lady doctor
-
ప్రాణదాతా.. నీకు సలాం! వీడియో వైరల్
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా డాక్టర్ ఓ వృద్ధుడి( 60 ఏళ్లు) ప్రాణాన్ని కాపాడారు. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2లో ఒక వ్యక్తికి గుండెపోటు రావటంతో గమనించి ఆమె వెంటనే స్పందించారు. ఆయన వద్దకు వెళ్లి ఛాతిమీద చేతులతో నొక్కుతూ సీపీఆర్ చేసి స్పృహలోకి వచ్చేలా చేశారు. అనంతరం విమాశ్రయ అధికారులు ఆ వ్యక్తికి వైద్యం అందించారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ డాకర్ట్ చూపిన చొరవకు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. డాక్టర్ చొరవతో ఆ వ్యక్తికి ప్రాణం వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. ఆమెను డాక్టర్ విశ్వరాజ్ వేమలగా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు.Doctors are no less than God 🙏🏻An elderly passenger at the Delhi airport's Terminal 2 was revived by a doctor after he suffered a heart attack on the premises.She deserves an acknowledgement and recognition 👏🏻#DelhiAirport pic.twitter.com/0lOLyKj2RC— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024 -
మహిళా డాక్టర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వేధింపులు
-
దటీజ్ డాక్టర్ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్బాడీస్కి పోస్ట్‌మార్టం
‘అమ్మాయిలు పోస్ట్‌మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైంటిస్ట్‌గా డాక్టర్ రుక్మిణీ కృష్ణమూర్తి వార్తల్లో నిలిచారు. ముంబయ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్ అయ్యేంతవరకు వర్క్ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మహాలక్ష్మి. చదువుకునే రోజుల్లో... ‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్. వాళ్లని చూసే నేనూ డాక్టర్ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్ డాక్టర్ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్‌ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్‌నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది. రిస్క్ ఎందుకు అన్నారు.. చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్మేట్ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్‌కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్‌లో ఛాలెంజెస్ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్ డాక్టర్. అనేక పరిశోధనలు.. మేల్ డామినేటెడ్ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్ స్టూడెంట్స్‌కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. – డాక్టర్ మహాలక్ష్మి -
వైద్యురాలితో అసభ్య ప్రవర్తన... తండ్రీ కొడుకుల అరెస్ట్
బంజారాహిల్స్: కిరాయి చెల్లించకుండా ఇంట్లో ఉండటమేగాక ఇంటిని ఖాళీ చేయాలని చెప్పిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు, విశ్రాంత ప్రొఫెసర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడిన ఘటనలో తండ్రీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 7లోని ఉమెన్ కో అపరేటివ్ సొసైటీ ప్లాట్ నెంబర్ 88లో విశ్రాంత ప్రొఫెసర్, ప్రముఖ పీడియాట్రిక్ నిపుణురాలు డా.గంటా కుసుమకు ఇల్లు ఉంది. పదేళ్ల క్రితం ఈ ఇంట్లో మొయ్యా రాఘవేంద్రనాథ్, ఆయన తండ్రి మొయ్యా రవీంద్రనాథ్ కిరాయికి దిగారు. కాగా నాలుగేళ్ల క్రితం తన భర్తతో కలిసి సొంతింట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటిని ఖాళీ చేయాలని రాఘవేంద్రనాథ్‌ను కోరారు. అయితే ఇంటిని ఖాళీ చేయ కుండా రోజుకో సాకును చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయకపోగా గత కొన్నినెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని డా. కుసుమతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రాఘవేంద్రనాథ్‌ను ఈనెల 8న కోరారు. దీంతో తీవ్ర పదజాలంతో వారిని దూషించడంతో పాటు అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడంతోపాటు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేశారు. నాలుగేళ్ల వరకు ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని, కిరాయి కూడా ఇచ్చేది లేదంటూ దబాయించారు. దీంతో బాధితురాలు డా.కుసుమ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ మేరకు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. గతంలో పార్కు స్థలం కబ్జా కేసులో.. ఇదిలా ఉండగా వృద్ధురాలైన వైద్యురాలి ఇంట్లో కిరాయికి దిగి ఖాళీ చేయకుండా వేధిస్తుండడంతో పాటు బెదిరింపులకు దిగిన నిందితులు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.9లోని సత్వా ఎన్క్లేవ్ కాలనీలో పార్కుస్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసినట్లు సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులిద్దరూ అరెస్టయినట్లు విచారణలో తేలింది. ఫోర్జరీ పత్రాలతో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు ఏకంగా జీహెచ్ఎంసీని బురిడీ కొట్టించి నిర్మాణ అనుమతులు తీసుకున్న వ్యవహారంపై కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అధికారులను బెదిరించడం, భూములను కబ్జా చేసినట్లు తేలింది. (చదవండి: కోమటిరెడ్డి సోదరులు.. కోవర్టు బ్రదర్స్) -
హిందూపురంలో యువ వైద్యురాలు ఆత్మహత్య
హిందూపురం(అనంతపురం జిల్లా): తీవ్రమైన మానసిక ఒత్తిడిని తాళలేక ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురంలోని 1వ వార్డు కౌన్సిలర్ (వైఎస్సార్సీపీ) మల్లికార్జున కుమార్తె సుప్రియ (25) ఇటీవల కర్నూలులోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. బెంగళూరులో పీజీ కోర్సు పూర్తి చేసేందుకు ఆన్లైన్లో పోటీ పరీక్షకు సిద్ధమవుతోంది. చదవండి: రూ.25 లక్షల కట్నం.. రూ.50లక్షలతో ఘనంగా పెళ్లి.. అయినా సరిపోలే! ఈ క్రమంలో తాను ఎంపిక చేసుకున్న విభాగంలో సీటు దక్కుతుందో లేదోననే ఆందోళనతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె సోమవారం ఉదయం ఇంటి మేడపైన ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గమనించిన తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఫోన్ ద్వారా మల్లికార్జునను పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్లు జబీవుల్లా, బలరామిరెడ్డి, కౌన్సిలర్లు బాధితకుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. -
వైరల్: ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ
వైరల్: రాత రాసేది బ్రహ్మ.. ప్రాణం మోసేది అమ్మ.. మరి ఆ ప్రాణం నిలిపేది?.. ఇంకెవరు దైవంతో సమానమైన వైద్యులు. ఇక్కడో డాక్టరమ్మ అప్పుడే పుట్టిన ఓ బిడ్డకు ప్రాణదానం చేసింది. ఒక తల్లికి గుండెకోతను తప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన ఓ ఆడబిడ్డ.. చలనం లేకుండా ఉంది. ఆ బిడ్డకు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని వైద్యులు గుర్తించారు. దీంతో.. ఆక్సిజన్ సపోర్ట్ ద్వారా బిడ్డకు ఊపిరి అందించే యత్నం చేశారు వైద్యులు. అయితే.. నవజాత శిశువు కావడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో.. నోటి ద్వారా శ్వాసను అందించడానికి సిద్ధమైంది అక్కడే ఉన్న ఓ డాక్టరమ్మ. అలా ఏడు నిమిషాలపాటు శ్వాస అందించింది. వేర్వేరు ప్రయత్నాలు చేసింది. చివరకు బిడ్డ ఊపిరి పీల్చుకుంది. కళ్లు తెరిచిన ఆ బిడ్డను చూసి ఆ వైద్యురాలు ఎంతగానో మురిసిపోయింది. వెల కట్టలేని క్షణం అది!. ఆగ్రా ఎట్మాదపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మార్చి నెలలోనే ఈ ఘటన జరిగింది. ఆ వైద్యురాలి పేరు డాక్టర్ సులేఖ చౌదరి. సచిన్ కౌశిక్ అనే యూపీ అధికారి తాజాగా ఈ వీడియోను వైరల్ చేయడంతో.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा। बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी। बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक ‘माउथ टू माउथ रेस्पिरेशन’ दिया, बच्ची में साँस आ गई।👏🏼❤️#Salute #Doctor #respect pic.twitter.com/1PQK8aiJXQ — SACHIN KAUSHIK (@upcopsachin) September 21, 2022 ఇదీ చూడండి: అన్యోన్యం.. ఆ అవ్వ ప్రేమకు అంతా ఫిదా -
నిన్నే పెళ్లాడతానంటూ మ్యాట్రిమోనీలో పరిచయం.. లేడి డాక్టర్‌ను నమ్మించి..
మాట్రిమోనీ వెబ్సైట్లో పరిచయమయ్యాడు. ఇండియాకు వచ్చానని, లక్షల యూరోలు తీసుకువస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారని, ట్యాక్స్ కడితే తాను వచ్చి ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో మహిళా డాక్టర్ ఏకంగా రూ.19 లక్షలు జమ చేసింది. ఆ తరువాత నెంబర్ పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తిరువొత్తియూరు(తమిళనాడు): మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై కోవైకి చెందిన మహిళా డాక్టర్‌కు రూ.19.60. లక్షలు టోకరా వేసిన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన మహిళ సైక్రియాటిస్ట్ వరుని కోసం మాట్రిమోని వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. అవి చూసి ఓ యువకుడు, తన పేరు యుసాన్ సియాన్ అని వైద్యురాలికి పరిచయమయ్యాడు. తాను నెదర్లాండులో శస్త్ర చికిత్స విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో కోట్ల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్లు నమ్మించాడు. ఇందుకు సహకారం అవసరమని కోరారు. పైగా తాను ఇక్కడ సెటిల్ అయ్యాక భారతీయ యువతిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పాడు. తాను భారతదేశానికి వచ్చిన సమయంలో కలుస్తానంటూ నమ్మించాడు. అనంతరం ఇద్దరూ సెల్‌ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్లో తరచూ మాట్లాడుకునేవారు. చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల లక్ష యూరోలతో వచ్చాడు.. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారి పేరుతో ఓ మహిళతో ఫోన్ చేయించాడు. ఆమె డాక్టర్‌తో మాట్లాడుతూ.. యుసాన్ సియాన్ తన తల్లితో ఢిల్లీ వచ్చారని వివరించింది. అతని సెల్‌ఫోను మరమత్తులకు గురైనట్లు చెప్పింది. లక్ష యూరో డాలర్లు తీసుకుని వస్తున్నారని, అది భారతదేశపు కరెన్సీలో రూ.82.51 లక్షలకు సమానమని వివరించింది. దాన్ని మార్చడానికి, వారు నివాసం ఉండడానికి, విమాన టికెట్, పన్ను చెల్లించడానికి మొత్తము రూ. 19,59,920 కట్టాలని, యుసాన్ సియాన్ నేరుగా కలిసి నగదు తిరిగి ఇస్తారని తెలిపింది. ఈ మాటలు నమ్మిన కోవై మహిళా డాక్టర్ వారు చెప్పిన అకౌంట్‌కు రూ.19,59,920లను డిపాజిట్ చేశారు. దీని తరువాత వారు ఫోన్లో మాట్లాడలేదు. ఆ తరువతా అనుమానం రావడంతో ఆ నెంబరుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళా వైద్యురాలు కోవై కార్పొరేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
నిర్దోషినని నిరూపించుకునేందుకు జీవితాన్నే ముగించడం బాధాకరం: హీరోయిన్
రాజస్థాన్‌లో డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్యపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్‌గా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపు పోస్ట్ చేసింది. 'తాను అమాయకురాలని (నిర్దోషి) నిరూపించుకోవడానికి ఓ వైద్యురాలి తన జీవితాన్నే ముగించాల్సి రావడం చాలా బాధాకరం.' అని ట్వీట్ చేసింది. 'ప్రతీసారి వైద్యులు దాడికి గురవుతున్నారు. ఇతర 100 మంది వైద్యులు రిస్క్ తీసుకోవడం ఆపేశారు. కానీ సాధారణంగా ఒకరి ప్రాణాలను కాపాడేందుకు రిస్క్ తీసుకోవాలి.' అని పేర్కొంది. చదవండి: ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత డాక్టర్ అర్చనా శర్మ.. రాజస్థాన్ దౌసా జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఓ గర్భణికి వైద్యం చేస్తుండగా.. దురదృష్టవశాత్తు ఆమె హేమరేజ్ కారణంగా మరణించింది. ఆ తర్వాత ఆమె తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి హాస్పిటల్ బయట ఆందోళన చేశారు. ఈ క్రమంలో గర్భిణీ కుటుంబ సభ్యులు వైద్యురాలిపై, ఆమె భర్తపై పోలీసు స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. ఆందోళనలతో పాటు ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో అర్చన తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్తతో కలిసి ఆసుపత్రిని నడిపిస్తున్న ఆమె.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. చదవండి: జీవితమంతా అంధకారమే: ప్రణీత షాకింగ్ కామెంట్స్ సూసైడ్ నోట్లో అర్చనా.. తన భర్త, పిల్లలు అంటే ఆమెకు ఎంతో ఇష్టమని పేర్కొంది. తన మరణం తర్వాత భర్తను, ఇద్దరు పిల్లలను వేధించొద్దని కోరింది. 'అమాయకపు డాక్టర్లను వేధించకండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరి చావుకు కారణం కాదు. నా చావుతోనైనా నేను అమాయకురాలిని అని తెలుసుకోండి' అంటూ తన ఆవేదన తెలియజేసింది. Sad that a doctor had to end her life to prove her innocence.. #JusticeForDrArchanaSharma #DrArchanaSharma pic.twitter.com/cTSRQNTsPC — Pranitha Subhash (@pranitasubhash) March 30, 2022 చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం -
ప్లీజ్ వేధించకండి.. మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం
జైపూర్: సమాజంలో మనం డాక్టర్లకు ఎంత విలువనిస్తామో అందరికీ తెలిసిందే. కొందరు వైద్యులు తమ వృత్తిని దైవంగా భావించి ఎంతో మందికి సాయం చేస్తారు. మరికొందరు నిర్లక్ష్యంగా ఉండి.. వైద్య వృత్తికి, వైద్యులకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నింటికి వైద్యులను బాధ్యులను చేయడం సరైంది కాదు. వారిపై భౌతిక దాడులు, పోలీసుల కేసులు పెట్టడం సమంజసం కాదు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ఓ పేషెంట్ మృతి చెందడంతో ఆమె ఫ్యామిలీ మెంటర్స్ సదరు డాక్టర్‌పై పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన వైద్యురాలు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. డాక్టర్ అర్చనా శర్మ.. దౌసా జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఓ గర్భణికి వైద్యం చేస్తుండగా.. దురదృష్టవశాత్తు ఆమె హేమరేజ్ కారణంగా మరణించింది. ఆ తర్వాత ఆమె తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి హాస్పిటల్ బయట ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు వైద్యురాలిపై, ఆమె భర్తపై పోలీసు స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. ఆందోళనలతో పాటు ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో అర్చన తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్తతో కలిసి ఆసుపత్రిని నడిపిస్తున్న ఆమె.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో.. ‘‘తన భర్త, పిల్లలు అంటే ఆమెకు ఎంతో ఇష్టమని పేర్కొంది. తన మరణం తర్వాత భర్తను, ఇద్దరు పిల్లలను వేధించొద్దని కోరింది. అమాయకపు డాక్టర్లను వేధించకండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరి చావుకు కారణం కాదు. నా చావుతోనైనా నేను అమాయకురాలిని అని తెలుసుకోండి’’ అంటూ ఆవేదక వ్యక్తపరిచింది. ఈ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. అర్చన మృతికి పోలీసులే కారణమంటూ వైద్యులు నిరసనలకు దిగారు. దీంతో ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ రంగంలోకి దిగారు. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని అన్నారు. పేషెంట్ల ప్రాణాలు కాపాడటానికి డాక్టర్లు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తారు. ఏదైనా తప్పు జరిగితే.. డాక్టర్లను నిందించడం కరెక్ట్ కాదని అన్నారు. డాక్టర్లపై ఇలా కేసులు, దాడులు జరిపితే.. వారు ఎలా ప్రశాంతంగా వైద్యం అందిస్తారని ప్రశ్నించారు. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, తగిన చర్యలను కూడా తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం గెహ్లాట్ ఆదేశించారు. -
డా‘‘ రోల్ మోడల్: వయసు మరచి కలలు కనండి
యవ్వనంలో ఉన్న అమ్మాయికి గానీ అబ్బాయిలకు గానీ కాస్త ఈ పనిచేయండి? అని దేనిగురించి అయినా చెప్పామంటే..‘‘నా వల్ల కాదని కొందరు చెబితే, మరికొందరు నాకే చాలా పని ఉంది మళ్లీ ఇది చేయాలా? అని సణుగుతారు. ఇటువంటి యంగ్ జనరేషన్ ఉన్న ఈ రోజుల్లో ఆరుపదులు దాటిన అమ్మమ్మలు, నాయనమ్మలు కొందరు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే, మరికొందరు డెభైఏళ్ల వయసులోనూ కొత్త బిజినెస్‌లు ప్రారంభించి ఔరా అనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న డాక్టర్ గీతా ప్రకాష్ ఈ కోవకు చెందిన వారే అయినప్పటికీ... వీరందరి కంటే ఒక అడుగు ముందుకేసి ఏకంగా రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. పేరులోనే తెలుస్తోంది ఆమె ఒక డాక్టర్ అని. ముఫ్పైఏళ్లపాటు డాక్టర్‌గా పనిచేసిన తరువాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి మంచి మోడల్‌గా మారింది గీత. ఒకపక్క డాక్టర్‌గా సేవలందిస్తూనే, 67 ఏళ్ల వయసులో లేటెస్ట్ మోడల్‌గా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన గీతా ప్రకాష్ వైద్యవిద్యపూర్తయ్యాక జనరల్ ఫిజీషియన్‌గా బాధ్యతలు చేపట్టింది. ఒక డాక్టర్‌గా జీవితం ఎంతో సంతృప్తిగా సాగుతోంది. రోజూ తన క్లినిక్‌కు వచ్చే రోగులను చూడడం, వారి బాధలకు మందులు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడడం ఆమె దైనందిన చర్యగా మారింది. ఓ రోజు ఇటలీకి చెందిన ఓ ఫొటో గ్రాఫర్ ట్రీట్మెంట్ కోసం గీత దగ్గరకు వచ్చాడు. తన ట్రీట్మెంట్ పూర్తయ్యాక..ఫొటోగ్రాఫర్ కాస్త చనువు తీసుకుని ..‘‘మేడమ్! మీ ముఖం చాలా కళగా అందంగా ఉంది. మీరెందుకు మోడలింగ్ చేయకూడదు’’అని సూచించాడు. ఓ పేషెంట్ తనకు అస్సలు సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించడాన్ని గీత చిన్నగా నవ్వి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయింది. యాభైఏడేళ్ల వయసులో... కొన్ని నెలల తరువాత ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ నుంచి గీతకు ఉత్తరం వచ్చింది. ‘‘మేడమ్! మీ ఫొటోలు పంపించండి’’ అని ఆ ఉత్తర సారాంశం. ఆ ఫొటోగ్రాఫర్ మాటలు ప్రోత్సాహకరంగా ఉండడంతో గీతకు నచ్చాయి. దీంతో ‘‘చూద్దాం అతను చెబుతున్నాడు, కాబట్టి మోడలింగ్ చేద్దాం’’ అనుకుంది. అప్పటిదాకా ఫొటోల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో..ఎప్పుడూ మంచిగా రెడీ అయ్యి ఫొటోలు దిగలేదు. అప్పుడప్పుడూ దిగిన అత్యంత సాధారణ ఫొటోలను తన పిల్లలతో చెప్పి ఫొటోగ్రాఫర్‌కు పంపించింది. ఈ ఫొటోలు ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీకి నచ్చడంతో...అతను రూపొందించిన ‘కనీ’ శాలువాకు మోడలింగ్ చేసేందుకు గీత ఎంపికైంది. ఆ శాలువా ధరించి 57 ఏళ్ల వయసులో తొలిసారి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ శాలువాలు గీత వయసువారు ధరించేవి కావడం, పైగా ‘కనీ’ శాలువాలు గీతకు బాగా నప్పడంతో ఆ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ అయింది. దాంతో ఆమె మోడల్‌గా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత జైపూర్ బ్రాండ్ వాళ్లు కూడా మోడల్‌గా పనిచేయమని ఆఫర్ ఇవ్వడంతో అప్పటి నుంచి గీత మోడలింగ్‌లో దూసుకుపోతోంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆరు పదుల వయసులో గీత మోడలింగ్‌లో రాణించడానికి కుటుంబం మొత్తం మద్దతుగా నిలవడం విశేషం. ప్రతి మోడలింగ్ అసైన్‌మెంట్‌కు వెళ్లేటప్పుడు ఆమెను మరింత ఉత్సాహపరిచి పంపడం, గ్లాసీ పేపర్ల మీద వచ్చిన గీత ఫొటోలను చూపించి అభినందించేవారు. నా వృత్తిని ఆరాధిస్తాను... ‘‘వృత్తిని దేవుడుగా భావించి ఆరాధిస్తాను. మనపని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు తప్పకుండా వస్తుందని నమ్ముతాను’’ అని చెబుతూ.. ‘‘కలలు కనడం ఎప్పుడూ మానకండి, వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం, ఇప్పుడు మనవల్ల ఏం అవుతుంది అని అస్సలు అనుకోవద్దు. వయసు ఏదైనా సరే... ఏదోఒకటి సాధించాలన్న కలను కనాలి. ఈ ప్రపంచంలో దేనికీ ఇంతవరకే అన్న పరిమితి లేదు. మన అలవాట్ల ద్వారా కూడా ఏదైనా సాధించవచ్చు’’. అని మహిళలకు పిలుపునిస్తోంది. డాక్టర్‌గానూ.. మోడల్‌గానూ... ఒకపక్క డాక్టర్‌గా బిజీగా ఉంటూనే గత పదేళ్లుగా మోడలింగ్‌లో రాణిస్తోంది గీతాప్రకాష్. మోడల్‌గా మారినప్పటికీ గీత తన డాక్టర్ వృత్తిని నిర్లక్ష్యం చేయలేదు. వారాంతాల్లో మోడలింగ్‌కు సమయం కేటాయిస్తూ...మిగతా సమయంలో పేషంట్లను చూసేది. మోడలింగ్‌లో తనకంటూ ఒక గుర్తింపు రావడంతో మరింత బాగా చేయడానికి ప్రయత్నించేది. మోడలింగ్‌ను ప్రేమిస్తూనే..తన ఇంట్లో చారిటబుల్ క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అన్జు మోడీ, తరుణ్ తహిలియానీ, గౌరవ్ గుప్తా, టొరాణి, నికోబార్, జేపోర్, అష్దీన్ల వద్ద అందాల మోడల్‌గా రాణిస్తూ ఎంతో మంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది. -
Krishna District: మహిళా వైద్యురాలి అనుమానాస్పద మృతి
సాక్షి, వత్సవాయి: మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. మండల కేంద్రం వత్సవాయిలో సంవత్సరం కిందట ఒక ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు. అందులో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన భీమనాథం మౌనికారెడ్డి(28) వైద్యురాలిగా పనిచేస్తున్నారు. మృతిచెందిన వైద్యురాలు మౌనికారెడ్డి రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా విధులు నిర్వహించిన ఆమె అదే రోజు రాత్రి ఆమె ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ ఉండటాన్ని కిటికీలోంచి సిబ్బంది గమనించారు. వెంటనే రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. వీఆర్వో శివాజీ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహాలక్ష్ముడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నీ పర్సనాలిటీ చూసుకున్నావా.. నీ సైజ్‌కు సరిపోయే డ్రెస్ లేదు’
ముంబై: పెళ్లి గురించి ప్రతి అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. అందుకోసం ప్రత్యేకంగా దుస్తులు, నగలు డిజైన్ చేయించుకుంటారు. పెళ్లిలో ధరించే ప్రతి దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇక చాలా మంది పెళ్లిలో నాజుకుగా కనిపించడం కోసం వివాహానికి కొన్ని రోజుల ముందు నుంచే డైటింగ్ వంటివి పాటిస్తుంటారు. ఇదంతా సరే. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను కాదనే హక్కు ఎవరికి లేదు. అలానే ఒకరి శరీరాకృతి గురించి విమర్శించే హక్కు కూడా ఎవరికి లేదు. కానీ ఈ విషయాన్ని ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని మర్చిపోయినట్లున్నాడు. పెళ్లి లెహంగా కోసం వచ్చిన వైద్యురాలు, ఇన్‌స్టాగ్రమ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ని దారుణంగా అవమానించడట. ‘‘నీ ఆకారం చూసుకున్నావా.. నీ భారీ కాయానికి సెట్ అయ్యె డ్రెస్ మా దగ్గర లేదు’’ అన్నాడట. అతడి మాటలకు బాధపడిన సదరు డాక్టర్ ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్ల వద్దని నిర్ణయించుకుంది. మరో డిజైనర్ దగ్గరకు వెళ్లి డ్రెస్ కుట్టించుకుంది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించింది. దీనిపై స్పందించిన తరుణ్ తహిలియాని సదరు వైద్యురాలికి క్షమాపణలు తెలిపాడు. ఆ వివరాలు.. సదరు డాక్టర్ పేరు తనయా నరేంద్ర. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు. ‘‘పెళ్లికి ముందు చాలా మంది మీద బరువు తగ్గమని ఒత్తిడి పెంచుతారు. నా విషయంలో కూడా అలానే జరిగింది. నువ్వు కూడా డైటింగ్ చేయోచ్చు కదా అని నా ఫ్రెండ్స్ అడిగారు. బరువు తగ్గడానికి చిట్కాలు కూడా చెప్పారు. కానీ నేను అవే పాటించలేదు. నన్ను నన్నుగా ప్రేమించుకోవడం నాకు బాగా తెలుసు. అందుకే వారి సూచనలు పట్టించుకోలేదు’’ అన్నారు. ‘‘పెళ్లి దుస్తుల విషయంలో నాకు చిన్నప్పటి నుంచే ఓ కోరిక ఉండేది. నా 12వ ఏట నుంచే నేను నా పెళ్లికి తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన పెళ్లి లెహంగా ధరించాలని అనుకునేదాన్ని. ఆ ప్రకారమే పెళ్లికి నెల రోజుల ముందు అంబవట్టాలో ఉన్న తరుణ్ బ్రైడల్ స్టోర్‌కు వెళ్లాను. అక్కడ నాకు తీవ్ర అవమానం జరిగింది. నా శరీరాకృతి గురించి దారుణంగా మాట్లాడారు. నీ భారీ పర్సనాలిటీకి మా దగ్గర డ్రెస్ లేదు అనే సెన్స్‌లో కామెంట్ చేశారు. వారి మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్లకూడదని నిర్ణియంచుకున్నాను’’ అన్నారు. ‘‘పెద్ద శరీరం, వక్షోజాలు ఉంటే డిజైనర్లకు ఎందుకు అంత భయమో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అనితా డోంగ్రే స్టోర్‌కు వెళ్లి నాకు కావాల్సిన లెహంగా గురించి వారికి వర్ణించాను. ఇవారు కేవలం మూడు వారాల వ్యవధిలోనే నాకు నేను కోరిన అందమైన లెహంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఇందుకు తనను ఎంత పొగిడినా తక్కువే’’ అన్నారు. ‘‘నన్ను చూడండి. పెళ్లిలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో. నాకు డబుల్ చిన్ ఉంది.. నా పొట్ట బయటకు కనిపిస్తుంది. కానీ ఇవన్ని నా సంతోషాన్ని పాడు చేశాయా.. లేదు కదా. ఎందుకంటే నా కుటుంబం, నా సన్నిహితులు, నా భర్త, నన్ను ప్రేమిస్తున్నాడు... మరీ ముఖ్యంగా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా పెళ్లి ద్వారా నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఇదే. ఆనందంగా ఉండండి. ఎందుకంటే సంతోషంగా ఉన్నవారే ఉత్తమ పెళ్లికుమార్తెలు’’ అంటూ షేర్ చేసిన ఈ స్టోరి ఎందరినో ఆకట్టుకుంది. ఇది చదివిన నెటిజనులు తరుణ్ తహిలియాని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తరుణ్ తహిలియాని క్షమాపణలు తెలిపారు. తాను సదరు డాక్టర్ శరీరాకృతిని విమర్శించలేదని.. కరోనా కారణంగా ఆమెకు సెట్ అయ్యే డ్రెస్ తమ స్టోర్‌లో లేదని చెప్పాను అన్నారు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. ఇక మూడు వారాల్లో లెహంగా డిజైన్ చేయడం సాధ్యం కాదని.. ఒకవేళ చేసినా నాసిరకంగా ఉంటుందని తెలిపారు. -
దేశంలోనే తొలిసారి: ఒకేసారి 2 వేరియంట్ల బారిన పడ్డ వైద్యురాలు
డిస్పూర్: దేశంలో కరోనా వైరస్ ఇంకా కట్టడిలోకి రాలేదు. మహమ్మారి రూపు మార్చుకుంటూ.. మరింత శక్తిమంతంగా తయారవుతూ.. ప్రపంచ దేశాలను ఒణికిస్తోంది. తాజాగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ వ్యాప్తి కొనసాగతోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారి ఓ మహిళా వైద్యురాలు ఒకేసారి కోవిడ్ రెండు వేరియంట్ల బారిన పడ్డారు. సదరు వైద్యురాలు ఒకేసారి ఆల్ఫాతో పాటు ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ బారిన పడ్డట్లు తెలిసింది. అసోంలోని దిబ్రుగఢ్ జిల్లా, లాహోవాల్లోని ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఆర్ఎంఆర్సి) నోడల్ ఆఫీసర్ డాక్టర్ బిస్వాజ్యోతి బోర్కాకోటి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బిస్వాజ్యోతి మాట్లాడుతూ.. ‘‘తాజాగా కోవిడ్ బారిన పడ్డ ఓ మహిళా డాక్టర్లో మేం ఒకేసారి కరోనా రెండు వేరియంట్లను గుర్తించాము. ఇప్పటికే ఆమె రెండు డోసుల టీకా తీసుకున్నారు. అయినప్పటికి వైరస్ బారిన పడ్డారు’’ అని తెలిపారు. బిస్వాజ్యోతి మాట్లాడుతూ.. ‘‘మేం బాధిత వైద్యురాలి శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షించాం. ఈ క్రమంలో ఆమెకు ఒకేసారి కోవిడ్ వైరస్‌కు చెందిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకాయి.ఒకే వ్యక్తిపై వైరస్ రెండు వేరియంట్లు ఒకేసారి దాడి చేయడం దేశంలో ఇదే ప్రథమం. మొదట మేం ఈ విషయాన్ని నమ్మలేకపోయాం. మా అనుమాన నివృత్తి కోసం మరోసారి ఆమె శాంపిల్స్ పరీక్షించాం. అప్పుడు కూడా సేమ్ అదే ఫలితం వచ్చింది. ఇక ఆమె భర్తకు ఆల్ఫావేరియంట్ సోకింది’’ అని తెలిపారు. ప్రస్తుతం వైద్యురాలిలో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా లేవని.. అందువల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్లు. కొద్ది రోజుల క్రితం బెల్జియానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్ల బారిన పడిన సంగతి తెలిసిందే. కాకపోతే అప్పటికి సదరు వృద్ధురాలు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ క్రమంలో ఆమె మార్చి, 2021న మృతి చెందారు. -
నిరుపేదల డాక్టరమ్మ.. ఈ అపర్ణ
అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో డాక్టర్ అపర్ణకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది 25 ఏళ్ల గర్భిణి అరుణకు ప్రసవం చేయడానికి వెంటనే రావాలని. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు అపర్ణ. కానీ అప్పటికే గర్భంలో ఉన్న శిశువు మరణించింది. కనీసం తల్లినైనా కాపాడాలనుకున్నారామె. కానీ మూడు రోజుల తరవాత తల్లి కూడా మరణించింది. ఈ దుర్ఘటనను అపర్ణ మర్చిపోలేకపోయారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న ఉద్దేశ్యంతో ఆమె ‘ఆర్మాన్’ పేరిట 2008లో ఎన్జీవోను స్థాపించారు. నిరుపేద, అణగారిన వర్గాలకు చెందిన గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా... దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఆధారిత వైద్యాన్ని ఆర్మాన్ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్ సమయంలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ఎన్జీవోలతో కలిసి ఆర్మాన్ అనేక సేవలందించింది. ఆర్మాన్ కృషిని గుర్తించిన ఫార్చ్యూన్ సంస్థ.. తాజాగా ఈ ఏడాది ప్రకటించిన ‘వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్’ జాబితాలో డాక్టర్ అపర్ణ హెగ్డే పేరును చేర్చింది. ప్రతిష్టాత్మక ఫార్చ్యున్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కగా.. వారిలో ఒకరైన డాక్టర్ అపర్ణ హెగ్డే 15వ స్థానంలో నిలిచారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, క్లీవ్స్లాండ్ క్లినిక్‌లో చదువుకున్న డాక్టర్ అపర్ణ హెగ్డేకు అంతర్జాతీయ యూరో గైనకాలజిస్టుగా మంచి పేరుంది. ఆర్మాన్ ఎన్జీవో వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ మరోపక్క ముంబైలోని కామా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. దాదాపు రెండున్నర కోట్లమందికి.. ఆర్మాన్.. లెవరేజ్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో తల్లి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించే పరిష్కారాలను చూపుతుంది. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో పనిచేస్తూ.. మొబైల్ ఆధారిత ‘మెటర్నల్ మెస్సేజింగ్ ప్రోగ్రామ్(కిల్కరీ), ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు ట్రైనింగ్ ఇచ్చేందుకు మొబైల్ అకాడమీని నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో దాదాపు 2.40 కోట్ల మంది మహిళలు పిల్లలు, 17 వేల మంది ఫ్రంట్‌లైన్ హెల్త్ కార్యకర్తలకు అర్మాన్ సేవలందించింది. ఆర్మాన్ సేవలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్రిటీష్ మెడికల్ జర్నల్, జీఎస్కే సేవ్ ది చిల్డ్రన్ వంటి సంస్థలు అవార్డులతో సత్కరించాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 700 సంస్థలు ప్రతిష్టాత్మక ‘స్కోల్’ అవార్డుకు పోటీపడగా.. ఆసియా నుంచి ఆర్మాన్ ఈ అవార్డును దక్కించుకుంది. లాక్‌డౌన్‌లోనూ.. ‘ద ప్యాన్ ఇండియా ఫ్రీ వర్చువల్ ఓపీడి క్లినిక్‌ల ద్వారా 14వేలకు పైగా గర్భిణులు, పిల్లలకు ఉచితంగా వైద్యసాయం చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండే ఫ్రీ కాల్ సెంటర్ ద్వారా 60 వేలమందికి పైగా గర్భిణులు, పిల్లలకు సేవల్ని అందించారు. ముంబైలోని మురికివాడల్లో నివసించే మూడు లక్షలమంది మహిళలకు వారం వారం ‘ఆటోమేటెడ్ వాయిస్ కాల్స్’ ద్వారా కోవిడ్–19కు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఫోన్‌కాల్స్, ఎస్ఎమ్ఎస్ సదుపాయాలతో లక్షలాది మంది గర్భిణులకు చేరువైంది. ఆర్మాన్ తరపున వర్చువల్ వైద్య సేవలు, వీడియోకాల్స్ ద్వారా అపర్ణతోపాటు మరికొందరు డాక్టర్లు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారు. -
ఈ వైద్యురాలు తన శ్వాసతో పసి ప్రాణాన్ని కాపాడింది
సాక్షి, చెన్నై: కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ రోగి జన్మనిచ్చిన బిడ్డను రక్షించడంలో మహిళా వైద్యురాలు మానవత్వం చాటారు. ఊపిరాడక ఆ బిడ్డపడుతున్న వేదనను చూసి, తక్షణం నోటిలో నోరు పెట్టి తన శ్వాసను అందించి ప్రాణం పోశారు. మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ మానత్వం గురించి వివరాల్లోకి వెళితే...కరోనా కాలంలో గర్భిణిలకు వైద్య పరీక్షలు, ప్రసవాల నిమిత్తం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే, కరోనాబారిన పడ్డ గర్భిణుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వీరికి చికిత్స అందించడంలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం చెన్నై పెరంబూరు రైల్వే ఆస్పత్రికి ప్రసవం నిమిత్తం ఓ గర్భిణిని చేర్చారు. పరిశోధనలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో వచ్చిన ఫోన్‌కాల్‌తో డాక్టర్ ప్రియాంక ఆస్పత్రికి పరుగులు తీశారు. ఊపిరి ఆడక సతమతం.... పెరంబూరు రైల్వే ఆస్పత్రిలో ఆ గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో, అందుకు చికిత్సలు సాగాయి. కొన్ని గంటల అనంతరం పండంటి మగబిడ్డకు ఆమె జన్మనించింది. అయితే, ఆమె కరోనా రోగి కావడంతో తల్లి బిడ్డను విడదీయాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ఆ బిడ్డకు శ్వాస సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన డాక్టర్ ప్రియాంక తక్షణం స్పందించారు. ఆ బిడ్డను రక్షించేందుకు ఆ బిడ్డ నోటిలో నోరు పెట్టి శ్వాస అందించారు. శ్వాస సమస్య సరి చేయడమే కాకుండా, ఆ బిడ్డను రెండు వారాల పాటు అతి జాగ్రత్తగా పరీక్షిస్తూ, వైద్య సేవల్ని డాక్టరు అందించడం విశేషం. తానూ ఓ తల్లే. డాక్టర్ ప్రియాంక మానవత్వాన్ని చాటుతూ వ్యవహరించిన తీరు వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆమెను అభినందిస్తున్నారు. ఆమె తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. అయితే, కరోనా రోగులు పడే వేదనను గత ఏడాది ప్రియాంక ప్రత్యక్షంగా చవి చూశారు. ఆమె కరోనా నుంచి కోలుకున్న డాక్టర్. అయితే, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ఆమెకు సూచించినా, వైద్య వృత్తిని సేవాతత్వంగా భావిస్తూ విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆ బిడ్డను రక్షించాలన్న కాంక్షతో తన శ్వాసను అందించడమే కాదు, ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే వరకు దగ్గరుండి ప్రియాంక అందించిన సేవల్ని ఆస్పత్రి వర్గాలు కొనియాడాయి. ( చదవండి: ‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం ) -
కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరీ ప్రేమ వేధింపులు
సాక్షి, జూబ్లీహిల్స్: ప్రేమించాలంటూ వివాహిత వైద్యురాలిని వేదిస్తున్న ఓ వ్యక్తి.. ఆమె ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఇదెలా సాధ్యమయ్యిందో వైద్యురాలికి అంతు పట్టలేదు. చివరకు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి వైద్యురాలు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తుందో తెలుసుకునేదుకు ఏకంగా ఆమె కారుకు జీసీఎస్ ట్రాకర్‌ను అమర్చినట్లు వెల్లడించాడు. ఆ వివరాలు.. బాధితురాలు జూబ్లీహిల్స్‌లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ వైద్యురాలిని వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా విశ్వనాథ్ తన తీరు మార్చుకోలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో వైద్యురాలు దీని గురించి తన భర్తకు తెలిపింది. ఈ క్రమంలో వైద్యురాలి భర్త విశ్వనాథ్‌ని హెచ్చరించడం కోసం అతడి ఇంటికి వెళ్లాడు. విశ్వనాథ్ ఇంట్లో అతడితో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు. తమను హెచ్చరించడానికి వచ్చిన వైద్యురాలి భర్తపై విశ్వనాథ్, అతడి స్నేహితుడు శ్రీకాంత్ గౌడ్ ఉల్టా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో వైద్యురాలు, ఆమె భర్త విశ్వనాథ్ మీద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో సంచలన విషయాలు తెలిసాయి. వైద్యురాలిని వెంటాడేందుకు విశ్వనాథ్ ఆమె కారుకు జీపీఎస్ ట్రాకర్‌ని అమర్చినట్లు వెల్లడించాడు. చదవండి: ‘నేను పోలీసుని.. మీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను’ -
సలామ్ డాక్టర్
వెనుకబడిన ప్రాంతాలు లండన్‌లో కూడా ఉంటాయి. తూర్పు లండన్‌లోని న్యూహామ్ అలాంటి ఒక ప్రాంతం. అక్కడి ఎన్.హెచ్.ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) శాఖ హాస్పిటల్లో పని చేసే డాక్టర్ ఫర్జానా హుసేన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి కారణం బ్రిటన్‌లోని మూలమూలలా ఆమె నిలువెత్తు హోర్డింగ్‌లు ప్రదర్శితం కావడమే. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఈ బంగ్లాదేశి అక్కడే 1995లో మెడిసిన్ పూర్తి చేసి జనరల్ ప్రాక్టీషనర్‌గా పని చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభించిన గత నాలుగు నెలలుగా తన క్లినిక్‌లో అలుపు లేకుండా పని చేస్తోంది. ఎన్.హెచ్.ఎస్ తన 72వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా తన బ్రాంచ్ హాస్పిటల్స్‌లో కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లను గౌరవించదలచుకుంది. మొత్తం 12 మంది డాక్టర్లను ఎంపిక చేసి వారికి కృతజ్ఞతలు చెప్తూ హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. ఆ 12 మందిలో డాక్టర్ ఫర్జానా కూడా ఒకరుగా నిలిచి ప్రశంసలు పొందుతోంది. ‘నేను మెడిసిన్ చేస్తుండగా మా అమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చింది. నేను కాలేజ్ నుంచి 250 మైళ్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉన్నాను. కాని మా అమ్మ– ‘వెళ్లు... చదువుకో... నువ్వు డాక్టర్ అయ్యి నలుగురికీ సాయం చెయ్యి’ అని చెప్పింది. ఆ తర్వాత ఐదు రోజులకు ఆమె చనిపోయింది. నా దగ్గరకు ఏ పేషెంట్ వచ్చినా వారు ఎవరికో ఒకరికి కుటుంబ సభ్యులు అయి ఉంటారని, వారి ప్రాణాలు ముఖ్యమని భావిస్తాను. వారికి శ్రద్ధగా వైద్యం చేస్తాను’ అని చెప్పిందామె. ‘నేను ఏ వసతులు లేని ప్రాంతంలో పని చేస్తున్నాను. పిల్లలకు టీకాలు వేయడం కూడా ఇక్కడ పెద్ద విషయం. కాని ప్రజలు నన్ను ఇష్టపడతారు. ఇరువురం కలిసి జబ్బులపై పోరాటం చేస్తున్నాం’ అంటుందామె. గృహిణిగా ఇల్లు, పిల్లలను చూసుకుంటూనే ఆమె తన విధులను నాగా లేకుండా నిర్వర్తిస్తోంది. లండన్ కూడలిలో ఏర్పాటైన తన భారీ హోర్డింగ్ ముందు ఫర్జానా నిలబడి చూసుకునే ఫోటో చాలామందికి నచ్చింది. మంచి పనులు చేసే వారికి గుర్తింపు వచ్చే తీరుతుందని ఈ ఉదంతం తెలియచేస్తోంది. -
కరోనా నుంచి కోలుకున్న డాక్టర్‌కు బెదిరింపులు
న్యూఢిల్లీ: కనిపించని శత్రువు కరోనాతో పోలీసులు, వైద్యులు యుద్ధం చేస్తున్నారంటూ ప్రధాని సైతం వారి సేవలను ప్రశంసిస్తుంటే.. కొందరు ముర్ఖులు మాత్రం వారిని అవమానిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వైద్యురాలు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలందించారు. దాంతో ఆమెకు కూడా వ్యాధి సోకింది. వెంటనే గుర్తించి, చికిత్స తీసుకోవడంతో కరోనా నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి.. హోమ్ క్వారంటైన్ కోసం ఇంటికి వచ్చారు. (వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ) అయితే విషయం తెలిసిన ఇరుగుపొరుగు వారు డాక్టర్‌ను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్లాట్ ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. ఈ క్రమమంలో బాధిత వైద్యురాలు మాట్లాడుతూ.. ‘నిన్న సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో మనిష్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి అసభ్యకరమైన మాటలతో నన్ను అవమానించాడు. ప్లాట్ ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించాడు. అంతేకాక ‘నువ్వు బయటకు ఎలా వెళ్తావో నేను చూస్తాను. నువ్వు ఈ స్థలాన్ని వదిలి వెళ్లాల్సిందే. ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో’ అంటూ బెదిరించాడు. నాకు కరోనా లేదు.. నెగిటీవ్ వచ్చిందని చెప్పినా అతడు పట్టించుకోలేదు’ అని వాపోయారు. వైద్యురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేశారు.(వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం) వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 22న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
గాంధీ వైద్యురాలిపై దాడి
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్న హౌస్‌సర్జన్‌పై మృతుని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లికి చెందిన జావీద్ అనే వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం అతడిని గాంధీ అత్యవసర విభాగంలో అడ్మిట్ చేశారు. 85 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న జావీద్ సాయంత్రం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ మృతుని కుటుంబసభ్యులు, బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న లేడీ హౌస్‌సర్జన్‌పై దాడిచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలి వైద్యురాలిపై దాడి చేసిన నిందితులపై కేసుల నమోదు చేసి కఠినంగా శిక్షించాలని టీజీజీడీఏ గాంధీయూనిట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వసంత్‌కుమార్, జూడాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అర్జున్, లోహిత్ డిమాండ్ చేశారు. -
చనిపోయిన విద్యార్థిని ఫోన్లో సూసైడ్ నోట్ ఫోటోలు
సాక్షి, ముంబై: సీనియర్ల ర్యాగింగ్‌తో మనస్తాపానికి గురై మే 22న ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని పాయల్ తద్వి రాసిన సూసైడ్ నోట్ ఫోటోలు ఆమె ఫోన్లో లభ్యమయ్యాయి. వివరాలు.. సెంట్రల్ ముంబైలోని బివైఎల్ ఆస్పత్రికి అనుబంధగా ఉన్న వైద్య కళాశాలలో ఎస్టి సామాజిక వర్గానికి చెందిన పాయల్ తద్వి(26) పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న సీనియర్లు హేమ అహుజా, అంకిత ఖండేల్వాల్, భక్తి మెహర్లు పాయల్‌ను కులం పేరుతో దూషిస్తూ ర్యాగింగ్ చేశారు. దీంతో పాయల్ సూసైడ్ నోట్లో వారి పేర్లు రాసి, ఆనోట్ను తన ఫోన్‌తో ఫోటోలను తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై అప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. అయితే సూసైడ్ నోట్ మాత్రం దొరకలేదు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారెవరో దాన్ని నాశనం చేసుంటారని ఈ కేసు వాదిస్తున్న లాయర్ తెలిపారు. తాజాగా ఆమె ఫోన్లో ఫోటోలు బయటికి రావడంతో పోలీసులు నిర్ధారణ కోసంవాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పరీక్షలో ఆ నోట్ పాయల్ రాసిందేనని తేలడంతో ముగ్గురు నిందితులను పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఈ కేసు వాదిస్తున్న లాయర్ కోరారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ మే 31 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అంతకు ముందు రెండు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ప్రత్యేక కోర్టు ద్వారా విచారిస్తున్న ఈ కేసులో, నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను జూన్ 24న కోర్టు కొట్టివేసింది. దాంతో వారు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో వాళ్లు బెయిల్ కావాలని కోరడంతో పాటు ఈ కేసులో మమ్మల్ని కావాలనే ఇరికించారని పేర్కొన్నారు. కాగా, తదుపరి విచారణను కోర్టు జులై 16కు వాయిదా వేసింది. -
ఏం జరిగిందో?: మహిళా వైద్యురాలు ఆత్మహత్య ...
బరంపురం: జిల్లా కేంద్రంలోని చత్రపూర్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా వైద్యురాలు శుక్రవారం మృతి చెందింది. రైల్వే పోలీసుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీఆర్పీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతిపై పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నప్పటికీ, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. చత్రపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని తురాయి పట్టపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రఘునాథ్‌దాస్ కుమార్తె అర్చనాదాస్‌గా మృతురాలిని పోలీసులు గుర్తించారు. నాలుగేళ్ల క్రితం భువనేశ్వర్‌లోని గడిఖానా ప్రాంతానికి చెందిన వైద్యుడు అర్జున్‌దాస్‌తో ఆమెకు వివాహం జరిగింది. అర్చనాదాస్ భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. కొన్నాళ్ల నుంచి భర్త అర్జున్‌దాస్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా గంజాం జిల్లాలోని తురాయి పట్టపూర్ గ్రామంలో తండ్రి ఇంటి వద్ద ఉంటోంది. అర్చనాదాస్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం : బిడ్డ తల తెంచేసింది
కరాచీ: ఓ మహిళా డాక్టర్ నిర్లక్ష్యానికి ఓ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. అమ్మ పొత్తిళ్లకు చేరకముందే సుదూర తీరాలకు తరలిపోయింది. నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పిన డాక్టర్, ప్రసవం సమయంలో బిడ్డ తలను, మొండాన్ని వేరు చేయడం కలకలం రేపింది. శిశువును బయటకు తీసే క్రమంలో తలను మాత్రం తీసి, మొండెను తల్లి గర్భంలోనే వదిలేసింది. ఊహించుకుంటేనే...గుండెలవిసిపోయే ఈ ఘటన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ , క్వెట్టాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో జరిగింది. ట్రిబ్యూన్ పత్రిక అందించిన సమాచారం అబ్దుల్ నాసిర్ తన భార్యను డెలివరీ కోసం ఒక ప్రయివేటు ఆసుపత్రి తీసుకొచ్చాడు. ఎలాంటి సమస్యా లేకుండా, సాధారణ ప్రసవం చేస్తానని డాక్టర్ అలియా నాజ్ నమ్మబలికింది. అందుకు10వేల రూపాయలు డిమాండ్ చేసింది. సరేనన్నాడు కానీ అంతా సవ్యంగా జరుగుతుందని ఆశించిన అబ్దుల్ జీవితంలో మర్చిపోలేని ఘోరమైన ఘటన జరిగింది. డాక్టర్ తన బిడ్డ తల, మొండాన్ని వేరు చేయడమేకాకుండా సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా చెప్పారని అబ్దుల్ ఆరోపించారు. తన భార్య పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స ద్వారా మిగిలిన భాగాలను తొలగించినట్టుచెప్పారు. అలాగే మెడికల్ రిపోర్టు ఇచ్చేందుకు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారని వాపోయారు. ఇది ఇలా ఉంటే ఆరోపణలుఎదుర్కొంటున్న డా.అలియా జిల్లా ఉప ఆరోగ్య అధికారిగా పనిచేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్య తీసుకుంటామని ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారు. -
లేడీ డాక్టర్ హత్యకు కుట్ర
-
లేడీ డాక్టర్ హత్యకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: పాత కక్షల కారణంగా సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో ఓ లేడీ డాక్టర్‌ను హతమార్చేందుకు ఆమె వ్యాపార భాగస్వామి చేసిన కుట్ర బట్టబయలైంది. సుపారీ తీసుకున్న వ్యకి ఈ కుట్రను బయట పెట్టడంతో డాక్టర్‌కు ప్రాణాపాయం తప్పింది. శనివారం హయత్‌నగర్ డీసీపి వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం... తట్టిఅన్నారం ఇందూ అరణ్య కాలనీలో నివసించే డాక్టర్ బొమ్మినేని దుర్గారాణి గైనకాలజిస్ట్. అదే కాలనీలో నివసించే బుర్ర రమేష్‌గౌడ్ తాను డాక్టర్నే అని చెప్పుకుని పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి కర్మన్‌ఘాట్‌లో జీవన్ ఆసుపత్రి, వరంగల్ జిల్లా పెద్దపల్లిలో శ్రీ సాయి ఆసుపత్రిని ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో రమేష్‌గౌడ్ సెటిల్మెంట్ చేసుకుని వ్యాపార భాగస్వామిగా విడిపోయాడు. తర్వాత పలు మార్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడనే కారణంగా రమేష్‌గౌడ్‌పై పలు పోలీస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన డాక్టర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. కిరాయి హంతకులను ఏర్పాటు చేయాలని హన్మకొండకు చెందిన జంపాల రమేష్‌ను కోరాడు. ఆయన హన్మకొండ ప్రకాష్రెడ్డిపేట్కు చెందిన మహ్మద్ రఫీతో మాట్లాడాడు. డాక్టర్‌ను హత్య చేసేందుకు రఫీ 10 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. నాలుగు దఫాలుగా 5 లక్షలను అడ్వాన్సుగా ముట్ట జెప్పగా 2 నెలల్లో పనిపూర్తి చేయాలని మిగితాది పనిపూర్తయిన తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డాక్టర్‌ను చంపేందుకు రఫీ మూడు సార్లు రెక్కీ నిర్వహించాడు. కాని చంపలేక పోయాడు. దీంతో రమేష్‌గౌడ్ ఆయనపై ఒత్తిడి పెంచాడు. ఒత్తిడిని భరించలేక రఫీ విషయాన్ని డాక్టర్ దుర్గారాణి, ఆమె భర్త రమేష్ బాబుకు తెలిపాడు. వీరి వద్దనుంచి డబ్బులు లాగాలని ప్రయత్నించిన రఫీ పలు మార్లు ఫోన్లు చేసి బెదిరించ సాగాడు. దీంతో ఈనెల 13న దుర్గారాణి హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. రమేష్‌గౌడ్, రఫీల ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు కుట్ర విషయం తెలుసుకుని రఫీ, జంపాల రమేష్‌లను అరెస్ట్ చేశారు. వారివద్దనుంచి ఒక ఎల్ఈడి టీవి, 2 సెల్ఫోన్లు, రూ. 45వేల నగదును స్వాదీనం చేసుకున్నారు. కాగా ప్రధాన నిందితుడు రమేష్‌గౌడ్, మరోనిందితుడు తిరుపతిలు పరారీలో ఉన్నారు. పాత కక్షల కారణంగా లేడీ డాక్టర్ హత్యకు కుట్ర -
సూర్యకుమారి మృతి కేసులో కొత్త మలుపు