
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులు ఓవర్ టైం, ట్రావెల్ అలవెన్సులకు కోత పడనుంది. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పొదపు మంత్రం పఠిస్తోంది కేంద్రం. దీంతో అన్ని శాఖల పరిధిలో 20 శాతం మేర ఖర్చులు తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కోరారు. నివారించతగిన వృథాతో పాటు సాధ్యమైనంత వరకు వ్యయాన్ని నియంత్రించాలని ఆమె సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఈ దిశగా చర్యలు చేపట్టాలంటూ ఆర్థిక శాఖ నుంచి గురువారం మెమోరాండం జారీ చేశారు.
అలవెన్సులు కట్
వ్యయనియంత్రణలో భాగంగా ఓవర్ టైం అలవెన్సులు, ట్రావెల్ అలవెన్సులు, రివార్డులు, ఆఫీసు ఖర్చులు, ఆద్దెలు, పన్నులు, రాయాల్టీ, ముద్రణ తదితర విభాగాల్లో వ్యయాన్ని నియంత్రించాలని కేంద్రం సూచించింది. వీటితో పాటు ఫ్యూయల్ బిల్స్, దుస్తులు, స్టేషనరీ కొనుగోలు, కరెంటు బిల్లు, అడ్వర్‌టైజ్‌మెంట్‌లతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ తదితర చోట్ల ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఆర్థిక శాఖ తెలిపింది. అలవెన్సులో కోత పెడితే సీ క్లాస్ ఉద్యోగులకు నష్టపోతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
2020 మే ప్రతిపాదికగా
2020 మేలో శాఖల వారీగా జరిగిన ఖర్చుల వివరాలను ప్రతిపాదికగా తీసుకుని ఆయా శాఖలు వ్యయ నియంత్రణ పాటించాలని కేంద్రం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment