Pranitha: రెండోసారి గుడ్‌ న్యూస్‌ చెప్పిన హీరోయిన్‌ | Actress Pranitha Subhash Announces Her Second Pregnancy, Instagram Post Goes Viral | Sakshi
Sakshi News home page

Pranitha Subhash Pregnancy: రౌండ్ 2 అంటూ.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన హీరోయిన్‌

Published Thu, Jul 25 2024 11:38 AM | Last Updated on Thu, Jul 25 2024 12:13 PM

Pranitha Subhash Again Announced Her Pregnancy

హీరోయిన్ ప్ర‌ణీత సుభాష్ రెండోసారి త‌ల్లికాబోతుంది. రౌండ్‌ 2 అంటూ పరోక్షంగా ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తెలుగులో సుమారు 10 సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది చిత్రంతో ఎక్కువగా పాపులర్‌ అయింది. టాలీవుడ్‌లో పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్‌, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో తాను చివరిగా నటించిన చిత్రం ఎన్టీఆర్: కథానాయకుడు, అయితే, ఈ ఏడాదిలో కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది.

2021లో వ్యాపార‌వేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం అయింది. అయితే, 2022 జూన్‌ మాసంలో వారికి ఆడబిడ్డ జన్మించింది. పాప పుట్టిన తర్వాత మళ్లీ పలు సినిమాల్లో కనిపించిన ప్రణీత తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది. అపై ఇలా తెలిపింది.. 'రౌండ్ 2... ఇక నుంచి ప్యాంట్‌లు సరిపోవు' అంటూ చమత్కారంగా తన సంతోషాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉంటుంది.

ప్రణీత చేస్తున్న ఈ సాయం గురించి తెలుసా..?
ప్ర‌ణీత సుభాష్ ఒక హాస్పిటాలిటీ కంపెనీలో భాగస్వామిగా ఉంది. బెంగుళూరులోని లావెల్లే రోడ్‌లో బూట్‌లెగర్ అనే రెస్టారెంట్‌ను కూడా ఆమె నడుపుతుంది. సినిమా, వ్యాపారంలో రాణిస్తున్న ప్రణీతలో మరో కోణం ఉంది. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సేవానిరతిని కూడా ఆమె చాటుకుంటోంది. అందుకోసం ప్రణిత ఫౌండేషన్‌ను స్థాపించింది. బెంగళూరులో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటికి మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య సౌకర్యాలను అందించడం ద్వారా ఆమె కర్ణాటకలో ప్రభుత్వ విద్యను ఆధునీకరించే దిశగా కృషి చేస్తోంది.  

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉండే ఒక వృద్ధాప్య ఆశ్రమం కోసం ఆమె నిధులు అందించింది. కరోనా నేపథ్యంలో ‘ఫ్రీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌’ చేపట్టింది. సమాజం కోసం తన వంతుగా సేవ చేస్తున్న ప్రణీత ఇప్పుడు మరో బిడ్డికు జన్మ ఇవ్వబోతుందని తెలియగానే ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement