ట్విటర్‌ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం | Twitter Blocks, Then Unblocks Ravi Shankar Prasad account | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం

Published Fri, Jun 25 2021 5:16 PM | Last Updated on Fri, Jun 25 2021 7:41 PM

Twitter Blocks, Then Unblocks Ravi Shankar Prasad account - Sakshi

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌ ఖాతాను "యుఎస్ఎ డీజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని" ఉల్లగించారు అనే ఆరోపణతో ఈ రోజు దాదాపు గంటపాటు తన ఖాతాను బ్లాక్ చేసింది. మళ్లీ గంట తర్వాత తన ఖాతాను అన్ బ్లాక్ చేసినట్లు రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ట్విటర్‌ చర్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డీజిటల్ మీడియా నైతిక నియమావళి) 2021 రూల్ 4(8) నియమాలను ఉల్లగించినట్లు ఆయన తెలిపారు. నిబందనల ప్రకారం ఖాతాను బ్లాక్ చేసే ముందు అతనికి ముందస్తు నోటీసు ఇవ్వడంలో విపలమైనట్లు పేర్కొన్నారు. 

‘నేను పోస్ట్‌ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్‌ ఛానల్‌ గానీ కాపీరైట్‌ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేసినట్లు ట్విటర్‌ చెబుతుంది. నిజానికి ట్విటర్‌ కు వ్యతిరేకంగా తాను మాట్లాడటంతోనే తన ఖాతాను బ్లాక్‌ చేసి ఉండవచ్చు’’ని ఇండియన్ ట్విటర్‌ కూ యాప్ లో కేంద్రమంత్రి పోస్ట్ చేశారు.

Ravi Shankar Prasadgi@ravishankarprasad
Friends! Something highly peculiar happened today. Twitter denied access to my account for almost an hour on the alleged ground that there was a violation of the Digital Millennium Copyright Act of the USA and subsequently they allowed me to access the account.(1/7)

"నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించడానికి ట్విట్టర్ ఎందుకు నిరాకరిస్తో౦దో ఇప్పుడు స్పష్టమవుతో౦ది. ఎ౦దుక౦టే ట్విటర్ అనుసరిస్తే, తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా నిలిపివేయడం ఉండదు కదా.." అని భారతీయ సోషల్ మీడియా వేదిక 'కూ'లో ట్విటర్ పై వరుస వ్యాఖ్యలతో మంత్రి విరుచుకుపడ్డారు. ఇప్పటికి నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, ఏ సామాజిక మాధ్యమ వేదికైనా భారతీయ చట్టాలను, నిబందనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. కేంద్రం, ట్విటర్‌ మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

చదవండి: 15 సంవత్సరాల తర్వాత రైలెక్కిన భారత రాష్ట్రపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement