హీరోయిన్ ప్రణీత సుభాష్ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసింది. గతేడాది చిరకాల ప్రయుడు నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆమెకు ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో అర్టిస్ట్‌లపై ఆమె పెట్టిన పోస్ట్ హాట్‌టాపిక్ మారింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రణీత ఏం చెప్పిందంటే.. ‘అర్టిస్టులకు సంబంధించిన ఎలాంటి విషయమైన కాస్తా ఆసక్తిగానే ఉంటుంది. అందుకే ఇలాంటి నిలకడ లేని జీవితాలను ఎంచుకుంటాం. ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు. మా శరీరాలను అంత్యంత కఠిన పరిస్థితుల్లో పడేస్తాం. అర్టిస్టుల జీవితాలు మొత్తం కష్టాలు, ఒడిదుడుకులు, కొన్నిసార్లు అంధకారంతో నిండి ఉంటాయి’ అని ఉంది.
చదవండి: కీరవాణి కంపోజ్ చేసిన ఆ పాట అంటే ఇరిటేషన్: ఎన్టీఆర్
అలాగే ‘సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను కాస్త వ్యవధిలోనే చూసేస్తాం. ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం మేం కూర్చుంటాం, లేస్తాం, తింటాం, పడుకుంటాం. అయినా మేం గౌరవం లేని జీవితాలను గడుపుతుంటాం. ఆనారోగ్యకరమైన షెడ్యూల్‌లో పనిచేస్తుంటాం. చలికి వణుకుతూ.. వర్షంలో తడుస్తూ.. ఎండలో ఎండుతూ పని చేయాలి. పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబానికి, స్నేహితులకు, బంధువులకు దూరంగా పనిచేస్తుంటాం. మా సామర్థ్యానికి మించిన పని చేస్తాం. ఇదంతా ఓ ఆర్ట్ కోసమే.. ఒక మంచి బ్రేక్ పాయింట్ కోసమే. సంతోషపెట్టే ఓ క్షణం కోసమే' అంటూ ప్రణీత ఓ బ్రీఫ్ కోట్‌ను షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా 'ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ భామ.
చదవండి: అందుకే ఫిలిం మేకర్‌గా నేను ఫెయిల్యూర్: రాజమౌళి షాకింగ్ కామెంట్స్
గుండ్రని కళ్లు, చక్కని చిరునవ్వు.. అంతకుమించిన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచింది. వెంటనే సిద్ధార్థ్ సరసన 'బావ' మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ మూవీతో రాత్రికిరాత్రే స్టార్‌డమ్ తెచ్చుకున్న ప్రణీత.. ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, అత్తారింటికి దారేదిలో సెకండ్ హీరోయన్ రోల్ కొట్టేసింది. వీటి తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. చివరగా ఆమె రామ్ పోతినేని ‘హాలో గురు ప్రేమకోసమే’ మూవీలో కనిపించింది. ఈ క్రమంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. హిందీలో రెండు సినిమాలు చేసిన ప్రణీతకు అక్కడ కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది ప్రణీత.
Comments
Please login to add a commentAdd a comment