Pranitha Subhash
-
బెనారసీ చీరలో ముద్దబంతిలా ముద్దొస్తున్న ముద్దుగుమ్మ
-
ట్రెడిషినల్ లుక్‌లో హీరోయిన్ ప్రణీత (ఫోటోలు)
-
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత
హీరోయిన్ ప్రణీత రెండోసారి తల్లయ్యారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆమెకు ఆర్నా అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ప్రణీత 2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కాస్త ఆమె బ్రేక్ ఇచ్చారు.ప్రణీత కూతురు ఆర్నా తన తమ్ముడిని చూసి 'బేబి' అని పిలుస్తూ తెగ సంబరపడితోంది. మొదటిసారి డెలివరీ సమయంలో ఉన్న కంగారు ప్రస్తుతం తనకు లేదని ప్రణీత తెలిపింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రణితకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రణీత అమ్మగారు గైనకాలజిస్టు అని తెలిసిందే. మొదటి కాన్పు ఆమె ఆసుపత్రిలోనే జరిగింది. ఇప్పుడు కూడా అక్కడే తను రెండో బిడ్డకు జన్మనిచ్చారు. గైనకాలజిస్టుగా ఎంతో అపార అనుభవం ఉన్నా డాక్టర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. నటి ప్రణీత కన్నడ, హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. 2010లో పోక్రీ కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. -
బేబీ బంప్‌తో ప్రణీత.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలతో రహస్య!
ప్రీ వెడ్డింగ్ ఫొటోల్ని ఇప్పుడు బయటపెట్టిన రహస్య గోరఖ్రాధాకృష్ణ వేషధారణంలో బిగ్ బాస్ ప్రియాంక జైన్సెల్ఫీ వీడియోతో మత్తెక్కించేలా సిమ్రాన్ చౌదరిబీచ్ ఒడ్డున ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానాబేబీ బంప్‌తో హీరోయిన్ ప్రణీత సుభాష్ ఫొటోషూట్పుస్తకం చదువుతూ మరింత అందంగా జ్యోతి రాయ్ View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) -
ప్రణీత సుభాష్ బేబీ షవర్ ఫోటోలు వైరల్ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్‌కి త్వరలో మరో బుజ్జాయి
ప్రముఖ హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ వేడుకలు చేసుకుంది. బెంగళూరులోని బస్టైన్ గార్డెన్ సిటీలో ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే ఈమెకు పాప ఉండగా.. త్వరలో మరో బిడ్డ పుట్టనుంది.(ఇదీ చదవండి: కూతురికి రామ్‌చరణ్ బహుమతి.. ఆ గిఫ్ట్‌కు మగధీరతో లింక్!)కర్ణాటకకు చెందిన ప్రణీత సుభాష్.. 2010లో నటిగా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం తదితర సినిమాల్లో నటించింది. మలయాళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. 2021లో నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాదికే అర్న అనే అమ్మాయి పుట్టింది. కొన్నాళ్ల క్రితం తాను మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించింది.ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోల్ని పోస్ట్ చేస్తున్న ప్రణీత.. తాజాగా తనకు బేబీ షవర్ వేడుకలు చేసినట్లు పేర్కొంది. అలానే ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చింది. ఈ సెలబ్రేషన్స్ బట్టి చూస్తే మరికొన్నిరోజుల్లో ప్రణీత మరో బిడ్డకి జన్మనివ్వనుంది. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్.. అదేంటంటే!) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
మళ్లీ తల్లి కాబోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!
-
Pranitha: రెండోసారి గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్
హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండోసారి తల్లికాబోతుంది. రౌండ్ 2 అంటూ పరోక్షంగా ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తెలుగులో సుమారు 10 సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది చిత్రంతో ఎక్కువగా పాపులర్ అయింది. టాలీవుడ్లో పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో తాను చివరిగా నటించిన చిత్రం ఎన్టీఆర్: కథానాయకుడు, అయితే, ఈ ఏడాదిలో కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది.2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం అయింది. అయితే, 2022 జూన్ మాసంలో వారికి ఆడబిడ్డ జన్మించింది. పాప పుట్టిన తర్వాత మళ్లీ పలు సినిమాల్లో కనిపించిన ప్రణీత తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది. అపై ఇలా తెలిపింది.. 'రౌండ్ 2... ఇక నుంచి ప్యాంట్లు సరిపోవు' అంటూ చమత్కారంగా తన సంతోషాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉంటుంది.ప్రణీత చేస్తున్న ఈ సాయం గురించి తెలుసా..?ప్రణీత సుభాష్ ఒక హాస్పిటాలిటీ కంపెనీలో భాగస్వామిగా ఉంది. బెంగుళూరులోని లావెల్లే రోడ్లో బూట్‌లెగర్ అనే రెస్టారెంట్‌ను కూడా ఆమె నడుపుతుంది. సినిమా, వ్యాపారంలో రాణిస్తున్న ప్రణీతలో మరో కోణం ఉంది. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సేవానిరతిని కూడా ఆమె చాటుకుంటోంది. అందుకోసం ప్రణిత ఫౌండేషన్‌ను స్థాపించింది. బెంగళూరులో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటికి మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య సౌకర్యాలను అందించడం ద్వారా ఆమె కర్ణాటకలో ప్రభుత్వ విద్యను ఆధునీకరించే దిశగా కృషి చేస్తోంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉండే ఒక వృద్ధాప్య ఆశ్రమం కోసం ఆమె నిధులు అందించింది. కరోనా నేపథ్యంలో ‘ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్’ చేపట్టింది. సమాజం కోసం తన వంతుగా సేవ చేస్తున్న ప్రణీత ఇప్పుడు మరో బిడ్డికు జన్మ ఇవ్వబోతుందని తెలియగానే ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
అప్పుడే రెండేళ్లు.. ‘బాపూ బొమ్మ’ కూతురు ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
స్విమ్ సూట్లో అప్పటి గ్లామర్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
అత్తారింటికి దారేది చిత్రంతో కుర్రకారు గుండెలను పిండేసిన ముద్దుగుమ్మ ప్రణీత. ఈ బ్యూటీ తెలుగులో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే... హీరోయిన్ ప్రణీత సుభాష్ టర్కీలో టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఒకరి తల్లి కూడా తన అందంతో కొత్త నటీమణులకు ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పుడు టర్కీలో ఓ బీచ్‌లో నిలబడి ఉన్న ఫోటోను ఆమె రిలీజ్ చేసింది . అయితే ఆ ఫోటోలో ఆమె బ్లూ కలర్ స్విమ్ సూట్ ధరించి ఉంది. నటి ప్రణీత సుభాష్ ఇటీవల ఏ సినిమాలోనూ కనిపించలేదు. అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. నటి ప్రణీత సుభాష్ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. 'చాలా హాట్‌గా ఉంది కానీ పూర్తి ఫోటో లేదని ఒకరు కామెంట్ చేస్తే.. 'వావ్, మీరు ఎల్లప్పుడూ చాలా అందంగా కనిపిస్తారంటూ హబీబీ కమ్ టు ఇండియా అని తెలిపారు. మరోకరైతే దయచేసి టర్కీకి వెళ్లవద్దు.. ఇది శత్రు దేశమని తెలిపారు. కొన్నేళ్లుగా నటనకు విరామం ఇచ్చిన ప్రణిత కొద్దిరోజుల క్రితం రామావతార్ చిత్రాన్ని ప్రకటించింది. రిషి, ప్రణీత ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
హీట్ పెంచేస్తున్న అనన్య.. కాజల్ సోయగాలు
చాలారోజులకు గ్లామర్ చూపించిన కాజల్ ఒంపుసొంపులు చూపిస్తూ పూజాహెగ్డే రచ్చ ఎప్పుడూ లేనంత హాట్‌గా తయారైన ఈషా రెట్రో లుక్‌లో హీరోయిన్ హెబ్బా పటేల్ చీరకట్టులో అందంగా కనిపిస్తున్న జాన్వీ కపూర్ కుర్చీపై కూర్చుని కాక రేపే పోజుల్లో ప్రణీత రెడ్ డ్రస్ లో మిర్చి కంటే హాట్ గా అనన్య అనసూయ క్యూట్ పోజులు.. నవ్వుతూ మాయ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ప్రగ్యా జైశ్వాల్ స్మైలీ లుక్స్.. గ్రీన్ డ్రెస్‌లో ప్రణీత హోయలు!
►స్టైలిష్ డ్రెస్‌లో పోజులు కొడుతున్న ప్రణీత! ►కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ స్మైలీ లుక్స్! ►హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా! ►బర్త్ డే పార్టీలో చిల్ అవుతోన్న ఆషిక రంగనాథ్! ►టర్కీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హన్సిక! View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
విశాఖపట్నం : సినీ నటి ప్రణీత సందడి... ఎగబడ్డ అభిమానులు(ఫోటోలు)
-
బాప్రే అనిపిస్తున్న బాపుబొమ్మ ప్రణీత అందాలు
-
రీఎంట్రీ ఇస్తున్న బాపుబొమ్మ, అందుకే ఈ గ్లామర్ ఫోటోలు..
పెళ్లయితే నటనకు దూరం కావాలా అనేది నేటి తరం కథానాయికల ప్రశ్న. హీరోలు తాతలు అయిన తరువాత కూడా నటిస్తుంటే తమకేంటి తక్కువ అనే అభిప్రాయాన్ని హీరోయిన్లు వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా తగ్గేదేలే అన్నట్టుగా పెళ్లయిన వెంటనే నటించడానికి సిద్ధమవుతున్నారు. నయనతార, హన్సిక, శ్రియ వంటి వారు ఈ కోవకు చెందిన వారే. ఇక కాజల్ అగర్వాల్ వంటి వారు పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లి అయిన రెండు మూడు నెలల్లోనే నటించడానికిసై అంటున్నారు. నటి ప్రణీత కూడా తానేమి తక్కువ తిన్నానా అన్నట్టుగా మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఈ కన్నడ బ్యూటీ 2010లో హీరోయిన్గా కన్నడ చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత తెలుగులోకి బావ చిత్రంతో దిగుమతి అయ్యారు. ఆపై తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. తమిళంలో నటుడు సూర్య, కార్తీ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన ప్రణీతకు ఇక్కడ పెద్దగా స్టార్ ఇమేజ్ రాలేదనే చెప్పాలి. ఆ తరువాత ఆశించిన అవకాశాలు రాకపోవడంతో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను 2021 మే 30న పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రణీత సినిమాలకు దూరమైనట్టే అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. అలా సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2022లో ఒక పాపకు జన్మనిచ్చారు. ఇటీవలే మలయాళ సినిమాలో నటించేందుకు సైన్ చేసింది ప్రణీత. చాలాకాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండటంతో తగిన కసరత్తులను చేసి స్లిమ్‌గా తయారవుతున్నారు. ఈ క్రమంలో గ్లామరస్తో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) చదవండి: ఇళయారాజా కుటుంబంలో తీవ్ర విషాదం -
నా కూతురికి దూరంగా ఉండాల్సి వస్తోంది : హీరోయిన్
‘అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్’ వంటి పలు చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ బ్యూటీ ప్రణీత. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన ప్రణీత మలయాళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. మలయాళ స్టార్ హీరో దిలీప్, దర్శకుడు రతీష్ రఘునందన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే: నయన్ సెన్సేషనల్ కామెంట్స్ దిలీప్ కెరీర్లో 148వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రణీత హీరోయిన్గా నటిస్తున్నారు. ‘‘మాలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మలయాళంలో డైలాగ్స్ చెప్పడం కాస్త కష్టంతో కూడినపనే.. ప్రస్తుతం నా ముందున్న చాలెంజ్ అదే. ఈ మూవీలో కాస్త అహం ఉన్న యువతి పాత్రలో కనిపిస్తాను. చదవండి: కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం నేను అమ్మగా మారిన తర్వాత ఒప్పుకున్న తొలి సినిమా ఇది. ఈ మూవీ కోసం నా కుమార్తె ఆర్నాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని నేను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను.. ఇందుకోసం కష్టపడతాను’’ అని పేర్కొన్నారు ప్రణీత. కాగా 2021 మే 30న నితిన్ రాజును వివాహం చేసుకున్న ప్రణీత గత ఏడాది ఆర్నాకు జన్మనిచ్చారు. -
బాపు బొమ్మ ప్రణీత సుభాష్ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ ప్రణీత కూతురు.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ ప్రణీత సుభాష్. ఆ తర్వాత అత్తారింటికీ దారేది సినిమాతో ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాందించారు. టాలీవుడ్‌తో కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించారు. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈ సుందరి 2021లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహమాడింది. కొద్ది నెలల క్రితమే ప్రణీత సుభాష్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఈమె తన కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ ఎక్కడా కనపడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో కూతురితో కలిసి ఉన్న ఫోటోలు పంచుకున్నారు. మొదటిసారి తన కూతురి ముఖాన్ని చూపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రణీత తన ఇన్‌స్టాలో రాస్తూ..'వారాంతాల్లో పేరెంటింగ్ హ్యాక్. ఇక నుంచి నా వారాంతాల్లో ఇలాగే ఉంటుంది' అంటూ లవ్ ఏమోజీని జతచేసింది. దీంతో పాప ఫోటోలు చూసిన ఆమె అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. వావ్.. ఎంత ముద్దుగా ఉందో అంటూ రిప్లై ఇస్తున్నారు. పాప కూడా అచ్చు ప్రణీత లాగే ఉందంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు. మరికొందరేమో ఏకంగా అందంలో ఇద్దరు పోటీ పడుతున్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులకు దగ్గరవుతున్నారు. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
అందాలతో రచ్చ చేస్తున్న హీరోయిన్ ప్రణీత సుభాష్ (ఫొటోలు)
-
Fashion: గ్రీన్ సిల్క్ సారీలో మెరిసిపోతున్న ప్రణీత! చీర ధర రూ. 44 వేలు!
ప్రణీత సుభాష్.. తన హావభావాలతో స్క్రీన్ మీద మంచి నటిగా.. పలు సేవా కార్యక్రమాలతో ఆఫ్ ది స్క్రీన్ మంచి వ్యక్తిగా ముద్ర వేసుకుంది. ఆమె తన మనసులో ముద్రించుకున్న విషయాలూ ఉన్నాయి. అందులో ఫ్యాషన్ ఒకటి. ఆ ఫ్యాషన్‌లో ఈ బ్రాండ్స్ కొన్ని... అనావిల చీరలు అంటే అమితంగా ఇష్టపడే అనావిల మిశ్రా.. 2011లో ప్రారంభించిందే ఈ బ్రాండ్. సొగసును పెంచే సరికొత్త డిజైన్లకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. అందుకే విదేశాల్లోనూ అనావిలకు మంచిపేరు ఉంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. అందుబాటులో ధరలు. ఆర్ని బై శ్రావణి ఎలాంటి వధువుకైనా నప్పే, నచ్చే ఆభరణాలను అందించడం ఆర్నిబై శ్రావణి జ్యూయెలర్స్ ప్రత్యేకత. విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన అద్భుతమైన డిజైన్లలో ఆకట్టుకుంటాయి ఈ బ్రాండ్ ఆభరణాలు. ఆర్డర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. చీర బ్రాండ్ : అనావిల ధర : రూ. 44,000 జ్యూయెలరీ బ్రాండ్ : ఆర్ని బై శ్రావణి ధర : ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. ‘మాది డాక్టర్ల కుటుంబం. అమ్మా,నాన్నలకు బెంగళూరులో హాస్పిటల్ ఉంది. చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్డే అలవాటు. నా బ్యూటీ సీక్రెట్ కూడా అదే అయ్యుంటుంది! –ప్రణీత సుభాష్ చదవండి: Actress Poorna: ‘పర్ఫెక్ట్ బ్రాండ్’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే! -
నా భర్తకు పాదపూజ చేస్తే తప్పేంటట?: ప్రణీత
అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత సుబాష్ ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోన్న ప్రణీత కొద్దిరోజుల క్రితం భర్త నితిన్ రాజుకు పాద పూజ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనినే భీమన అమావాస్య పూజ అంటారు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని ఈ పూజ చేస్తుంటారు. అయితే సాంప్రదాయాలను ఫాలో అవుతూ అతడి పాదాలకు పూజ చేసిన ప్రణీతను చూసి కొందరు నెటిజన్లు ఇంకా ఏ కాలంలో ఉందో అంటూ వెటకారంగా మాట్లాడారు. మరికొందరేమో ఏ.. భర్త పాద పూజ చేయొచ్చు కదా, తనే ఎందుకు చేయడం అంటూ ప్రశ్నించారు. ఈ విమర్శలపై తాజాగా ప్రణీత స్పందించింది. 'జీవితంలో జరిగే ప్రతి విషయానికి రెండు కోణాలుంటాయి. 90 శాతం జనాలు పాజిటివ్‌గా స్పందిస్తారు. మిగిలినవారు నోటికొచ్చినట్లు వాగుతారు, అదంతా నేను పట్టించుకోను. ఒక నటిగా నేను గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నంతమాత్రాన సాంప్రదాయాలను, ఆచారాలను ఎందుకు పాటించననుకుంటున్నారు. చిన్నప్పటినుంచి అవన్నీ చూస్తూ పెరిగాను. నా సోదరీమణులు, ఫ్రెండ్స్, పక్కింటివాళ్లు ఇలా అందరూ ఈ పూజ చేశారు. పెళ్లైన కొత్తలో గతేడాది కూడా ఈ పూజ చేశాను. కాకపోతే ఫొటో షేర్ చేయలేదంతే! చెప్పాలంటే ఇది నాకు కొత్తేం కాదు. నేనెప్పుడూ పద్ధతి గల అమ్మాయిగానే నడుచుకోవాలనుకుంటాను, సాంప్రదాయ విలువలను, పూజలు, పునస్కారాలను గౌరవిస్తాను. అమ్మ, పెద్దమ్మలు, నానమ్మలు, అంకుల్స్ మధ్యే పెరిగాను. ఆ వాతావరణం నాకిష్టం. మోడ్రన్‌గా ఆలోచించడమంటే మనం నడిచొచ్చిన దారిని మర్చిపోవడం కాదు' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఓటీటీలో అమలాపాల్ విక్టిమ్ సిరీస్, ఎప్పటినుంచంటే? నటితో అమర్దీప్ నిశ్చితార్థం, వీడియో వైరల్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత
హీరోయిన్ ప్రణీత సుభాష్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కూతురిని పొత్తిళ్లలోకి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. 'పాప పుట్టినప్పటి నుంచి అంతా కలగా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను' అంటూ వైద్యులతో దిగిన పలు ఫొటోలు షేర్ చేసింది. కానీ ఇందులో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. మాతృత్వ మధురిమలతో ఉప్పొంగిపోతున్న ప్రణీతకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రణీత గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం సోషల్ మీడియా ద్వారానే ప్రకటించింది. స్కానింగ్ కాపీని షేర్ చేసి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. బేబీ బంప్‌తో పాటు సీమంతం ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) చదవండి: మేజర్.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే? కిన్నెరసాని రివ్యూ -
భర్తతో హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు, వైరల్
హీరోయిన్ ప్రణీత సుభాష్ సంతోషం అంతాఇంతా కాదు. తను ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతగానో తహతహలాడుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది. భర్తతో కలిసి దిగిన బ్యూటిఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రణీతను ఇలా చూసిన ఫ్యాన్స్ అందమైన యువరాణిలా ఉన్నారు, లవ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. ఏప్రిల్ నెలలో తను తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ సంవత్సరంలోనే డెలివరీ జరగనున్నట్లు తెలిపింది. కాగా ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. బావ మూవీతో గుర్తింపు సంపాదించుకుంది. అత్తారింటికి దారేది చిత్రంతో బాపుబొమ్మగా మరింత క్రేజ్ తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) చదవండి 👉🏾 మే నాలుగో వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలివే! హౌస్‌ఫుల్ బోర్డ్‌తో హీరో.. తనకే టికెట్లు దొరకలేదని ట్వీట్ -
హీరోయిన్ ప్రణీత సుభాష్ సీమంతం ఫంక్షన్ ( ఫొటోలు )
-
హీరోయిన్ ప్రణీత సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్
హీరోయిన్ ప్రణీత సుభాష్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! గత నెలలో స్కానింగ్ కాపీని చూపిస్తూ గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులకు వెల్లడించిందీ ప్రణీత. ఇటీవలే బేబీ బంప్ ఫొటోలను సైతం నెట్టింట షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. తాజాగా ప్రణీతకు సీమంతం జరిగింది. పసుపు పచ్చని చీరలో అందంగా ముస్తాబైన ఆమె అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సీమంతం ఫొటోలు చూసిన అభిమానులు హీరోయిన్‌కు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా సెకండ్ లాక్డౌన్లో అంటే 2021 సంవత్సరంలో మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది ప్రణీత. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఈ హీరోయిన్.. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం అదే సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. తన లైఫ్‌లో జరిగే ప్రతి మంచి విషయాన్ని సైతం ఫ్యాన్స్‌కు తెలియజేస్తానంది. View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) చదవండి: షూటింగ్లో గాయాలు, వీడియో షేర్ చేసిన హీరో -
డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన ప్రణీత
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే! గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడిన ఆమె ఈ నెల 11న తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న ఆమె ఈ శుభవార్తను ముందుగా భర్త నితిన్‌కి చెప్పింది. ఆ తర్వాత తన పేరెంట్స్‌కు, అత్తమామలకు, అనంతరం ఫ్యాన్స్‌కు తెలియజేసింది. ఇక ప్రెగ్నెన్సీ టైంలో యోగా, ఎక్సర్సైజ్లు చేసేందుకు ప్లాన్ చేస్తానంది. కానీ తాజాగా 'థ్రోబ్యాక్' అంటూ ఓ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోను షేర్ చేసింది. కూ యాప్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఇంతకీ ప్రణీత గర్భం దాల్చిన తర్వాత ఈ డ్యాన్స్ చేసిందా? లేదా ఇది అంతకుముందు వీడియోనా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ప్రణీత జోష్ చూస్తుంటే డ్యాన్స్‌తో అటు బాడీని ఫిట్‌గా ఉంచుకుంటూనే మనసును సైతం ఉల్లాసంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Koo App Dancing to drive away all the pregnancy blues 💃💃 View attached media content - Pranitha Subhash (@pranithasubhash) 24 Apr 2022 చదవండి: వందో, ఒక వెయ్యో, లక్షో కాదు.. కళావతి సాంగ్‌కు 150 మిలియన్ వ్యూస్ ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్ -
'ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను.. మాటల్లో చెప్పలేని ఫీలింగ్'
సెకండ్ లాక్డౌన్ (గత ఏడాది)లో వెడ్ లాక్ (2021 మే 30)లోకి ఎంటరయ్యారు ప్రణీత. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. సోమవారం (ఏప్రిల్ 11) సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఓ తీపి కబురు పంచుకున్నారు ప్రణీత. తల్లి కాబోతున్న విషయాన్ని తెలియజేసి, స్కానింగ్ కాపీని చూపిస్తూ భర్తతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేశారామె. ఈ సందర్భంగా ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చిట్ చాట్. ►పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తల్లి కాబోతున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారానే ప్రకటించారు..(నవ్వేస్తూ).. నాకు సింపుల్ వెడ్డింగ్ అంటే ఇష్టం. అందుకు తగ్గట్టుగా అప్పుడు లాక్డౌన్ కూడా. అందుకే మాకు నచ్చినట్లు దగ్గర బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాం. హడావిడి లేకుండా మా పెళ్లి ప్రశాంతంగా జరిగింది. ►ఇప్పుడు తల్చుకున్నా చాలా స్వీట్‌గా ఉంటుంది. ఇక నా లైఫ్‌లో జరిగే ప్రతి మంచి విషయాన్ని నా ఫ్యాన్స్‌కి తెలియజేయాలనుకుంటాను. అందుకే అప్పుడు పెళ్లి, ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాను. 2021లో పెళ్లితో లైఫ్‌లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకో కొత్త చాప్టర్. ఈ కొత్త ఫీలింగ్ గురించి... ►నిజంగా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఇది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. నితిన్‌కి చెప్పాను. మా అమ్మవాళ్లకి, అత్తమామలకు చెప్పేటప్పుడు మాత్రం బిడియంగా అనిపించింది. నాకు నేను కొత్తగా అనిపించాను. అలానే వేరే ఫ్రెండ్స్‌తో కూడా సిగ్గుపడుతూ మాట్లాడాను. ►మీ అమ్మగారు గైనకాలజిస్ట్ కాబట్టి గైడెన్స్ విషయంలో మీకు ఇబ్బంది ఉండదు... అవును. అమ్మ సలహాలు తీసుకుంటాను. ఏం తినాలి? ఏం తినకూడదు? అని చాలామంది చెప్పారు. నాకు వామిటింగ్, వేరే ఏ ఇబ్బందులు లేవు. అందుకని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేంతవరకూ నేను ప్రెగ్నెంట్ అని కన్ఫార్మ్గా తెలుసుకోలేకపోయాను. మామూలుగా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బొప్పాయి, పైనాపిల్ తినకూడదంటారు. కానీ టెస్ట్ చేసుకోకముందు కొన్ని రోజులు ఈ రెండూ బాగానే తిన్నాను. థ్యాంక్ గాడ్... ఏమీ కాలేదు. ►ఇప్పుడు ఎన్నో నెల? అది మాత్రం సస్పెన్స్. డెలివరీ ఈ సంవత్సరమే. ►ప్రెగ్నెన్సీ టైమ్‌లో చేసే యోగా, ఎక్సర్సైజ్లవీ ప్లాన్ చేసుకున్నారా? ఇంకా లేదు. కొన్ని రోజులు మెల్లిగా నడవాలనుకుంటున్నాను. ఆ తర్వాత యోగా వంటివి ప్లాన్ చేస్తాను. ఈ మధ్య కాజల్ అగర్వాల్ (ప్రస్తుతం కాజల్ గర్భవతి) యోగా చేస్తూ పెట్టిన వీడియోలు చూశాను. కొన్ని రోజుల తర్వాత నేనూ అవి చేయాలనుకుంటున్నాను. ►ఇప్పుడు ఏమేం తినాలనిపిస్తోంది? ప్రస్తుతానికి నాకు చాక్లెట్లు, ఐస్‌క్రీములు తినాలనిపిస్తోంది. ఇంతకుముందూ తినేదాన్ని కానీ ఇప్పుడు ఈ రెండింటి మీద మనసు బాగా లాగుతోంది. అయితే నా ఆరోగ్యం, బేబీ ఆరోగ్యం కోసం కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. ఇంకా డైట్ ప్లాన్ చేయలేదు... చేయాలి. ►పాప కావాలా? బాబు పుట్టాలనుకుంటున్నారా? మా ఇద్దరికీ (భర్త నితిన్ రాజు) ఎవరైనా ఓకే.. ప్రస్తుతం ఓ కన్నడ సినిమా చేస్తున్నట్లున్నారు.. లక్కీగా ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ►సినిమాలు కంటిన్యూ చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు కూడా ఏమైనా యాడ్స్‌కి అవకాశం వస్తే చేస్తాను. సినిమాలు వదిలే ప్రసక్తే లేదు. ►ఫైనల్లీ.. కంగ్రాట్స్ ప్రణీత... టేక్ కేర్.. థ్యాంక్యూ సో మచ్. ఓ కొత్త ఫీలింగ్‌తో నా ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నాను. ‘ఐయామ్ వెరీ హ్యాపీ’. -
తల్లి కాబోతున్న 'అత్తారింటికి దారేది' హీరోయిన్
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 'నా భర్త34వ పుట్టినరోజున దేవుడు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ప్రణీత ఆమె భర్తను హగ్ చేసుకొని పట్టలేని ఆనందంతో కనిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రెగ్నెన్సీ కిట్ సహా స్కానింగ్‌కు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది. దీంతో పలువురు ప్రముఖులు సహా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతేడాది వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా ఆంక్షల నడుమ అతికొద్ది మంది సన్నిహితులు, బంధువు సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇక ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ప్రణీత 'రభస', 'డైనమైట్' సహా పలు చిత్రాల్లో నటించింది. పవన్‌కల్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించిన 'బాపు బొమ్మ'గా పాపులర్ అయ్యింది. View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) -
నిర్దోషినని నిరూపించుకునేందుకు జీవితాన్నే ముగించడం బాధాకరం: హీరోయిన్
రాజస్థాన్‌లో డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్యపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్‌గా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపు పోస్ట్ చేసింది. 'తాను అమాయకురాలని (నిర్దోషి) నిరూపించుకోవడానికి ఓ వైద్యురాలి తన జీవితాన్నే ముగించాల్సి రావడం చాలా బాధాకరం.' అని ట్వీట్ చేసింది. 'ప్రతీసారి వైద్యులు దాడికి గురవుతున్నారు. ఇతర 100 మంది వైద్యులు రిస్క్ తీసుకోవడం ఆపేశారు. కానీ సాధారణంగా ఒకరి ప్రాణాలను కాపాడేందుకు రిస్క్ తీసుకోవాలి.' అని పేర్కొంది. చదవండి: ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత డాక్టర్ అర్చనా శర్మ.. రాజస్థాన్ దౌసా జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఓ గర్భణికి వైద్యం చేస్తుండగా.. దురదృష్టవశాత్తు ఆమె హేమరేజ్ కారణంగా మరణించింది. ఆ తర్వాత ఆమె తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి హాస్పిటల్ బయట ఆందోళన చేశారు. ఈ క్రమంలో గర్భిణీ కుటుంబ సభ్యులు వైద్యురాలిపై, ఆమె భర్తపై పోలీసు స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. ఆందోళనలతో పాటు ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో అర్చన తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్తతో కలిసి ఆసుపత్రిని నడిపిస్తున్న ఆమె.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. చదవండి: జీవితమంతా అంధకారమే: ప్రణీత షాకింగ్ కామెంట్స్ సూసైడ్ నోట్లో అర్చనా.. తన భర్త, పిల్లలు అంటే ఆమెకు ఎంతో ఇష్టమని పేర్కొంది. తన మరణం తర్వాత భర్తను, ఇద్దరు పిల్లలను వేధించొద్దని కోరింది. 'అమాయకపు డాక్టర్లను వేధించకండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరి చావుకు కారణం కాదు. నా చావుతోనైనా నేను అమాయకురాలిని అని తెలుసుకోండి' అంటూ తన ఆవేదన తెలియజేసింది. Sad that a doctor had to end her life to prove her innocence.. #JusticeForDrArchanaSharma #DrArchanaSharma pic.twitter.com/cTSRQNTsPC — Pranitha Subhash (@pranitasubhash) March 30, 2022 చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం -
జీవితమంతా అంధకారమే: ప్రణీత షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ ప్రణీత సుభాష్ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసింది. గతేడాది చిరకాల ప్రయుడు నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆమెకు ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో అర్టిస్ట్లపై ఆమె పెట్టిన పోస్ట్ హాట్‌టాపిక్ మారింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రణీత ఏం చెప్పిందంటే.. ‘అర్టిస్టులకు సంబంధించిన ఎలాంటి విషయమైన కాస్తా ఆసక్తిగానే ఉంటుంది. అందుకే ఇలాంటి నిలకడ లేని జీవితాలను ఎంచుకుంటాం. ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు. మా శరీరాలను అంత్యంత కఠిన పరిస్థితుల్లో పడేస్తాం. అర్టిస్టుల జీవితాలు మొత్తం కష్టాలు, ఒడిదుడుకులు, కొన్నిసార్లు అంధకారంతో నిండి ఉంటాయి’ అని ఉంది. చదవండి: కీరవాణి కంపోజ్ చేసిన ఆ పాట అంటే ఇరిటేషన్: ఎన్టీఆర్ అలాగే ‘సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను కాస్త వ్యవధిలోనే చూసేస్తాం. ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం మేం కూర్చుంటాం, లేస్తాం, తింటాం, పడుకుంటాం. అయినా మేం గౌరవం లేని జీవితాలను గడుపుతుంటాం. ఆనారోగ్యకరమైన షెడ్యూల్లో పనిచేస్తుంటాం. చలికి వణుకుతూ.. వర్షంలో తడుస్తూ.. ఎండలో ఎండుతూ పని చేయాలి. పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబానికి, స్నేహితులకు, బంధువులకు దూరంగా పనిచేస్తుంటాం. మా సామర్థ్యానికి మించిన పని చేస్తాం. ఇదంతా ఓ ఆర్ట్ కోసమే.. ఒక మంచి బ్రేక్ పాయింట్ కోసమే. సంతోషపెట్టే ఓ క్షణం కోసమే' అంటూ ప్రణీత ఓ బ్రీఫ్ కోట్‌ను షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా 'ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ భామ. చదవండి: అందుకే ఫిలిం మేకర్‌గా నేను ఫెయిల్యూర్: రాజమౌళి షాకింగ్ కామెంట్స్ గుండ్రని కళ్లు, చక్కని చిరునవ్వు.. అంతకుమించిన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచింది. వెంటనే సిద్ధార్థ్ సరసన 'బావ' మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ మూవీతో రాత్రికిరాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న ప్రణీత.. ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, అత్తారింటికి దారేదిలో సెకండ్ హీరోయన్ రోల్ కొట్టేసింది. వీటి తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. చివరగా ఆమె రామ్ పోతినేని ‘హాలో గురు ప్రేమకోసమే’ మూవీలో కనిపించింది. ఈ క్రమంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. హిందీలో రెండు సినిమాలు చేసిన ప్రణీతకు అక్కడ కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది ప్రణీత. -
ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత
Pranitha Subhash Gets Tears After Watching The Kashmir Files Movie: గుండ్రని కళ్లతో, చక్కని చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచిన చిన్నది ప్రణీత సుభాష్. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో; సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బాపుబొమ్మ సిద్ధార్థ్ సరసన హీరోయిన్గా 'బావ' మూవీలో నటించి మెప్పించింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'అత్తారింటింకి దారేది' సినిమాతో సెకండ్ హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనంతరం తెలుగులో అవకాశాలు లేక కనుమరుగైంది. సినిమాల మాట ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ప్రణీత. ఈ సోషల్ మీడియా వేదికగా తను, ఆమె భర్త ఓ సినిమా చూసి ఏడ్చేశాం అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ప్రణీత తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్లో ''మేము 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా వీక్షించాం. ఈ చిత్రం పూర్తయ్యేసరికి నేనూ, నా భర్త ఏడ్చేశాం. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు.'' అని పోస్ట్ పెట్టింది. అలాగే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది. కాగా 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా తెరకెక్కిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. హర్యాణా, మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కూడా ప్రకటించాయి. ఈ చిత్రాన్ని వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
పెళ్లి తర్వాత తొలిసారి స్పందించిన హీరోయిన్
హీరోయిన్ ప్రణీత సుభాస్ ఇటీవల పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు, బెంగళూరు వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న ఆమె రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె పెళ్లి వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఆమె సడెన్‌గా పెళ్లి పీటలు ఎక్కడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ప్రణీత ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కరోనా పరిస్థితులు, ఆషాడం వల్ల నిరాడంబరంగా తన పెళ్లి తంతును జరపాల్సి వచ్చిందన్నారు. ‘పరిశ్రమకు చెందిన సన్నిహితులు, అందరి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా మా పెళ్లి వేడుకను నిర్వహించాలనుకున్నాం. కానీ ఈ సారి జులైలోనే ఆషాడం ఉంది. ఆషాడ మాసం దగ్గర్లోనే ఉండేసరికి సింపుల్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా కుటుంబం అన్ని సంప్రదాయాలను పాటిస్తుంది. అందుకే ఆషాడ మాసం, దాని తర్వాత వచ్చే పరిణామాలపై అపనమ్మకంతో ఇరు కటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువుల సమక్షంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పెళ్లి వేడుకను నిర్వహించాం. అంతేగాక సెకండ్ వేవ్ ఉధృతికి ఎంతోమంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజం ఇలాంటి క్లిష్ట పరిస్థితులను చూస్తున్న క్రమంలో మేము ఆడంబరంగా వివాహం చేసుకోవడం సరైనది కాదనే భావన కూడా ఒక కారణం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా ప్రణీత హిందీలో నటించి ‘భుజ్’ చిత్రం ఓటీటీలో విడుదల కాగా ‘హంగామా-2’ మూవీ విడుదల కావాల్సి ఉంది. చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణిత.. ఫోటోలు వైరల్ -
హీరోయిన్ ప్రణిత భర్త గురించి ఈ విషయాలు తెలుసా?
హీరోయిన్ ప్రణిత సుభాష్ రీసెంట్‌గానే పెళ్లి చేసుకొని మిసెస్ ప్రణితగా మారింది. ఏమాత్రం హడావిడి లేకుండా, చాలా సైలెంట్‌గా పెళ్లి విషయాన్ని రివీల్ చేసింది. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను లాక్డౌన్లో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది. బెంగుళూరులోని తన నివాసంలో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ప్రణిత పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు.. ప్రణిత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇక పెళ్లి విషయంపై స్పందించిన ప్రణిత తమది ప్రేమ వివాహమని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా పెళ్లి తేదీపై సందిగ్ధత నెలకొందని, పెళ్లికి ముందు రోజు వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగిందని పేర్కొంది. కోవిడ్ దృష్ట్యా ఎక్కవమంది ఆహ్వానించలేకపోయామని, పెద్ద మనసుతో మన్నించాలని కోరుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇక ప్రణిత పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో అసలు ప్రణిత పెళ్లి చేసుకుంది ఎవరిని ఆయన ఏం చేస్తుంటారంటూ చాలామంది గూగూల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రణిత భర్త బెంగుళూరులో హాస్పిటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసి 2011లో బ్లూ హరిజన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ బిజెనెస్‌తో పాటు నితిన్ రాజుకు మరికొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయని సమాచారాం. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రణిత అత్తారింటికి దారేది, రభస చిత్రలతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో తెరకెక్కుతోన్న ‘హంగామా-2’, భుజ్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. గతేడాది లాక్డౌన్ సమయంలో వలస కూలీల స్వయంగా ఆహారం తయారు చేసి అందిస్తూ అందరి మనసును గెలుచుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణిత.. ఫోటోలు వైరల్ -
బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణిత
హీరోయిన్ ప్రణిత సుభాష్ పెళ్లి పీటలెక్కింది. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా బెంగుళూరులోని ప్రణిత నివాసంలోనే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఇక వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు.. ప్రణిత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్రణిత పెళ్లి టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య వివాహం జరిగిందని సమాచారం. ప్రస్తుతం ప్రణిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పెళ్లి కొడుకు నితిన్ కూడా బెంగుళూరుకు చెందిన వారని తెలుస్తోంది. ఇక పెళ్లి వార్తలపై స్పందించిన ప్రణిత స్పందించింది. ఇది లవ్ కమ్ అరెంజెడ్ మ్యారెజ్. చాలా కాలంగా నితిన్ నాకు తెలుసు. ఇక పెళ్లితో మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాక మా ఇరు కుటుంబాలకు విషయం చెప్పాం. వాళ్లు కూడా మా నిర్ణయం పట్ల చాలా సంతోషించారు. ఇక నా వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు. నేను నా పెళ్లి ఎలా అయితే జరగాలని కలలు కన్నానో అలానే జరిగింది. కరోనా కారణంగా అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు అని ప్రణిత వివరించింది. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రణిత అత్తారింటికి దారేది, రభస చిత్రలతో మరింత గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె హంగామా-2, భుజ్ అనే చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలోనూ రమణ అవతార అనే చిత్రంలో నటిస్తుంది. -
బాలీవుడ్లో హీరోయిన్ ప్రణీతకు చేదు అనుభవం!
‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ‘బాపుగారి బొమ్మ’ ప్రణీత సుభాష్. ఆ తర్వాత ‘బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస’ వంటి మూవీలో సహానటి పాత్రలు పోషించింది. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ కన్నడ, తమిళంలోను హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్లో కూడా ఆమెకు అవకాశాలు రావడంతో హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. అవి ‘భూజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ‘హంగామా 2’. ఈ చిత్రాల్లో ప్రణీత కీలక పాత్రలు పోషించింది. గతేడాది షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తన తొలి హిందీ చిత్రం ‘భూజ్’ ఆగష్టు 14, 2020 స్వాంతంత్రయ దినోత్సవం సందర్భంగా థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో మేకర్స్ డీస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించి, త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా తను నటించిన రెండవ చిత్రం ‘హంగామా 2’ సైతం ఓటీటీ బాట పట్టేలా కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడానికి ‘హంగామా 2’ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలు కావడంతో బాలీవుడ్లో తన సత్తా చాటుకోవాలని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రణితకు కరోనా చేదు అనుభవాన్నే మిగిల్చింది. హిందీలో తాను నటించిన రెండు చిత్రాలు ఓటీటీలోనే విడుదల కానుండటంతో బాలీవుడ్లో ప్రణీతకు నిరాశే ఎదురైందని చెప్పుకోవచ్చు. కాగా భూజ్‌లో అజయ్ దేవగన్, సంజయ్ దత్ లీడ్ రోల్స్ పోషించగా.. శ్రద్దా కపూర్, సోనాక్షి సిన్హా, ప్రణీతలు కీలక పాత్రల్లో నటించారు. -
21 రోజుల్లో 75 వేలమందికి కడుపు నింపిన ప్రణీత
ప్రణీత సుభాష్ అనే పేరుకంటే ‘బాపుగారి బొమ్మ’ గా బాగా గుర్తింపు పొందిన కన్నడ నటి ప్రణీత. ‘‘ఏం పిల్లో ఏం పిల్లడో, ‘బావ’, ‘అత్తారింటికి దారేది’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రభస’, డైనమైట్’’ వంటి తెలుగు సినిమాల్లో తన అభినయంతో ఆకట్టుకోవడమేగాక, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో వివిధ చిత్రాల్లో కథానాయికగా రాణిస్తూ.. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అందంతోపాటు స్వచ్ఛమైన మనస్సుకూడా ఉండడంతో హీరోయిన్‌గానే గాక వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. కోవిడ్ సమయం లోనైతే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది అభాగ్యులకు ఆమె ఆపన్నహస్తం అందించారు. లాక్డౌన్ సమయంలో చాలామంది తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజూ కూలి చేస్తేగానీ పూటగడవని కూలీల అవస్థలు తెలుసుకున్న సినీ నటి ప్రణీత సుభాష్ ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున 50 కుటుంబాలకు లక్షరూపాయలను విరాళంగా అందచేశారు. పేద ప్రజల కోసం ఆమె దగ్గరుండి వండించి, పంపిణీ చేశారు. ఇలా 21 రోజుల్లో ఏకంగా 75 వేలమందికి భోజనం పెట్టి కడుపు నింపారు. లాక్డౌన్ సమయంలో ‘హెల్ప్ది హెల్పింగ్ హ్యాండ్స్’ పేరుతో పదిలక్షల రూపాయలను విరాళంగా సేకరించి 450కి పైగా కుటుంబాలను ఆదుకున్నారు. ఒక హీరోయిన్గా కాక, ఒక లీడర్‌గా ఆమె అన్నీ తానే అయి చేశారు. ప్రణీత ఫౌండేషన్ ప్రణీత తల్లిదండ్రులు ఇద్దరూ బెంగళూరులో ఓ ఆసుపత్రిని నడుపుతున్నారు. వారు స్తోమత లేనివారికి ఉచితంగా వైద్యం చేస్తూ ఎంతోమందిని ఆదుకునేవారు. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగారు ప్రణీత. ఈ క్రమంలోనే సినిమాల్లో్ల కాస్త నిదొక్కుకున్నాక ప్రణీత తల్లిదండ్రులతో కలసి ‘ప్రణీత ఫౌండేషన్’ను ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా..‘సేవ్ గవర్నమెంట్ స్కూల్స్’ అనే ఉద్యమంలో భాగస్వామిగా వ్యవహరిస్తూ బెంగళూరులోని ప్రభుత్వ స్కూళ్ల పరిరక్షణకు కృషిచేస్తున్నారు. విటార్ అనే హెల్త్ టెక్ స్టార్టప్‌తో కలిసి నిరుపేదలకు హెల్త్ చెకప్‌లు ఉచితంగా చేయిస్తూ.. వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్య సమస్యల నివారణకూ కృషి చేస్తున్నారు. ఆర్థికం గా సామాజికంగా వెనుకబడిన వర్గాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రణీత సేవాకార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక ఎన్నికల కమిషన్ ప్రణీతను ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు అంబాసిడర్‌గా నియమించింది. -
చల్ చల్ గుర్రం... చలాకీ గుర్రం
గుర్రం చలాకీదే. గుర్రపు స్వారీ కూడా చలాకీయే. రేసులో చురుకుగా ఉంటే రేసుగుర్రం అవ్వొచు. ఇటీవలే కొందరు కథానాయికలు... గుర్రపు స్వారీ మీద శ్రద్ధ పెట్టారు. ఒకరేమో శరీరాన్ని మరింత ఫిట్‌గా ఉంచుకోవడం కోసం. మరొకరు తన పాత్రను హిట్ చేయడం కోసం. ఆ విశేషాలు. యువరాణి పాత్రకోసం... ఇటీవల తన కొత్త ఫ్రెండ్ బూని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు త్రిష. బూ అంటే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న గుర్రం పేరు. త్వరలో చేయబోయే పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు త్రిష. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో నటించనున్నారు త్రిష. ఈ పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ అని తెలిసింది. మరింత ఫిట్‌గా... లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగిస్తే ప్రణీతా సుభాష్ ఫిట్నెస్ మీద మరింత దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. ‘‘మా ట్రైనర్ నేనేదో సినిమాలో పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నానని అనుకున్నారు. కానీ అదేం కాదని చెప్పాను. హార్స్ రైడింగ్ వల్ల నా ఫిట్నెస్ మరింత మెరుగుపరుచుకోవచ్చు అనుకున్నాను. అందుకే నేర్చుకుంటున్నానని చెప్పాను. నిజంగానే దీని వల్ల నా శరీరం మరింత చురుకుగా ఉంది. ఇదో సరికొత్త అనుభవం’’ అన్నారు ప్రణీత. పదును పెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌కు గుర్రపు స్వారీ వచ్చు. గతంలోనే ఆమె ఈ స్వారీ నేర్చుకున్నారు. అయితే తాజాగా తన ప్రతిభకు మరింత పదును పెడుతున్నారు. లాక్డౌన్లో మళ్లీ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ‘మన భవిష్యత్తు మన దినచర్యలోనే తెలిసిపోతుంది’ అంటూ ఆ ఫోటోలు షేర్ చేశారామె. -
వేస్ట్ జీరో
మామూలుగా అమ్మాయిలు చాలామంది ‘సైజ్ జీరో’ని టార్గెట్‌గా పెట్టుకుంటారు. అందుకోసం బోలెడన్ని వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తారు. కానీ ప్రణీత దృష్టంతా ఇప్పుడు ‘వేస్ట్ జీరో’ మీద ఉంది. ‘కరోనా సమయంలో ఉన్న సరుకులను పొదుపుగా వాడుకోవాలి. వృథా తగదు. అనవసరమైన వేస్ట్ అసలే వద్దు’ అంటున్నారు ప్రణీతా సుభాష్. ‘జీరో వేస్ట్ కుకింగ్’ (వ్యర్థం ఎక్కువపోకుండా వంట చేయడం) విధానాన్ని పాటించడం మొదలుపెట్టారామె. మామూలుగా చాలామంది కూరగాయల తొక్కలను పడేస్తారు. కానీ అది కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్తపడాలనుకుంటున్నారట ప్రణీత. ‘‘కూరగాయలను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఆ తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు. ఆ విధంగా ఇలాంటి కష్ట సమయంలో నిత్యావసరాలను పొదుపు చేసుకుందాం’’ అంటున్నారు ప్రణీత. -
హీరోయిన్ ప్రణీత ఫోటోలు
-
అమీర్‌పేట బిగ్‌బజార్ మాల్లో ప్రణీత సందడి
-
డబుల్ ఎంట్రీ
ఈ మధ్యే తొలి బాలీవుడ్ సినిమా చేయడానికి అంగీకరించారు ప్రణీతా సుభాష్. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ద్వారా హిందీ తెరకు పరిచయం కానున్నారామె. ఈ సినిమా పూర్తికాకముందే మరో హిందీ సినిమా అంగీకరించారు ప్రణీత. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఏడేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న హిందీ చిత్రం ‘హంగామా 2’లో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ చిత్రం గురించి ప్రణీత మాట్లాడుతూ – ‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున (వచ్చే ఏడాది ఆగస్ట్ 14 రిలీజ్ కాబోతున్నాయి. ఆ విధంగా హిందీ స్క్రీన్‌పై ఒకేసారి డబుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రణీత. -
బొంగరాలకళ్ల బాపు బొమ్మా!
‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాలో కృష్ణకుమారిగా మెప్పించిన బొంగరాల కళ్ల అమ్మాయి ప్రణిత సుభాష్ శాకాహారమే తన అందానికి సగం కారణం అంటోంది. త్వరలో బాలీవుడ్లో మెరవనున్న ఈ ముద్దుగుమ్మ చెప్పిన ముచ్చట్లు.... డాక్టర్ల ఫ్యామిలీ ‘యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేదాన్ని’ అంటుంటారు. కాని నేను నిజంగానే డాక్టర్ అయ్యేదాన్ని. ఎందుకంటే మాది డాక్టర్ల కుటుంబం. అమ్మా,నాన్నలకు బెంగళూరులో హాస్పిటల్ ఉంది. వృత్తిపరమైన బిజీలో మా వాళ్లు సినిమాలు అసలు చూడరు. ఇప్పుడిప్పుడే నా సినిమాలు చూస్తున్నారు. ఇక నా స్నేహితుల విషయానికి వస్తే ‘ఆహో ఒహో’ అనే టైప్ కాదు. వారికి ఏమాత్రం నచ్చకపోయినా ‘ఇదేం సినిమా!’ అంటారు. వాళ్లు ఎక్కువగా ఇంగ్లిష్ సినిమాలు చూస్తారు కాబట్టి....‘‘హాలీవుడ్లో నటించు’’ అని సలహా ఒకటి ఇస్తుంటారు! డిష్యుం డిష్యుం! పాటలే కాదు ఫైట్స్ అంటే కూడా నాకు ఇష్టం. అయితే ఫైట్లు చేసే ఛాన్సు హీరోలకే ఎక్కువ కదా! ‘డైనమెట్’ సినిమాలో ఫైట్లు చేసే అవకాశం వచ్చింది. ఛాలెంజ్‌గా అనిపించింది. ఎప్పుడోగాని ఇలాంటి అవకాశం రాదు కాబట్టి శ్రద్ధగా చేశాను. ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్....ఇలాంటివేమీ పట్టించుకోను. ఒక సినిమాకు ప్రతి పాత్ర ముఖ్యమైనది అని నా అభిప్రాయం. గ్లామర్‌రోల్స్ మాత్రమే చేయాలని నేనేమీ కంకణం కట్టుకోలేదు. డీగ్లామర్ రోల్ కూడా చేస్తాను. చేశాను కూడా. అడవి నేపథ్యంతో నడిచే ఒక కన్నడ సినిమా కోసం డీగ్లామర్‌గా నటించాను. తెలుగు తెలుసు నావరకైతే ఒక కొత్త భాష నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఎలా వచ్చిం దో ఏమోగాని...ఇప్పుడు మాత్రం తెలుగు చక్కగా మాట్లాడగులుగుతున్నాను! మొదటి సారి తెలుగు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు సౌండ్స్‌తో బై హార్ట్ చేశాను. అప్పుడు తెలుగు ఏమీ తెలియదు. నా పేరు విని చాలామంది నేను తెలుగు అమ్మాయిని అనుకుంటారు! నా బలం... బలహీనత కష్టపడే తత్వం నా బలం. కష్టపడకుండా ఏ చిన్న అదృష్టం కూడా తలుపు తట్టదు. ఇక బలహీనత విషయానికి వస్తే అందరినీ గుడ్డిగా నమ్మేస్తాను. మరొకటి... మొహమాటం!నేను పనిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి...‘కాఫీ తాగివద్దాం’’ అన్నారు అనుకోండి.‘‘నేను పనిలో ఉన్నాను’’ అనలేను. ‘‘అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను’’ అంటాను! ఇలాంటి మొహమాటలు వదులుకోవాలి. ఇక సినిమాల విషయానికి వస్తే... ‘డార్క్’ సినిమాల కంటే ఎంటర్టైన్మెంట్, ఫన్ సినిమాలంటేనే నాకు ఇష్టం. -
ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకున్న ప్రణీత
యశవంతపుర : సొంత గడ్డపై నటి ప్రణీత తన మమకారం చాటుకున్నారు. అక్కడ ఎలాంటి సదుపాయాలకు నోచుకొని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. రూ.5 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ప్రణీత మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది బెంగళూరు అయినప్పటికీ తన తండ్రి పుట్టింది మాత్రం ఆలూరులోనని పేర్కొన్నారు. సొంతూరు ఆలూరులో ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని భావించి పాఠశాలను దతత్త తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించడంతోపాటు తరగతి గదుల రూపురేఖలను మార్చి విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలలను దత్తత తీసుకొనే ఆలోచన ఉందన్నారు. అంతేగాకుండా విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించేందుకు కృషి చేస్తానన్నారు. -
బడిని దత్తత తీసుకున్న నటి ప్రణీత
బెంగళూరు: నటి ప్రణీత తన పెద్ద మనసును చాటుకుంది. అందరూ ఊర్లను, పిల్లల్ని దత్తత తీసుకుంటే ప్రణీత ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. స్నేహితులు కోరడంతో... గతేడాది బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి సిద్ధమైంది. ఆ సమయంలో బడి వాతావరణాన్ని, పిల్లలు చదివే విధానాన్ని గమనించింది. అక్కడ ఏడో తరగతి చదివే విద్యార్థికి కూడా ఆంగ్లభాషలో కనీస పరిజ్ఞానం లేదని గుర్తించింది. అదే కాదు ఆ బడిలో ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. అది చూసి అలాంటి పాఠశాలల రూపురేఖల్ని మార్చాలని అనుకుంది. అందులో భాగంగా మొదట హసన్ జిల్లా, ఆలూరులోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. ఈ విషయమై ప్రణీత మాట్లాడుతూ.. ‘మా నాన్న పుట్టిన ఊరు హసన్‌లోని ఆలూరు గ్రామం. తరువాత బెంగళూరుకు వచ్చేశారు. నేను పుట్టి, పెరిగింది బెంగళూరులోనే అయినా మా సొంతూరుని మర్చిపోలేనుగా. అందుకే ఆలూరును ఎంచుకున్నా. అక్కడి పాఠశాల అభివృద్ధికోసం రూ.5లక్షలను అందించా. విద్యార్థినులకు మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించడానికి, తరగతి గదుల రూపురేఖల్ని మార్చడానికి ఈ సొమ్మును వినియోగిస్తున్నాం. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలల్ని దత్తత తీసుకునే ఆలోచన కూడా ఉంది. కేవలం బడికి సౌకర్యాలు అందించడమే కాదు... వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నాం. ఇందుకు అవసరమైన ప్రణాళికల్ని మా స్నేహితులమంతా ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటున్నామ’ని చెప్పింది. -
‘అబద్దాలు చెప్తే అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు’
ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్న చిత్రయూనిట్ ఆడియోను కూడా డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుదల చేశారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రామ్ ఎనర్జీ, అనుపమా, ప్రణీతల క్యూట్ పర్ఫామెన్స్తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమాలో ప్రకాష్రాజ్లు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'సైమా' సన్నాహక కార్యక్రమంలో తారల సందడి
-
రెండేళ్ల తరువాతే పెళ్లి
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : రెండేళ్ల తరువాత పెళ్లి కబురు చెబుతానని నటి ప్రణీత సుభాష్( అత్తారింటికి దారేది ఫేం) పేర్కొన్నారు. విశాఖలో ఓ ప్రయివేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే మంచి సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని, అత్తారింటికి దారేదితో టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడిందన్నారు. తనకు ఇష్టమైన నటుడు పవన్‌కల్యాణ్ అని పేర్కొన్నారు. ఇప్పుడు నా దృష్టంతా కెరీర్‌పైనే ఉందని, రెండేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మంచి కథలతో వస్తే భాషతో సంబంధం లేకుండా నటిస్తానన్నారు. బిగ్‌బజార్‌లో సందడి ద్వారకానగర్ బిగ్ జార్లో ప్రముఖ హీరోయిన్ ప్రణీత (అత్తారింటికి దారేది ఫేం) సందడి చేసింది. ప్రముఖ ఫ్యాబ్రిక్ కేర్ బ్రాండ్‌లో ఒకటైన టైడ్ ప్లస్ అదనపు పవర్‌తో తయారు చేసిన నూతన ‘టైడ్ ప్లస్ ఎగస్ట్రా పవర్’ను ప్రణీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు టైడ్ ఎగస్ట్రా పవర్ వాడాలన్నారు. బిగ్‌బజారు స్టోర్ మేనేజర్ భానుప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ప్రాడెక్ట్‌కు ప్రణీత ప్రచారకర్తగా ఉన్నారని తెలిపారు. ప్రణీతను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ ప్రణీత సందడి చేశారు. -
ఆదిలాబాద్‌లో సందడి చేసిన సినీనటి ప్రణీత
-
నేను అందంగా లేనా.. నాకే ఎందుకిలా : ప్రణీత
సాక్షి, చెన్నై: తనకే ఎందుకిలా జరుగుతోందని వాపోతోంది నటి ప్రణీత. మాతృ భాష కన్నడతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తోంది. అయితే దక్షిణాదిలో ఏ భాషలోనూ ప్రముఖ కథానాయకిగా పేరు సంపాదించుకోలేకపోతోంది. తెలుగులో మొదట సోలో హీరోయిన్‌గానే పరిచయమైంది. ఆ తరువాత పవన్‌కల్యాణ్ వంటి స్టార్‌కు జంటగా నటించినా సెకెండ్ హీరోయిన్ పాత్రలే వస్తున్నాయని వాపోతోంది. ఇక తమిళంలో అయితే కార్తీకి జంటగా శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో గుర్తింపు పొందలేకపోయింది. నటుడు సూర్య హీరోగా నటించిన మాస్ చిత్రంలోనూ రెండవ హీరోయిన్ పాత్రకే పరిమితం అయ్యింది. జెమినీ గణేశనుమ్ సురుళీరాజవుమ్, ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ వంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో నెగిటివ్ పాత్రను కూడా ధైర్యం చేసి పోషించింది. అయితే ఆ పాత్రకు ఆమెకు ప్రశంసలు మాట అటుంచితే విమర్శలే ఎక్కువ వచ్చాయి. అయినా స్టార్ ఇమేజ్ను పొందలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్లో ఒక్క చిత్రం కూడా లేదు. దీంతో 'నాకే ఎందుకిలా జరుగుతోంది. నేను అందంగా లేనా, నటనా ప్రతిభను చూపడం లేదా?' అంటూ ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రణీత ప్రస్తుతం కన్నడంలో ఒక చిత్రం, మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. -
నటి ప్రణీత సందడి.. తరలివచ్చిన అభిమానులు
సాక్షి, మహబూబాబాద్: మానుకోట (ప్రస్తుత మహబూబాబాద్) జిల్లా కేంద్రంలో టాలీవుడ్ నటి ప్రణీత సందడి చేశారు. ఆదివారం ఓ షాపింగ్ మాల్ ప్రారంభ వేడుకకు ఆమె హాజరయ్యారు. నటి ప్రణీతను చూసేందుకు ఆమె అభిమానులతో పాటు జిల్లావాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ వివరాలిలా.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎం.వి షాపింగ్ మాల్ (శారీస్ క్లాత్ మార్చంట్) సిద్ధంగా ఉంది. అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయాల్సిందిగా దాని నిర్వాహకులు నటి ప్రణీతను సంప్రదించారు. అందుకు అంగీకరించిన ప్రణీత ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఎంవి షాపింగ్ మాల్‌ను ప్రారంభించి, అందులోని కొన్ని శారీల నాణ్యతను పరిశీలించి, వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రణీత రాకను తెలుసుకున్న అభిమానులు, స్థానికులు అక్కడికి భారీ సంఖ్యలో రావడంతో నటి హర్షం వ్యక్తం చేశారు. వారికి అభివాదం చేస్తూ ప్రణీత సందడి చేశారు. -
నేను ప్రేమిస్తున్నదెవరినో తెలుసా?
ప్రతి మనిషి జీవితంలోనూ ఒక భాగమైన ప్రేమ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.నటి ప్రణీతను తన అభిప్రాయాన్ని తెలపమన్నప్పుడు ప్రేమ అన్నది ఏదో ఒక దశలో ప్రతిఒక్కరికి కలుగుతుందన్నారు.అయితే తనకు మాత్రం ఇంకా ఆ దశ రాలేదన్నారు.తమిళంలో ఉదయన్ చిత్రంతో పరిచయం అయిన ఈ భామ ఆ తరువాత శకుని,మాస్ తదితర చిత్రాలలో నటించారు.అయితే ఇప్పటికీ మంచి విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారన్నది గమనార్హం.తమిళంలో ఎక్కువగా నటించడం లేదే అన్న ప్రశ్నకు ప్రణీత బదులిస్తూ మంచి అవకాశాలు లభిస్తే తానెందుకు నటించనూ,అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాననీ అన్నారు. అయితే తాను తెలుగు,కన్నడం భాషా చిత్రాలతో బిజీగానే ఉన్నాననీ చెప్పారు.ముఖ్యంగా తెలుగులో తను హోమ్లీ ఇమేజ్ ఉందని అన్నారు.జూనియర్ ఎన్గీఆర్,పవన్‌కల్యాణ్,మహేశ్‌బాబు లాంటి ప్రముఖ హీరోలతో నటించాననీ,ఇప్పుడు కూడా నటిస్తున్నాననీ తెలిపారు.కోలీవుడ్‌లో ఎక్కువగా నటించక పోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం తమిళంలో జయ్‌కి జంటగా ఎనక్కు వాయ్Oద అడిమైగళ్,అధర్వతో కలిసి జెమినీగణేశనుమ్ సురళిరాజానుమ్ చిత్రాల్లో నటిస్తున్నానీ తెలిపారు. ఈ చిత్రలు విడుదలనంతరం తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు.సరే మీతో కలిసి నటించిన నటి సమంత లాంటి వాళ్లు ప్రేమించి పెళ్లికి సిద్ధం అవుతున్నారు.మీరు ఎవరినైనా ప్రేమించారా?అన్న ప్రశ్నకు తాను ప్రేమిస్తున్నాను.ఎవరినో తెలుసా సినిమాని అని తెలివిగా బదులిచ్చారు.ప్రస్తుతానికి సినిమాను తప్ప వేరెవరినీ తాను ప్రేమిచండం లేదని ప్రణీత పేర్కొన్నారు. -
నా బాధను...మాటల్లో చెప్పలేను!
పిల్లలు పరీక్షలు రాస్తుంటే తల్లిదండ్రులు కూడా రాస్తున్నట్లే. అలాగే ఇంట్లో అమ్మమ్మ - నానమ్మ-తాతయ్యలు ఉంటే వాళ్లూ రాస్తున్నట్లే. పిల్లలను చదివిస్తూ, నానా హైరానా పడిపోతుంటారు. ఇది పరీక్షల సీజన్ కాబట్టి, ప్రణీత తన ఫ్లాష్‌బ్యాక్ గుర్తు చేసుకున్నారు. చదువుకొనే రోజుల్లో నాయనమ్మ తనను చదివించేవారని ప్రణీత చెబుతూ - ‘‘పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా నానమ్మ నన్ను బాగా చదివించేది. తెల్లవారుజామునే నాతో పాటు తను కూడా నిద్ర లేచేది. ముఖ్యంగా కన్నడ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా అనిపిస్తే, తనే చదివి అర్థం చెప్పేది. అంతలా పెంచిన మన పెద్దల కోసం మనం పెద్దయ్యాక సమయం కేటాయించం. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను పట్టించుకోం. చిన్నప్పుడు అర్థం కాక పట్టించుకోకపోతే, టీనేజ్‌లోకొచ్చాక టైమ్ లేక పట్టించుకోం. తీరా కొంత వయసు పెరిగి, పరిణతి వచ్చాక పట్టించుకుందామనుకుంటే మనల్ని పట్టించుకునే స్థితిలో వాళ్లు ఉండకపోవచ్చు. అందుకే, ఇప్పుడు మా నానమ్మకు నేను సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఏవేవో ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాను. కానీ, అర్థం చేసుకునే పరిస్థితిలో ఆమె లేదు. అసలు తను ఇంత ముసలావిడ ఎప్పుడు అయ్యిందో తెలియనంతగా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మా నానమ్మ ఒక పసిపాప లాంటిది. ఎవరి సహాయమూ లేకుండా తను నడవలేదనీ, తినలేదనీ తల్చుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఆవిడ గది వైపుగా వెళుతునప్పుడు తన కేర్ టేకర్‌తో నానమ్మ పొందిక లేని, స్పష్టంగా లేని కథలు చెప్పడం వినపడుతుంది. అప్పుడు నాకు కలిగే బాధను మాటల్లో చెప్పలేను. అందుకే, పెద్దవాళ్లు బాగున్నప్పుడే వాళ్ల కోసం మనం సమయం కేటాయించాలి’’ అన్నారు. -
12 న్యూ ఇయర్ విషెస్
ఇంటర్వ్యూ ఆల్చిప్పల్లాంటి కళ్లు, శిల్పం లాంటి శరీరాకృతి ఉన్న ఏ అమ్మాయినైనా ‘బాపు బొమ్మ’ అంటారు. ప్రణీత అలా ఉంటుంది కాబట్టే ‘అత్తారింటికి దారేది’లో ‘అమ్మో బాపుగారి బొమ్మో...’ అంటూ ఆమెను ఉద్దేశించి పాట రాసి ఉంటారు. బాపు కుంచె నుంచి జాలువారకపోయినా బాపూ బొమ్మ అనిపించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో బ్రహ్మోత్సవం, చుట్టాలబ్బాయ్ చిత్రాలతో పాటు కన్నడంలోనూ ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో ప్లాన్స్ ఏంటని అడిగితే... కొత్త సంవత్సరాన్ని నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలంటే అందరూ ఇవి పాటించాలంటూ 12 సూత్రాలు చెప్పింది. అవే తను ఇచ్చే న్యూ ఇయర్ విషెస్ అంది. అవే ఇవి... 1. దేశంలో ఉన్న అందరికీ మనం సహాయం చేయాలన్నా చేయలేం. కానీ, మన కంటి ఎదురుగా ఉన్నవాళ్లకి చేయగలం కదా! అలా అయినా కొందరికి ఓ దారి చూపించాలి. 2. విద్యాదానం ఎంతో గొప్పదంటారు. అందుకే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి చదువుకోలేనివారిని చదివించాలి. 3. ఎటువంటి పరిస్థితుల్లోనూ రూల్స్‌ని వయొలేట్ చేయకూడదు. ఉదాహరణకు.. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం చాలా ముఖ్యం. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం. ఇలాంటివన్నీ జాగ్రత్తగా పాటించాలి. 4. మన ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలనుకుంటాం. కానీ రోడ్డు మీద అడ్డమైన చెత్తనూ పడేస్తాం. అలా చేయకూడదు. చెత్త పడేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ని ఉపయోగించుకోవాలి. 5. రోడ్లు మీద వెళుతున్నప్పుడు ఎవరైనా హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయినా, యాక్సిడెంట్‌కి గురైనా ఆంబులెన్స్‌కి కాల్ చేయాలి. మనకెందుకులే అని మన దారిన మనం వెళ్లిపోతే... రేపు మనకే ఆ పరిస్థితి రావచ్చేమో ఎవరు చెప్పగలరు! 6. నలుగురూ ఇబ్బందిపడే పనులు అస్సలు చేయకూడదు. ఉదాహరణకు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చకూడదని తెలిసినా కాల్చేస్తారు. అలాగే కొందరు మద్యం తాగి రచ్చ చేస్తుంటారు. అలాంటివి చేయకూడదు. 7. హోటల్స్‌లో సర్వర్స్‌ని కొంతమంది చాలా చీప్‌గా చూస్తారు. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. మనలాగే వాళ్లూ మనుషులే అన్న విషయం గుర్తించాలి. 8. పరాయి సొత్తు కొల్లగొట్టాలనుకోవడం చాలా తప్పు. ఎప్పుడైనా కానీ, కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే నిజమైన ఆనందాన్నిస్తుంది. 9. జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యసాధన కోసం పాటు పడటంలో ఓ మజా ఉంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. 10. ఆత్మస్థయిర్యం కోల్పోకూడదు. చెడు జరిగినప్పుడు ముందున్నవి మంచి రోజులే అనుకోవాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. 11. అసూయ, అసహనం, ఆగ్రహం వంటివన్నీ జీవితానికి శత్రువుల్లాంటివి. వాటిని దగ్గరకు రానివ్వకూడదు. 12. జీవితం చాలా చిన్నది. అందుకే ఉన్నంతలో తృప్తిగా, ఆనందంగా బతకాలి. ఎప్పుడూ బెంగళూరులో మా ఇంట్లోనే జరుపుకోవడం అలవాటు. విదేశాల్లో షూటింగ్స్ ఉంటే తప్పదనుకోండి. షూటింగ్ లేకపోతే మాత్రం మంచి ఫుడ్ తింటూ, మ్యూజిక్ వింటూ ఫ్యామిలీ మెంబర్స్‌తో సెలెబ్రేట్ చేసుకుంటా. ఆ రోజు బయటకు వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఒకవేళ వెళ్లినా మా కుటుంబ సభ్యులతోనే వెళ్తాను. వాళ్లతోనే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాను. అయినవాళ్లతో గడపడంలో ఉండే ఆనందమే వేరు! -
డైనమైట్ లాంటివి ఎప్పుడో కానీ దొరకవు
‘‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్.. ఇదే నేను నమ్మిన సిద్ధాంతం’’ అంటున్నారు ప్రణీత. మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నానంటున్నారీ కన్నడ భామ. దేవా కట్టా దర్శకత్వంలో విష్ణు సరసన ఆమె నటించిన ‘డైనమైట్’ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రణీతతో జరిపిన ఇంటర్వ్యూ... ‘డైనమైట్’లో రిస్కీ ఫైట్స్ చేశారట..? మామూలుగా యాక్షన్ సినిమాలంటే హీరోయిన్ని విలన్ తోసేయగానే ఫ్రేమ్ నుంచి అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోపై యాక్షన్ సీన్స్ తీస్తారు. ఈ చిత్రంలో ప్రతి యాక్షన్ ఎపిసోడ్లో హీరోయిన్ ఉంటుంది. అది నాకు నచ్చింది. ఇలాంటి పాత్రలు ఎప్పుడో కానీ రావు. ఆ యాక్షన్ సీన్స్‌లో మీకు దెబ్బలేమైనా తగిలాయా? బాగా తగిలాయి. ఒకసారి మోకాళ్లయితే నీలం రంగులోకి మారిపోయాయి. విలన్ నన్ను వెంటాడుతుంటే నేను కూరగాయల బండి మీద నుంచి దూకాలి. అప్పుడు మోకాలికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఓ ఫైట్ తీస్తున్నప్పుడు గోరుకి ఘోరమైన దెబ్బ తగిలింది. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి దెబ్బలు కామన్. ఈ సీన్స్ తీసే ముందు చాలా రిహార్శల్ చేశాం. కానీ, ఎంత రిహార్శల్స్ చేసినా సీన్స్ తీసేటప్పుడు అనుకోకుండా దెబ్బలు తగులుతుంటాయి. ఇంతకూ ఈ చిత్రంలో మీ పాత్ర? మోడ్రన్ అమ్మాయిని. ఇప్పుడు సిటీ అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి అమ్మాయిని. ఆ అమ్మాయిని హీరో ఓ సందర్భంలో కలుస్తాడు. అప్పట్నుంచీ ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం. ఆ ట్రావెల్ ఎందుకు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాతో సోలో హీరోయిన్గా మీకు ప్రమోషన్ లభిస్తుందనుకుంటున్నారా? లభిస్తుందనే అనుకుంటున్నాను. సోలో హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అనే విషయాన్ని పక్కన పెడితే ఇంత మంచి సినిమాలో చేసినందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కథలో నా పాత్రక్కూడా ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో ఫైట్స్ జరిగేదంతా హీరోయిన్ కోసమే. కథలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుంది. ఎలాగూ ఈ చిత్రంలో చిన్న చిన్న ఫైట్స్ చేశారు కాబట్టి, ఇక పూర్తి స్థాయి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలొస్తే చేస్తారన్న మాట? యాక్చువల్‌గా నాకు ఫైట్స్ చేసే సీన్ లేదు. అందుకే, డూప్‌తో చేయిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ, విజయన్ మాస్టర్ ‘నువ్వు చేయగలవ్’ అంటూ చేయించారు. యాక్షన్ అంటే ఏదో భారీగా చేయలేదు. విలన్ తోసేసినప్పుడు పడిపోవడం కూడా యాక్షనే. అలా పడటం మామూలు విషయం కాదు. ఒకవేళ ఈ సినిమాలో నేను చేసిన చిన్న చిన్న యాక్షన్ సీన్స్‌ని బాగా రిసీవ్ చేసుకుంటే, అప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ మూవీ గురించి ఆలోచిస్తా. ‘డైనమైట్’లో మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏది? కొన్ని టేబుల్స్ వరుసగా ఉంటాయి. విష్ణు నన్ను కాపాడటానికి తోస్తారు. అప్పుడు నేను టేబుల్ కింద నుంచి దూసుకుంటూ ముందుకెళ్లాలి. ఆ సీన్‌కి ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. ఈ చిత్రం షూటింగ్ చేసినప్పుడు ఉదయం నిద్ర లేవగానే, ‘ఈరోజు బిల్డింగ్ నుంచి దూకడమా? పరిగెత్తడమా? ఏం చేయమని చెబుతారో’ అనుకుంటూ షూటింగ్‌కి రెడీ అయ్యి వెళ్లేదాన్ని. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండేది. హీరో విష్ణు గురించి చెప్పండి? విష్ణు చాలా డిఫరెంట్. ఆయన ఆలోచనలన్నీ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయి. ఎక్కువ హాలీవుడ్ చిత్రాలు చూస్తారు. ముఖ్యంగా ఫిట్నెస్ అయితే ఎక్స్లెంట్. ఆయనతో పాటు ట్రైనర్ కూడా ఉండేవారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విష్ణు చాలా వర్కవుట్స్ చేశారు. నేను కూడా తన నుంచి కొన్ని టిప్స్ తీసుకున్నాను. దేవా కట్టా దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపించింది? దేవా కట్టా ఆలోచనలు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఇది తమిళ చిత్రానికి రీమేక్. తెలుగుకి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే చేశారు. అలాగే, మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. సెకండ్ లీడ్ రోల్స్‌పై మీ అభిప్రాయం? మెయిన్, సెకండ్ లీడ్ రోల్స్ గురించి నేనెలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వను. నాకిచ్చిన పాత్రను నేను చక్కగా క్యారీ చేయగలనా? లేదా అని చూసుకుంటాను. ఈ మధ్య సూర్యగారు చేసిన ‘రాక్షసుడు’లో నాది చాలా చిన్న పాత్ర. కానీ, థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు నా పాత్ర గుర్తుండిపోతుంది. అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా? చేస్తాను. హీరో ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడు హీరోయిన్‌కి కూడా ప్రాధాన్యం ఉంటే బాగుంటుంది. ‘డైనమైట్’ అలాంటి చిత్రమే. ఇందులో నా పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది కాబట్టే, నేనీ చిత్రం గురించి ఇంతగా మాట్లాడగలుగుతున్నాను. తెలుగు బాగా మాట్లాడుతున్నారు... త్వరలో మీ పాత్రకు డబ్బింగ్ చెప్పేస్తారా? నా స్టాఫ్‌కి తెలుగు తప్ప వేరే తెలియదు. వాళ్లతో మాట్లాడటంవల్ల నాక్కూడా తెలుగు వచ్చేసింది. డబ్బింగ్ గురించి భవిష్యత్తులో ఆలోచిస్తాను. -
సినిమా రివ్యూ: రభస
ప్లస్ పాయింట్స్: జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సమంత, ప్రణీత గ్లామర్, బ్రహ్మానందం కామెడీ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, పేలవమైన కథనం మితిమీరిన ఫైట్స్ ఓ అమ్మాయి ప్రేమను కాపాడే పయత్నంలో మరో అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి కారణమవుతాడు కార్తీక్(జూనియర్ ఎన్టీఆర్). తన తండ్రి(నాజర్) అవమానించిన తన మేనమామ ధనుంజయ్ (షియాజీ షిండే) బుద్ది చెప్పి, తన తల్లి కోరిక మేరకు తన మరదలు చిట్టి అలియాస్ ఇందు(సమంత)ను పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ చేరుకుంటారు. తన మరదలు అని తెలియకపోవడంతో మొదటి కలయికలోనే ఇందు,కార్తీక్ ల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. తన మరదలిని ప్రేమలోకి దించే ప్రయత్నంలో భాగ్యం(ప్రణితి)ను ఇందుగా భావించి ప్రేమలోకి దింపుతాడు. కార్తీక్ చెడ్డవాడు అనే భావనలో ఉన్న ఇందు..వారిద్దరి విడగొడుతుంది. భాగ్యంతో ప్రేమను విడగొట్టిన ఇందు అప్పటికే తనకు తెలియని వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న తన తండ్రి ప్రయత్నాలకు దూరంగా పారిపోవడానికి కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. కథ ఇలా నడుస్తుండగా.. పెద్దిరెడ్డి (జయప్రకాశ్) ఓబుల్ రెడ్డి (అజయ్)ల గ్యాంగ్ కార్తీక్ కోసం వెదుకుతుంటారు. ఓదశలో కార్తీక్, ఇందులు పెద్దిరెడ్డి ఇంట్లోకే చేరుతారు. తనను వెతుకున్న విలన్ల ఇంటికి చేరిన కార్తీక్ ఏం చేశాడు. ఇందు తన మరదలే అని తెలుసుకున్నాడా? తెలియని వ్యక్తితో ప్రేమలో పడిన ఇందు తన ప్రేమికుడిని కలుసుకుందా? పెద్దిరెడ్డి, ఓబుల్ రెడ్డిలు కార్తీక్ ను ఎందుకు వెతుకుతున్నారు? అయితే ఇందు తన మరదలు అని తెలుసుకుంటాడా? తన కారణంగా ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న కార్తీక్ ఏం చేశాడు? తన మామ ధనుంజయ్ ను ఎలా కన్విన్స్ చేసి ఇందును పెళ్లి చేసుకున్నాడా? అనే పలు ప్రశ్నలకు సమాధానమే 'రభస' ప్రేమికుడిగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఓ వ్యక్తిగా, తన తల్లిని మాటను తీర్చే కోడుకుగా, పగ ప్రతీకారంతో రగిలిపోతున్న రెండు ఫ్యాక్షన్ల కుటుంబాలను కలిపే మనసున్న మనిషిగా, తన మేనమామకు తగిన గుణపాఠం నేర్పే అల్లుడిగా.. పలు విభిన్న షేడ్స్ ఉన్న కార్తీక్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశాడు. గత కొద్దికాలంగా సరైన హిట్ లేని.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రయోగాలకు చోటివ్వకుండా చాలా సేఫ్ గా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే ఫైట్స్, డ్యాన్స్, అభినయం, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. సమంత పాత్ర ప్రధానంగా గ్లామర్ కే పరిమితమైన, కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. ప్రణీత రెండో హీరోయిన్ గా కనిపించి.. కథానుగుణంగా కనిపించి మాయమవుతుంది. ప్రణీత కెరీర్ కు పెద్గగా ప్లస్ అవుతుందని చెప్పడం కష్టమే. రాజు పాత్రలో కనిపించిన బ్రహ్మనందం రోటిన్ కారెక్టర్ అయినప్పటికి.. ద్వితీయార్ధంలో సినిమా భారాన్ని తనపైనే వేసుకున్నాడు. ఫైట్స్ తో విసిగించే సమయంలో రాజుగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులకు బ్రహ్మనందం కొంత రిలీఫ్ కలిగించాడు. జయప్రకాశ్, నాగినీడు, అజయ్, షియాజీ షిండే, నాజర్, జయసుధలు తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు. సాంకేతిక నిపుణులు పనితీరు: సాంకేతిక విభాగంలో ముఖ్యంగా శ్యామ్ కే నాయుడును అందించిన ఫోటోగ్రఫి బాగుంది. లోకేషన్లు ఆందంగా చిత్రీకరించి.. రభసకు అదనపు ఆకర్షణగా మారారు. ఈ చిత్ర నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాలకు పైనే ఉంది. ఎడిటింగ్ విభాగంలో కోటగిరి వెంకటేశ్వరరావు మరింత పదను పెట్టాల్సిందే. ఓ రెండు పాటలు మినహా తమన్ ప్రభావవంతమైన సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. ఎమోషన్ సీన్స్ లో నేపథ్యం సంగీతంగా అంతగా ఆకట్టుకునే విధంగా లేదనిపిస్తోంది. 'కందిరీగ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శ్రీనివాస్ రభస కథ, కథనాన్ని చాలా కాంప్లికేటెడ్ పంథాలోనే కొనసాగించాడు. అనేక ట్విస్టులు, గందరగోళంగా ఉండే కథనంతో ప్రేక్షకుడిని అక్కడక్కడా కన్ ఫ్యూజ్ చేస్తుంది. కథాగమనంలో అనేక మలుపులు సహజంగా ఉన్నట్టు ఎక్కడా అనిపించదు. కేవలం కమర్షియల్ ఆంశాలను బేరిజు వేసుకుని కథ, కథనంపై దృష్టిపెట్టారనేది సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. అయితే తొలిభాగంలో ఓపెన్ చేసిన ట్విస్టులకు ద్వితీయార్ధంలో క్లోజ్ చేసిన తీరు, విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. చిత్ర ద్వితీయార్ధంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు దర్శకుడి ప్రతిభకు అద్దపడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా ఎలాంటి ప్రయోగాలకు చోటివ్వకుండా టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాతో కథను పట్టాలెక్కించి.. సేఫ్ గా గమ్యాన్ని చేర్చేందుకు చేసిన ప్రయత్నం కొంత వర్కవుట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిత్రంగా కాకుండా.. ఓ రకమైన సంతృప్తిని కలిగించే చిత్రంగా 'రభస' రూపొందింది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరణపైనే రభస సక్సెస్, కమర్షియల్ గా ఏరేంజ్ లో వర్కవుట్ అయిందనే అంశాలు అధారపడి ఉన్నాయి. -రాజబాబు అనుముల -
ఇప్పుడు కూడా నేను తెలియని వారున్నారా!
స్టార్డమ్ వస్తే... కనీసం సరదాగా షాపింగ్ కూడా చేసే పరిస్థితి ఉండదు. అందుకే... స్టార్లందరూ సాధారణ జీవితం అనుభవించడానికి ఇతర దేశాలకు వెళుతుంటారు. అక్కడ యదేచ్ఛగా షాపింగులు గట్రా చేస్తుంటారు. ఎందుకంటే... అక్కడి జనాలు మనవాళ్లను గుర్తు పట్టరు కాబట్టి. అది కూడా ఓ విధంగా ఓ గొప్ప అనుభూతే. అయితే... ఇక్కడున్న మన జనాలే మన స్టార్లను గుర్తు పట్టకపోతే? అది నిజంగా అవమానం. అలాంటి పరిస్థితే ఇటీవల ప్రణీతకు ఎదురైంది. ఇటీవల హైదరాబాద్‌లోనే ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లి రిబ్బన్ కట్ చేసిందట ప్రణీత. అయితే... అక్కడి ప్రణీతను చూసిన చాలామంది ‘ఎవరు?’ అని చెవులు కొరుక్కున్నారట. ఇది విని షాక్ తినడం ప్రణీత వంతు అయ్యిందట. ‘‘ ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్‌లో హీరోయిన్గా నటించిన, నేను కూడా తెలీని వారు ఉన్నారా!’’ అని సదరు సంస్థ యాజమాన్యంతో ఆశ్చర్యం వెలిబుచ్చిందట ప్రణీత. ఇది ముస్లిం ఏరియా అని, ఇక్కడ తెలుగు సినిమాలు చూడరని, బాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఈ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం సర్ది చెప్పడంతో ప్రణీత ఊపిరి పీల్చుకుందట. ఏదిఏమైనా ప్రణీతకు ఇది కాస్త చేదు అనుభవమే. -
బికినీలో ప్రణీత?
బాపుగారి సినిమాల్లో నటించకుండానే బాపుబొమ్మ అయి కూర్చుంది ప్రణీత. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మను అందరూ బాపు బొమ్మా అనే అంటున్నారు. ప్రస్తుతం ఈ బాపు బొమ్మ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో మొదటిది ఎన్టీఆర్ ‘రభస’ కాగా, రెండోది మంచు ఫ్యామిలీ సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెదా’. అయితే... ఈ రెండు చిత్రాల్లోనూ ప్రణీతను సెకండ్ హీరోయిన్ పాత్రలే వరించాయి. తన తొలి విజయం ‘అత్తారింటికి దారేది’లో సెకండ్ హీరోయిన్ పాత్ర చేయడం వల్ల... తర్వాతి చిత్రాల్లో కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలే రావడం ప్రణీతను వేదనకు గురిచేస్తున్న అంశం. సాటి హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్‌ని పలికించినా... సరైన అవకాశాలు రాకపోవడంతో... తన అంబుల పొదిలోంచి చివరి అస్త్రాన్ని సంధించడానికి ప్రణీత సంసిద్ధమయ్యారు. తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో బికినీలో సాక్షాత్కరించబోతున్నారట. వెయిట్ అండ్ సీ. -
‘మగధీర’ను క్రాస్ చేసింది!
‘‘ఈ చిత్రానికి నేను నిర్మాత అవ్వడం నా అదృష్టం. ఇంత మంచి చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చిన హీరో, దర్శకుడికి నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు డబుల్ థ్యాంక్స్’’ అన్నారు బీవీయస్‌యన్ ప్రసాద్. పవన్‌కల్యాణ్, సమంత, ప్రణీత నాయకా నాయికలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘అత్తారింటికి దారేది’ విడుదలై, 25 రోజులైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘మగధీర’ నిర్మాణంలో నాకూ ఓ భాగం ఉంది. ఇప్పుడు నిర్మించిన ‘అత్తారింటికి దారేది’ కొన్ని ఏరియాల్లో ‘మగధీర’ను క్రాస్ చేసింది. మిగతా ఏరియాల్లో కూడా అధిగమిస్తుందనే నమ్మకం ఉంది. అన్ని థియేటర్లలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. కచ్చితంగా వంద కోట్లు చేసే అవకాశం ఉందనిపిస్తోంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ -‘‘ఈ సినిమా విడుదలకు ముందే పైరసీకి గురైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఘనవిజయం సాధించడం ఆ భగవంతుడు మాకిచ్చిన బహుమతి. 50 రోజుల్లో వస్తాయనుకున్న వాసూళ్లు 25 రోజులకే రావడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది నంబర్‌వన్ హిట్ అని చెబుతున్నారు. ఈ చిత్ర హీరో, దర్శక, నిర్మాతలు చాలా మంచివాళ్లు. వాళ్ల కోసమే ఈ సినిమా విజయం సాధించాలని కోరుకున్నా. నా సొంత సినిమాలా భావించి చేశా. ఇంతటి సూపర్‌హిట్ మూవీలో నటించడం నా లక్‌గా భావిస్తున్నా. త్రివిక్రమ్‌గారు బెస్ట్ రైటర్ మరియు బెస్ట్ డెరైక్టర్. హీరో, నిర్మాతతో ఎలా ప్రవర్తిస్తారో హీరోయిన్, ఇతర యూనిట్ సభ్యులతోనూ అలానే ఉంటారు. ఇందులో పవన్ నన్ను ఓ పాటలో వళ్లో కూర్చొబెట్టుకుంటారు. ఆ సీన్ గురించి త్రివిక్రమ్ చెప్పగానే, మరో మాట మాట్లాడకుండా చేశారు. అలాగే ఆడియో వేడుకలో పవన్ నన్ను అభినందించినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే, ఆయన ఎవర్నీ పొగడరు. అలాంటి పవన్ నన్ను అభినందించడం విని, నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి’’ అని చెప్పారు.