
సాక్షి, చెన్నై: తనకే ఎందుకిలా జరుగుతోందని వాపోతోంది నటి ప్రణీత. మాతృ భాష కన్నడతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తోంది. అయితే దక్షిణాదిలో ఏ భాషలోనూ ప్రముఖ కథానాయకిగా పేరు సంపాదించుకోలేకపోతోంది. తెలుగులో మొదట సోలో హీరోయిన్‌గానే పరిచయమైంది. ఆ తరువాత పవన్‌కల్యాణ్ వంటి స్టార్‌కు జంటగా నటించినా సెకెండ్ హీరోయిన్ పాత్రలే వస్తున్నాయని వాపోతోంది.
ఇక తమిళంలో అయితే కార్తీకి జంటగా శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో గుర్తింపు పొందలేకపోయింది. నటుడు సూర్య హీరోగా నటించిన మాస్ చిత్రంలోనూ రెండవ హీరోయిన్ పాత్రకే పరిమితం అయ్యింది. జెమినీ గణేశనుమ్ సురుళీరాజవుమ్, ఎనక్కు వాయ్ంద అడిమైగళ్ వంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఎనక్కు వాయ్ంద అడిమైగళ్ చిత్రంలో నెగిటివ్ పాత్రను కూడా ధైర్యం చేసి పోషించింది.
అయితే ఆ పాత్రకు ఆమెకు ప్రశంసలు మాట అటుంచితే విమర్శలే ఎక్కువ వచ్చాయి. అయినా స్టార్ ఇమేజ్‌ను పొందలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా లేదు. దీంతో 'నాకే ఎందుకిలా జరుగుతోంది. నేను అందంగా లేనా, నటనా ప్రతిభను చూపడం లేదా?' అంటూ ట్విట్టర్‌లో తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రణీత ప్రస్తుతం కన్నడంలో ఒక చిత్రం, మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment