
సాక్షి, హైదరాబాద్ : దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు అనేకమని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడా ఆయన పేరును చెడగొట్టలేదన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారని, ప్రచారం కూడా చేస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సురభి వాణి దేవిని పోటీకి దింపినట్లు పేర్కొన్నారు.
పీవీకి గౌరవం ఇచ్చే విధంగా ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి కుటుంబానికి గౌరవం దక్కేలా పీవీ కూతురు వాణి దేవి పోటీ చేస్తుందన్నారు. వాణి దేవి విద్యావంతురాలు, విద్యావేత్త అని కొనియాడారు. ఓటు వేసే ప్రతి విద్యావంతులు వాణి దేవికి ఓటు వేయాలని కోరారు. ఆమెకు ఉన్న అర్హతలు, సానుకూలతలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో 24వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, తెలంగాణలో 10వేలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత తాము లక్ష 32 వేల799 ఉద్యోగాలకు పైగా భర్తీ చేశామని పేర్కొన్నారు.
చదవండి: ట్రాఫిక్‌లో కుయ్ కుయ్!
Comments
Please login to add a commentAdd a comment