేంట్స్ అసోసియేషన్ పేరిట ఈ లేఖ వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.