
ఒకప్పుడు 100 మందికి పైగా ఉద్యోగులున్న ట్విటర్‌లోని ఆ విభాగంలో ఇప్పుడు పనిచేస్తున్నది కేవలం ముగ్గురంటే ముగ్గురే. ట్విటర్‌లో ఆడియో సంభాషణలకు సంబంధించిన ట్విటర్ స్పేసెస్ విభాగంలో ప్రస్తుతం మిగిలింది ముగ్గురేనని ప్లాట్‌ఫార్మర్ అనే సంస్థ నివేదిక ద్వారా వెల్లడైంది.
ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ తాను అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించడం ఇటీవల సంచలనం సృష్టించింది. అమెరికా పునర్ వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారాయన. ఎలాన్ మస్క్‌తో కలిసి ఆయన ట్విటర్ స్పేసెస్ ద్వారా లైవ్ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ట్విటర్ క్రాష్ అయిపోవడం తెలిసిందే.
అయితే ట్విటర్ క్రాష్ కావడంపై తాజాగా ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది. ట్విటర్ స్పేసెస్ విభాగంలో ఒకప్పుడు 100 మంది సిబ్బంది పనిచేస్తుండగా ఇప్పుడున్నది కేవలం ముగ్గురేనని తెలిసింది. ట్విటర్ స్సేసెస్ బృందం చాలా నెలలుగా సంస్థాగత జ్ఞానం లేకుండానే పనిచేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. కాగా క్లబ్‌హౌస్ అనే సంస్థకు పోటీగా ట్విటర్ 2021లో ట్విటర్ స్పేసెస్ పేరుతో ప్రత్యక్ష ఆడియో సంభాషణలను జోడించింది. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ ఆధీనంలోకి తీసుకున్నాక ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు 100 మంది ఉన్న ట్విటర్ స్పేసెస్‌లో ఇప్పుడు మిగిలింది కేవలం ముగ్గరే అని ప్లాట్‌ఫార్మర్ నివేదిక బహిర్గతం చేసింది.
ఇదీ చదవండి: Friendship Recession: మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు?
Comments
Please login to add a commentAdd a comment