Cost control
-
layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?
సాక్షి,ముంబై: ఇండియన్ ట్విటర్ ‘కూ’ కూడా ఉద్యోగులనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఏకంగా 30శాతం ఉద్యోగాలను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నష్టాలు భరించలేక, నిధులను సమీకరించలేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన ఉద్యోగులకు పరిహారం ప్యాకేజీలు, ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించడం, కొత్త ఉద్యోగాలను అన్వేషణలో సాయం అందించడం ద్వారా కూ మద్దతు ఇస్తుందని నివేదించింది. అయితే తాజా పరిణామంపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (ఫ్రెండ్ యూట్యూబ్ ఛానెల్‌ని రూ. 26వేల కోట్ల కంపెనీగా మార్చాడు, షాకింగ్ శాలరీ!) కాగా ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా మూడేళ్ల క్రితం వచ్చిన కూ ఆప్ చాలా తక్కువ సమయంలో ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా భారతీయ ఉన్నతాధికారులు, శాఖలు కూ ని ఎంచుకోవడంతో మిలియన్ల డౌన్లోడ్లతో భారీ వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణలో సవాళ్లు ఉన్నప్పటికీ, ఆపరేటింగ్‌ను కొనసాగించాలని యోచిస్తోంది. అలాగే తన సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్) 60 మిలియన్ డౌన్లోడ్లతో లాభదాయకంగా మారాలని చూస్తోందనీ, ఇతర సోషల్ మీడియా కంపెనీలలో ఒక యూజర్‌కి అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉన్న కంపెనీ తమదేనని అని సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్కా ఇటీవల పేర్కొన్నారు. కంపెనీలో సుమారు 260 మంది ఉండగా వీరిలో 30శాతం మందిని తాజాగా తొలగించింది. (ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!) -
షాక్‌ల మీద షాక్‌లిస్తున్న మస్క్: కాస్ట్ కటింగ్‌పై భారీ టార్గెట్
న్యూఢిల్లీ: ట్విటర్‌ను టేకోవర్‌ను చేసిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అనుకున్నట్టుగా భారీ ఎత్తున సంస్కరణ చర్యలకు దిగుతున్నారు. ట్విటర్ డీల్ పూర్తి చేసిన తొలి రోజే టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన చెప్పారు. ఆ తరువాత బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు, ఉద్యోగులకు వీకెండ్ సెలవులు రద్దు లాంటి చర్యల్ని తీసుకున్న తాజాగా మస్క్ కాస్ట్ కట్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ట్విటర్ టీంలకు కీలక ఆదేశాలను జారి చేయడమే కాకుండా, నవంబరు 7ను డెడ్‌లైన్ విధించినట్టు సమాచారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులను బాగా తగ్గించుకోవాలంటూ ట్విటర్ టీంకు కీలక ఆదేశాలు జారీ చేశారు మస్క్. 1.5 మిలియన్ డాలర్ల మేర ఖర్చులు తగ్గించి, పొదుపు చేయాలనే ఆదేశాలిచ్చినట్టు రాయిటర్స్ నివేదించింది.దీని ప్రకారం కంపెనీ సర్వర్లు ,క్లౌడ్ సేవల ఖర్చులతోపాటు, మొత్తంగా రోజుకు 1.5 నుంచి 3 మిలియన్ డాలర్ల మేర, ఏడాదికి 100 కోట్ల డాలర్ల మేర ఖర్చులు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను "డీప్ కట్స్ ప్లాన్"గాపేర్కొంది. అయితే కీలక సమయాల్లో ట్రాఫిక్ ఎక్కువై, ట్విటర్ డౌన్ అవుతుందనే ఆందోళన నేపథ్యంలో సర్వర్ ప్లేస్‌ను తగ్గించాలా లేదా అనే ఆలోచననలో పడిందట. కాగా ట్విటర్ రోజుకు 3 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అయితే తాజాగా అంచనాలపై ట్విటర్ ఇంకా స్పందించాల్సి ఉంది. (Twitter down: యూజర్లకు లాగిన్ సమస్యలు, ఏమైంది అసలు?) సగం మందికి ఉద్వాసన? మరోవైపు ట్విటర్లో దాదాపు సగానికిపైగా ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే రిమోట్ వర్క్ పాలసీని రద్దు చేయడంతోపాటు, సిబ్బంది క్యాలెండర్లో కరోనా టైంలో ఇచ్చిన నెలవారీ "విశ్రాంతి రోజులు" తొలగించారు. కాగా తొలగించిన సీఈవోతోపాటు, పలువురు ఎగ్జిక్యూటివ్‌లకు భారీ చెల్లింపులు చేసింది. ఇపుడు ఎలాంటి నోటీసు లేకుండా ఉద్యోగులను తొలగిస్తే భారీ చెల్లింపులు చేయాల్సి వస్తుందని ఇది మస్క్‌కు భారం కాక తప్పదని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు మస్క్ చర్యలు రాబోయే యూఎస్ మధ్యంతర ఎన్నికలు లాంటి హెవీ ట్రాఫిక్ టైంలో ట్విటర్ వెబ్సైట్, యాప్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: Elon Musk మరో ప్రైవేట్ జ...ఆర్డర్: ఖరీదెంతో తెలుసా? -
కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే..
రోజులో 10–12 గంటలు, ఎంతో సిన్సియర్‌గా పనిచేసినా, లాభం లేదు.. ఆదాయం అక్కడక్కడే.. ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది..! రూపాయి కూడా మిగలడం లేదు.. ఇలాంటి నిట్టూర్పు, నిరాశా వాతావరణం కొందరిలో కనిపిస్తుంటుంది. ఎప్పుడూ తమ గురించి ఇలా అనుకోవడమే కానీ, పట్టుబట్టి కారణాలేంటని? విశ్లేషించుకుని, సమీక్షించుకునేది కొద్ది మందే ఉంటారు. జీవితంలో మరింత పురోగమనం చెందాలంటే? అందుకు ఎక్కువ గంటలు పనిచేయడం ఒక్కటే ప్రామాణికం కాబోదు. తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందా..? ఆదాయం పెంచుకునే మార్గాలేంటి?.. సమీక్షించుకుని సరైన దిశలో అడుగులు వేస్తే మార్పుకు ఆహ్వానం పలికినట్టే.. వృద్ధి లేకపోవడానికి కారణాలు కొందరు వ్యయాలను నియంత్రించుకోవడంలోనే బిజీగా కనిపిస్తుంటారు. మరికొందరు ఆదాయం పెంచుకునే మార్గాలపైనే దృష్టి పెడతారు. ఖర్చుల నియంత్రణకు సమయం వృ«థా చేయకుండా, ఆదాయం పెంచుకోవడానికే ఆ సమయాన్ని ఖర్చు చేస్తారు. ఇందులో మీరు ఏ రకం అన్నది ప్రశ్నించుకోవాలి. ఆదాయం పెంచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, వ్యయ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కూరగాయలు, గ్రోసరీ, స్కూలు ఫీజులు, పెట్రోల్ చార్జీలు, ఇంటి అద్దె వీటిల్లో ఏవీ మన నియంత్రణలో ఉండేవి కావు. ఏ మార్గంలో వెళితే, ఎలా పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది? అనేది విశ్లేషించుకోవాలి. ► నిందలతో కాలయాపన చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ ఏడాది ‘నాకు కచ్చితంగా పదోన్నతి రావాలి. కానీ, ఆఫీసు రాజకీయాలు దానికి నన్ను దూరం చేశాయి. ఆ ఆర్డర్ నాకు రావాల్సింది. నా పోటీదారు తన్నుకుపోయాడు’ ఈ తరహా ఆక్షేపణలతో వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకు రాలేదో? నిజాయితీగా విశ్లే షించుకుని, కారణాలను గుర్తించినప్పుడే అదే అనుభవం పునరావృతం కాకుండా ఉంటుంది. ► నాకేంటి? ఏ పని చేసినా అందులో నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ ఆలోచన కూడా ఆదాయం పెరగకపోవడానికి, అవకాశాలను గుర్తించకపోవడానికి అడ్డుగా ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. ఒక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు మిత్రులు ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ వెయిటర్లు కొందరు ఎవరు టిప్ ఇస్తారన్న దానిపైనే శ్రద్ధ చూపిస్తూ, టిప్ కోసమే పనిచేస్తున్నారు. కానీ, వారికి టిప్ అనుకున్నంత రావడం లేదు. కొందరు శ్రద్ధతో, గౌరవంగా, వేగంగా వచ్చిన వారికి కావాల్సినవి అందిస్తూ, వారిని సంతోష పెట్టడంపై దృష్టి పెట్టారు. వారికి బోలెడంత టిప్ వస్తోంది. ఇక్కడ కార్యాచరణే ఫలితమిస్తుంది. అంచనాలు కాదు. ఆదాయం పెంచుకోవాలని ఉంటుంది. అందుకు ఫలితం ఇవ్వని చోట వెతుక్కుంటే ప్రయోజనం ఏముంటుంది? ► అధిక ఆదాయం ఆశిస్తున్నప్పుడు మీ ఉత్పాదకత ఏ పాటిది? అని ప్రశ్నించుకున్నారా! నైపుణ్యాలు పెంచుకోకుండా వృద్ధి కోరుకోవడం అత్యాశ అవుతుందేమో ఆలోచించాలి. కొందరు తమ నైపుణ్యాలపై పెట్టుబడి పెడుతుంటారు. ఏటా కొంత మొత్తాన్ని పక్కన పెడుతూ, ఆ మొత్తాన్ని నైపుణ్యాల వృద్ధికి ఇన్వెస్ట్ చేస్తుంటారు. మారుతున్న అవసరాలకు అనగుణంగా మీ నుంచి ఉత్పత్తి ఉండాలి. అప్పుడే పురోగతి సాధ్యపడుతుందని గుర్తించాలి. ► మార్గదర్శి లేకపోవడం? చాలా మందికి జీవితంలో మంచి, చెడులు చెప్పి, సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకులు ఉండరు. సొంతంగా చేయడం తప్పించి, పెద్దగా ఉండదు. ఒక మార్గదర్శి ఉంటే వచ్చే ఫలితాలు వేరు. ఒక రచయితకు మార్గదర్శి ఉంటే ఎప్పటికప్పుడు మెరుగుపడడానికి వీలుంటుంది. ఒక ఇన్వెస్టర్ తాను సొంతంగా ఇన్వెస్ట్ చేస్తే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. అప్పటికే పెట్టుబడుల స్వరూపం పూర్తిగా అర్థం చేసుకుని, చక్కని పరిజ్ఞానం ఉన్న వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ► ఏ పని చేస్తున్నారు?.. చేసే పనులను బట్టే ఆదాయం ఆధారపడి ఉంటుంది. చేస్తున్న పనిని ఎక్కువ ఫలితం ఇచ్చేవి, తక్కువ ఫలితం ఇచ్చేవి, అసలు ఫలితం ఇవ్వనివి అంటూ మూడు రకాలుగా నిపుణులు చూస్తారు. ఆదాయం పెంచుకోలేని వారిలో ఎక్కువ మందిని గమనించినప్పుడు.. వారు చేసే పనులు ఫలితాన్ని ఇవ్వనివే ఉంటున్నాయి. మీరు చేస్తున్నది కూడా ఇదే అయితే సరిదిద్దుకోవడం ఒక మార్గం. ► మెచ్చేలా పనిచేయకపోవడం! కొందరు ఉద్యోగులు కంపెనీని వీడుతుంటే.. కంపెనీయే బతిమిలాడే సందర్భాలు కనిపిస్తాయి. కొందరు కొన్ని అవసరాలకు ఎప్పుడైనా ఒకటే దుకాణానికి వెళుతుంటారు. అక్కడ లేకపోతేనే మరొక దుకాణం చూసుకుంటారు. అక్కడ ఆ వర్తకుడు అందించే సేవలు, దుకాణాదారు నిర్వహణ, మాటతీరు, ఎక్కువ శ్రేణిలో ఉత్పత్తులు ఉండ డం కారణం ఏదైనా కావచ్చు. అలాంటి ప్రత్యేకతలు చేస్తున్న పనిలో మీరు చూపిస్తే ఆదాయం వృద్ధి చెందుతుందేమో పరిశీలించాలి. మార్పు దిశగా అడుగులు ► మీరు చేస్తున్న పనికి పారితోషికం పెరగాలంటే లేదా బ్యాంక్ బ్యాలన్స్ పెరగాలంటే ముందు ఆలోచనల పరిధిని విస్తృతం చేసుకోవాల్సి ఉంటుంది. గొప్ప ఆలోచనలకు చోటు ఇవ్వాలి. మీ పరిధిని విస్తృతం చేసి, ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించండి. ► పనికి సృజనాత్మక జోడించుకోవాలి. మీకు అప్పగించిన పనిని సాధారణంగా చేసుకుపోవడం వేరు. దాన్ని భిన్నంగా, ఆకర్షణీయంగా చేయడం వేరు. మీకు అప్పగించిన పని.. మీరేంటన్నది చూపించుకునే వేదిక. ఇచ్చిన పనికి ఎంత విలువ జోడించామన్నది కీలకం అవుతుంది. మీకు పని అప్పగిస్తే ప్రశాతంగా నిద్రపోవచ్చు? అన్న నమ్మకం కలిగించారంటే సంస్థకు విలువైన ఆస్తియే అవుతారు. అప్పుడు ఆదాయం దానంతట అదే పెరుగుతుంది. ఖర్చయినా మీకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ నైపుణ్యాలు లేకపోతే వాటిని తెచ్చుకోవడంపై ఫోకస్ పెట్టాలి. పనిలో నైపుణ్యాలను పెంచుకునే మార్గాలు కచ్చితంగా ఉంటాయి. సంస్థ కంటే ముందు మీరు మీ పనిలో కొత్తదనాన్ని కోరుకోవడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ► మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడం కూడా ఆదాయం పెంచుకోవడానికి మార్గం అవుతుంది. చేస్తున్న పనిలోనే కొత్త అవకాశాలను వెతుక్కోవాలి. వాటిని సంస్థతో పంచుకోవాలి. మీ నుంచి వచ్చే ఒక్క ఆవిష్కరణ సక్సెస్ అయినా, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ► ఎంత ప్రయత్నించినా చేస్తున్న పనిలో ఆదాయం పెంచుకోవడం సాధ్యపడడం లేదన్న వారికి మరో ఆదాయ మార్గాన్ని వెతుక్కోవడం ఒక పరిష్కారం కావచ్చు. అయితే, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తికి అదనంగా, రెండో ఆదాయం కోసం ఎంత సమయం కేటాయించగలరనేది ఇక్కడ కీలకం అవుతుంది. ► సమయం చాలడం లేదు? ఈ డైలాగ్ ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంటుంది. ఏది చేయాల న్నా వచ్చే సమాధానం ఇదే. పని ప్రదేశంలో ఉ త్పాదకతకు తోడ్పడని, అదనపు కాల హరణంతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని గుర్తు ంచుకోవాలి. సమయాన్ని వృ«థా చేయకుండా, సద్వినియోగం చేసుకోవడం విజయానికి, అదనపు ఆదాయానికి పునాదిగా గుర్తించాలి. ► అదనపు ఆదాయ వనరులు ఎన్నో ఉన్నాయి. మీరు ఎందులో నిపుణులు అయితే ఆ విభాగానికి సంబంధించి అధ్యాపకులుగా మారొచ్చు. ఆన్లైన్ బోధన చేపట్టవచ్చు. ఫ్రీలాన్స్ వర్క్, డిజిటల్ మార్కెటింగ్ లేదా ఆలోచనలో పదునుంటే స్టార్టప్ పెట్టేయవచ్చు. ఒక్కసారి ఆలోచన చానల్ తెరుచుకుంటే రెండో ఆదాయానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ఆదాయ మార్గాలు.. పార్ట్‌టైమ్/ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా రెండో ఆదాయానికి ఎన్నో మార్గాలున్నట్టే.. అసలు కష్టపడకుండా ఆదాయం సమకూర్చి పెట్టే ‘ప్యాసివ్’ మార్గం కూడా ఒకటి ఉంది. ► రెండు ప్రాపర్టీలు ఉంటే ఒకదానిని అద్దెకు ఇ వ్వడం ద్వారా ప్యాసివ్ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. కార్యాలయ స్థలం ఉన్నా, అందులో కొత భాగాన్ని అద్దెకు ఇచ్చినట్టయితే అలా కూ డా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. లేదంటే బ్యా ంకు డిపాజిట్లలో పెద్ద మొత్తంలో ఉంటే వెన క్కి తీసుకుని ప్రాపర్టీని సమకూర్చుకోవాలి. ► బిల్డింగ్‌లో చిన్న స్పేస్‌ను ఏటీఎం కేంద్రానికి అద్దెకు ఇచ్చుకున్నా చక్కని ఆదాయ వనరు ఏర్పడుతుంది. పట్టణాల్లో ఏటీఎం కేంద్రానికి బ్యాంకులు నెలవారీగా రూ.25–50వేల వరకు చెల్లిస్తున్నాయి. ► పార్కింగ్ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం కూడా మంచి ఐడియా. అదనపు పార్కింగ్ స్లాట్లను కొనుగోలు చేసి, ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. పట్టణాల్లో ఖాళీ ప్లాట్/స్థలం ఉన్నా అందులో రూపాయి పెట్టుబడి పెట్టుకుండా పార్కింగ్‌కు అద్దెకు ఇచ్చినా మంచి ఆదాయం సమకూరుతుంది. అందరికీ ప్రాపర్టీ ఉండాలని లేదు. కానీ, మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు.. పట్టణానికి శివారులో అయినా ప్రాపర్టీని సమకూర్చుకుని, దానిపై ఆదాయం తెచ్చుకునే మార్గం గురించి ఆలోచిస్తే మార్గం కనిపించొచ్చు. ► భవనంపైన, టెర్రాస్‌లో హోర్డింగ్‌కు స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుంది. రహదారికి సమీపంలో మీకు ఇల్లు/స్థలం ఉంటే చాలు. ► వడ్డీ ఆదాయానికి ప్యాసివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడినిచ్చే సాధనాలనే ఎంపిక చేసుకోవాలి. బ్యాంకు సేవింగ్స్ డిపాజిట్, ► స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం మరొక మార్గం. డివిడెండ్ ఆదాయం అన్నది ఆయా కంపెనీల పనితీరు, మార్కెట్ పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులకు ప్రభావితం అవుతుందని గుర్తించాలి. ► కార్లు, వ్యాన్లను కొనుగోలు చేసి, కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం లభిస్తుంది. ► కష్టమా, సుఖమా.. ఎంత మిగులుతుంది? ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండా కృషితో మీకు తోచినది ప్రారంభించండి. మంచి ఫలితమే ఎదురవుతుంది. -
అలవెన్సులకు కోత... ఖర్చులు తగ్గించాలన్న ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులు ఓవర్ టైం, ట్రావెల్ అలవెన్సులకు కోత పడనుంది. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పొదపు మంత్రం పఠిస్తోంది కేంద్రం. దీంతో అన్ని శాఖల పరిధిలో 20 శాతం మేర ఖర్చులు తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కోరారు. నివారించతగిన వృథాతో పాటు సాధ్యమైనంత వరకు వ్యయాన్ని నియంత్రించాలని ఆమె సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఈ దిశగా చర్యలు చేపట్టాలంటూ ఆర్థిక శాఖ నుంచి గురువారం మెమోరాండం జారీ చేశారు. అలవెన్సులు కట్ వ్యయనియంత్రణలో భాగంగా ఓవర్ టైం అలవెన్సులు, ట్రావెల్ అలవెన్సులు, రివార్డులు, ఆఫీసు ఖర్చులు, ఆద్దెలు, పన్నులు, రాయాల్టీ, ముద్రణ తదితర విభాగాల్లో వ్యయాన్ని నియంత్రించాలని కేంద్రం సూచించింది. వీటితో పాటు ఫ్యూయల్ బిల్స్, దుస్తులు, స్టేషనరీ కొనుగోలు, కరెంటు బిల్లు, అడ్వర్టైజ్మెంట్లతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ తదితర చోట్ల ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఆర్థిక శాఖ తెలిపింది. అలవెన్సులో కోత పెడితే సీ క్లాస్ ఉద్యోగులకు నష్టపోతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2020 మే ప్రతిపాదికగా 2020 మేలో శాఖల వారీగా జరిగిన ఖర్చుల వివరాలను ప్రతిపాదికగా తీసుకుని ఆయా శాఖలు వ్యయ నియంత్రణ పాటించాలని కేంద్రం సూచించింది. చదవండి: Covid-19: ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే -
ఎస్బీఐ ఉద్యోగులకు 'స్వచ్ఛంద షాక్'
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి ఉద్యోగులకు షాకివ్వనుంది. ఖర్చులను తగ్గించే లక్ష్యంతో రెండవ విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) అమలు చేయనుంది. ఇందులో భాగంగా దాదాపు 30,190 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వీఆర్ఎస్ కోసం ముసాయిదా పథకం సిద్ధం చేసి బోర్డు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత పథకం 'సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్-2020' పేరుతో ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేసిందనీ, బోర్డు ఆమోదం అనంతరం ఆచరణకు సిద్ధమవుతోందన్న ఆందోళన బ్యాంకు వర్గాల్లో నెలకొంది. డిసెంబర్ 1న ప్రారంభమై, ఫిబ్రవరి వరకు మాత్రమే అర్హులైన వారినుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కటాఫ్ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఇది వర్తిస్తుంది. మొత్తం 11,565 మంది అధికారులు,18,625 మంది సిబ్బంది వీఆర్ఎస్కు అర్హులు. వారిలో 30 శాతం మంది ముందుకొస్తారని అంచనా. తద్వారా సుమారు 2,170 కోట్ల రూపాయలను ఆదా చేయాలని బ్యాంక్ ఆశిస్తోంది. పరిహారం, ప్రయోజనాలు విఆర్ఎస్ కింద పదవీ విరమణ ఎంచుకున్నసిబ్బందికి మిగిలిన 18 నెలల చివరి వేతనానికి లోబడి, మిగిలిన కాలానికి (సూపరన్యుయేషన్ తేదీ వరకు) 50 శాతం జీతం చెల్లించాలి. వీఆర్ఎస్ను ఎంచుకునే ఉద్యోగులకు గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, మెడికల్ బెనిఫిట్స్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందించనుంది. ఈ పథకం కింద పదవీ విరమణ చేసిన సిబ్బంది పదవీ విరమణ చేసిన తేదీ నుండి రెండేళ్ల కూలింగ్ ఆఫ్ కాలం తర్వాత బ్యాంకులో తిరిగి ఉద్యోగం పొందటానికి, లేదా సర్వీసులు అందించేందుకు అర్హులు. కాగా ఎస్బీఐ 2020 మార్చి చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.49 లక్షలు. గత ఏడాది ఇదే కాలంలో వీరి సంఖ్య 257,000. -
కోతలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. ఇప్పుడు కరోనా సెగ అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు సైతం తగిలింది. ఇప్పటికే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు క్రికెట్ బోర్డులు ఆటగాళ్లతో పాటు బోర్డు ఉద్యోగులు జీతాల్లోనూ కోతలు విధిస్తున్నాయి. ఇక ఎప్పుడు వేల కోట్ల లాభార్జనలతో క్రికెట్ ప్రపంచంలో విరాజిల్లుతున్న బీసీసీఐ పై కూడా కరోనా కారణంగా ఆర్థిక భారం ఎక్కువైంది. కరోనా కారణంగా జరగాల్సిన సిరీస్‌లన్ని రద్దు కావడం, మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో బీసీసీఐ కూడా నిధుల కొరతను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ సుమారు రూ. 4000 కోట్లు నష్టపోనుంది. (సౌరవ్ గంగూలీ రేసులో లేడు..కానీ) పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం ఎలాంటి కోతలు లేకుండా అందరికి జీతాలు సక్రమంగా చెల్లిస్తోంది. ట్రావెల్, వసతులు ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం అంతకముందులా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వెల్లడించాడు. ఉద్యోగులు, ఆటగాళ్ల జీతాల్లో కోతల గురించి దుమాల్ మాట్లాడుతూ, ‘బీసీసీఐ గత ఏడాది అక్టోబరు నుంచే ఖర్చుల్ని తగ్గించుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతానికి ఆటగాళ్లు, ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేయడం కానీ, కోతలు కానీ లేవు. అయితే ట్రావెల్, వసతుల విషయంలో మాత్రం కాస్ట్ కటింగ్‌ని అమలు చేస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్ సీజన్ రద్దయితే మాత్రం ఆ ప్రభావం బీసీసీఐపై తీవ్రంగా పడనుంది. టోర్నీ రద్దు నిర్ణయాన్ని మాత్రం అప్పటి పరిస్థితుల్ని పూర్తిగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం’ అని అరుణ్ వెల్లడించాడు. (విదేశాల్లో ఐపీఎల్-2020?) -
జెట్‌ఎయిర్‌వేస్ ఎకానమీ తరగతుల్లో ఉచిత భోజనం కట్
ముంబై: వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా జెట్‌ఎయిర్‌వేస్ దేశీయ మార్గాల్లో మరో రెండు ఎకానమీ తరగతి ప్రయాణికులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఉపసంహరించుకుంది. వచ్చే జనవరి 7 నుంచి మొదలయ్యే ప్రయాణాల కోసం డిసెంబర్ 21 నుంచి బుక్ చేసుకునే టికెట్లపై ఇది అమలవుతుందని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఎకానమీ విభాగంలో దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి లైట్, డీల్, సేవర్, క్లాసిక్, ఫ్లెక్స్ పేరుతో ఐదు రకాల ధరల ఆప్షన్లను జెట్‌ఎయిర్‌వేస్ ప్రస్తుతం ఆఫర్ చేస్తోంది. ఇందులో లైట్, డీల్ విభాగాల్లో ఇంతకుముందే ఉచిత భోజనం తొలగించగా, తాజాగా ట్రావెల్ సేవర్, క్లాసిక్ నుంచి కూడా వీటిని తీసివేయనుంది. దీంతో ఇకపై ఫ్లెక్స్ ఆప్షన్లో మాత్రమే ప్రయాణికులకు ఉచిత భోజన సదుపాయం లభించనుంది. ఇక ఈ నెల 21కి ముందు బుక్ చేసుకునే వారికి ప్రస్తుతమున్నట్టుగానే ఉచిత భోజనం అందిస్తామని జెట్‌ఎయిర్‌వేస్ తెలిపింది. ప్లాటినం, గోల్డ్ కార్డు కలిగిన సభ్యులకు ఇక ముందూ కాంప్లిమెంటరీ ఉచిత భోజనం పొందొచ్చని స్పష్టం చేసింది. ఇంధన ధరల పెరుగుదలతో జెట్‌ఎయిర్‌వేస్ ఇటీవలి కాలంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
చైనాలో దుబారా చేస్తే అంతే..
ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యయ నియంత్రణ పాటించకుండా, దుబారా ఖర్చులు చేస్తూ జాతి సంపదను హరించి వేస్తున్న సర్కారు ఉద్యోగులపై చైనా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా 22 వేల మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మితిమీరిన ఉద్యోగస్వామ్యాన్ని అదుపు చేయాలని నిబంధనలను రూపొందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇందుకోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కానీ, లక్షల మంది ఉద్యోగులు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో 2012 నుంచి ఇప్పటి వరకు నిబంధనలను ఉల్లంఘించిన 1.20 లక్షల మంది ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వంలోని కిందిస్థాయి సిబ్బందితో పాటు అత్యున్నత స్థాయి అధికారులు కూడా క్రమశిక్షణ చర్యలకు గురైన వారిలో ఉన్నారు. 16,761 కేసుల్లో ప్రమేయం ఉన్న వీరందరిపై చర్యలు చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన కేంద్ర క్రమశిక్షణ, విచారణ కమిషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, 2014లో ఇలా క్రమశిక్షణ చర్యలకు గురైన అధికారులు 71 వేల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత పనులకు వాడటం, అనర్హులకు సబ్సిడీలు ఇవ్వడం, విందులు, వినోదాలకు విపరీతంగా ఖర్చులు చేయడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.