సాక్షి,ముంబై: ఇండియన్ ట్విటర్ ‘కూ’ కూడా ఉద్యోగులనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఏకంగా 30శాతం ఉద్యోగాలను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నష్టాలు భరించలేక, నిధులను సమీకరించలేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన ఉద్యోగులకు పరిహారం ప్యాకేజీలు, ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించడం, కొత్త ఉద్యోగాలను అన్వేషణలో సాయం అందించడం ద్వారా కూ మద్దతు ఇస్తుందని నివేదించింది. అయితే తాజా పరిణామంపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (ఫ్రెండ్ యూట్యూబ్ ఛానెల్‌ని రూ. 26వేల కోట్ల కంపెనీగా మార్చాడు, షాకింగ్ శాలరీ!)
కాగా ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా మూడేళ్ల క్రితం వచ్చిన కూ ఆప్ చాలా తక్కువ సమయంలో ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా భారతీయ ఉన్నతాధికారులు, శాఖలు కూ ని ఎంచుకోవడంతో మిలియన్ల డౌన్‌లోడ్లతో భారీ వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణలో సవాళ్లు ఉన్నప్పటికీ, ఆపరేటింగ్‌ను కొనసాగించాలని యోచిస్తోంది. అలాగే తన సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్)
60 మిలియన్ డౌన్‌లోడ్‌లతో లాభదాయకంగా మారాలని చూస్తోందనీ, ఇతర సోషల్ మీడియా కంపెనీలలో ఒక యూజర్‌కి అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉన్న కంపెనీ తమదేనని అని సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్కా ఇటీవల పేర్కొన్నారు. కంపెనీలో సుమారు 260 మంది ఉండగా వీరిలో 30శాతం మందిని తాజాగా తొలగించింది.
(ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!)
Comments
Please login to add a commentAdd a comment