Vani
-
రూ. 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో (టెస్కాబ్) జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ముసుగులో రూ.200 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిమ్మగడ్డ వాణీబాల, ఆమె భర్త, కుమారుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన 532 మందిలో 147 మంది టెస్కాబ్ ఉద్యోగులేనని డీసీపీ ఎన్.శ్వేత గురువారం తెలిపారు.వాణీబాలతోపాటు ఆమె భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్షలను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. అధిక వడ్డీ ఆశచూపి..: ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985లో హైదరాబాద్‌లోని తిలక్ రోడ్లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్‌ఫండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇతర వ్యాపారాలు కూడా చేసిన ఆయన.. వాటి నిర్వహణ కోసం ప్రియాంక సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమ వద్ద నగదు డిపాజిట్ చేస్తే ఏడాదికి 24% చొప్పున వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మబలికాడు.అలాగే ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసి ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి కొని ప్రింటింగ్ ప్రెస్‌లకు విక్రయించడం మొదలెట్టారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణీబాల ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత టెస్కాబ్గా మారిన ఈ సంస్థలో కొనసాగారు. రాష్ట్ర స్థాయి పోస్టు అయిన జనరల్ మేనేజర్ వరకు వెళ్లారు. శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలోనే డైరెక్టర్‌గా చేరా రు.వాణీబాల టెస్కాబ్‌లో పనిచేసే ఉద్యోగులను భర్త సంస్థలో పెట్టుబడులు పెట్టాలని హుకుం జారీ చేసింది. దీంతో 147 మంది రూ. 26 కోట్ల డిపాజి ట్లు చేశారు. అలాగే టెస్కాబ్‌లో డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని సైతం మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయించుకుంది. రశీదులన్నీ వేరే సంస్థ పేరుతో..: తమ వద్ద పె ట్టుబడులు పెట్టిన డిపాజిట్‌దారులకు ఇవ్వడానికి నేతాజీ, శ్రీహర్షలు ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో రసీదులు తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి రూపాయి విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకాలు చేసిచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వినియోగదారులకు వడ్డీ చెల్లింపులు ఆపేశారు. ఈ నెల 3న సిటీ సివిల్ కోర్టులో ఏకంగా దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించింది. విచారణ నిమిత్తం 14 రోజుల కస్టడీకి కోరాలని నిర్ణయించింది. -
Vani Bhojan: గ్లామర్ డోస్ పెంచేసిన వాణి భోజన్
బ్యూటీ వాణి భోజన్ కూడా గ్లామర్ బాట పట్టింది. బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఓ మై కడవులే చిత్రంలో రెండో కథానాయకి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో చక్కగా ఒంటి నిండా దుస్తులు ధరించి పక్కింటి అమ్మాయి ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచింది. అయినా స్టార్ హీరోల దృష్టి ఈ అమ్మడిపై పడటం లేదు. ప్రస్తుతం శశి కుమార్, విక్రమ్ ప్రభు, భరత్, జై నటులతోనే జతకట్టే అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. దీంతో గత రెండేళ్లుగా కథలు, పాత్రలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఈ అమ్మడు చెప్పింది. ఇటీవల అరుణ్ విజయ్ సరసన నటించిన తమిళ్ రాకర్స్ అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో గ్లామర్ డోస్‌ను పెంచేసింది. అలాంటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆమె ధోరణి కూడా మారిపోయింది. ఇటీవల ఒక భేటీలో తాను చీర ధరించినా శృంగారంగానే కనిపిస్తానంటూ పేర్కొని ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఒక భేటీలో హిందీలో అలియా భట్ నటించిన గంగుబాయి కతివాడియా చిత్రం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ చిత్రంలో అలియా భట్ వేశ్యగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రాన్ని తమిళ్లో రీమేక్ చేస్తే అందులో గంగుబాయి పాత్రను తాను పోషించాలని కోరుకుంటున్నానంది. ఇకపోతే నటి నయనతార తన చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే విధానం తనకు నచ్చిందని చెప్పింది. తాను ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, చిత్రాలు ఎంపికలో ఆమె బాటలో పయనించాలని భావిస్తున్నట్లు నటి వాణి భోజన్ పేర్కొంది. చదవండి: (హీరోయిన్ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు!) -
హీరోయిన్‌కు షాకిచ్చిన మహాన్, చాలా అన్యాయం !
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, ఛాలెంజింగ్ రోల్స్‌తో అభిమానులను ఎంటర్టైన్ చేసే హీరో చియాన్ విక్రమ్. అతడు నటించిన తాజా చిత్రం 'మహాన్'. ఇందులో తనయుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించాడీ స్టార్ హీరో. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వాణి భోజన్ కూడా ఉందని గతంలో చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విక్రమ్‌తో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా! కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం ఆమె ఎక్కడా కనిపించనేలేదు. ఆమె నటించిన పార్ట్ అంతా ఎడిటింగ్‌లో తీసేశారు. బహుశా రన్ టైమ్ వల్ల ఆమె సన్నివేశాలు తొలగించి ఉండవచ్చని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంది. దీనికి వాణి నటించిన సన్నివేశాలు కూడా కలిపితే మూడు గంటలవుతుందని ఆలోచించి వాటిని తొలగించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మహాన్ లాంటి పెద్ద సినిమాలో నటిస్తున్నానని మురిసిపోయిన వాణికి ఇది నిజంగా బాధించే అంశమే. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాణికి అన్యాయం చేశారంటూ ఆమె అభిమానులు నెట్టింట ఫైర్ అవుతున్నారు. కాగా వాణి భోజన్ తెలుగులో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో కథానాయికగా నటించింది. -
వ్యాపారంతో కోలాటం
దేశాల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. గొంగళిపురుగు అందమైన సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్లు స్టార్టప్‌లు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పట్టుకొమ్మలు యువతలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి, సరైన చోట పెట్టుబడి పెట్టాలి... అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది... పెట్టుబడి పెట్టిన వారు కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది... ఇలా అనటమే కాదు.. ఆచరణలోనూ చూపారు హైదరాబాద్‌కు చెందిన వాణి కోలా... అమెరికా నుంచి... మింత్ర, మెడ్‌ప్లస్ వంటి ఎన్నో వ్యాపార సంస్థలకు ఆమె పెట్టుబడులు సమకూర్చారు. అనతి కాలంలోనే అవి ‘ఇంతింతై’ అన్నట్లు చకచకా ఎదిగాయి. ప్రఖ్యాత సంస్థలలో ఆమె పెట్టుబడులు పెట్టి, ఆ సంస్థలతో పాటు వాణి కోలా కూడా ఎదిగారు. ఇరవై రెండు సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్న వాణి కోలా 2005 లో భారతదేశానికి తిరిగి వచ్చారు. పనులలో రిస్క్ తీసుకోవటం ఆమెకు ఇష్టం. ‘విశ్రాంతిగా గడపడానికి ఏదో విహార స్థలానికి వెళ్ళడం కంటే భారత దేశంలో గడపడమే నాకు ఇష్టం’ అంటారు వాణి కోలా. ఈ ఆలోచనే వాణి కోలా విజయానికి బాట వేసింది. ఆర్థిక సరళీకరణ వల్ల భారతదేశంలో వచ్చిన మార్పులు వాణిని ఆకర్షించాయి. కలారీ క్యాపిటల్ సంస్థను స్థాపించి, స్టార్టప్స్‌కు ఫండింగ్ చేయటం ప్రారంభించారు. ఇలా చేయటంలో తనకు చాలా ఆనందం కలుగుతుందంటారు వాణి కోలా. మింత్ర, స్నాప్‌డీల్, ఫాంటసీ స్పోర్ట్స్, కంపెనీ డ్రీమ్ – 11తో పాటు, మెడ్ ప్లస్, జివామే వంటి ఫార్మస్యుటికల్ చైన్లకు కూడా ఫండింగ్ చేశారు. 2011లో ప్రారంభమైన కలారీ క్యాపిటల్ ఇంతవరకూ 92 వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టింది. వాణి చేస్తున్న ప్రయత్నం రిలయన్స్ ఇండస్ట్రీస్ దృష్టిలో పడింది. కలారీ పరిధిలో ఉన్న జివామె, అర్బన్ ల్యాడర్ వంటి అనేక కంపెనీలను సొంతం చేసుకుంది. అక్కడితో ఆగకుండా కలారీలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ అంశాన్ని వాణి స్వయంగా ఒక ఇ–మెయిల్ ద్వారా తెలియజేశారు. సిలికాన్ వ్యాలీలో రెండు విజయవంతమైన టెక్నాలజీ కంపెనీలకు ఫౌండర్ సిఇఓ అయిన వాణి గెలుపుకి, విజయపథంలో దూసుకుపోవటానికి కారణం... కంపెనీలను రూపొందించడం పైనే తన దృష్టిని కేంద్రీకరించటం, ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పారిశ్రామికవేత్తలను గుర్తించడం. పురుషులు అసూయ చెందారు... హైదరాబాద్‌కు చెందిన వాణీ కోలా... అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నుంచి 1980లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం కాలిఫోర్నియా వచ్చి, అక్కడ టెక్నాలజీలో వచ్చిన విప్లవాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. తన కంపెనీని 657 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2001లో సెర్టస్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించారు. ఇన్ని విజయాలు సాధించటానికి ముందు వాణీ కోలా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఒక మహిళ ఇన్ని విజయాలను సాధించటం నచ్చని పురుష వాణిజ్యవేత్తలు ఆమెను ఎగతాళి చేశారు. విమానాశ్రయంలో కలిసిన ఓ వ్యాపారవేత్త ‘ఏడాది కంటే తక్కువ వయసున్న బిడ్డను ఇంట్లో వదిలేసి, వ్యాపారం కోసం ఇలా తిరగటం మీకు సిగ్గుగా లేదా’ అని వెటకారమాడాడు. ‘ఇలాంటి పరిస్థితులు ఆడవారికేనా.. మగవారికి మాత్రం ఉండవా. మీ ఇంట్లో ఉండే చంటి పిల్లాడిని మీరు మాత్రం వదిలేసి రావట్లేదా’ అంటూ ఎదురు ప్రశ్నించారు వాణీ కోలా. -
వాణీ విశ్వనాథ్ నట వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ
ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భాషతో సంబంధం లేకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వర్షా విశ్వనాథ్. ఆమె ఎవరో కాదు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ సోదరి ప్రియా విశ్వనాథ్ కూతురు. వాణీ విశ్వనాథ్‌కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నారు వర్ష. కేరళలోని త్రిస్సూర్‌లో ఇంటర్ పూర్తి చేసిన వర్షా విశ్వనాథ్ తమిళంలో మూడు చిత్రాల్లో నటించారు. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. రమణ్ కథానాయకుడిగా శిరీషారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఎం.రమేశ్, గోపీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్ష పక్కింటి అమ్మాయిగా కనిపించనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు వర్ష. రెండో చిత్రం హీరో రమణ్‌తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేయనున్నారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరితో ఓ సినిమా చేయడానికి వర్షా విశ్వనాథ్ అంగీకరించారు. ఇవి కాకుండా తమిళంలోనూ సినిమాల్లో నటించారు వర్షా విశ్వనాథ్. చదవండి: యాంకర్ సుమ తల్లి వీడియో.. 70 ఏళ్ల వయసులో కూడా.. -
‘వాణిదేవి అర్హతలు దృష్టిలో పెట్టుకొని ఓటేయాలి’
సాక్షి, హైదరాబాద్ : దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు అనేకమని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడా ఆయన పేరును చెడగొట్టలేదన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారని, ప్రచారం కూడా చేస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సురభి వాణి దేవిని పోటీకి దింపినట్లు పేర్కొన్నారు. పీవీకి గౌరవం ఇచ్చే విధంగా ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి కుటుంబానికి గౌరవం దక్కేలా పీవీ కూతురు వాణి దేవి పోటీ చేస్తుందన్నారు. వాణి దేవి విద్యావంతురాలు, విద్యావేత్త అని కొనియాడారు. ఓటు వేసే ప్రతి విద్యావంతులు వాణి దేవికి ఓటు వేయాలని కోరారు. ఆమెకు ఉన్న అర్హతలు, సానుకూలతలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో 24వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, తెలంగాణలో 10వేలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత తాము లక్ష 32 వేల799 ఉద్యోగాలకు పైగా భర్తీ చేశామని పేర్కొన్నారు. చదవండి: ట్రాఫిక్‌లో కుయ్ కుయ్! -
హెచ్‌సీయూ విద్యార్థికి గ్రేస్ హోపర్ స్కాలర్షిప్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంసీఏ విద్యార్థిని వాణిగుప్తాకు 2020 సంవత్స రానికి గ్రేస్ హోపర్ స్టూడెంట్ స్కాలర్షిప్ లభించింది.కాలిఫోర్నియాలోని అనితాబి డాట్ ఆర్గ్ ఈ స్కాలర్షిప్ను అందజేస్తుంది. ఇందులో భాగంగా 1200 డాలర్లు వార్షిక మొత్తంగా చెల్లిస్తారు. ఈ సందర్భంగా వాణిగుప్తాను పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
వివాహిత ఆత్మహత్య
వరంగల్ రూరల్, చెన్నారావుపేట: క్షణికావేశంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని లింగాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శీలం రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గన్నవరపు వాణి(35) ఆర్థిక పరిస్థితులు మనసులో పెట్టుకొని తన భర్త చిరంజీవితో బుధవారం సాయంత్రం గొడవపడి క్షణికావేశంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వాణికి భర్త చిరంజీవి, ముగ్గురు కుమార్తెలు వైష్ణవి, తేజస్విని, అక్షర ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. -
విజయ్ దేవరకొండ సినిమాలో సీరియల్ నటి
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో ఓ తమిళ సీరియల్ నటి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ హీరోకాదు కేవలం నిర్మాత మాత్రమే. ఇటీవల కింగ్ ఆఫ్ ద హిల్ బ్యానర్‌ను స్థాపించిన విజయ్ దేవరకొండ తన సినిమాలకు భాగస్వామిగా వ్యవహరించటంతో పాటు కొత్త నటీనటులు, దర్శకులను పరిచయం చేస్తూ సినిమాలు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తొలి ప్రయత్నంగా పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో తమిళ నాట షార్ట్ ఫిలింస్‌తో ఫేమస్ అయిన సమీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో తరుణ్‌కు జోడిగా తమిళ సీరియల్ నటి వాణి భోజన్ నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం, నల్లచెరువు: పల్లెవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ కుమార్తె వాణి (19) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన మేరకు... వాణి కదిరిలోని బ్లూమూన్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల నుంచి మౌనంగా ఉంటున్న వాణి సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు గమనించి హుటాహుటిన కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
పోయెమ్ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది
‘విత్ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ మార్బుల్స్/ హెడ్ ఫిల్డ్ విత్ డ్రీమ్స్’ అనే భావ కవితాత్మక వాక్యాలున్న ‘చైల్డ్‌హుడ్ డ్రీమ్స్’ అనే కవితతో ప్రారంభమయ్యే ‘వైల్డ్ వింగ్స్’.. ఓ అచ్చ తెలుగు అమ్మాయి రచించిన ఆంగ్ల పద్య కావ్యం! ఇటీవల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన స్రష్ట వాణి కొల్లి ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నారు. ∙మొదటి కవిత ఎప్పుడు రాశారు? స్కూల్లో చదువుతున్నప్పుడు ఇచ్చిన అసైన్మెంట్కి కొత్తగా ఉంటుందని హిందీలో మొదట పద్యం రాశాను. అప్పుడు నా వయసు పదమూడు సంవత్సరాలు. ఆ తరవాత మరో అసైన్‌మెంట్‌లో వ్యవసాయ సంబంధితంగా ‘ఫార్మర్’ అనే పద్యం రాసి, మా ఇంగ్లిషు టీచర్‌కి చూపించాను. ఆవిడ చిన్న చిన్న మార్పులు చేయమని సూచన ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతోనే çకవిత్వం రాయడం ప్రారంభించాను. ∙చదువుకు రచన అడ్డు కాలేదా? ఇంటర్మీడియెట్ చదువుతున్న రెండు సంవత్సరాలు ఒక్క పద్యం కూడా రాయలేకపోయాను. ఆ రెండేళ్లు ఏదో మిస్సింగ్ అనిపించింది. ఇంటర్లో సెంట్ పర్సెంట్‌తో పరీక్షలు ప్యాసయ్యాక మళ్లీ కవిత్వం రాయడం ప్రారంభించాను. ఇన్నాళ్ల విరామాన్ని మరచిపోయేలా మూడు నెలల కాలంలో దాదాపు 50 దాకా కవితలు రచించాను. అన్ని కవితలకూ మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం బీబీఏ ఎల్ఎల్బీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ∙కవిత్వం రాయడానికి మీకు ప్రేరణ ఎవరు? నాకు ఖలీల్ జిబ్రాన్ రచనలంటే చాలా ఇష్టం. ఆయన నా అభిమాన రచయిత. అప్పుడప్పుడు టాగూర్ని చదువుతాను. షేక్స్పియర్ రచించిన హామ్లెట్ చదివాను. ‘మ్యాక్బత్’ నాటకంలో మ్యాక్బత్ వేషం వేయడం కోసం ఆ పాత్ర గురించి మొత్తం ^è దివాను. అర్థం కాని చోట వేరే వాళ్లను అడిగి చెప్పించుకున్నాను. ∙మీ కవిత్వానికి ప్రేరణ ఏమిటి? ఒక్కో పోయమ్ వెనకాల ఒక్కో చరిత్ర ఉంది. చిన్నప్పుడు ఎవరినైనా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే, నేను డాక్టరు, నేను ఇంజనీరు ఇలా చెబుతారు. నేను రోజుకోరకం చెప్పేదాన్ని. బాల్యం అంతా కలలు కంటూనే ఉంటాం. అలా రాసినదే ‘చైల్డ్ హుడ్ డ్రీమ్స్’. సీఎస్ లూయిస్ రచించిన నార్నియా అనే సిరీస్ చదివి బయటకు రాలేకపోయాను. దాని నుంచి ‘ఒన్ వింటర్ నైట్’ రాశాను. కాలేజీ నుంచి ఇంటికి వచ్చే దారిలో రకరకాల రంగురంగుల పూలు చూసేదాన్ని. వాటి నుంచి వచ్చినదే ‘ఫ్లవర్’. నా గదిలో కూర్చుని కిటికీలో నుంచి గదిలోకి వెలుగు రావడం చూసి, ‘లైట్’ పద్యం రాశాను. ప్రతి పోయెమ్ పక్కన వేసిన బొమ్మ నా ఆలోచనకు అనుగుణంగా చేసినదే. ‘బ్రేవ్’ పోయెమ్ నాకు నేను చెప్పుకున్నట్లుగా రాసుకున్నాను. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనుకుంటాను. ∙ఒక్కో కవిత రాయడానికి ఎంత సమయం పడుతుంది? మనసులోకి ఆలోచన రాగానే భావాలు రాసుకుంటాను. తరవాత దానిని ఫ్రేమ్ చేసుకుంటాను. మొత్తం పూర్తయ్యాక ముందుగా అమ్మకి వినిపిస్తాను. ఆవిడకు బాగున్నా బాగుండకపోయినా బాగానే ఉంది అంటుంది. నా ఐడియాని ప్రొజెక్ట్ చేసేది నాన్న. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను. వీకెండ్స్‌లో చిరాకుగా అనిపిస్తే, పోయెమ్ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది. కవిత్వం రాయడం నా జీవితంలో భాగంగా మారిపోయింది. ∙మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వర్తమాన రాజకీయాల మీద వ్యాసాలు రాస్తున్నాను. లాగే కరెంట్ టాపిక్స్ మీద కూడా రాస్తున్నాను. ‘ట్రిపుల్ తలాక్’ గురించి రాసిన ఆర్టికల్‌ను ఫేస్బుక్లో ఏడువేల మంది షేర్ చేశారు. నేషనల్ సెమినార్లో ఆర్టికల్స్ ప్రజెంట్ చేశాను. నా తరవాతి పుస్తకం ఈ ఆర్టికల్స్ మీదే. ∙మీ కుటుంబం గురించి... నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న అరవింద్ కొల్లి జర్నలిస్టు, అమ్మ ఆశ హౌస్ వైఫ్. ప్రస్తుతం బెంగళూరు రేవా యూనివర్సిటీలో చదువుతున్నాను. వాస్తవానికి ఇంగ్లిషు లిటరేచర్ చేద్దామనుకున్నాను. కాని లా డిగ్రీలో నాకు టైమ్ స్పేస్ కనిపించింది. మా యూనివర్సిటీ వారు నా పుస్తకాన్ని స్టూడెంట్స్ సమక్షంలో రిలీజ్æ చేస్తానన్నారు. భవిష్యత్తులో షార్ట్ స్టోరీస్, నవలలు కూడా రాయాలనుకుంటున్నాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఎక్కువ చేస్తున్నావ్..
సాక్షి, హైదరాబాద్ : అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్ అధికారిపై ఓ కార్పొరేటర్ భర్త దౌర్జన్యానికి దిగాడు. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని దుర్భాషలాడడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఇతని దౌర్జాన్యాన్ని సెల్ఫోన్లో చిత్రిస్తున్న ఆమె చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కున్నాడు. అంతేకాదు.. వార్నింగ్ ఇచ్చి సంఘటన స్థలం నుంచి ఆమెను తరిమేశాడు. దీంతో ఆ మహిళా ఉద్యోగిని విలపిస్తూ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుధవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బాధితురాలి కథనం ప్రకారం.. జీహెచ్ఎంసీ సర్కిల్–16లో జి.వాణి టౌన్‌ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్. కాచిగూడ డివిజన్ చెప్పల్‌బజార్‌లోని 3–2–505 డోర్ నంబర్లోని 50 గజాల స్థలంలో సురేష్ అనే వ్యక్తి జి+3 ఇంటి నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసిన వాణి బుధవారం అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని నిర్మాణంపై ప్రశ్నించారు. అనుమతి లేకుంటే నిలిపివేయండని చెప్పారు. దీంతో సురేష్ విషయాన్ని కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య భర్త ఎక్కాల కన్నకు సమాచారం అందించాడు. ఆయన భార్య కార్పొరేటర్‌ను తీసుకొని ఆఘమేఘాలపై అక్కడకు చేరుకున్నాడు. వస్తూ వస్తూనే.. ‘నువ్వు కాచిగూడకు సెక్షన్ ఆఫీసర్‌గా వచ్చి నెలరోజులు కాలేదు. ఎక్కువ చేస్తున్నావ్.. ఏంది సంగతి? ఇక్కడి అక్రమ నిర్మాణంపై ఎవరు ఫిర్యాదు చేశారు? అంటూ ఎక్కాల కన్నా సెక్షన్ ఆఫీసర్‌ను నిలదీశాడు. ఫిర్యాదు కాఫీ చూపించాలంటూ చిందులు తొక్కాడు. అక్రమ నిర్మాణం జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామని ఆమె సమాధామిచ్చారు. దీంతో రెచ్చిపోయిన కార్పొరేటర్ భర్త ఆమెను దుర్భాషలాడాడు. అతని దౌర్జన్యాన్ని అధికారి వాణి తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆమె చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొన్నాడు. దీంతో భయపడిన ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి బయటపడ్డారు. సర్కిల్ డీఎంసీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు.. సెక్షన్ అధికారిణి జి.వాణి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆమెను సంఘటన స్థలానికి తీసుకువెళ్లి ఏం జరిగిందనే దానిపై విచారించారు. అంతేగాక వారు తీసిన వీడియోను పరిశీలించారు. సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఎక్కాల కన్నాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాణికి పలువురు అధికారుల మద్దతు కాచిగూడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ జి.వాణిపై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం చేసినట్లు తెలుసుకున్న వివిధ సర్కిళ్లల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆపీసర్లు ఆమెకు బాసటగా నిలిచారు. పెద్దసంఖ్యలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వాణికి ఓదార్చి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగేవరకు తామంతా వెంట ఉంటామని భరోసానిచ్చారు. -
వీణా–వాణీల బాగోగులు ప్రభుత్వ బాధ్యతే
స్టేట్‌హోంలో వీణా–వాణీలను కలసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న అవిభక్త కవలలు వీణా– వాణీలను శుక్రవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వీణా–వాణీల బాధ్యత ప్రభుత్వానిదే అని, వారికి అవసరమై న నిధులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. స్టేట్‌హోంకు వచ్చి ఆర్నెల్లు కావస్తోందని.. వారి బాగోగుల నిమిత్తం ఇప్పటివరకు రూ. 6.46 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఇందులో వారిని చూసుకునే ఆయాలకు రూ.4.32 లక్షలు, రూ.1.14 లక్షలు చదువుల కోసం, మరో రూ.లక్ష ప్రత్యేక కోటాలో అత్యవసర ఖర్చుల నిమిత్తం విడుదల చేశామన్నారు. వీణా–వాణీ గతేడాది ఐదో తరగతి చదివారని, వారి ఐక్యూ బాగుండ డంతో ఏడో తరగతికి ప్రమోట్ చేశామన్నారు. -
లేడీ డాక్టర్‌తో లవ్
అనగనగా ఓ యువకుడు. తలకి బలమైన గాయం కావడంతో గతం మర్చిపోతాడు. పేరు కూడా గుర్తు ఉండదు. తానెవరో తెలుసుకోవాలని హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో లేడీ డాక్టర్ అతనితో ప్రేమలో పడుతుంది. ఏంటీ.. సూర్య ‘గజని’ గుర్తొస్తుందా? అలాంటి కథతోనే నందా దురైరాజ్, ఉమ, వాణి ముఖ్య తారలుగా ‘ప్రేమలేఖ’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ చిత్రాల దర్శకుడు అగస్త్యన్ తమిళంలో ‘సెల్వమ్’ తీశారు. ఈ చిత్రాన్ని ‘లక్ష్మీపుత్రుడు’ పేరుతో నిర్మాత ఎ. రమేశ్‌బాబు తెలుగులోకి అనువదించారు. దేవా స్వరపరిచిన పాటల్ని ఇటీవల విడుదల చేశారు. ‘‘ప్రేమకథా చిత్రమిది. ఫిబ్రవరి రెండోవారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రమేశ్‌బాబు. ఈ చిత్రానికి మాటలు–పాటలు: భారతీబాబు, సమర్పణ: ఎ. రమాదేవి. -
వాణీ అయితే వద్దట!
హీరోయిన్ ఎంపిక విషయంలో నిర్మాతతో ఆమిర్ ఖాన్‌కి విభేదాలు వచ్చాయట. అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్ హీరోలుగా ‘ధూమ్ 3’ ఫేమ్ విజయకృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో హీరోయిన్గా వాణీ కపూర్‌ను తీసుకోవాలని నిర్మాత ఆదిత్యా చోప్రా, వాణీ వద్దంటూ ఆమిర్ పట్టుదలగా ఉన్నారట. యశ్‌రాజ్ సంస్థతో వాణీకి త్రీ ఫిల్మ్స్ కాంట్రాక్ట్ ఉంది. ఆదిత్యా చోప్రా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘బేఫికర్’లోనూ ఆమే హీరోయిన్. ‘థగ్స్ ఆఫ్...’కి హీరోయిన్గా వాణీ వద్దని ఆమిర్ చెప్పడంతో ఆదిత్య డైలమాలో పడ్డారట. ఇంతకీ వాణీ వద్దని ఆమిర్ ఎందుకంటున్నారో? -
రక్తహీనతతో చిన్నారి మృతి
కెరమెరి(ఆదిలాబాద్) రక్త హీనతతో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. వివరాలివీ.. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం దువుడుపల్లి గ్రామానికి చెందిన రంజిత్, వాణి దంపతుల కుమార్తె సహస్ర(ఏడాది) రక్త హీనతతో బాధపడుతోంది. ఆమెను తల్లి దండ్రులు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె 12 రోజులుగా చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించటంతో సహస్ర గురువారం ఉదయం చనిపోయింది. చిన్నారి సికిల్‌సెల్ అనీమియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబసభ్యులు చెప్పారు. -
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ‘పురం’ విద్యార్థులు
హిందూపురం టౌన్ : పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లి బాలికల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన బి.లావణ్య, ఎన్.వాణి ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలక్ష్మమ్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం రామలక్ష్మమ్మ, మహత్మాగాంధీ ఉచిత శిక్షణ కేంద్రం నిర్వాహకులు వెంకటాచలపతి విద్యార్థులు ఎంపికపై హర్షం వ్యక్తం చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. -
ABN ఛానల్‌పై సిబిఐకి ఫిర్యాదు
-
వీణా-వాణీల ఆ‘పరేషాన్’!
-
వీణా-వాణీల ఆ‘పరేషాన్’!
- లండన్ వైద్యులతో శస్త్రచికిత్సపై చేతులెత్తేసిన ఎయిమ్స్? సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీ (13)ల శస్త్రచికిత్స విషయంలో స్పష్టత కరువైంది. ఆపరేషన్ ద్వారా వారిని వేరు చేసేందుకు లండన్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) చేతిలో పెట్టడం, లండన్ వైద్యులను ఢిల్లీకి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఎయిమ్స్ హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఆపరేషన్ ఖర్చుపై స్పష్టత కోరుతూ ఎయిమ్స్‌కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం...శస్త్రచికిత్స కోసం లండన్ వైద్యులు ఢిల్లీకి వచ్చేందుకు ముందుకొస్తారో లేదో తెలుసుకోవాలని కోరింది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి 5 నెలలు దాటింది. ఇప్పటివరకు ముందడుగు పడలేదు. వైద్య ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ చేయించే విషయంలో ఎయిమ్స్ చేతులెత్తేసింది. అందుకే ఈ విషయాన్ని ఎటూ తేల్చకుండా పెం డింగ్‌లో పెట్టిందని ఈ వ్యవహారాలు పరిశీలిస్తున్న నీలోఫర్‌కు చెందిన ఒక వైద్యాధికారి ‘సాక్షి’కి చెప్పారు. అవిభక్త కవలలను వేరు చేసిన అనుభవమున్న లండన్ ఆస్పత్రిలోనే వీణావాణీలకు ఆపరేషన్ చేయిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిపాటు విడతల వారీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని... ఇందుకు రూ. 10 కోట్లు ఖర్చవుతుందని లండన్ వైద్యులు చెప్పగా దీనిపైనే సర్కారు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. వీణావాణీలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఏమిటన్న ప్రశ్న కూడా తాత్సారానికి మరో కారణంగా చెబుతున్నారు. మరోవైపు వీణావాణీల వయసు పెరుగుతున్న దృష్ట్యా వారిని మహిళా వసతి గృహంలోకి మార్చాల్సి ఉందని నీలోఫర్ వైద్యులు అంటున్నారు. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
అల్లరి చేస్తోందని వాతలు
ఓ తల్లి ఘాతుకం బాపూజీనగర్‌లో ఘటన బంజారాహిల్స్: అల్లరి చేస్తున్న చిన్నారిని లాలించి.. బుజ్జగించాల్సిన తల్లే రాక్షసిలా మారింది... కన్నబిడ్డ అనే కనికరం లేకుండా గరిటెతో వాతలు పెట్టింది. తీవ్రగాయాలకు గురైన ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్పీఆర్ హిల్స్ బాపూజీనగర్‌లో నివసించే వాణి, ఆంజనేయులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మద్యానికి బానిసైన భర్త ఇంటికి రాకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో వాణి ఓ ఇంట్లో పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. పెద్ద కూతురు సోని (5) ఇదే బస్తీలో అంగన్వాడి కేంద్రంలో చదువుతోంది. ఈ చిన్నారి ఎక్కువగా అల్లరి చేస్తుంది. చుట్టుపక్కల చిన్నారులతో ఆడుకొనే సమయంలో తన కొంటెతనాన్ని చూపించి తల్లికి తలనొప్పి తెస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి సోనిని రోజూ దండిస్తోంది. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం తల్లి దిండు కింద దాచిన రూ. 100ను సోని తీసుకొని సమీపంలోని షాపులో తినుబండారాలు కొనుక్కుంది. తనకు తెలియకుండా డబ్బులు తీసుకుందని, రోజు రోజుకూ కూతురు అల్లరి ఎక్కువైందనే కోపం.. భర్త ఇంటిపట్టున ఉండటం లేదన్న బాధ.. ఈనేపథ్యంలో సహనం కోల్పోయిన వాణి సోమవారం ఉదయం గరిటెను బాగా కాల్చి చిన్నారి సోని కాళ్లు, చేతులు, కడుపు, బుగ్గలపై రెండువైపులా వాతలు పెట్టింది. చిన్నారి పెద్దగా ఏడుస్తూ బయటకు పరుగు తీయబోగా... లోపలి నుంచి గడియపెట్టి మళ్లీ వాతలు పెట్టింది. దీంతో చిన్నారి కుప్పకూలిపోయింది. వెంటనే వాణి కూతురిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి.. ఇంట్లోనే బంధించింది. చిన్నారి పరిస్థితి చూసి చలించిన స్థానికులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మీడియా పోలీసుల సహకారంతో బాలికకు విముక్తి కలిగించారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తల్లిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అత్యంత దారుణం: బాలాల హక్కుల సంఘం సిటీబ్యూరో: చిన్నారి సోనిపై తల్లి వాతలు పెట్టిన ఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తల్లిదండ్రలే కన్న బిడ్డను హింసించడం అత్యంత దారుణమని సంఘం అధ్యక్షురాలు అనురాధరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు త్వరగా విచారణ జరిపి శిక్ష విధిస్తే మరొకరు నేరం చేయరని ఆమె పేర్కొన్నారు. -
కిలాడి దంపతుల అరెస్టు
క్రైం (కడప అర్బన్) : రెడీమేడ్ షోరూం నిర్వహిస్తూ అప్పుల పాలైన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసుల వలలో చిక్కాడు. ఏకంగా కానిస్టేబుల్ ఇంటిలో గతనెల 14వ తేదీన దొంగతనానికి పాల్పడే యత్నంలో అడ్డంగా దొరికిపోయాడు. భర్త పాల్పడే దొంగతనాలకు భార్య తోడునీడగా నిలవడంతో ఆమె కూడా కటాకటాల పాలైంది. పసుపులేటి చంద్రశేఖర్ అలియాస్ శంకర్ (34), అతని భార్య పసుపులేటి మంజువాణి అలియాస్ వాణి అలియాస్ గనమంతు మంజువాణి (30) అనే కిలాడిజంటను జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో అర్బన్ సీఐ శ్రీరాములు, తాలూకా ఎస్ఐ బాల మద్దిలేటి ప్రత్యేక బృందంగా ఏర్పడి ఐటీఐ సర్కిల్ వద్ద సోమవారం అరెస్టుచేశారు. వారి వద్దనుంచి రూ. 12 లక్షల విలువైన 405 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. సోమవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారిని హాజరు పరిచారు. ఈ సందర్బంగా డీఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన పసుపులేటి చంద్రశేఖర్ అలియాస్ శంకర్ నేహా రేడీమేడ్ షోరూం పెట్టుకుని జీవించేవాడన్నారు. ఆ షాపు దివాళా తీయడంతో అప్పుల పాలై దుర్వసనాలకు లోనై నేరాలకు పాల్పడ్డాడన్నారు. 2013 నుంచి ఇప్పటివరకు 12 దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. గత సంవత్సరం డిసెంబరు 2న నకాష్‌లో, జనవరి 23న బాలాజీనగర్‌లో, ఏప్రిల్ 4న విజయనగర్ కాలనీలో, జూన్ 7న బాలాజీనగర్‌లో, జులై 28, 29 తేదీలలో ఎస్బీఐ కాలనీలోని పామ్ గ్రూవ్ రెసిడెన్సీలో, ఆగస్టు 10, 11 తేదీలలో విజయదుర్గ కాలనీలో, అక్టోబరు 15న రాజారెడ్డివీధిలో, అదేరోజు ప్రకాశ్‌నగర్‌లో, అదేనెల 26న నబీకోటలో చోరీలకు పాల్పడ్డారు. అదేనెలలో 19న జెడ్పీ ఆవరణంలో, జూన్ 10వ తేదీన హరిత రెస్టారెంట్ సమీపంలో మోటారు సైకిళ్లను దోచుకున్నారు. నేరాలకు పాల్పడే శైలి చంద్రశేఖర్ అలియాస్ శంకర్ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తూ రాజారెడ్డివీధిలో నివసిస్తున్నాడు. అతని భార్య మంజువాణి నగర శివార్లలోని ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తన సహచర ఉపాధ్యాయులు నివసించే ప్రాంతాలను మొదట తన భర్తతోసహా వెళ్లి పరిశీలిస్తారు. పాఠశాల వేళల్లో ఉపాధ్యాయుల హ్యాండ్‌బ్యాగుల్లో ఉండే తాళాలను వారికి తెలియకుండా తీసుకుని భర్తకు అందజేస్తుంది. తర్వాత ఆమె భర్త సదరు ఇళ్లకు వెళ్లి తాళాలు తీసి లోపలున్న వస్తువులను దోచుకుంటారు. తర్వాత ఏమీ ఎరగనట్లు తాళాలను భార్య చేతికి ఇస్తే ఆమె సదరు ఉపాధ్యాయుల తాళాలను వారి బ్యాగులోనే గమనించకుండా దాచేస్తుంది. ఒకవేళ తాళాల కనబడక బాధితులు వెతుకుతుంటే తనకు ఫలానా చోట దొరికాయని ఆమె వారికి అందజేస్తుంది. గతనెల 14వ తేదీన బాలల దినోత్సవం కావడం, అదే పాఠశాలలో బాలాజీనగర్‌లో నివసిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళ్లింది. సదరు ఉపాధ్యాయురాలు భర్త ట్రాఫిక్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను టిఫెన్ తినేందుకు ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ శంకర్ కానిస్టేబుల్‌ను చూడగానే బిత్తరపోయి పరారయ్యాడు. తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ నేరాలన్నీ బట్టబయలయ్యాయి. ఈ నేరాలను చేధించడంలో కృషి చేసిన కడప అర్బన్ సీఐ శ్రీరాములు,ఎస్ఐ బాల మద్దిలేటి, తాలూకా, సీసీఎస్ పోలీసులు, ఏఎస్ఐ మరియన్న, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున,కానిస్టేబుళ్లు రామాంజనేయులు, పరమేశ్, ప్రవీణ్, పెంచలయ్య, సాగర్, ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్రాజు, మహేశ్వరి, హోంగార్డులు సూర్యనారాయణమ్మ, శశికళలను డీఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు. సమావేశంలో డీఎస్పీతోపాటు సీఐలు శ్రీరాములు, సదాశివయ్య, నాయకుల నారాయణ, ఎస్ఐలు బాలమద్దిలేటి, ఎస్వీ నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్రాజునుడీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
అనాథ బాలలకు ఆశాకిరణం
స్ఫూర్తి ఊరు కాని ఊరు... రాష్ట్రం కాని రాష్ర్టంలో రోడ్డు పక్కన ఉండే అనాథ పిల్లల ఆక్రందనలు ఆమెను కదిలించాయి. ఓ మంచి కార్యానికి సంసిద్ధురాలిని చేశాయి. తను, తన కుటుంబం మాత్రం బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో అనాథలను, వీధిబాలలను ఆదుకోవడానికి ఆమె దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకూ ఈమె ఎవరో, ఈమె చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలు ఎక్కడో చూద్దామా..! ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వాణి, హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ భార్యాభర్తలు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ ముంబాయిలో నివసిస్తున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లాక, ఇంట్లో ఒంటరిగా ఉండలేక వాణి ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. ఆమె ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లే క్రమంలో దారిలో ఎందరో అనాథలు, వీధిబాలలు దయనీయమైన స్థితుల్లో తిరగాడుతుండటాన్ని చూసి చలించిపోయింది. వారికోసం ఏదైనా చేయాలనుకుంది. తన ఆలోచనను స్నేహితులతో పంచుకుంది. బెంగాల్‌కు చెందిన దేవాంజలి ఆమెకు తోడ్పాటును అందించేందుకు సిద్ధమైంది. వీరికి మరికొందరు స్నేహితులు జత కలిశారు. మొదట్లో వీరందరూ కలిసి దుప్పట్లు, దుస్తులు కొనుగోలు చేసి అనాథలకు అందించేవారు. వివిధ ఆశ్రమాల్లో ఉండేవారికి, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి దుస్తులు, పండ్లు పంపిణీ చేసేవారు. ఇదే సమయంలో వీధిబాలలు చాలామంది ఆకలితో అలమటిస్తుండటాన్ని వీరు గుర్తించారు. దాంతో ఇంటి వద్దనే వండిన ఆహారాన్ని తీసుకెళ్లి మురికివాడల్లో నివసించే పిల్లలకు తినిపించటంతో బాటు వారికి పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా అందిస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలను చూసిన పలువురు తమవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. దాంతో 75 మంది పిల్లలకు చదువుతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరు ‘ఆశాకిరణ్’ పేరుతో ఒక పాఠశాలను, ఒక ఉచిత ఉపశమన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో పిల్లలకు విద్య మాత్రమే కాకుండా చిత్రలేఖనం, వృత్తి విద్య, నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. అతి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఆశాకిరణ్’ ఇప్పుడు ఇక్కడి చిరునామాలలో ల్యాండ్ మార్క్‌గా మారడం విశేషం. పేరుకు తగ్గట్టే మురికి వాడలలోని వారికి వీరి పాఠశాల ‘ఆశాకిరణం’లా వెలుగునిస్తోంది. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, సేవాభావం, దానిని నెరవేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే, ఎక్కడైనా, ఎంతైనా చేయవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి! - కొమ్మినేని వెంకటేశ్వర్లు, సాక్షి, ఖమ్మం ఆసరా ఇస్తే ఖమ్మంలోనూ పాఠశాల ప్రారంభించాలని ఉంది! ‘నేను చేస్తున్న సేవలకు పలువురు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో పాఠశాల నిర్వహిస్తున్నాను. అయితే మా సొంత పట్టణమైన ఖమ్మంలో కూడా అనాథలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది. దాతలు ముందుకొస్తే అక్కడ కూడా అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని ఉంది’ - వాణి -
నేడు పాలిసెట్
ఆదిలాబాద్ టౌన్/బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం ఆదిలాబాద్ నాలుగు, బెల్లంపల్లిలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో 1,566, బెల్లంపల్లిలో 6,397 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఆదిలాబాద్, బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్లు సత్యానందం, వాణి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 23 మంది పరిశీలకులు, ఐదుగురు రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. విద్యార్థులకు పెన్సిల్, రబ్బర్, షార్ప్‌నర్ పరీక్ష కేంద్రంలో అందజేస్తారు. బాల్‌పెన్, పరీక్ష ప్యాడ్, హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలి. ఈసారి ఓఎంఆర్ షీట్‌ను ఆధునీకరించారు. విద్యార్థి ఫొటో, పేరు, హాల్‌టికెట్ నంబరు పొందుపర్చారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా రూపొందించారు. ఒక్కో పరీక్ష కేంద్రంలో సుమారు 25 నుంచి 45 మంది ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించారు. పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిపై పోలీసుల అక్కసు
ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులను ఇదేం పని అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. అంతే మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ అహం దెబ్బతిన్న పోలీసులు దువ్వాడ శ్రీనివాస్‌పై తమ అక్కసు వెళ్లగక్కారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణిలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తరలించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై అక్రమంగా కేసు బనాయించారు. -
కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి, వాణిలకు ఛాన్స్
హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్యాహ్నం గవరన్నర్ నరసింహన్‌ను కలిసినట్లు సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్సీల రేసులో పలువురు నేతలు ఉన్నాయి అయితే పీసీసీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి, పదవీకాలం పూర్తి కానున్న ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇంకొక్క చాన్స్ ఇవ్వండి
వాణి ఓ అబ్బాయిని ప్రేమించింది. తండ్రి అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంది. కానీ ఆరు నెలలు తిరగకముందే ఆ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. దానికి ఆమె కారణాలు ఆమెకున్నాయి. వాణి భర్త దిలీప్ ఆవేశపరుడు. ఎక్కడ చెడు జరిగినా మండిపడతాడు. తనకు సంబంధం లేకపోయినా అన్యాయం జరిగినవాళ్ల పట్ల వకాల్తా పుచ్చుకుని మాట్లాడతాడు. అలా చాలాసార్లు గొడవల్లో ఇరుక్కున్నాడు. చివరకు తన కొలీగ్కి అన్యాయం చేసిందని యాజమాన్యంతో గొడవ పెట్టుకుని ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ప్రతిసారీ అతడు ఏదో ఒకటి చెబుతుంటే కన్విన్స్ అయ్యే వాణి ఈసారి కాలేకపోయింది. అతడితో కాపురం చేయలేనని పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి చెబుతున్నా వినకుండా వాణి తన భర్తకు దూరంగా వెళ్లిపోయింది. కానీ సంతోషంగా మాత్రం లేదు. కొన్నాళ్ల తర్వాత దిలీప్ని మొదట్నుంచీ గమనించిన వాణి స్నేహితురాలు అతడిని పెళ్లి చేసుకుంది. అతడి అభిప్రాయాల్ని గౌరవించి, జీవితాన్ని ఆనందమయం చేసుకుంది. అప్పుడుగానీ తాను కోల్పోయిందేంటో తెలిసి రాలేదు వాణికి. ఇది నిజంగా జరిగిన సంఘటనే. ఇద్దరు మనుషులు ఓ చోట ఉన్నప్పుడు అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. అంతమాత్రాన ఆ బంధానికి ముగింపు చెప్పేయడం సరికాదు. వాణినే తీసుకుంటే... తన భర్తని తప్పుబట్టింది. కానీ అదే వ్యక్తితో మరో స్త్రీ ఆనందంగా జీవితాన్ని సాగించగలిగింది..! తప్పెవరిది? చెప్పేదేమిటంటే...అందరూ ఒకలా ఉండరు. మనల్ని వేరేవారిలా ఉండమంటే ఉంటామా! అలాంటప్పుడు అవతలివాళ్లను మనలా ఉండమనడం కరెక్టేనా? ప్రేమిస్తే వారిలోని లోపాల్ని, వారి అభిప్రాయాల్ని, సిద్ధాంతాల్ని కూడా ప్రేమించాలి. అప్పుడు వారు చేసేది తప్పు అనిపించదు సరికదా, వారికి అండగా నిలిచేందుకు మన మనసు సిద్ధపడుతుంది. అలా అని భర్త నిజంగా తప్పు చేసినా భరించమని చెప్పడం లేదు. అవగాహనా లోపంతో వారు చేసే పనిని తప్పు పట్టవద్దని మాత్రమే చెప్పేది. అలా చేసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్లెవరూ సంతోషంగా ఉండరు. మీరు మాత్రం అలా చేయకండి. విలువైన బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి. మీ రిలేషన్‌షిప్‌కి ఇంకొక్క చాన్స్ ఇవ్వండి! - బాధితురాలి స్నేహితురాలు (దిలీప్ రెండో భార్య కాదు), హైదరాబాద్ -
ప్రియుడిపై కక్షతో విద్యార్థిని యాసిడ్ దాడి నాటకం!
అనంతపురం : అనంతపురంలో ఈనెల 2న బీకాం ఫైనలియర్ విద్యార్థిని వాణిపై జరిగిన యాసిడ్ దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇన్నిరోజులు వాణిపై దాడి జరిగిందని అందరూ అనుకుంటుండగా, ఆమే స్వయంగా యాసిడ్ పోసుకుందని పోలీసుల విచారణలో తేలింది. పాత ప్రియుడు రాఘవేంద్రకు బుద్ధిచెప్పాలని ఆమె, అతడే యాసిడ్ పోసినట్టుగా ఈ డ్రామా ఆడిందని ఎస్పీ తెలిపారు. పోలీసులను పక్కదోవ పట్టించినందుకుగానూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముదిగుబ్బకు చెందిన వాణి, అనంతలోని వాణి కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రియుడు రాఘవేంద్రపై పగ తీర్చుకునేందుకు, పరిచయమున్న మహేష్‌ను ఆశ్రయించింది. మహేష్, ఉద్యానశాఖలో పనిచేస్తున్న తాహీర్ ఇబ్రహీమ్ ద్వారా, సురేష్ అనే వ్యక్తి నుంచి యాసిడ్ సేకరించి, వాణికి అందించాడు. ఆమె తన ఒంటిపై యాసిడ్ పోసుకుని, ఇంతపెద్ద దుమారం రేపింది. యాసిడ్ దాడి నాటకం జరిగిందిలా... సెప్టెంబర్ 2వ తేదీ....సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలు.. అనంతపురం బైపాస్‌లోని పరిటాల రవీంద్ర పెట్రోల్ బంక్ ప్రాంతం.. కళాశాల బస్ దిగిన విద్యార్థిని వాణి అక్కడి నుంచి మేనమామ ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి ఇంటి సమీపంలోకి రాగానే అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు ఇద్దరు రెండు యాసిడ్ బాటిళ్లతో బైక్‌పై వెంటబడ్డారు. ఒక యాసిడ్ బాటిల్‌ను బైక్ నడుపుతున్న తాహీర్ ఇబ్రహీమ్ ముందు పెట్టిన సురేష్ ... మరొక బాటిల్‌ను తన చేతిలో పట్టుకున్నాడు. సురేష్ హెల్మెట్ పెట్టుకోగా, తాహీర్ ఇబ్రహీమ్ మొహం కన్పించకుండా కర్చీఫ్ కట్టుకున్నాడు. వాణి సమీపంలోకి రాగానే వాళ్లిద్దరూ యాసిడ్ బాటిల్ మూత తెరిచి చల్లేందుకు ప్రయత్నించాడు. ఆమె వెంటనే తల పక్కకు తిప్పుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది. బాటిల్లోని 40 శాతం యాసిడ్ వాణి ఒంటిపై పడింది. కుడి చేయి, కుడికాలు, ఛాతి, వెనుక భాగంలో గాయాలయ్యాయి. దీంతో ఆమెపెద్ద పెట్టున అరుపులు, కేకలు వేసింది. మొదటి యాసిడ్ బాటిల్‌ను అక్కడే పడేసిన వారు ... మరో బాటిల్ తీసుకుని చల్లేందుకు ప్రయత్నించారు. అయితే.. జనాలు అక్కడికి పరుగెత్తుకు వస్తుంటం చూసి పరారయ్యారు.