
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వత్సవాయి: మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. మండల కేంద్రం వత్సవాయిలో సంవత్సరం కిందట ఒక ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు. అందులో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన భీమనాథం మౌనికారెడ్డి(28) వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
మృతిచెందిన వైద్యురాలు మౌనికారెడ్డి
రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా విధులు నిర్వహించిన ఆమె అదే రోజు రాత్రి ఆమె ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ ఉండటాన్ని కిటికీలోంచి సిబ్బంది గమనించారు. వెంటనే రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. వీఆర్వో శివాజీ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహాలక్ష్ముడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment