Ravi shanker prasad
-
మళ్లీ మొదటికి వచ్చిన ట్విటర్.. గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నాన్ లోకల్..!
కేంద్రం, ట్విటర్ మధ్య ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన కొద్ది రోజులోకే ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ పోస్టు నుంచి ధర్మేంద్ర చాతుర్ ఆ పదవికి రాజీనామా చేశారు. జూన్ 9న ట్విటర్, సోషల్ మీడియా సంస్థలకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలను పాటించనునట్లు ప్రభుత్వానికి లేఖ రాసింది. కొత్త ఐటీ నిబందనల ప్రకారం భారత్‌లో ట్విట్టర్ వినియోగదారుల పీర్యాదుల కోసం మన దేశానికి చెందిన వారినే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలని కొత్త ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల ట్విట్టర్ సంస్థ ధర్మేంద్ర చాతుర్‌ని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా ఆయన స్థానంలోకి ట్విటర్ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ అయిన జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. ఇండియాలో కొత్ ఐటీ రూల్స్‌ను పాటిస్తూ ఈ ఆఫీసర్‌ను నియమించింది. అయితే నిబందనల ప్రకారం స్థానికులనే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియాయమించాలి. ఇప్పుడు ఆ నిబందనలు ఉల్లఘించడంతో ఈ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించట్లేదు. కొత్త ఐటీ గైడ్‌లైన్స్ ప్రకారం 50 లక్షల కన్నా ఎక్కువ యూజర్లు కలిగి ఉన్న సోషల్ మీడియా సంస్థలో పబ్లిష్ అయ్యే కంటెంట్‌కు సదరు సంస్థల్ని బాధ్యుల్ని చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. చదవండి: ట్విట్టర్‌కు గ్రీవెన్స్ ఆఫీసర్ ‘గుడ్ బై’ -
ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్ ఖాతాను "యుఎస్ఎ డీజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని" ఉల్లగించారు అనే ఆరోపణతో ఈ రోజు దాదాపు గంటపాటు తన ఖాతాను బ్లాక్ చేసింది. మళ్లీ గంట తర్వాత తన ఖాతాను అన్ బ్లాక్ చేసినట్లు రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ట్విటర్ చర్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డీజిటల్ మీడియా నైతిక నియమావళి) 2021 రూల్ 4(8) నియమాలను ఉల్లగించినట్లు ఆయన తెలిపారు. నిబందనల ప్రకారం ఖాతాను బ్లాక్ చేసే ముందు అతనికి ముందస్తు నోటీసు ఇవ్వడంలో విపలమైనట్లు పేర్కొన్నారు. ‘నేను పోస్ట్ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్ ఛానల్ గానీ కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేసినట్లు ట్విటర్ చెబుతుంది. నిజానికి ట్విటర్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడటంతోనే తన ఖాతాను బ్లాక్ చేసి ఉండవచ్చు’’ని ఇండియన్ ట్విటర్ కూ యాప్ లో కేంద్రమంత్రి పోస్ట్ చేశారు. Ravi Shankar Prasadgi@ravishankarprasad Friends! Something highly peculiar happened today. Twitter denied access to my account for almost an hour on the alleged ground that there was a violation of the Digital Millennium Copyright Act of the USA and subsequently they allowed me to access the account.(1/7) "నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించడానికి ట్విట్టర్ ఎందుకు నిరాకరిస్తో౦దో ఇప్పుడు స్పష్టమవుతో౦ది. ఎ౦దుక౦టే ట్విటర్ అనుసరిస్తే, తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా నిలిపివేయడం ఉండదు కదా.." అని భారతీయ సోషల్ మీడియా వేదిక 'కూ'లో ట్విటర్ పై వరుస వ్యాఖ్యలతో మంత్రి విరుచుకుపడ్డారు. ఇప్పటికి నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, ఏ సామాజిక మాధ్యమ వేదికైనా భారతీయ చట్టాలను, నిబందనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్రం, ట్విటర్ మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: 15 సంవత్సరాల తర్వాత రైలెక్కిన భారత రాష్ట్రపతి -
దేశీయంగా తయారీకి భారీ ప్రోత్సాహం
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) కింద టెలికం గేర్ల తయారీకి రూ.12,195 కోట్ల రాయితీలను ఐదేళ్ల కాలంలో ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ‘‘దీంతో వచ్చే ఐదేళ్లలో దేశంలో రూ.2.44 లక్షల కోట్ల మేర టెలికం పరికరాల తయారీ సాధ్యపడుతుంది. ఇందులో రూ.1,95,360 కోట్ల మేర ఎగుమతులు ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉపాధి లభిస్తుంది. దేశానికి పన్నుల రూపేణా రూ.17,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది’’ అని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టెలికం గేర్ల తయారీకి పీఎల్ఐ పథకం అమల్లోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో రూ.3,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ‘‘టెలికం రంగానికి పీఎల్ఐ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టెలికం ఎక్విప్మెంట్ విభాగంలో భారత్‌లో తయారీ ఊపందుకుంటుంది. 5జీ ఎక్విప్మెంట్ కూడా రానుంది. కనుక ప్రోత్సాహకాలు ఇవ్వడం అన్నది కీలక నిర్ణయం అవుతుంది. భాగస్వాములతో ఇప్పటికే విస్తృతమైన సంప్రదింపులు చేశాము’’ అని మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. రూ.50వేల కోట్లకు పైగా టెలికం ఉపకరణాల దిగుమతులకు పీఎల్ఐ పథకం చెక్ పెడుతుందని.. భారత తయారీ ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌కు, ఎగుమతి మార్కెట్లకు అందించడం సాధ్యపడుతుందని ప్రభుత్వం సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. 4 నుంచి 7 శాతం రాయితీలు టెలికం ఉపకరణాల తయారీపై 4 శాతం నుంచి 7 శాతం వరకు అమ్మకాల్లో రాయితీలను ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కింద రాయితీలకు ఎంఎస్ఎంఈలు అయితే కనీసం 10 కోట్లు, ఇతరులకు రూ.100 కోట్ల పెట్టుబడుల నిబంధన అమలు చేయనున్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి త్వరలోనే పీఎల్ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. దేశంలో 2014 నాటికి ఎల్రక్టానిక్స్ తయారీ విలువ రూ.1.9 లక్షల కోట్లుగా ఉంటే, 2019–20 నాటికి రూ.5.5 లక్షల కోట్లకు చేరుకున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. -
సోషల్ మీడియాకు కేంద్రం వార్నింగ్
న్యూఢిల్లీ: ట్విటర్‌తో నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు యూజర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాపింపజేసిన, హింసను ప్రేరేపించిన కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, లింక్డ్ఇన్ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి.."మీకు భారతదేశంలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. మీరు వ్యాపారం చేసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కానీ మీరు తప్పనిసరిగా భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సి ఉంటుంది" అని అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగంపై క్వశ్చన్ అవర్ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. "మేము సోషల్ మీడియాను చాలా గౌరవిస్తాము, ఇది సామాన్య ప్రజలను శక్తివంతం చేస్తుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియాకు పెద్ద పాత్ర ఉంది. అయితే, నకిలీ వార్తలు, హింసను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు" అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఖలిస్తాన్, పాకిస్తాన్ లింకులున్న మొత్తం 1,178 ఖాతాలను బ్యాన్ చేయాలన్న హెచ్చరికల నేపథ్యంలో పలు ఖాతాలను ఇప్పటికే తొలగించిన ట్విటర్, కొద్దీ రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమంటూ ఒక బ్లాగ్ పోస్ట్ లో వివరణ ఇచ్చింది. అయితే దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక -
అయిదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న అయిదేళ్లలో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం ప్రకటించారు. వివిధ దిగ్గజ ఎలక్ట్రానిక్ తయారీదారులు వచ్చే అయిదేళ్లలో దేశంలో భారీస్థాయిలో స్మార్ట్ఫోన్లు, విడిభాగాల తయారీ చేసేలా ప్రతిపాదించారని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల వరకు ఉద్యోగాలు సృష్టించనున్నారని వెల్లడించారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కింద దేశంలో రాబోయే ఐదేళ్లలో11 లక్షలకు కోట్ల రూపాయలకు పైగా విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు తయారు కానున్నాయని కేంద్రం మంత్రి వెల్లడించారు. పెగాట్రాన్, శాంసంగ్ , రైజింగ్ స్టార్ , ఫాక్స్ కాన్, విస్ట్రాన్ ఐదు అంతర్జాతీయ బ్రాండ్లతో సహా మొత్తం 22 కంపెనీలు ఈ పథకం కింద 22 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. ఈ కంపెనీల 7 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు లక్షల ప్రత్యక్ష, తొమ్మిది లక్షల పరోక్ష ఉద్యోగాలు దేశీయంగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
న్యాయశాఖ మంత్రిని కలిసిన సీఎం జగన్
-
న్యాయశాఖ మంత్రిని కలవనున్న సీఎం జగన్
-
ఒత్తిడిలో కమలం!
బిల్లులో సవరణల కోసం ఇరుప్రాంతాల పార్టీ నేతల పట్టు ఇరు ప్రాంతాల నేతలను సమాధానపరిచే యత్నంలో నేతలు తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూనే.. సీమాంధ్ర సమస్యలపై రాజీ పడబోమంటూ సమాధానం సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లులో సవరణల కోసం బీజేపీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ నేతలు పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. సీమాంధ్ర, తెలంగాణ బీజేపీ నేతలు రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్, అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్లను కలిసి బిల్లులో చేయాల్సిన సవరణల పత్రాలను అందజేశారు. హరిబాబు, శాంతారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రఘునాథబాబు తదితరులతో కూడిన సీమాంధ్ర నేతల బృందం ఈ నేతలను కలిసి, 14 సవరణలను, డిమాండ్లను వివరించింది. పోలవరం మినహా మిగతా డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదని తెలిపింది. సీమాంధ్రకు రెవెన్యూ లోటు, ఉమ్మడి రాజధానిపై తలెత్తే చిక్కుల విషయంలో అరుణ్ జైట్లీ కూడా సీమాంధ్ర నేతలతో ఏకీభవించినట్టు సమాచారం. సీమాంధ్రుల డిమాండ్ల విషయంలో రాజీ పడేదిలేదని ఆయన వారికి భరోసా ఇచ్చారు. తాజాగా సోమవారం తెలంగాణకు చెందిన బీజేపీ శాసన సభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిలతో కూడిన బృందం 10 సవరణలు కోరుతూ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్లను కలిసింది. హైదరాబాద్‌ను మూడేళ్ల వరకే ఉమ్మడి రాజధాని చేయాలని, ఆ తరువాత సీమాంధ్రులు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేలా బిల్లులో సవరణలు తేవాలని కోరింది. సీమాంధ్రకు వేరే హైకోర్టు ఏర్పాటు చేయాలని, తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఆ ప్రాంతంలో పింఛను అందించాలని, ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని ఈ బృందం కోరింది. ఇరు ప్రాంతాల నేతలు గట్టిగా వాదనలు వినిపిస్తుండటంతో పార్టీ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే.., సీమాంధ్రుల సమస్యల విషయంలో రాజీపడబోమని ఇరు ప్రాంతాల నేతలను సమాధానపరిచే ప్రయత్నంలో ఉన్నారు. నేడు పార్టీ వైఖరి స్పష్టమవుతుంది: నాగం ‘బీజేపీ విధానం చిన్న రాష్ట్రాలకు అనుకూలం. అందులో ఎలాంటి మార్పులేదని పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేస్తున్నారు’ అని పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సోమవారం రాత్రి మీడియాకు చెప్పారు. మంగళవారం బిల్లు పెట్టిన తర్వాత పార్టీ వైఖరి స్పష్టమవుతుందని తెలిపారు. ‘ఇప్పుడు సవరణలు చేయకపోతే మోడీ అధికారంలోకి వచ్చాక సవరణలు చేయించుకుందామని సీమాంధ్ర బీజేపీ నేతలే చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని నాగం అన్నారు. చంద్రబాబు సమన్యాయం నాటకాలకు తెరదించాలన్నారు.