‘కూ’ నుంచి చైనా ఇన్వెస్టరు నిష్క్రమణ | Chinese investor Shunwei Capital exits parent company of Koo | Sakshi
Sakshi News home page

‘కూ’ నుంచి చైనా ఇన్వెస్టరు నిష్క్రమణ

Published Thu, Mar 18 2021 1:22 AM | Last Updated on Thu, Mar 18 2021 1:22 AM

 Chinese investor Shunwei Capital exits parent company of Koo - Sakshi

న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్‌ సైటు ట్విట్టర్‌కు పోటీగా తెరపైకి వచ్చిన దేశీ యాప్‌ ‘కూ’ నుంచి తాజాగా చైనాకు చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ షున్‌వై క్యాపిటల్‌ వైదొలిగింది. తమ మాతృ సంస్థ బాంబినేట్‌ టెక్నాలజీస్‌ నుంచి షున్‌వై తప్పుకున్నట్లు బుధవారం కూ వెల్లడించింది. కొత్తగా పలువురు ప్రముఖులు మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినట్లు వివరించింది. వీరిలో మాజీ క్రికెటర్‌ జవగళ్‌ శ్రీనాథ్, బుక్‌మైషో వ్యవస్థాపకుడు ఆశీష్‌ హేమ్‌రాజానీ, ఉడాన్‌ సహ వ్యవస్థాపకుడు సుజీత్‌ కుమార్, ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి, జిరోధా వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ తదితరులు ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ డీల్స్‌ విలువ ఎంతన్నది మాత్రం కూ వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement