Kriti Sanon Gets More Than 20k Followers on Koo: ‘దోచెయ్’ సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన హీరోయిన్ కృతీసనన్... ఫాలోయర్ల విషయంలో రికార్డు సృష్టించారని దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ ప్రకటించింది. 'కూ'లో ఖాతా తెరిచిన వారం రోజులకే ఆమెను 20 వేల మంది ఫాలో అవుతున్నారని తెలిపింది. కాగా గత కొన్ని నెలలుగా రాజకీయ, సినీరంగ ప్రముఖులను ఆకట్టుకుంటూ అకౌంట్లు తెరిచేలా చేస్తున్నా ‘కూ’లో ఇటీవలే కృతి కూడా తన ఖాతా తెరిచారు. స్వల్ప వ్యవధిలోనే 20వేల ఫాలోయర్లను అందుకున్నారు. తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ ‘కూ’ అందుబాటులో ఉండడం, బహుభాషా చిత్రనటిగా కృతికి ఉన్న ఇమేజ్... ఈ రికార్డుకు దోహదం చేసింది. అలాగే ప్రభాస్ సరసన 'ఆదిపురుష్'లో నటించడం కూడా ఆమె ఫాలోయింగ్‌ను అమాంతం పెంచిందనేది కాదనలేని నిజం. కృతిసనన్‌కు చెందిన 4 ఫ్యాన్ క్లబ్స్ కూడా ఆమెతో పాటు కూలో తమ ఖాతాలు తెరిచాయి.
కొంత కాలంగా టాలీవుడ్‌లో సరైన ఛాన్స్‌లు అందుకోలేకపోయిన కృతి బాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ బాట పట్టారు. ఆమె తాజా చిత్రం 'మిమి' హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇదే మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఇటీవలే ఖాతా తెరిచిన యంగ్ బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ కూడా పెద్ద సంఖ్యలోనే ఫాలోయర్లను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment