లేడీ డాక్టర్‌తో లవ్‌ | Lakshmi putrudu movie releasae In the second week of February | Sakshi
Sakshi News home page

లేడీ డాక్టర్‌తో లవ్‌

Published Sun, Jan 22 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

లేడీ డాక్టర్‌తో లవ్‌

లేడీ డాక్టర్‌తో లవ్‌

అనగనగా ఓ యువకుడు. తలకి బలమైన గాయం కావడంతో గతం మర్చిపోతాడు. పేరు కూడా గుర్తు ఉండదు. తానెవరో తెలుసుకోవాలని హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో లేడీ డాక్టర్‌ అతనితో ప్రేమలో పడుతుంది. ఏంటీ.. సూర్య ‘గజని’ గుర్తొస్తుందా? అలాంటి కథతోనే నందా దురైరాజ్, ఉమ, వాణి ముఖ్య తారలుగా ‘ప్రేమలేఖ’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ చిత్రాల దర్శకుడు అగస్త్యన్‌ తమిళంలో ‘సెల్వమ్‌’ తీశారు.

ఈ చిత్రాన్ని ‘లక్ష్మీపుత్రుడు’ పేరుతో నిర్మాత ఎ. రమేశ్‌బాబు తెలుగులోకి అనువదించారు. దేవా స్వరపరిచిన పాటల్ని ఇటీవల విడుదల చేశారు. ‘‘ప్రేమకథా చిత్రమిది. ఫిబ్రవరి రెండోవారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రమేశ్‌బాబు. ఈ చిత్రానికి మాటలు–పాటలు: భారతీబాబు, సమర్పణ: ఎ. రమాదేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement