హైదరాబాద్: చైనా పర్యటనకు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఇవాళ తెల్లవారుజామున హాంకాంగ్ చేరుకుంది. అక్కడి నుంచి మూడు గంటల అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం జరిగే టియాంజిన్ పట్టణానికి చంద్రబాబు బృందం బయలు దేరింది. చైనాతో రాజకీయ, వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకొనే లక్ష్యంతో చంద్రబాబు చైనా పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు చైనా కంపెనీలను ఆయన ఆహ్వానించనున్నారు.