Koo
-
మస్క్‌కు పోటీగా ఎగసి.. అంతలోనే మూతపడిన ఇండియన్ యాప్
ఇలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)కు పోటీగా వచ్చిన భారతీయ స్టార్టప్ ‘కూ’ (Koo) మూతపడింది. పలు పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, సమ్మేళనాలు, మీడియా హౌస్‌లతో కొనుగోలు చర్చలు విఫలం కావడంతో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాప్ వ్యవస్థాపకులు తెలిపారు.నాలుగు సంవత్సరాల క్రితం 2020లో అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదవత్కా ‘కూ’ను ప్రారంభించారు. భారత్‌లో యూఎస్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన అనేక కంపెనీలలో ‘కూ’ ఒకటి. స్థానిక భాషలలో వినియోగదారులకు సేవలు అందిస్తోంది.‘కూ’ వ్యవస్థాపకులు రాధాకృష్ణ, బిదవత్కా బుధవారం లింక్డ్ఇన్ పోస్ట్‌లో వివరాలు వెల్లడించారు. "పలు పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, సమ్మేళనాలు, మీడియా హౌస్‌లతో" కొనుగోలు చర్చలు విఫలమైన తర్వాత ‘కూ’ను మూసివేస్తున్నట్లు తెలిపారు. కాగా బెంగుళూరుకు చెందిన న్యూస్, కంటెంట్ అగ్రిగేటర్ డైలీహంట్ ద్వారా ‘కూ’ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఫిబ్రవరిలో టెక్ క్రంచ్ నివేదిక పేర్కొంది.‘కూ’కు ఒకానొకప్పుడు దాదాపు కోటి మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు, 21 లక్షల మంది డైలీ యాక్టివ్ యూజర్లు ఉండేవారు. ప్రభుత్వంతో కలిసి ట్విటర్ కంటెంట్‌పై ఆంక్షలు తీసుకొచ్చినప్పుడు ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 2022లో ‘కూ’కు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఆ సమయంలోనే ఈ ఇండియన్ యాప్ 50 మిలియన్ యూజర్ల మార్కును దాటింది.మరియు రోగి మూలధనం" అవసరమని రాధాకృష్ణ పేర్కొన్నారు. -
నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ తదుపరి దశ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిధులు సమీకరించడం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల రాక మందగించిన నేపథ్యంలో ’కూ’ ప్లాట్‌ఫామ్ విస్తృతంగా వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించగలిగే భాగస్వామితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. (మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్) స్టార్టప్ వ్యవస్థకు 2023 అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటని మయాంక్ చెప్పారు. నిధుల ప్రవాహం ఒక్కసారిగా నిల్చిపోయిందని, దాదాపు బ్రేక్ఈవెన్కి దగ్గర్లో ఉన్నవి లేదా ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రమే నిధులు లభించాయని తెలిపారు. మరో ఆరు నెలలు సమయం లభించి ఉంటే తాము దేశీయంగా ట్విటర్‌ను (ప్రస్తుతం ఎక్స్) అధిగమించి ఉండేవారమని, కానీ పరిస్థితుల వల్ల ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) -
layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?
సాక్షి,ముంబై: ఇండియన్ ట్విటర్ ‘కూ’ కూడా ఉద్యోగులనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఏకంగా 30శాతం ఉద్యోగాలను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నష్టాలు భరించలేక, నిధులను సమీకరించలేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన ఉద్యోగులకు పరిహారం ప్యాకేజీలు, ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించడం, కొత్త ఉద్యోగాలను అన్వేషణలో సాయం అందించడం ద్వారా కూ మద్దతు ఇస్తుందని నివేదించింది. అయితే తాజా పరిణామంపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (ఫ్రెండ్ యూట్యూబ్ ఛానెల్‌ని రూ. 26వేల కోట్ల కంపెనీగా మార్చాడు, షాకింగ్ శాలరీ!) కాగా ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా మూడేళ్ల క్రితం వచ్చిన కూ ఆప్ చాలా తక్కువ సమయంలో ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా భారతీయ ఉన్నతాధికారులు, శాఖలు కూ ని ఎంచుకోవడంతో మిలియన్ల డౌన్లోడ్లతో భారీ వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణలో సవాళ్లు ఉన్నప్పటికీ, ఆపరేటింగ్‌ను కొనసాగించాలని యోచిస్తోంది. అలాగే తన సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్) 60 మిలియన్ డౌన్లోడ్లతో లాభదాయకంగా మారాలని చూస్తోందనీ, ఇతర సోషల్ మీడియా కంపెనీలలో ఒక యూజర్‌కి అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉన్న కంపెనీ తమదేనని అని సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్కా ఇటీవల పేర్కొన్నారు. కంపెనీలో సుమారు 260 మంది ఉండగా వీరిలో 30శాతం మందిని తాజాగా తొలగించింది. (ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!) -
తగ్గేదేలే.. బ్రెజిల్లో రికార్డు సృష్టించిన భారత కంపెనీ, 48 గంటల్లోనే..
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ యాప్ బ్రెజిల్లో రికార్డు సృష్టించింది. అక్కడి మార్కెట్లో ఆవిష్కరించిన 48 గంటల్లో 10 లక్షలకుపైగా డౌన్లోడ్స్ నమోదు చేసింది. ప్రస్తుతం 11 భాషల్లో కూ యాప్ అందుబాటులో ఉంది. మరిన్ని దేశాల్లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో ముమ్మరం చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. “ప్రపంచంలో కేవలం 20% మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రపంచంలోని 80% మంది తమ దేశానికి చెందిన భాషను మాట్లాడుతున్నారు. చాలా గ్లోబల్ ప్రోడక్ట్‌లు వివిధ భాషలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రారంభించినప్పటి నుంచి ఒక్క బ్రెజిల్ యూజర్ల నుంచి Koo ఇటీవల 2 మిలియన్ కూస్ (లేదా పోస్ట్‌లు), 48 గంటల్లో 10 మిలియన్ లైకులను సంపాదించిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ సంస్థలో గందరగోళం పరిస్థితి నెలకొంది. రోజుకో అంశం తెరపైకి వచ్చి రచ్చ చేస్తోంది. అంతేకాకుండా బ్లూ టిక్ వివాదం నెట్టింట దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో యూజర్లు ట్విటర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ట్విటర్, మెటా ఉద్యోగుల తొలగింపు.. రండి మీకు నేను ఉద్యోగాలిస్తా.. రతన్ టాటా బంపరాఫర్! -
ట్విటర్‌కు షాక్: ‘కూ’ దూకుడు, మస్క్‌కు నిద్ర కరువే!
న్యూఢిల్లీ: దేశీయ మైక్రోబ్లాగింగ్ యాప్ ‘కూ’ సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ టేకోవర్ తరువాత యూజర్లు తగ్గిపోతున్నారన్న అంచనాల నేపథ్యంలో ట్విటర్‌కు ప్రత్యమ్నాయంగా అమెరికాలో పాగా వేసేందుకు కూ పావులు కదుపుతోంది. త్వరలోనే అమెరికాలో సేవలను ప్రారంభించనున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ వెల్లడించారు. నమ్మండి! ఇది మన క్షణం! రాక్ చేద్దాం. యూఎస్‌లో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ కూ గురించి తెలియజేయాలని కోరారు. స్వదేశీ యాప్ 50 మిలియన్ల డౌన్లోడ్లతో ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే రెండవ మైక్రోబ్లాగింగ్ యాప్‌గా అవతరించింది. ఇండియాతోపాటు పలు దేశాల్లో మంచి ఆదరణ పొందుతున్న కూ యాప్ దాదాపు 10కిపైగా భాషల్లో అందుబాటులో ఉంది. ఇపుడిక కూ సేవలు త్వరలో అమెరికాలో పూర్తి స్థాయిలో మొదలుకానున్నాయి. మరోవైపు ట్విటర్ లాగా తాము ఎలాంటి వెరిఫికేషన్ ఎలాంటి ఫీజు వసూలు చేయమని ఇటీవల ప్రకటించడం గమనార్హం. (మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్‌పై ప్రశంసలు) కాగా మస్క్ నెలకు 8 డాలర్ల బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు నవంబరు 29 నుంచి ప్రారంభించనున్నారు. దీనికితోడు ట్విటర్‌ను మస్క్ టేకోవర్ చేసిన తరువాత, మార్పులు, చేర్పులు సంచలన నిర్ణయాలతో వివాదాస్పదంగా మారుతున్నారు. దీనికి తోడు చాలా దిగ్గజ సంస్థలు తమ యాడ్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డేస్ సేల్ అదిరే ఆఫర్లు -
ట్విటర్‌లాగా చార్జీలేమీ విధించం..
న్యూఢిల్లీ: యూజర్ల వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ట్విటర్‌లాగా చార్జీలేమి విధించబోమని, ఇది పూర్తిగా ఉచితమేనని దేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ చెప్పారు. ఆధార్ ఆధారిత స్వీయ ధృవీకరణతో పసుపు రంగు వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ని ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. బాట్స్ (రోబో) సమస్యను సృష్టించినది ట్విటరే అని రాధాకృష్ణ ఆరోపించారు. మొదట్లో వాటిని ప్రోత్సహించిన ట్విటర్ ప్రస్తుతం నియంత్రించడానికి నానా తంటాలు పడుతోందని చెప్పారు. తాము సిసలమైన మనుషులమేనని యూజర్లు ధృవీకరించేందుకు, బ్లూ టిక్ పొందేందుకు .. వెరిఫికేషన్ పేరిట చార్జీలు వసూలు చేసే ప్రయత్నాల్లో ఉందని విమర్శించారు. కూ ఈ ఏడాది తొలి నాళ్ల నుండే స్వచ్ఛంద వెరిఫికేషన్‌ను యూజర్లకు చట్టబద్ధమైన హక్కుగా ఉచితంగా అందిస్తోందని రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకూ 1,25,000 మంది భారతీయ యూజర్లు దీన్ని ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వెరిఫైడ్ బ్యాడ్జ్‌ల కోసం 8 డాలర్ల ఫీజు విధించనుండటం మొదలైనవి వీటిలో ఉన్నాయి. -
ట్విటర్‌కు సవాల్: టాప్-10 ఆల్టర్నేటివ్స్ ఇవిగో!
న్యూఢిల్లీ: టెక్ ప్రపంచంలో అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా చెప్పాలంటే, బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విటర్ డీల్‌ను చెప్పుకోవచ్చు. 44 బిలియన్ల క్యాష్ డీల్‌కు ట్విటర్‌ను టేకోవర్ చేశారు మస్క్. అయితే ట్విటర్లో చేసిన, చేయనున్న తాజా మార్పులు, చేర్పులు చాలా మంది వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇదీ చదవండి: అపుడు వేటు..ఇపుడు స్పెషల్ గిఫ్ట్: ట్విటర్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్ ముఖ్యంగా బ్లూ-టిక్ వెరిఫికేషన్ ఫీజు యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు రానున్న రోజుల్లో ఇంకా ఏమేమి వివాదాలు, సంచలనాలు రానున్నాయోనని, అటు యూజర్లు ఇటు ప్రచురణ కర్తలు, కంటెంట్ సృష్టికర్తలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివి చాలా ఉన్నప్పటికీ ట్విటర్డీల్ తరువాత ట్విటర్‌కు పెద్ద సవాలుగా మారుతున్న టాప్-10 మేజర్ ఆల్టర్నేటివ్స్ను చూద్దాం. (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) ట్విటర్‌కు టాప్- 10 మేజర్ ఆల్టర్నేటివ్ ప్లాట్‌ఫారమ్స్ బ్లూ స్కై: ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే స్థాపించిన బ్లూస్కీ యాప్. ఈ యాప్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు అక్టోబర్ ప్రకటించారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌కు ఇప్పటికే 30వేల మంది సైన్ అప్ చేసి వెయిట్ చేస్తున్నారు. తమ ప్రచురించిన కంటెంట్‌పై హక్కు, పోస్ట్‌లను వివిధ సోషల్ నెట్‌వర్క్‌లలో తరలించేందుకు ఇది వీలు కల్పిస్తుందట. కూ: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న దేశీయ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ. ఇది 200 దేశాల్లో 50 మిలియన్లకు పైగా వినియోగదారులతో ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉంది. తమకిష్టమైన భాషలో వ్యక్తీకరించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సామాజిక వార్తలు, కొత్త అప్డేట్స్ను, ట్రెండింగ్ పోస్ట్‌లు చూడొచ్చు. మిలియన్ల కొద్దీ క్రియేటర్లు, సెలబ్రిటీలు లేదా టాపిక్‌లను కూ యూజర్లు ఫాలో అవ్వొచ్చు. ఇండియాలో చాలా ప్రభుత్వ శాఖలు, అధికారులు కూయూజర్లుగా ఉన్నారు. ఇటీవల వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కూ యాప్‌లో చేరారు. మాస్టోడాన్ : దాదాపు ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్. ఇన్‌స్టాన్స్ అనే మాస్టోడాన్ నోడ్ల ద్వారా అందించే మైక్రోబ్లాగింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో కూడా యాడ్స్ ఉండవు.ప్రవర్తనా నియమావళి, సేవా నిబంధనలు, సెక్యూరిటీ ఆప్షన్స్, నియంత్రణ విధానాలు ఇందులో ఉన్నాయి. అలాగే 500 అక్షరాల లిమిట్, ఎమోజీలకు సపోర్ట్ చేస్తుంది. 10 లక్షలకుపైగా యాక్టివ్ యూజర్లు దీని సొంతం. ముఖ్యంగా అక్టోబర్ నెలలో మస్క్- ట్విటర్ టేకోవర్ తరువాత దాదాపు 500,000 మంది కొత్త వినియోగదారులను తన ఖాతాలో వేసుకుంది. టంబ్లర్: 2007లో లాంచ్ అయిన సోషల్ మీడియా వెబ్సైట్ టంబ్లర్. ఇందులో ఫోటోలు, GIFల లాంటి వాటితోపాటు, లాంగ్ పోస్ట్‌లు కూడా చేసుకోవచ్చు. మల్టీమీడియా, ఇతర కంటెంట్‌ను బ్లాగ్‌లో పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇతరుల బ్లాగ్లనూ ఫాలోకావచ్చు. డైరెక్ట్ మెసేజ్ ద్వారా చాటింగ్ చేసుకోవచ్చు. క్లబ్‌హౌస్: కోవిడ్ కాలంలో పాపులర్ అయింది. క్లబ్‌హౌస్. క్లబ్‌హౌస్ లైవ్ ఆడియో చాట్రూమ్లలకు అవకాశం కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో చాట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులోని రూమ్స్ ద్వారా ఒక వినియోగదారు ఆడియో చాట్రూమ్ని ప్రారంభించవచ్చు. ఏ అంశంపైనైనా చర్చించవచ్చు. ఇన్వైట్ ఆప్షన్ ద్వారా ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ పొందే వీలుంది. కోహోస్ట్: ఎలాంటి యాడ్స్ లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కోహోస్ట్. ఇందులో పోస్ట్‌లు ట్విటర్ లాగానే మన టైమ్‌లైన్‌లో వరుసగా ఉంటాయి. కోహోస్ట్ సబ్స్క్రిప్షన్స్ మొదలు పెడతామని కంపెనీ ఇటీవల ప్రకటించింది. పార్లర్: నాష్విల్లే బేస్ట్డ్ పార్లర్ 2018లో ఆవిష్కృతమైంది. అమెరికాలో కన్సర్వేటివ్ ఫావేరెట్గా పాపులర్ అయింది. కంటెంట్ మోడరేషన్‌కు ప్రాధాన్యమిచ్చే పార్లర్..వినియోగదారులు పోస్ట్‌లపై జోక్యం చేసుకోదు. అలాగే ఫేస్బుక్, ట్విటర్ వ్యతిరేకించే వారిలో ఎక్కువ ఆదరణ పొందింది. ట్రైబల్ సోషల్: ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో, ఆండ్రాయిడ్‌లో ఇది అందుబాటులో ఉంది. యూజర్లు వివిధ ట్రెండింగ్ అంశాలపై నిపుణులను ఇక్కడ కనుగొనవచ్చు. ట్రైబెల్ యూజర్ పోస్ట్‌లకు ఎన్ని లైక్లువచ్చాయో ట్రాక్ చేసి, జనాదరణ పొందిన పోస్ట్‌లు ,కంట్రిబ్యూటర్లను ర్యాంక్లిస్తుంది. ట్రూత్ సోషల్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎంతో ఇష్టమైన ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్.ఒక అమెరికన్ స్థాపించిన ఇది అమెరికా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యూసింక్: ఈ ప్లాట్ఫారంలో స్టోరీలు, వీడియోలు, ఫోటోలతోపాటు, బ్లాగ్లోలా లాంగ్ కంటెంట్‌ను పోస్ట్ చేయవచ్చు. ఈవెంట్లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది యూజర్లనుంచి ఫీజు వసూలు చేస్తుంది. -
మేము ట్విటర్‌లా ఫీజుల వసూలు చేయం.. ఇటు వచ్చేయండి!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా అది వైరల్‌గా మారుతుంది. ఆయన చేసే ప్రతీ పనిలో తన ట్రేడ్‌మార్క్‌ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి విమర్శలకు కూడా దారి తీస్తుంటాయి. తాజాగా ట్విటర్ టేకోవర్ తర్వాత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు మస్క్. ట్విటర్లోని బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో అది నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తాజాగా దీనిపై కూ(koo) సీఈవో, సహవ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ స్పందించారు. ఇటు వచ్చేయండి! ట్విట్టర్‌కు పోటీగా ఉన్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ (Koo) యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెట్టింట బ్లూ టిక్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కూ సంస్థ సీఈఓ రాధాకృష్ణ దీనిపై ట్వీట్ చేశారు. అందులో తాము ట్విటర్‌లా కాదని తెలుపుతూ.. ‘వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ‘కూ’ నెలకు రూ. 1,600 వసూలు చేయదని #switchtokoo" అని ట్వీట్ చేశారు. మరి ఈ ట్విట్ యూజర్లను ఆకర్షిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేసిన ఎలాన్ మస్క్ అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. ఇక భవిష్యత్తులో మరెన్ని మార్పులు వస్తాయో చూడాలి. చదవండి: ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు -
వచ్చే దశాబ్దం మనదే...
సాంకేతిక రంగంలో ప్రస్తుత వృద్ధి, భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా, వచ్చే దశాబ్దం భారతదేశానిదేనని కూ యాప్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు అప్రమయ రాధాకృష్ణ అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డిజిటల్ ఇండియా వీక్‌లో భాగంగా టెక్నాలజీ ఇండియా అండ్ ది వరల్డ్ అనే అంశంపై ’క్యాటలైజింగ్ న్యూ ఇండియా టేక్డ్’ అనే అంశంపై సదస్సులో కూ యాప్ సీఈఓ అప్రమయ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీషు మాట్లాడలేని ప్రతీ ఒక్కరి భావప్రకటనా స్వేచ్ఛ అనే కల సాకారం కోసం ప్రారంభమైన తమ స్టార్టప్ అంతకంతకూ పురోగమిస్తోందన్నారు. భారతదేశపు ప్రప్రధమ బహుభాషా మైక్రో–బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ ప్రస్తుతం వినూత్నమైన కొత్త ఫీచర్లతో సోషల్ మీడియా దిగ్గజాలకు సవాలు విసురుతోందని, నైజీరియాలో సైతం ఉపయోగించబడుతోందనీ వివరించారు.భవిష్యత్తులో ప్రపంచంలోని ఇతర దేశాలకూ కూ విస్తరించనుందన్నారు. భారత ప్రభుత్వం నిర్వహించిన ఈ డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గత సోమవారం ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమంలో స్టార్టప్ సదస్సు నిర్వహించారు. ఇందులో, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెక్ స్టార్టప్‌లు పాల్గొని, ప్రధాని మోదీ కలలుగన్న డిజిటల్ ఇండియాకు అనుగుణంగా తమ భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన అనంతరం కూ సిఇఓ తన సంతోషాన్ని కూ వేదికగా పంచుకున్నారు. ఇదో అద్భుతమైన అవకాశమని పాల్గొన్నవారిలో సానుకూల ధృక్పధం కనిపించిందని అన్నారు. Koo App Participated at the Digital India Week event at Gandhinagar! What an atmosphere of positivity here! Great to be witness to the launch of all the wonderful new digital initiatives by our very own Union Ministers @rajeev_chandrasekhar @ashwinivaishnaw under the leadership of @narendramodi. The next decade is ours 🙂. #indiastechade #diw2022 View attached media content - Aprameya Radhakrishna (@aprameya) 5 July 2022 -
బొగత... మన నయాగరా...కిషన్ రెడ్డి
ప్రస్తుతం వానలు కురుస్తున్న నేపథ్యంలో బొగత జలపాతం పర్యాటకులకు మరోసారి సందర్శనీయ ప్రదేశం గా మారింది. కనువిందు చేసే బొగత అందాలను సందర్శించాలంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కూ యాప్ పై తన అభిప్రాయం పంచుకున్నారు..."తెలంగాణ "నయాగర"గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది. ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని" ఆయన కోరారు. Koo App తెలంగాణ "నయాగర"గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది.ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని కోరుతున్నాను. View attached media content - Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 29 June 2022 -
'మా నాన్నే మా సూపర్ హీరో'!
మైక్రో బ్లాగర్ ట్విటర్ యూజర్లను దాటే లక్ష్యంగా దేశీయ సోషల్ మీడియా సంస్థ 'కూ' దూసుకుకెళ్తుంది. యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో 'కూ' 'పాపా కి లవ్ లాంగ్వేజ్' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫాదర్స్ డే సందర్భంగా వినియోగదారులు వారి తండ్రికి సంబంధించిన ఆత్మీయ కథనాలతో పాటు ఫోటోలు, మీమ్‌లు,వీడియోల ద్వారా ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకునే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా యూజర్లు వారి నాన్నల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారో గుర్తు చేస్తూ ఆయన్ని సంతోష పెట్టే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తుంది.ఈ కాంపెయిన్లో భాగంగా, కూ యాప్ ప్రత్యేక కవితల పోటీని కూడా ప్రారంభించింది, కవిత్వం ద్వారా తమ తండ్రికి కృతజ్ఞత తెలియజేసేందుకు యూజర్లను ఆహ్వానిస్తోంది. మరి ఈ పోటీల్లో మీరూ పాల్గొంటున్నారా. Koo App Baat koi bhi ho, papa se sidha reply kahan aana hai.😝 Yeh #PapaKiLoveLanguage bhi na, Daant aur Dulaar ka perfect mixture hai.🥰 Share kariye apne #PapaKiLoveLanguage & jeetiye Koo Goodies. 🎁 #FathersDay #ContestAlert View attached media content - Koo (@KooOfficial) 17 June 2022 -
ట్విటర్‌ని క్రాస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇండియన్ కంపెనీ
కోల్‌కతా: యూజర్ల సంఖ్యాపరంగా ఏడాది వ్యవధిలో దేశీయంగా ట్విటర్‌ను అధిగమించగలమని దేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ’కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ వెల్లడించారు. గత రెండేళ్లుగా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆయన తెలిపారు. గత 12 నెలల్లో 3 కోట్ల పైచిలుకు డౌన్లోడ్లు, నమోదయ్యాయని, యూజర్ల సంఖ్య 10 రెట్లు వృద్ధి చెందిందని రాధాకృష్ణ వివరించారు. 2022 ఆఖరు నాటికి ఈ సంఖ్య 10 కోట్లు దాటగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఇంగ్లీష్ భాషయేతర యూజర్ల సంఖ్యాపరంగా తాము ట్విటర్‌ను అధిగమించామని రాధాకృష్ణ చెప్పారు. 2020 మార్చిలో ప్రారంభమైన కూ ప్రస్తుతం దేశీయంగా ఇంగ్లిష్, తెలుగు, హిందీ సహా 10 భాషల్లో కూ అందుబాటులో ఉంది. నైజీరియాలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, విదేశాల్లో విస్తరణలో భాగంగా ఇండొనేసియా మొదలైన దేశాలను పరిశీలిస్తున్నామని రాధాకృష్ణ చెప్పారు. ఇప్పటికే 45 మిలియన్ డాలర్లు సమీకరించామని, ఈ ఏడాది మరిన్ని నిధుల సమీకరణ ప్రణాళికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నకిలీ ఖాతాలు, విద్వేషాలను రెచ్చగొట్టే పోస్ట్‌ల విషయంలో తగు రీతిలో వ్యవహరించేందుకు సలహా మండలిని ఏర్పాటు చేసుకుంటున్నట్లు రాధాకృష్ణ చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 5–11 మంది సభ్యులు ఇందులో ఉంటారని, ఏడాది వ్యవధిలోగా దీన్ని ఏర్పాటు చేయగలమని ఆయన వివరించారు. చదవండి: ట్విటర్ డీల్‌కు మస్క్ బ్రేకులు -
డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన ప్రణీత
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే! గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడిన ఆమె ఈ నెల 11న తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న ఆమె ఈ శుభవార్తను ముందుగా భర్త నితిన్‌కి చెప్పింది. ఆ తర్వాత తన పేరెంట్స్‌కు, అత్తమామలకు, అనంతరం ఫ్యాన్స్‌కు తెలియజేసింది. ఇక ప్రెగ్నెన్సీ టైంలో యోగా, ఎక్సర్సైజ్లు చేసేందుకు ప్లాన్ చేస్తానంది. కానీ తాజాగా 'థ్రోబ్యాక్' అంటూ ఓ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోను షేర్ చేసింది. కూ యాప్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఇంతకీ ప్రణీత గర్భం దాల్చిన తర్వాత ఈ డ్యాన్స్ చేసిందా? లేదా ఇది అంతకుముందు వీడియోనా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ప్రణీత జోష్ చూస్తుంటే డ్యాన్స్‌తో అటు బాడీని ఫిట్‌గా ఉంచుకుంటూనే మనసును సైతం ఉల్లాసంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Koo App Dancing to drive away all the pregnancy blues 💃💃 View attached media content - Pranitha Subhash (@pranithasubhash) 24 Apr 2022 చదవండి: వందో, ఒక వెయ్యో, లక్షో కాదు.. కళావతి సాంగ్‌కు 150 మిలియన్ వ్యూస్ ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్ -
‘కూ’త పెట్టారా?
మెసేజ్‌లు టైప్ చేయడం విసుగనిపిస్తోందా.. వేరే రాష్ట్రాల్లోని స్నేహితులకు వాళ్ల భాషలోనే సందేశాలు పంపాలనుకుంటున్నారా.. బంధువులతో లైవ్ వీడియోలు పంచుకోవాలనుకుంటున్నారా.. అయితే మీరు కూత పెట్టాల్సిందేనంటున్నారు ‘కూ’ సీఈవో అప్రమేయ రాధాకృష్ణన్. తొలి దేశీ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’ విశేషాలు, ప్రయాణం, భవిష్యత్ గురించి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. అలా మొదలైంది: నేను, మయాంక్ బిడ్‌వటకా గతంలో ‘వోకల్’ పేరుతో ఓ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాం. అది కూడా స్థానిక భాషలే కేంద్రంగా పనిచేస్తుంది. ఏ అంశంపైన అయినా అడిగే ప్రశ్నలకు నిపుణుల నుంచి సమాధానాలు లభిస్తాయి. వోకల్‌ను అభివృద్ధి చేసే క్రమంలోనే స్థానిక భాషల్లో మైక్రో బ్లాగింగ్ అప్లికేషన్ అవసరాన్ని గుర్తించాం. 2019 నవంబర్‌లో మొదలుపెట్టగా 2020 మార్చికల్లా ‘కూ’ సిద్ధమైంది. మైసూరు సమీపంలోని మండ్యలో కన్నడ భాషతో ‘కూ’ మొదలైంది. 22 భాషల్లో తెచ్చేందుకు ప్రయత్నాలు గతేడాది డిసెంబర్ నాటికే దేశంలో ‘కూ’ వాడే వారి సంఖ్య 2 కోట్లు దాటింది. ప్రస్తుతం 2.5 కోట్ల వరకూ ఉంది. 5 వేల మంది సెలబ్రిటీలూ వాడుతున్నారు. ఇంగ్లిష్, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలి, మరాఠీ, అసమీస్ వంటి 10 భాషల్లో అందుబాటులో ఉంది. కేంద్రం గుర్తించిన 22 భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏంటీ ‘కూ’ ప్రత్యేకతలు?: భారతీయ భాషల్లోనే సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ‘వాయిస్ టు టైప్’ కూడా ఉంటుంది. మీ మాతృ భాషలో మాట్లాడితే ఆ మాటలు అక్షరాల్లా టైప్ అవుతాయి. ఒక భాషలోని సందేశాన్ని మిగిలిన 9 భాషల్లోకీ తర్జుమా చేయవచ్చు. బంధు మిత్రులతో లైవ్ వీడియో చేయడం, చాట్‌రూమ్ ఏర్పాటు చేసుకోవడం మిగిలిన ప్రత్యేకతలు. -
‘కూ’ యాప్‌కి నాస్కామ్ అత్యుత్తమ పురస్కారం...
మన స్వదేశీ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రసిద్ధి చెందిన కూ యాప్... అనతి కాలంలోనే అత్యధిక సంఖ్యాక ప్రజలకు చేరువవుతూ, అద్భుత విజయాలు స్వంతం చేసుకుంటోంది. అదే క్రమంలో తాజాగా నాస్కామ్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కూడా అందుకుంది. ‘నాస్కామ్ లీగ్ ఆఫ్ 10 ఎమర్జ్ 50 అవార్డ్’ను గెలచుకుంది భారతదేశపు 50 అత్యుత్తమ వైవిధ్య భరిత సాఫ్ట్వేర్ ఉత్పత్తుల తయారీ కంపెనీలను గుర్తించి ఈ అవార్డులను అందిస్తారు. ఇందులోనూ సంస్థ మరిన్ని విజయాలను స్వంతం చేసుకుని, ఎక్కువ మంది ప్రజల మీద ప్రభావం చూపిన విధానాన్ని బట్టి లీగ్ ఆఫ్ 10లో స్థానం కల్పిస్తారు. ఆ జాబితాలో ఏకైక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌గా కూ కు అగ్రస్థానం దక్కడం విశేషం. -
అభ్యంతరకర భాష..అడ్డుకోవడమే లక్ష్యం: కూ యాప్
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సవ్యమైన భాష, వ్యాఖ్యలను ప్రోత్సహించడానికి ధేశీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫార్మ్ కూ ఆధ్వర్యంలోని బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మైసూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు యాప్‌కు చెందిన కంటెంట్ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్లైన్లో సురక్షితమైన పరిస్థితులను కల్పించడానికి ఈ రెండు సంస్థలూ కలిసి పనిచేయనున్నాయి. ఆన్లైన్ బెదిరింపులు, అసంబద్ధ ఆరోపణల వాతావరణం నుండి యూజర్లకు రక్షణ కల్పించడానికి మరియు పారదర్శకమైన ప్లాట్ఫార్మ్ రూపొందించడానికి ఒప్పందం సహాయపడుతుందని ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
అనుష్కకు తగ్గని క్రేజ్..4నెలల్లో 10లక్షల ఫాలోవర్స్
దక్షిణాది హీరోయిన్లలో నెంబర్ వన్‌గా నిలిచి బాహుబలి సహా భారీ చిత్రాల్లో నటించి.. కొంత కాలం పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన అనుష్క శెట్టి ఇప్పుడు కెరీర్లో వెనుకబడ్డారు. అయితే సినిమాల్లో ఎక్కువ కనిపించకపోయినా ఆమె పట్ల ప్రేక్షకుల్లో ఆదరణ చెక్కు చెదరలేదనే విషయం తాజాగా కూ యాప్ సాక్షిగా నిరూపితమైంది. ట్విట్టర్ స్థానంలో దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫార్మ్గా శరవేగంగా భారతీయులను ఆకర్షిస్తున్న కూ యాప్ అంతకంతకూ ప్రముఖులకు కేరాఫ్‌గా మారుతోన్న నేపధ్యంలో.. రాజకీయ, సినీ రంగ సెలబ్రిటీలు కూ యాప్‌పై ఖాతాలను ప్రారంభిస్తున్నారు. అదే విధంగా 4నెలల క్రితం అనుష్క శెట్టి కూడా తన కూ యాప్ ఖాతాను ప్రారంభించింది. అయితే కేవలం 4నెలల్లోనే ఆమెకు 10లక్షల మంది ఫాలోయర్స్ ఏర్పడడం విశేషం. తాజాగా 40వ పుట్టిన రోజును జరుపుకున్న ఆమెకు ఈ స్థాయి ఫాలోయింగ్... అభిమానులు ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్‌గా మారింది. -
డౌన్‌లోడ్‌లో దూసుకెళ్తున్న ఇండియన్ ‘కూ’ యాప్
ట్విటర్‌కు పోటీగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయుల కోసం ‘కూ’ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు "కూ" సోషల్ మీడియా యాప్‌ను భారతీయులు భారీగానే ఆదరిస్తున్నారు. కూ యాప్‌ను ప్రారంభించిన 3 నెలల కాలంలోనే 5 మిలియన్ల యూజర్లను సొంతం చేరుకొని మొత్తం దీనిని 15 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. విదేశీ సోషల్ మీడియా యాప్స్‌తో పోటీపడుతూ ‘కూ’ యాప్ దూసుకెళ్తోంది. స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ కూ యూజర్ బేస్ ఇప్పుడు సుమారు 15 మిలియన్లకు చేరుకుంది. గత త్రైమాసికంలోనే ఐదు మిలియన్ల కొత్త వినియోగదారులు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. జూన్ 2022 తర్వాత ఆగ్నేయాసియా మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నప్పటికీ "కూ" భారత మార్కెట్ పై పట్టు కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం నైజీరియాలో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది. అక్కడ కూడా యాప్ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో నైజీరియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. నైజీరియాలో ఆశించిన మేర ఆదరణ ఉన్నట్లు సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించడానికి నైజీరియా, ఇతర ఆఫ్రికా దేశాలలో విస్తరణ పనులు వేగవంతం చేస్తుంది. (చదవండి: సరికొత్త యాప్‌ను లాంచ్ చేయనున్న సూపర్‌స్టార్ రజినీకాంత్..!) -
క్రికెట్ కోసం ‘కూ’ సబ్సే బడా స్టేడియమ్..
దేశీయంగా పేరొందిన మైక్రో బ్లాగింగ్ సోషల్ వేదిక కూ... క్రికెట్ ప్రేమికుల కోసం సబ్సే బడా స్టేడియం పేరిట వినూత్న క్రికెట్ అనుభవాన్ని అందిస్తోంది. తాజాగా ప్రారంభమవుతున్న టి 20 వరల్డ్ కప్‌ను పురస్కరించుకుని అందిస్తున్న ఈ వేదిక ద్వారా దేశీయ భాషలన్నింటిలోనూ క్రికెట్‌ను ఆస్వాదించవచ్చు. అదే విధంగా ఈ యాప్ వేదికగా ఇంటరాక్టివ్ సెషన్స్, వీరేంద్ర సెహ్వాగ్, నిఖిల్ చోప్రా, వెంకటేష్ ప్రసాద్, వినోద్ కాంబ్లీ తదితర లెజండరీ క్రికెటర్స్ పంచుకునే విశేషాలు, కామెంటేటర్స్, సెలబ్రిటీస్, యూజర్స్‌తో ముచ్చట్లు, లైవ్ మ్యాచ్ అప్డేట్స్, కూ ఆఫ్ ద మ్యాచ్ పేరిట అనాలసిస్, కూ ఫ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, పోల్ ఆఫ్ ద మ్యాచ్...వగైరాలన్నీ ఇందులో చోటు చేసుకోనున్నాయి. దీనితో పాటే కూ క్రియేటర్ కప్ పేరిట ఒక యూజర్ కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. ఇది మ్యాచ్‌లు, క్రీడాకారులు, విశేషాలపై అప్పటికప్పుడు మీమ్స్, వీడియోస్ సృష్టించే కంటెంట్ క్రియేటర్ల సృజనాత్మక ప్రతిభకు అద్దం పడుతుంది. క్రికెట్ అభిమానులు తమ ఫేవరెట్ క్రికెటర్లకు స్థానిక భాషలో అభినందనలు తెలియజెప్పగలిగే అవకాశం దేశంలోనే తొలిసారి తాము అందిస్తున్నామని కూ యాప్ ప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పారు. చదవండి: AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే.. -
టార్గెట్ ట్విటర్..! కాకపుట్టిస్తోన్న ఇండియన్ ‘కూ’
ట్విటర్‌కు పోటీగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయులకు ‘కూ’ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కూ యాప్‌ను భారతీయులు భారీగానే ఆదరిస్తున్నారు. కూ యాప్‌ను ప్రారంభించిన 16 నెలల కాలంలో 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. విదేశీ సోషల్ మీడియా యాప్స్‌తో పోటీపడుతూ ‘కూ’ యాప్ దూసుకెళ్తోంది. ఫేస్బుక్, ట్విటర్లకు పోటీగా...! స్వదేవీ సోషల్ మీడియా యాప్ కూ ఒక బిగ్ బ్యాంగ్‌తో ప్రారంభమైంది. యూజర్లు, కొన్ని ప్రభుత్వ అధికారుల నుంచి కూ యాప్ భారీగా ఆసక్తిని సంపాందించింది. ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో కూ యాప్ గణనీయంగా పుంజుకుంది. ప్రముఖ సోషల్‌మీడియా ట్విటర్‌ను ఎదుర్కొనేందుకు కూ యాప్ యాడ్స్ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అదిరిందయ్యా ముఖేశ్ అంబానీ.. ! జెప్‌బెజోస్, ఎలన్ మస్క్‌తో పాటు.. ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ ప్రకారం....గత 90 రోజుల్లో ఫేస్బుక్ యాడ్స్ కోసం కూ కంపెనీ సుమారు రూ. 2.4 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 2.6 లక్షల మేర కూ యాప్ ఖర్చు చేసింది. గత మూడు నెలల్లో ఫేస్బుక్లో అత్యధికంగా ఖర్చు చేసిన కంపెనీగా కూ యాప్ నిలిచింది. కూ యాప్ వ్యూహంలో భాగంగా - హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, గుజరాతీ, కన్నడ, తమిళం , తెలుగు వంటి భాషలతో యాప్‌ను రూపొందించింది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం అమెరికాకు చెందిన ట్విట్టర్‌ను వినియోగించే జాబితాలో భారత్ 22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్ 14,2019 లో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు. చదవండి: కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్‌వీర్‌సింగ్..! -
ప్రభాస్ హీరోయిన్‘కూ’ ఒక్కవారంలో 20వేల ఫాలోయర్లు
Kriti Sanon Gets More Than 20k Followers on Koo: ‘దోచెయ్’ సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన హీరోయిన్ కృతీసనన్... ఫాలోయర్ల విషయంలో రికార్డు సృష్టించారని దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ ప్రకటించింది. 'కూ'లో ఖాతా తెరిచిన వారం రోజులకే ఆమెను 20 వేల మంది ఫాలో అవుతున్నారని తెలిపింది. కాగా గత కొన్ని నెలలుగా రాజకీయ, సినీరంగ ప్రముఖులను ఆకట్టుకుంటూ అకౌంట్లు తెరిచేలా చేస్తున్నా ‘కూ’లో ఇటీవలే కృతి కూడా తన ఖాతా తెరిచారు. స్వల్ప వ్యవధిలోనే 20వేల ఫాలోయర్లను అందుకున్నారు. తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ ‘కూ’ అందుబాటులో ఉండడం, బహుభాషా చిత్రనటిగా కృతికి ఉన్న ఇమేజ్... ఈ రికార్డుకు దోహదం చేసింది. అలాగే ప్రభాస్ సరసన 'ఆదిపురుష్'లో నటించడం కూడా ఆమె ఫాలోయింగ్‌ను అమాంతం పెంచిందనేది కాదనలేని నిజం. కృతిసనన్‌కు చెందిన 4 ఫ్యాన్ క్లబ్స్ కూడా ఆమెతో పాటు కూలో తమ ఖాతాలు తెరిచాయి. కొంత కాలంగా టాలీవుడ్లో సరైన ఛాన్స్‌లు అందుకోలేకపోయిన కృతి బాలీవుడ్లో మాత్రం సక్సెస్ బాట పట్టారు. ఆమె తాజా చిత్రం 'మిమి' హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇదే మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఇటీవలే ఖాతా తెరిచిన యంగ్ బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ కూడా పెద్ద సంఖ్యలోనే ఫాలోయర్లను అందుకున్నారు. -
ట్విట్టర్‌ను వదిలేస్తున్నారు,'కూ' కు క్యూ కట్టేస్తున్నారు
ట్విట్టర్‌కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్ మీడియా నెట్ వర్క్ 'కూ' కు వరంగా మారింది. కూ' ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్ మీడియా స్టాటిటిక్స్ సెన్సార్ టవర్ తెలిపింది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం అమెరికాకు చెందిన ట్విట్టర్‌ను వినియోగించే జాబితాలో భారత్ 22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్ 14,2019 లో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు. ట్విట్టర్ కు కేంద్రానికి వైరం 2020 నాటికి కూ యాప్ ను 2.6 మిలియన్ల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. అయితే ట్విట్టర్ భారత్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందంటూ పలువురు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై కేంద్రం ట్విట్టర్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది. అయినా ట్విట్టర్ లైట్ తీసుకుంది.ముఖ్యంగా 2020-21 మధ్య కాలంలో వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళన, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సర్టిఫైడ్ బ్లూ టిక్ ను తొలగించడం, కేంద్రం తెచ్చిన ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించడంతో కేంద్రానికి - ట్విట్టర్ల మధ్య వార్ మొదలైంది. దీంతో కేంద్ర కేబినెట్ మినిస్టర్లు పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్‌లు ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి దేశీ నెట్వర్క్ కూ'ను వినియోగించడం ప్రారంభించారు. అప్పటి నుంచే ట్విట్టర్ యూజర్లు కాస్త కూ కు అలవాటు పడ్డారు. దేశీ నెట్ వర్క్ కేంద్రం - ట్విట్టర్ల వివాదం కూ' కు ప్లస్ అయ్యింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర స్థానిక భాషల్లో ఆపరేట్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన ఈ నెట్ వర్క్‌ను 85శాతం మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ట్విట్టర్ యూజర్లు కాస్త దాన్ని వదిలేసి కూ ను వినియోగించేందుకు క్యూ కడుతున్నారు.వారిలో మంత్రులు,బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్లతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ స్థానిక భాషాల్లో దేశీ యాప్‌ను వినియోగించేలా డెవలప్ చేశామన్నారు. త్వరలోనే సౌత్ ఈస్ట్ ఏసియన్ కంట్రీస్, ఈస్ట్రన్ యూరప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి : ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
‘కూ’ కోటి యూజర్ల రికార్డ్
న్యూఢిల్లీ: దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’ యూజర్ల సంఖ్య కోటి దాటింది. వచ్చే ఏడాది కాలంలో పది కోట్ల యూజర్ల మార్క్‌ను సాధించడమే తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. మార్కెట్ ఆఫర్ చేస్తున్న వృద్ధి అవకాశాల పరంగా చూస్తే తాము ఇంకా ఎంతో సాధించగలమన్నారు. ఇంటర్నెట్ యూజర్లలో 2 శాతం లోపే తమ భావాలను మైక్రోబ్లాగింగ్ వేదికలపై వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ‘‘మైక్రోబ్లాగింగ్ ద్వారా తమ గళాన్ని దేశంలో ఎవరికైనా చేరువ చేయవచ్చు. 98 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులకు దీనిపై అవగాహన లేదు’’ అని రాధాకృష్ణ చెప్పారు. ఈ మార్కెట్‌పైనే కూ దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ‘కూ’ (ట్విట్టర్ మాదిరి) ఆరంభమైన 15–16 నెలల్లోనే కోటి యూజర్ల మార్క్‌ను సాధించగా.. అందులోనూ 85 లక్షల డౌన్లోడ్లు ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాతే నమోదు కావడాన్ని గమనించాలి. ‘ప్రస్తుతం కోటిగా ఉన్న డౌన్లోడ్లు ఏడాది కాలంలో 10 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత వచ్చే కొన్నేళ్లలో 50 కోట్ల మార్క్‌ను చేరుకుంటాం’ అని రాధాకృష్ణ వివరించారు. -
కూ యాప్ ద్వారా ప్రజలకు మరింత చేరువగా సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల బాటలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా కూ యాప్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కానున్నారు. ఈ వివరాలను యాప్ ప్రతినిధులు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. భారత మైక్రో బ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన కూ యాప్... వినియోగదారులకు స్థానిక భాషలలో సైతం ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా ఈ సోషల్ వేదికపై తమ అధికారిక ఖాతాలను ప్రారంభించాయి. ఇకపై తెలుగులోనే సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారని, ప్రజలు తమ సీఎంతో https://www.kooapp.com/profile/ysjagan ద్వారా చేరువ కావచ్చునని యాప్ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ సీఇఓ రాధాకృష్ణ, సహ వ్యవస్థాపకులు మయాంక్ బిడావక్తలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తమ సోషల్ వేదిక ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఇది ఎంతో ఉపయుక్తమైన అంశమని అభిప్రాయపడ్డారు. సినీనటులు తనికెళ్ల భరణి, భాజాపా నేత విజయశాంతి, ఎల్బీ శ్రీరాం, సినీ నటి ఈషారెబ్బా, అనుష్క శెట్టి, నాగశౌర్య తదితరులు కూడా కూ యాప్‌లో తాజాగా ఖాతా తెరిచారన్నారు. -
నెటిజన్లకు షాక్, పోస్ట్‌లపై 'కూ' యాప్ కొరడా
ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ యాప్ 'కూ' యూజర్లపై కొరడా ఝుళిపించింది.కేంద్ర ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అకౌంట్లను బ్లాక్ చేసే పనిలో పడింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్రం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021కు వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా అకౌంట్లపై ఆయా సోషల్ మీడియా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 'కూ' యాప్ 3,431 సోషల్ మీడియా పోస్టులపై దృష్టిసారించింది. జులై నెలలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ విరుద్దంగా ఉన్న 498 పోస్ట్‌లను డిలీట్ చేసింది. మరో 2,933 పోస్ట్‌లను పర్యవేక్షించనుంది. కూ యాప్ వివరాల ప్రకారం.. 'ప్రో యాక్టీవ్ మోడరేట్'లో భాగంగా మొత్తం 65,280 పోస్ట్ లను దృష్టిసారించగా..వాటిలో 1,887 పోస్ట్‌లను డిలీట్ చేసినట్లు మిగిలిన 63,393 పోస్ట్‌లపై హెచ్చరికలు జారీ చేయడం, బ్లర్ చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అకౌంట్ వెరిఫికేషన్ జులైలో ఐటీ రూల్స్ అనుగుణంగా ఉన్న ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లను బ్లూటిక్ వెరిఫికేషన్‌కు అప్లయ్ చేయాలని సూచించింది. తాజాగా కూ యాప్ సైతం ఎల్లో టిక్ వెరిఫికేషన్‌కు అప్లయ్ చేయాలని కోరింది. కాగా, బ్లూటిక్, ఎల్లో టిక్ వెరిఫికేషన్ అకౌంట్ కావాలంటే ప్రముఖులై ఉండాలి. ఉదాహరణకు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినిమా స్టార్స్, స్పోర్ట్స్ పర్సన్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా ఆయా రంగాల్లో రాణిస్తున్న వారి సేవలకు గుర్తుగా ఆయా సోషల్ మీడియా సంస్థలు ఈ వెరిఫికేషన్ అకౌంట్లను అందిస్తుంటాయి. -
ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్ ఖాతాను "యుఎస్ఎ డీజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని" ఉల్లగించారు అనే ఆరోపణతో ఈ రోజు దాదాపు గంటపాటు తన ఖాతాను బ్లాక్ చేసింది. మళ్లీ గంట తర్వాత తన ఖాతాను అన్ బ్లాక్ చేసినట్లు రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ట్విటర్ చర్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డీజిటల్ మీడియా నైతిక నియమావళి) 2021 రూల్ 4(8) నియమాలను ఉల్లగించినట్లు ఆయన తెలిపారు. నిబందనల ప్రకారం ఖాతాను బ్లాక్ చేసే ముందు అతనికి ముందస్తు నోటీసు ఇవ్వడంలో విపలమైనట్లు పేర్కొన్నారు. ‘నేను పోస్ట్ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్ ఛానల్ గానీ కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేసినట్లు ట్విటర్ చెబుతుంది. నిజానికి ట్విటర్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడటంతోనే తన ఖాతాను బ్లాక్ చేసి ఉండవచ్చు’’ని ఇండియన్ ట్విటర్ కూ యాప్ లో కేంద్రమంత్రి పోస్ట్ చేశారు. Ravi Shankar Prasadgi@ravishankarprasad Friends! Something highly peculiar happened today. Twitter denied access to my account for almost an hour on the alleged ground that there was a violation of the Digital Millennium Copyright Act of the USA and subsequently they allowed me to access the account.(1/7) "నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించడానికి ట్విట్టర్ ఎందుకు నిరాకరిస్తో౦దో ఇప్పుడు స్పష్టమవుతో౦ది. ఎ౦దుక౦టే ట్విటర్ అనుసరిస్తే, తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా నిలిపివేయడం ఉండదు కదా.." అని భారతీయ సోషల్ మీడియా వేదిక 'కూ'లో ట్విటర్ పై వరుస వ్యాఖ్యలతో మంత్రి విరుచుకుపడ్డారు. ఇప్పటికి నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, ఏ సామాజిక మాధ్యమ వేదికైనా భారతీయ చట్టాలను, నిబందనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్రం, ట్విటర్ మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: 15 సంవత్సరాల తర్వాత రైలెక్కిన భారత రాష్ట్రపతి -
స్వదేశీ ట్విటర్ "కూ" యాప్ లో భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్రానికి, ట్విటర్ కి మధ్య టూల్ కిట్ విషయంలో ఘర్షణ జరుగుతున్న ఈ కీలక సమయంలో దేశీయ మైక్రో బ్లాగింగ్ "కూ" యాప్ సిరీస్ బి నిధుల కింద 30 మిలియన్లను సేకరించింది. అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ పెట్టుబడి నిదుల కోసం ఈ రౌండ్ కి నాయకత్వం వహించింది. ప్రస్తుత పెట్టుబడిదారులు అక్సెల్ పార్టనర్స్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్ మరియు డ్రీమ్ ఇంక్యుబేటర్ కూడా ఈ రౌండ్ లో పాల్గొన్నారు. దీంతో "కూ" యాప్ విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగి 100 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఐఎఫ్ఎల్, మిరే ఎస్టేట్స్ ఈ రౌండ్‌తో క్యాప్ టేబుల్ పైకి వచ్చిన ఇతర కొత్త పెట్టుబడిదారులు. "కూ" యాప్ అనేది భారతీయ భాషలలో అభిప్రాయాలు పంచుకునేందుకు ఉన్న ఒక మైక్రోబ్లాగింగ్ సైట్. ఇది కేవలం ఒక సంవత్సర కాలంలో దాదాపు 6 మిలియన్ల డౌన్లోడ్లను సంపాదించి ప్రతిరోజూ కమ్యూనిటీ పోస్ట్ చేసే కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్ మరియు స్మృతి ఇరానీ వంటి అనేక మంది ప్రముఖులు ఇందులో ఉన్నారు. "కూ"ని టాక్సీ ఫర్ స్యూర్ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, గతంలో మీడియా యాంట్ & గుడ్ బాక్స్ వంటి సంస్థలను స్థాపించిన మయాంక్ బిదావత్కా కలిసి స్థాపించారు. కూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “ రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఎదగడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి భారతీయుడు దగ్గరికి చేరుకోవాలని ఉత్సాహంగా ఉన్నామని. ఈ కలను సాకారం చేసుకోవడానికి టైగర్ గ్లోబల్ సరైన భాగస్వామి” అని అన్నారు. చదవండి: బంగారం ప్రియులకు భారీ షాక్ -
‘కూ’ నుంచి చైనా ఇన్వెస్టరు నిష్క్రమణ
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైటు ట్విట్టర్‌కు పోటీగా తెరపైకి వచ్చిన దేశీ యాప్ ‘కూ’ నుంచి తాజాగా చైనాకు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ షున్‌వై క్యాపిటల్ వైదొలిగింది. తమ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్ నుంచి షున్‌వై తప్పుకున్నట్లు బుధవారం కూ వెల్లడించింది. కొత్తగా పలువురు ప్రముఖులు మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినట్లు వివరించింది. వీరిలో మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్, బుక్‌మైషో వ్యవస్థాపకుడు ఆశీష్ హేమ్‌రాజానీ, ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి, జిరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ డీల్స్ విలువ ఎంతన్నది మాత్రం కూ వెల్లడించలేదు. -
ఇండియన్ ట్విటర్ నుంచి చైనా ఔట్
న్యూఢిల్లీ: దేశీ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ’కూ’ యాప్ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్‌లో ఇన్వెస్ట్ చేసిన చైనా సంస్థ షున్‌వై తన వాటాలను విక్రయించి వైదొలిగే పనిలో ఉంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కి పోటీగా తెరపైకి వచ్చిన ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ ఈ విషయం తెలిపారు. కూ యాప్ మాతృసంస్థ బాంబినేట్ గతంలో తయారు చేసిన వోకల్ యాప్ కోసం షున్‌వై క్యాపిటల్ పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత బాంబినేట్ సంస్థ ప్రధానంగా ఇండియన్ ట్విటర్ "కూ" యాప్ పై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించుకోవడంతో షున్‌వై తప్పుకుంటోంది. ఆ సంస్థకున్న 9 శాతం వాటాలను దేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయనున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. ‘2018లో ప్రశ్నోత్తరాల యాప్ వోకల్‌ను మేం ప్రారంభించినప్పడు.. కంటెంట్ రంగంలో ప్రముఖ ఇన్వెస్టరయిన చైన సంస్థ షున్‌వై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో పలు కంపెనీల్లో షున్‌వై ఇన్వెస్ట్ చేసిందని, బాంబినేట్ కూడా అందులో ఒకటని వివరించారు. అప్పట్లో ‘కూ’ ని రూపొందించలేదని చెప్పారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా కూ ప్రారంభించామని, పూర్తి దేశీ యాప్‌గా జాతీయ స్థాయిలో దీనికి ఇంత గుర్తింపు వస్తుందని ఊహించలేదని రాధాకృష్ణ చెప్పారు. 3వన్4 క్యాపిటల్, యాక్సెల్ పార్ట్నర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి బాంబినేట్ ఇటీవలే 4.1 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించింది. పూర్తి స్వదేశీ యాప్‌గా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కొత్తగా మరే చైనా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించడం లేదని రాధాకృష్ణ వివరించారు. తెలుగు, హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూ యాప్ అందుబాటులో ఉంటోంది. ఇటీవలే 30 లక్షల డౌన్లోడ్లు దాటగా, పది లక్షల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. చదవండి: ‘కూ’కి క్యూ కడుతున్న నెటిజన్లు వాట్సాప్ లో సరికొత్త ఫీచర్! -
‘కూ’ కోసం దేశీ ఇన్వెస్టర్ల క్యూ!
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా తెరపైకొచ్చిన దేశీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ‘కూ’ భారీగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. టికెట్ల బుకింగ్ పోర్టల్ బుక్‌మైషో సీఈవో ఆశీష్ హేమ్‌రాజానీ, డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కొత్త ఇన్వెస్టర్లు ముందుకొస్తుండటంతో.. మరో ఉత్పత్తి కోసం గతంలో ‘కూ’లో ఇన్వెస్ట్ చేసిన చైనా సంస్థ షున్‌వై .. తన వాటాలను విక్రయించి పూర్తిగా వైదొలగాలని భావిస్తోంది. పలువురు దేశీ ఔత్సాహిక వ్యాపారవేత్తలు .. ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్నట్లు ‘కూ’ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. బుక్‌మైషో వ్యవస్థాపకుడు, సీఈవో ఆశీష్ హేమ్‌రాజానీ, బౌన్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు వివేకానంద హలెకెరె, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ సహా పలువురు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినట్లు వివరించారు. ‘దేశీ ఇన్వెస్టరు 3వన్4 క్యాపిటల్ సారథ్యంలోని ఇన్వెస్టర్లు .. ‘కూ’ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్‌లో ఇటీవలే 4.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. మా సంస్థలో భారతీయ ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులు పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనం‘ అని రాధాకృష్ణ తెలిపారు. గతంలో వోకల్ అనే ఉత్పత్తి కోసం ‘కూ’ లో ఇన్వెస్ట్ చేసిన షున్‌వై .. కొత్త ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి పూర్తిగా వైదొలగనుందని ఆయన వివరించారు. ‘ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన 3వన్4 క్యాపిటల్, కలారి తదితర సంస్థలు కూడా మరికొంత వాటాలు కొనుగోలుచేయనున్నాయి’ అని రాధాకృష్ణ తెలిపారు. పది రెట్లు పెరిగిన డౌన్లోడ్స్ .. ప్రస్తుతం ‘కూ’ యాప్‌నకు ముప్ఫై లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. ఈ వారంలో యాప్ డౌన్లోడ్లు ఏకంగా పది రెట్లు పెరిగాయి. భారతీయ వ్యవస్థాపకులు, దేశీయంగా రిజిస్ట్రేషన్‌తో పూర్తి దేశీ యాప్‌గా కూ కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు మొదలుకుని వివిధ ప్రభుత్వ శాఖలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను కట్టడి చేయాలన్న ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ ట్విటర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కేంద్ర ఐటీ శాఖ కూడా ‘కూ’ నే ఎంచుకుంది. పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు సైతం ‘కూ’ యాప్‌నకు మళ్లాలంటూ పిలుపునివ్వడంతో.. దీనికి మరింతగా ప్రాచుర్యం పెరిగింది. ఆత్మనిర్భర్ చాలెంజ్ విజేత.. ‘కూ’ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ గతంలో ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థ ట్యాక్సీఫర్ష్యూర్ను నెలకొల్పారు. ఆ తర్వాత దాన్ని మరో ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ కంపెనీ ఓలాకు విక్రయించారు. అటుపైన మయాంక్ బిదావత్కాతో కలిసి 2017లో ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ ప్రశ్నోత్తరాల ప్లాట్‌ఫాం వోకల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కూ’ ప్లాట్‌ఫామ్‌ను గతేడాది ఆవిష్కరించారు. యూజర్లు భారతీయ భాషల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికగా దీన్ని రూపొందించారు. తెలుగు, హిందీ, బెంగాలీ సహా పలు ప్రాంతీయ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ఆత్మనిర్భర్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో గెలుపొందిన వాటిల్లో ‘కూ’ కూడా ఒకటి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ టీవీ మోహన్‌దాస్ పాయ్ వంటి ప్రముఖులు .. దీనికి మద్దతుగా ఉన్నారు. గత వారమే యాక్సెల్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, డ్రీమ్ ఇన్క్యుబేటర్, 3వన్4 క్యాపిటల్ తదితర సంస్థలు ‘కూ’లో ఇన్వెస్ట్ చేశాయి. -
‘కూ’కి క్యూ కడుతున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: ట్విట్టర్ సంస్థతో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు దేశీయంగా తయారు చేసిన ట్విట్టర్ తరహా యాప్ ‘కూ’ వాడాలంటూ పిలుపునిస్తున్నారు. తమ పోస్టులను అందులోనే షేర్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు భారీగా కూ వైపు మళ్లిపోతున్నారు. ఈ వారంలోనే కూలో వినియోగదారులు పది లక్షల వరకు పెరిగారు. ఒకప్పుడు 20 లక్షల మంది యూజర్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. చదవండి: ‘కూ’ యాప్ సురక్షితమేనా? సంచలన విషయాలు ‘కూ’ అకౌంట్‌ను ఇలా ఓపెన్ చేయండి.. -
‘కూ’ యాప్ సురక్షితమేనా? సంచలన విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు ఉద్యమం సందర్బంగా కొంతమంది దేశీయ, విదేశీ ప్రముఖులు చేసిన ట్విట్లు వివాదం రేపాయి. ఈ క్రమంలో ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా దేశీయ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘‘కూ’‘ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అధికార బీజేపీ కేంద్ర మంత్రులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు కూ యాప్ వైపు షిప్ట్ కావడం చర్చకు దారి తీసింది. ఈనేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ పరిశోధకుల సంచలన విషయాలను వెల్లడించారు. కూ సురక్షితం కాదనీ, ప్రస్తుతం, ఇది ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు , పుట్టిన తేదీతో సహా చాలా సున్నితమైన వినియోగదారుల సమాచారాన్ని లీక్ చేస్తోందని ఫ్రెంచ్ భద్రతా పరిశోధకుడు రాబర్ట్ బాప్టిస్ట్ తేల్చారు. అంతేకాదు కూతో చైనీస్ కనెక్షన్‌ను చూపించే డొమైన్ రికార్డును కూడా బాప్టిస్ట్ షేర్ చేశారు. అయితే బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగేళ్ల క్రితం క్రియేట్ చేసిన డొమైన్ అని, ఇప్పటికే ఇది చాలా చేతులు మారినట్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. (ట్విటర్‌కు షాక్: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు) ట్విటర్లో ఇలియట్ ఆండర్సన్ పేరుతో ప్రసిద్ది చెందిన రాబర్ట్ బాప్టిస్ట్ తన రీసెర్చ్ వివరాలను ట్విటర్లో షేర్ చేశారు. గత రాత్రి కూ యాప్‌లో 30 నిమిషాలు గడిపాననీ, వినియోగదారుల వ్యక్తిగత డేటాను లీక్ చేస్తోందని స్పష్టం చేశారు. ఈమెయిల్, పుట్టిన తేదీ, పేరు, వైవాహిక స్థితి, జెండర్ సహా, ఇతర వివరాలు బహిర్గతమవుతున్నాయని చెప్పారు. గతంలో ఆధార్ వ్యవస్థతోపాటు, ఇతర టెక్ సేవల్లో అనేక సెక్యూరిటీ లోపాలను ఎత్తిచూపిన బాప్టిస్ట్ తాజాగా కూపై కూడా దృష్టి సారించారు. ఈ సందర్భంగా కొన్ని భద్రతా లోపాలను గుర్తించారు. ఆ మేరకు స్క్రీన్షాట్లను కూడా పంచుకున్నారు. దీంతో ఇప్పటికే ఈ యాప్‌లో చేరిన ప్రభుత్వ విభాగాలు, ఇతర సేవలు, మంత్రుల డేటాతో సహా మిలియన్ల వినియోగదారుల డేటా ఇప్పటికే లీక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. (‘కూ’ అకౌంట్‌ను ఇలా ఓపెన్ చేయండి..) You asked so I did it. I spent 30 min on this new Koo app. The app is leaking of the personal data of his users: email, dob, name, marital status, gender, ... https://t.co/87Et18MrOg pic.twitter.com/qzrXeFBW0L — Elliot Alderson (@fs0c131y) February 10, 2021 చైనా కంపెనీ పెట్టుబడులు ఆత్మనిర్భర్ యాప్‌గా చెబుతున్న కూలో చైనా కంపెనీ పెట్టుబడులు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి అనుసంధాన కంపెనీ షున్‌వేకి ఇందులో వాటాలున్నాయి. (షున్వే వెంచర్ క్యాపిటల్ ఫండ్ సంస్థ. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది). ఈ విషయాన్ని కూ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ధృవీకరించారు కూడా. షున్వే వాటాలు ఇప్పటికీ ఉన్నాయని, త్వరలో వీటిని విక్రయిస్తుందంటూ ట్వీట్ చేశారు. అయితే కూ అనేది భారతీయ వ్యవస్థాపకుల ద్వారా రిజిస్టర్డ్ కంపెనీ అనీ,రెండున్నరేళ్ల క్రితం మూలధనాన్ని సమీకరించిందని తెలిపారు.బాంబినేట్ టెక్నాలజీస్‌కు సంబంధించిన తాజా నిధులు నిజమైన భారతీయ పెట్టుబడిదారుడు 3వన్4 క్యాపిటల్ నేతృత్వంలో ఉన్నాయని వివరణ ఇచ్చారు. సింగిల్ డిజిట్ వాటాదారు షున్వే త్వరలోనే పూర్తిగా నిష్క్రమించనుంది అంటూ ట్వీట్ చేశాడు. ఫేక్ ఖాతాపై వివరణ కూ అధికారిక ఖాతాపై గందరగోళానికి కూడా రాధాకృష్ట చెక్ పెట్టారు. KooAppOfficial అనేది నకిలీదని చెప్పారు. కూ యాప్ అధికారిక ఖాతా @kooindia అని గమనించాలంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా రైతుల నిరసనలపై ట్వీట్ చేస్తున్న జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల ఖాతాలను బ్లాక్ చేయడానికి ట్విటర్ నిరాకరించడంపై ఐటీశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్విటర్ నుంచి కూ యాప్‌లోకి మారుతున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అలాగే పలువురు ప్రముఖులు దేశీ ఆత్మనిర్భర్ యాప్‌ను వాడాలని చెప్పడంతో ఒక్కసారిగా కూ యాప్ డోన్‌లోడ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. గత 24 గంటల్లో 30 లక్షలకుపైగా డౌన్లోడ్లు నమోదు చేయడం గమనార్హం. @kooindia is the official handle for #Kooapp. @KooAppOfficial is impersonating and is fake. Please follow only @kooindia — Aprameya R (@aprameya) February 11, 2021 Koo is an India registered company with Indian founders. Raised earlier capital 2.5 years ago. Latest funds for Bombinate Technologies is led by a truly Indian investor 3one4 capital. Shunwei (single digit shareholder) which had invested in our Vokal journey will be exiting fully — Aprameya R (@aprameya) February 10, 2021 -
‘కూ’ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే...
చేతిలో కత్తి ఉన్నవాడికి భయపడని లోకం నోటిలో బూర ఉన్నవాడికి వణికి చస్తుంది. ఏదో ఒకటి ఊదేస్తాడు వాడు.. ఉన్నదీ లేనిదీ. అదీ జడుపు. ట్విట్టర్ వచ్చి మనిషికొక బూర ఇచ్చింది. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. వాటీజ్ దిస్ అండీ..!’ అని కామన్ మ్యాన్ తన బూర ఊదొచ్చు. ‘మిత్రోం..’ అని మన మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. దేవుడితో డైరెక్టుగా మాట్లాడినట్లు కామన్ మ్యాన్‌తో కనెక్ట్ అవొచ్చు. అంతటి మహా ట్విట్టర్‌తో సరిపడక ఇప్పుడు భారత ప్రభుత్వం ‘కూ’ (Koo) అనే సొంత బూరల యాప్‌ను క్రియేట్ చేసుకుంది. ఇంకా కొన్ని దేశాలు ఇలాంటి ‘సొంత బూర’ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌తో ప్రభుత్వాలకు ఎందుకు పడటం లేదు? ట్విట్టర్‌పై ఉన్న విమర్శలు ఏమిటి? ఆ విమర్శలు ప్రభుత్వానివా, ప్రజలవా? ‘ఐ యామ్ నౌ ఆన్ కూ..’ అని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయల్ మంగళవారం ఒక ట్వీట్ పెట్టారు. ‘కూ’ అనేది ఇండియన్ ట్విట్టర్. మనం సొంతంగా డెవలప్ చేసుకున్నది. మేడ్ ఇన్ ఇండియా! అయితే ట్విట్టర్ ఎంత శక్తిమంతమైనదో చూడండి. ‘కూ’లో చేరిన సంగతిని కూడా మంత్రిగారు మళ్లీ ట్విట్టర్లోనే పెట్టవలసి వచ్చింది! ఆయనతోపాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ‘కూ’లో అకౌంట్ తెరిచారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా ‘కూ’ లోకి చేరాయి. ‘కూ’లో ప్రత్యేకతలకు మళ్లీ వద్దాం. అసలు ట్విట్టర్‌కు పోటీగా ‘కూ’ను మన ప్రభుత్వం ఎందుకు వృద్ధి చేసింది? డిజ్అగ్రిమెంట్! ఒప్పుదలకు అనంగీకారం. ట్విట్టర్ ఏం చేస్తే అది చెల్లుబాటు అవడం భారత్‌కే కాదు.. ప్రపంచంలోని దేశాలకు, దేశాధినేతలకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తెచ్చిపెడుతోంది. సోషల్ మీడియాలో అత్యంత శక్తిమంతమైన మైక్రో–బ్లాగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ట్విటర్ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ హద్దులు మీరుతోందన్న విమర్శలు.. ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌ని బ్యాన్ చేశాక ఎక్కువయ్యాయి. ట్విట్టర్ ఎంతో.. ‘కూ’ అంత ట్విట్టర్ అమెరికన్ మేడ్. కూ మేడిన్ ఇండియా. కూ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే ఓటీపీ అవసరం. ట్విట్టర్‌కు ఓటీపీ అక్కర్లేదు. ‘కూ’ యాప్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళ్, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, ఇంకా ఇతర భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం కోసం అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్కా అనేవారు పది నెలల క్రితం ‘కూ’ని రూపొందించారు. మోదీ తన మన్‌కీ బాత్‌లో వారిద్దరినీ ప్రశంసించారు కూడా. ఇప్పుడిప్పుడు కూ దేశానికి అలవాటవుతోంది. కూ ని గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్విట్టర్ లో మనం షేర్ చేసుకునేవన్నీ ‘కూ’లోనూ చేసుకోవచ్చు. చదవండి: 500 మంది ట్విటర్ ఖాతాలు రద్దు కూలో చేరిన కంగనా: ట్విటర్‌కు కౌంటర్ వారి ఖాతాలను బ్లాక్ చేస్తుంది మార్చి 21 వస్తే ఈ ఏడాదికి ట్విట్టర్‌కు పదిహేనేళ్లు నిండుతాయి. కువకువలాడే పక్షి ట్విట్టర్ గుర్తు. ఆ పక్షి గూడు హెడ్ క్వార్టర్స్ ఉన్నది కాలిఫోర్నియాలో. ట్విట్టర్ బాస్ జాక్ డోర్సీ. ట్విట్టర్లో ఎవరైనా అకౌంట్ తీసుకోవచ్చు. ఎవరు ఏదైనా, ఎవరు ఎవరితోనైనా మాట్లాడొచ్చు. అయితే ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలూ దెబ్బతినేందుకు లేదు. ఆ మాటలు విద్వేషాలకు కారణం అవకూడదు. స్త్రీలను ఏ విధంగానూ కించపరచకూడదు. ప్రభుత్వాలను కూలదోయకూడదు. ఇవన్నీ జాక్ డోర్సీ పెట్టిన నిబంధనలు. వాటిని యూజర్స్ ఎవరైనా ఏ రూపంలోనైనా అతిక్రమిస్తే ట్విట్టర్ ఆ అతిక్రమించిన వారి ఖాతాలను బ్లాక్ చేస్తుంది. ఇక వాళ్లు ట్వీట్ ఇవ్వలేరు. ట్వీట్లు పొందలేరు. ప్రముఖులకైతే అదొక అవమానం.. ట్విట్టర్ తమ అకౌంట్‌ను తొలగించిందంటే! చూడండి మరి. ప్రముఖుల కంటే ప్రముఖమైన మైక్రో–బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియన్ మాజీ రేసర్, ప్రస్తుతం అడల్ట్ స్టార్ అయిన రెనీ గ్రేసీల అకౌంట్లను ట్విట్టర్ ఈమధ్యనే తొలగించింది. జనవరి 6న అమెరికా పాలనా భవనం ‘క్యాపిటల్ హిల్’ లో అరాచకానికి ట్రంప్ పెట్టిన ట్వీట్లే పెట్రోలు పోశాయని నమ్మిన ట్విట్టర్ ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేసింది. ఇక రెనీ గ్రేసీ ట్విట్టర్ గూడును వదిలిపెట్టవలసి రావడానికి కారణం.. పోర్న్‌స్టార్‌గా నానాటికీ ఆమె ఫొటోలు ‘ప్రఖ్యాతిగాంచడం’. (ట్విటర్‌కు షాక్: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు) వీళ్లిద్దరే కాదు.. హాలీవుడ్ నటి రోస్ మెక్‌గోవన్, అమెరికన్ గాయని బ్యాంక్స్, అమెరికన్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ ష్రేలీ, అమెరికన్ ర్యాపర్ కర్టిస్ జాక్సన్, అమెరికన్ గాయని కోర్ట్నీ లవ్, స్వీడిష్ యూ ట్యూబర్ ప్యూడీపీ, బ్రిటిష్ గాయని అడేర్, మన దేశం నుంచి బాలీవుడ్ నేపథ్య గాయకుడు అభిజీత్ భట్టాచార్య, బాలీవుడ్ నటుడు కమాల్‌ఖాన్.. ట్విట్టర్ ఆగ్రహానికి గురై గూడు కోల్పోయిన వారిలో ఉన్నారు. మంచి పనే. తిన్నగా లేనివారిని తీసివేయవలసిందే. మరి ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిని ట్విట్టర్ తొలగించడం లేదు కదా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. ప్రశ్నిస్తున్నది ప్రజలే కనుక, ప్రజలకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుంది కనుక, ఆ స్వేచ్ఛను అకౌంట్ క్లోజ్ చేయడం ద్వారా హరించడం అప్రజాస్వామ్యం అవుతుంది కనుక తాము ఆ పని చేయబోమని ట్విట్టర్ తరచు చెబుతూనే ఉంటుంది. సహజంగానే ప్రభుత్వాలను సంతృప్తిపరచని ధోరణి ఇది. మన దేశంలోనే చూడండి. రైతు ఉద్యమానికి ట్విట్టర్ వేదికగా ప్రపంచవ్యాప్త మద్దతు లభిస్తుండటంతో ప్రభుత్వం ట్విట్టర్‌పై అసంతృప్తితో ఉంది. సెన్సార్ విధించాయి. ట్విట్టర్‌పై అసంతృప్తితో లోగడ ట్విట్టర్‌ను బ్యాన్ చేసిన, మళ్లీ యాక్సెస్ ఇచ్చిన దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాలు సెన్సార్ విధించాయి. ఫ్రాన్స్, ఇజ్రాయిల్, పాకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, టాంజానియా, టర్కీ, వెనిజులా, చైనా, ఈజిప్టు, ఇరాన్, ఉత్తర కొరియా, టర్క్మెనిస్తాన్, బ్రిటన్లు ‘ఆన్ అండ్ ఆఫ్’ ట్విట్టర్‌ను నిషేధిస్తూ, నిషేధాన్ని సడలిస్తూ వస్తున్నాయి. ఇండియా ఆ స్థాయిలో నిషేధించలేదు కానీ, అల్లర్లను ప్రేరేపించే ప్రమాదం ఉన్న కొన్ని అకౌంట్లను ట్విట్టర్ చేత బ్లాక్ చేయించగలిగింది. ఏమైనా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ట్విట్టర్ మీదే ఆధారపడి పరుగులు తీస్తున్నాయి. దేశాధినేతల మనసులోని మాట ప్రజలకు తెలియాలంటే మునుపు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు, ఆ ఏర్పాట్లు అవసరం అయ్యేవి. ఇప్పుడు పీఎం గానీ, ప్రెసిడెంటు గానీ ఇంట్లో కూర్చొని క్షణాల్లో, అదీ రెండంటే రెండే ముక్కల్లో దేశాన్నంతటినీ ఉద్దేశించి వర్తమానం ఇవ్వగలుగుతున్నారు. ఇక ప్రజా ఉద్యమాలకైతే ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌లు పెద్ద చోదకశక్తి. బ్లాక్ లైవ్జ్ మేటర్, మీటూ, బ్రింగ్ బ్యాక్ అవర్ గర్ల్స్, ఐస్ బకెట్ చాలెంజ్, స్కూల్ స్ట్రయిక్ 4 క్లైమేట్, నెవర్ అగైన్ వంటి ఎన్నో ఉద్యమాలకు ట్విట్టర్ తొలి వేదిక అయింది. ప్రజా ఉద్యమాల వరకు ప్రభుత్వం సహిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రజాఉద్యమాలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటుంది. అయితే ట్విట్టర్‌కు ఈ ఉద్యమాలతో సంబంధం ఉండదు. ఒక పరిమితి వరకు భావ వ్యక్తీకరణకు ప్లాట్‌ఫామ్ అవుతుంది. వ్యక్తీకరణ మితి మీరితే అకౌంట్లు బ్లాక్ చేస్తుంది.. పౌరులవైనా, రాజకీయ నాయకులవైనా. ఒక పెద్ద ఆన్లైన్ ప్రజాస్వామ్య రాజ్యం ట్విట్టర్. ఆ ప్రజాస్వామ్యం దుర్వినియోగం అవుతున్నట్లు అనిపించినప్పుడు పోటీగా తామూ ఒక ట్విట్టర్‌ను పెట్టుకోవాలన్న ఆలోచన ప్రభుత్వాలకు కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు మన దేశం ప్రారంభించిన ‘కూ’ కూడా ఒక ప్రత్యామ్నాయ ట్విట్టర్ వంటిదే. -
కూలో చేరిన కంగనా: ట్విటర్‌కు కౌంటర్
ఇటీవల ట్విటర్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఖాతాల తొలగింపు.. లేదా పోస్టుల డిలీట్ వంటి అంశాలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ట్రంప్ మొదలుకుని మనదేశంలో కంగనా వరకు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే సామాజిక మాధ్యమం ట్విటరే. ఇప్పుడు ఆ యాప్‌కు ప్రత్యామ్నాయంగా సరికొత్త యాప్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్‌కు దేశీయ యాప్‌గా ‘కూ’ (Koo)ను పేర్కొంటున్నారు. ఈ దేశీయ యాప్‌ను ప్రముఖులు వినియోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూశ్ గోయల్ వంటి వారు కూలో చేరారు. తాజాగా ఇటీవల ట్విటర్లో తన ట్వీట్ల తొలగింపునకు గురయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూలో చేరింది. సరికొత్త యాప్‌లో చేరిన కొద్దిసేపటికే ట్విటర్‌కు కౌంటర్ ఇచ్చింది. ట్విటర్ పనైపోయిందని తెలిపింది. ‘ట్విటర్ నీ టైమ్ అయిపోయింది. కూ యాప్‌కు హాయ్ చెప్పే సమయం వచ్చింది. త్వరలోనే అకౌంట్ వివరాలు తెలుపుతా. దేశీయంగా అభివృద్ది చెందిన యాప్ ఓపెన్ చేసినందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’ అని కంగనా ట్వీట్ చేసింది. ఈ విధంగా కూ యాప్ వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. ట్విటర్‌కే కాదు వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలో దేశీయ యాప్స్ రూపొందిస్తున్నారు. చైనా మాదిరి అన్ని స్వదేశీ సామాజిక మాధ్యమాలు రూపొందించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రోత్సాహం కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే. ట్విటర్‌కు ప్రత్యామ్నాయం ‘కూ’ రాగా, వాట్సాప్‌కు పోటీగా సందేశ్ అనే యాప్‌ను రూపొందించారు. టెలిగ్రామ్ కూడా. ప్రస్తుతం వీటి వినియోగం పెరిగింది. Your time is up @Twitter time to shift to #kooapp will inform everyone soon about my account details there. Absolutely thrilled to experience home grown #kooapp https://t.co/Kdm0TISCmR — Kangana Ranaut (@KanganaTeam) February 10, 2021 -
ట్విటర్‌కు షాక్: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్, ఖలిస్తాన్‌తో లింకులున్న ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ట్విటర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు ట్విటర్‌కు తాజాగా షాకిచ్చాయి. తాజాగా పలు ప్రభుత్వ కార్యాలయాలు స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ఆత్మనిర్భర్ అవార్డు గెల్చుకున్న ‘కూ’ వైపు అడుగులు వేశాయి. అంతేకాదు రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా కూ లో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో తనతో కనెక్ట్ అవ్వాలంటూ గోయల్ ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత ఏడాది నుంచే ఈ ప్లాట్ఫామ్లో సభ్యుడిగా ఉన్నారు. (రైతు ఉద్యమం : ఆ ఖాతాలకు షాక్) ట్విటర్ వ్యవహారంపై సీరియస్ అవుతున్న కేంద్రంతో పాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ,దాని అనుబంధ సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాలను మేడిన్ ఇండియా ట్విటర్ ప్లాట్ ఫామ్‌లోకి మార్చుకున్నాయి. డిజిటల్ ఇండియా, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి), ఇండియా పోస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్), డిజిలోకర్, కామన్ సర్వీసెస్ సెంటర్, ఉమాంగ్ యాప్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు కూడా కూలో రిజిస్టర్ కావడం విశేషం. దేశంలోని అత్యున్నత ప్రభుత్వ ఆఫీసులు తమ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాయని కూ యాప్ సీఈఓ,సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ప్రకటించారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాజా పరిణామంతో 10 నెలల క్రితం లాంచ్ అయిన కూ యాప్ డౌన్లోడ్ల సంఖ్య క్రమంగా పుంజుకుంటోంది. I am now on Koo. Connect with me on this Indian micro-blogging platform for real-time, exciting and exclusive updates. Let us exchange our thoughts and ideas on Koo. 📱 Join me: https://t.co/zIL6YI0epM pic.twitter.com/REGioTdMfm — Piyush Goyal (@PiyushGoyal) February 9, 2021