న్యూఢిల్లీ: ట్విటర్‌ను టేకోవర్‌ను చేసిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అనుకున్నట్టుగా భారీ ఎత్తున సంస్కరణ చర్యలకు దిగుతున్నారు. ట్విటర్ డీల్ పూర్తి చేసిన తొలి రోజే టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన చెప్పారు. ఆ తరువాత బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు, ఉద్యోగులకు వీకెండ్ సెలవులు రద్దు లాంటి చర్యల్ని తీసుకున్న తాజాగా మస్క్ కాస్ట్ కట్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ట్విటర్ టీంలకు కీలక ఆదేశాలను జారి చేయడమే కాకుండా, నవంబరు 7ను డెడ్‌లైన్ విధించినట్టు సమాచారం.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులను బాగా తగ్గించుకోవాలంటూ ట్విటర్ టీంకు కీలక ఆదేశాలు జారీ చేశారు మస్క్. 1.5 మిలియన్ డాలర్ల మేర ఖర్చులు తగ్గించి, పొదుపు చేయాలనే ఆదేశాలిచ్చినట్టు రాయిటర్స్ నివేదించింది.దీని ప్రకారం కంపెనీ సర్వర్లు ,క్లౌడ్ సేవల ఖర్చులతోపాటు, మొత్తంగా రోజుకు 1.5 నుంచి 3 మిలియన్ డాలర్ల మేర, ఏడాదికి 100 కోట్ల డాలర్ల మేర ఖర్చులు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను "డీప్ కట్స్ ప్లాన్"గాపేర్కొంది. అయితే కీలక సమయాల్లో ట్రాఫిక్ ఎక్కువై, ట్విటర్ డౌన్ అవుతుందనే ఆందోళన నేపథ్యంలో సర్వర్ ప్లేస్‌ను తగ్గించాలా లేదా అనే ఆలోచననలో పడిందట. కాగా ట్విటర్ రోజుకు 3 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అయితే తాజాగా అంచనాలపై ట్విటర్ ఇంకా స్పందించాల్సి ఉంది. (Twitter down: యూజర్లకు లాగిన్ సమస్యలు, ఏమైంది అసలు?)
సగం మందికి ఉద్వాసన?
మరోవైపు ట్విటర్‌లో దాదాపు సగానికిపైగా ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే రిమోట్ వర్క్ పాలసీని రద్దు చేయడంతోపాటు, సిబ్బంది క్యాలెండర్‌లో కరోనా టైంలో ఇచ్చిన నెలవారీ "విశ్రాంతి రోజులు" తొలగించారు. కాగా తొలగించిన సీఈవోతోపాటు, పలువురు ఎగ్జిక్యూటివ్‌లకు భారీ చెల్లింపులు చేసింది. ఇపుడు ఎలాంటి నోటీసు లేకుండా ఉద్యోగులను తొలగిస్తే భారీ చెల్లింపులు చేయాల్సి వస్తుందని ఇది మస్క్‌కు భారం కాక తప్పదని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు మస్క్ చర్యలు రాబోయే యూఎస్ మధ్యంతర ఎన్నికలు లాంటి హెవీ ట్రాఫిక్ టైంలో ట్విటర్ వెబ్‌సైట్, యాప్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ చదవండి: Elon Musk మరో ప్రైవేట్ జ...ఆర్డర్: ఖరీదెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment