రాజస్థాన్‌లో డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్యపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్‌గా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపు పోస్ట్ చేసింది. 'తాను అమాయకురాలని (నిర్దోషి) నిరూపించుకోవడానికి ఓ వైద్యురాలి తన జీవితాన్నే ముగించాల్సి రావడం చాలా బాధాకరం.' అని ట్వీట్ చేసింది. 'ప్రతీసారి వైద్యులు దాడికి గురవుతున్నారు. ఇతర 100 మంది వైద్యులు రిస్క్ తీసుకోవడం ఆపేశారు. కానీ సాధారణంగా ఒకరి ప్రాణాలను కాపాడేందుకు రిస్క్ తీసుకోవాలి.' అని పేర్కొంది.
చదవండి: ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత
డాక్టర్ అర్చనా శర‍్మ.. రాజస్థాన్ దౌసా జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఓ గర్భణికి వైద్యం చేస్తుండగా.. దురదృష్టవశాత్తు ఆమె హేమరేజ్ కారణంగా మరణించింది. ఆ తర్వాత ఆమె తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి హాస్పిటల్ బయట ఆందోళన చేశారు. ఈ క్రమంలో గర్భిణీ కుటుంబ సభ్యులు వైద్యురాలిపై, ఆమె భర్తపై పోలీసు స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. ఆందోళనలతో పాటు ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో అర్చన తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్తతో కలిసి ఆసుపత్రిని నడిపిస్తున్న ఆమె.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
చదవండి: జీవితమంతా అంధకారమే: ప్రణీత షాకింగ్ కామెంట్స్
సూసైడ్ నోట్‌లో అర్చనా.. తన భర్త, పిల్లలు అంటే ఆమెకు ఎంతో ఇష్టమని పేర్కొంది. తన మరణం తర్వాత భర్తను, ఇద్దరు పిల్లలను వేధించొద్దని కోరింది. 'అమాయకపు డాక్టర్లను వేధించకండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరి చావుకు కారణం కాదు. నా చావుతోనైనా నేను అమాయకురాలిని అని తెలుసుకోండి' అంటూ తన ఆవేదన తెలియజేసింది.
Sad that a doctor had to end her life to prove her innocence.. #JusticeForDrArchanaSharma #DrArchanaSharma pic.twitter.com/cTSRQNTsPC
— Pranitha Subhash (@pranitasubhash) March 30, 2022
చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం
Comments
Please login to add a commentAdd a comment