ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే! గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడిన ఆమె ఈ నెల 11న తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న ఆమె ఈ శుభవార్తను ముందుగా భర్త నితిన్‌కి చెప్పింది. ఆ తర్వాత తన పేరెంట్స్‌కు, అత్తమామలకు, అనంతరం ఫ్యాన్స్‌కు తెలియజేసింది. ఇక ప్రెగ్నెన్సీ టైంలో యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేసేందుకు ప్లాన్ చేస్తానంది.
కానీ తాజాగా 'థ్రోబ్యాక్' అంటూ ఓ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోను షేర్ చేసింది. కూ యాప్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఇంతకీ ప్రణీత గర్భం దాల్చిన తర్వాత ఈ డ్యాన్స్ చేసిందా? లేదా ఇది అంతకుముందు వీడియోనా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ప్రణీత జోష్ చూస్తుంటే డ్యాన్స్‌తో అటు బాడీని ఫిట్‌గా ఉంచుకుంటూనే మనసును సైతం ఉల్లాసంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: వందో, ఒక వెయ్యో, లక్షో కాదు.. కళావతి సాంగ్‌కు 150 మిలియన్ వ్యూస్
ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment